![Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/20/hyderabad-metro-rail.jpg.webp?itok=dzNMitFz)
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నగరంలోని మెట్రో రైళ్లు దూకుడు పెంచాయి. మియాపూర్- అమీర్‌పేట్- నాగోల్ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో టైన్ నడవనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయం నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మియాపూర్ - అమీర్‌పేట్ - నాగోల్ మధ్య రేపు ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు మెట్రో రైలు, రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు నడవనుంది.
Happy to announce CMRS has cleared the new signalling system & Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours & every 8 minutes during non-peak on Miyapur - Ameerpet- Nagole stretches from tomorrow 6 am onwards
— KTR (@KTRTRS) April 20, 2018
Comments
Please login to add a commentAdd a comment