చైనాతో సరిహద్దు వివాదం, పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలోనూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. ఆటుపోట్ల మధ్య ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం జోరందుకున్నాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు జంప్‌చేసి 33,765కు చేరగా.. 72 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 9,953 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో బీహెచ్‌ఈఎల్, టైమ్ టెక్నోప్లాస్ట్, ఐగరషీ మోటార్స్ ఇండియా, సాల్జెర్ ఎలక్ట్రానిక్స్, లోకేష్ మెషీన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..
ఐగరషీ మోటార్స్
ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 47 ఎగసి రూ. 281 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 11,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 50,000 షేర్లు చేతులు మారాయి.
సాల్జెర్ ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రికల్, రోటరీ స్విచ్‌ల తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 15 ఎగసి రూ. 92 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 10,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 43,000 షేర్లు చేతులు మారాయి.
లోకేష్ మెషీన్స్
మెషీన్లు, ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 3.7 ఎగసి రూ. 22 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 79,000 షేర్లు చేతులు మారాయి.
టైమ్ టెక్నోప్లాస్ట్
భారీ ప్యాకేజింగ్ సొల్యూషన్ల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 14 శాతం దూసుకెళ్లింది. రూ. 5 ఎగసి రూ. 42 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 40,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 8.56 లక్షల షేర్లు చేతులు మారాయి.
బీహెచ్‌ఈఎల్
విద్యుత్ రంగ పరికరాల ఈ పీఎస్‌యూ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 12 శాతం జంప్ చేసింది. రూ. 3.5 ఎగసి రూ. 31 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 41 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.35 కోట్ల షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment