![Cross currency trading! - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/22/CURRENCY-580X358.jpg.webp?itok=Og3zx8Ye)
న్యూఢిల్లీ: బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్‌ఈ) నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ల్లో క్రాస్ కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్ మొదలవుతోంది. ఈ నెల 27 నుంచి క్రాస్ కరెన్సీ డెరివేటివ్స్‌ను ప్రారంభిస్తున్నామని, క్రాస్ ఇండియన్ రూపీ (ఐఎన్‌ఆర్) ఆప్షన్స్‌ను కూడా ఆరంభిస్తామని బీఎస్‌ఈ వెల్లడించింది. ఉదయం 9 నుంచి రాత్రి 7.30 వరకూ ట్రేడింగ్ ఉంటుంది. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజీలో (ఎంసీఎక్స్) కరెన్సీ ట్రేడింగ్‌కు మాత్రమే అనుమతి ఉంది.
అంటే రూపాయి – డాలర్, రూపాయి – పౌండ్ స్టెర్లింగ్, రూపాయి – జపనీస్ యెన్‌లో మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతి ఉంది. ఇకపై యూరో– అమెరికా డాలర్, పౌండ్ స్టెర్లింగ్– అమెరికా డాలర్, అమెరికా డాలర్– జపనీస్ యెన్ జోడీల్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు తమకు సెబీ అనుమతినిచ్చినట్లు బీఎస్‌ఈ ఎమ్‌డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆశీష్ కుమార్ చౌహాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment