సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ఎంతమందిని చేరవేసిందో తెలుసా? జంట నగర వాసుల ఆదరణతో ఇప్పటివరకు 20 మిలియన్ల (రెండు కోట్ల మంది) ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ట్విటర్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను షేర్ చేసింది.
2017, నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధాని స్వయంగా ఇందులో ప్రయాణించారు. నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో తన పరుగును ఆరంభించింది. మెట్రో రైలుపై నగర వాసుల భారీ ఆసక్తితో ఆరంభంలోనే భారీ ఆదరణను దక్కించుకుంది. కిక్కిరిసిన జనంతో మెట్రో రైలు పెద్ద విశేషంగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు సేవలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Hyderabad Metro Rail is a convenient mode of transportation for 20 million riders.
— L&T HydMetroRail (@ltmhyd) September 5, 2018
Reaching here would not be possible without you. Thank you for trusting and travelling with us. #MeeMetro #20MillionPassengers #ManaMetro pic.twitter.com/GxCpqnGrs1
Comments
Please login to add a commentAdd a comment