Sebi guidelines
-
డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం!
ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించి నిత్యం నిబంధనలు తీసుకొస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్ చేయడానికి వీలు లేదని సెబీ పేర్కొంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చేసే ట్రాన్సాక్షన్లు కస్టోడియన్ లెవెల్లో జరుగుతాయని, వీరు స్టాక్ ఎక్స్చేంజీలతో నెట్ బేసిస్‌లో తమ డెలివరీలను పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. మరోవైపు అన్ని కేటగిరీల్లోని ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చని సెబీ పేర్కొంది. కానీ, నేకెడ్ (ప్రొటెక్షన్ లేకుండా) సెల్లింగ్ చేయడానికి కుదరదని తెలిపింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కింద అన్ని షేర్లు షార్ట్ సెల్లింగ్‌కు అర్హులని వివరించింది. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. అధిక నష్టభయం ఉండే డెరివేటివ్స్, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ విషయంలో, మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించాలని గతంలో ఎన్ఎస్ఈ సూచించింది. స్టాక్ మార్కెట్లో తరచు (ఫ్రీక్వెంట్) ట్రేడింగ్ చేయడం మంచిదికాదని సలహా ఇచ్చింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లలో 90 శాతం మంది మదుపర్లు నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, వాటిల్లోనే ట్రేడింగ్ చేసేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. -
కనీస ప్రైస్‌బ్యాండ్‌పై సెబీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుక్‌బిల్ట్ విధానంలో పబ్లిక్ ఇష్యూలకు కనీసం 5 శాతం ప్రైస్‌బ్యాండ్(ధరల శ్రేణి)ను ప్రతిపాదించింది. అంతేకాకుండా నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(ఎన్ఐఐలు)ను సబ్‌కేటగిరీలోకి చేర్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశాలతోపాటు బుక్ బిల్డింగ్ మార్గదర్శకాలపై ప్రతిపాదనలు, వ్యాఖ్యానాలను ఆహ్వానించింది. 2021 అక్టోబర్ 20కల్లా వీటిని దాఖలు చేయవలసిందిగా సూచించింది. ఇటీవల పలు కంపెనీలు ఐపీవోల ధరల శ్రేణిలో కనిష్ట, గరిష్టాలను అతితక్కువగా నిర్ణయిస్తున్న నేపథ్యంలో సెబీ తాజా ప్రతిపాదనలు తీసుకువచ్చింది. పలు అంశాలలో ప్రైమరీ మార్కెట్ సలహా కమిటీ పలు అభ్యంతరాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది. ధరల నిర్ణయంలో పారదర్శక, నిజాయితీ విధానాల అమలు కనుమరుగవుతున్నట్లు అభిప్రాయపడినట్లు సెబీ పేర్కొంది. దీంతో బుక్ బిల్ట్ విధానంలో కనీసం 5 శాతం ప్రైస్‌బ్యాండ్ వ్యత్యాసాన్ని ప్రతిపాదించింది. ఎన్ఐఐలు ఇలా.. ఎన్‌ఐఐల విభాగంలో కొన్ని అతిపెద్ద సంస్థల నుంచే భారీ అప్లికేషన్లు దాఖలుకావడం ద్వారా రిస్కులు ఎదురవుతున్నట్లు సెబీ పేర్కొంది. 2018 జనవరి– 2021 ఏప్రిల్ మధ్య కాలంలో అత్యధిక స్పందన లభించిన ఐపీవోలను సెబీ విశ్లేషించింది. 29 పబ్లిక్ ఇష్యూలలో సగటున 60 శాతం ఎన్ఐఐలకు షేర్ల కేటాయింపు జరగనట్లు గుర్తించింది. ఏ ఐపీవోలోనైనా అందరికీ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్లు సెబీ తెలియజేసింది. దీంతో రిటైల్, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ స్థాయిలో సమాన కేటాయింపులవైపు దృష్టిసారించినట్లు వెల్లడించింది. వెరసి ఎన్‌ఐఐలను రెండు కేటగిరీలుగా విభజించేందుకు ప్రతిపాదించింది. తొలి విభాగంలో రూ. 2–10 లక్షల మధ్య ఎన్ఐఐలకు మూడోవంతు కేటాయింపు ఉంటుంది. రెండో కేటగిరీలో రూ. 10 లక్షలకుపైన మూడోవంతు షేర్లకు వీలుంటుంది. చదవండి : కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
రూ. 62,600 కోట్లు చెల్లించకుంటే జైలుకే!
ముంబై, సాక్షి: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌తోపాటు, అతనికి చెందిన మరో రెండు కంపెనీలను 8.4 బిలియన్ డాలర్లు(రూ. 62,600 కోట్లు) చెల్లించవలసిందిగా ఆదేశించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది. చెల్లించలేని పక్షంలో అతనికిచ్చిన బెయిల్‌ను రద్దు చేయవలసిందిగా కోరింది. సహారా గ్రూప్.. 2012, 2015లలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని ఈ సందర్భంగా సెబీ తాజా ఫిర్యాదులో పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం సొమ్మును 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించవలసిందిగా గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియజేసింది. 2014లో అరెస్టయిన రాయ్ 2016 నుంచీ బెయిల్‌పై ఉన్నారు. 8 ఏళ్లుగా.. గత 8 ఏళ్లుగా నిబంధనలు ఉల్లంఘింస్తున్న రాయ్ ఇకనైనా పూర్తిసొమ్మును చెల్లించకుంటే కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టును తాజా ఫిర్యాదులో సెబీ కోరింది. గతంలో సహారా ఇండియా పరివార్ గ్రూప్ అసలు మొత్తంలో కొంతమేర మాత్రమే డిపాజిట్ చేసిందని, మిగిలిన సొమ్ముతోపాటు వడ్డీలు కలిపి భారీగా రూ. 62,600 కోట్లకు చేరాయని సుప్రీంకు సెబీ వివరించింది. 8 ఏళ్ల క్రితం ఈ మొత్తం రూ. 25,700 కోట్లు మాత్రమేనని తెలియజేసింది. కాగా.. సహారా ఇప్పటికే సెబీకి రూ. 22,000 కోట్లు డిపాజిట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే పూర్తి సొమ్ముపై వడ్డీని విధించడం ద్వారా సెబీ భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. సహారా గ్రూప్ సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి 3.5 బిలియన్ డాలర్లను చట్టవిరుద్ధంగా సమీకరించినట్లు 2012లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే సహారా గ్రూప్ ఈ నిధులను తిరిగి చెల్లించకపోవడంతో గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌ను జైలుకి తరలించారు. -
కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనల సమీక్ష
న్యూఢిల్లీ: కంపెనీలు ఎగ్జిక్యూటివ్‌లకు అధిక వేతనాలు చెల్లించడం, స్వతంత్ర డెరైక్టర్లకు స్టాక్ ఆప్షన్స్ కేటాయించడం వంటి అంశాలకు ఇక చెక్ పడనుంది. ఇందుకు అనుగుణంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)కు సంబంధించిన నిబంధనలను పూర్తిగా సమీక్షించి తగిన మార్పులను చేపట్టింది. తాజా నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి అమలుకానున్నాయి. వీటితోపాటు మ్యూచువల్ ఫండ్లలో రూ. 2 లక్షల వరకూ పెట్టుబడులపై పన్ను మినహాయింపులపై కూడా దృష్టిపెట్టింది. తాజా నిబంధనలను సెబీ బోర్డు గురువారం సమావేశంలో ఆమోదించింది. పన్ను మినహాయింపు అంశాల ప్రతిపాదలను ప్రభుత్వానికి పంపనున్నట్లు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు.