ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించి నిత్యం నిబంధనలు తీసుకొస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్ చేయడానికి వీలు లేదని సెబీ పేర్కొంది. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చేసే ట్రాన్సాక్షన్లు కస్టోడియన్ లెవెల్‌లో జరుగుతాయని, వీరు స్టాక్ ఎక్స్చేంజీలతో నెట్ బేసిస్‌లో తమ డెలివరీలను పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది.
మరోవైపు అన్ని కేటగిరీల్లోని ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చని సెబీ పేర్కొంది. కానీ, నేకెడ్ (ప్రొటెక్షన్ లేకుండా) సెల్లింగ్ చేయడానికి కుదరదని తెలిపింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కింద అన్ని షేర్లు షార్ట్ సెల్లింగ్‌కు అర్హులని వివరించింది.
ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే..
అధిక నష్టభయం ఉండే డెరివేటివ్స్, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ విషయంలో, మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించాలని గతంలో ఎన్‌ఎస్‌ఈ సూచించింది. స్టాక్ మార్కెట్లో తరచు (ఫ్రీక్వెంట్) ట్రేడింగ్ చేయడం మంచిదికాదని సలహా ఇచ్చింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లలో 90 శాతం మంది మదుపర్లు నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, వాటిల్లోనే ట్రేడింగ్ చేసేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గతంలో సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment