![Torus Kling Blockchain to launch India in first Bitcoin ETFs - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/14/BITCON-ETF.jpg.webp?itok=qzoTsqIN)
న్యూఢిల్లీ: దేశీయంగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్ సిటీ)లో వీటిని తొలిసారిగా ఆవిష్కరించడంపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్‌చెయిన్ ఐఎఫ్‌ఎస్‌సీ, బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్‌ఈ) అంతర్జాతీయ విభాగం ఇండియా ఐఎన్‌ఎక్స్ చేతులు కలిపాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. ఈటీఎఫ్‌లు, డిస్కౌంట్ సర్టిఫికెట్ల ద్వారా బ్లాక్‌చెయిన్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లతో తొలి రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) సాధించాలని నిర్దేశిం చుకున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చెయిన్ ఐఎఫ్‌ఎస్‌సీ సీఈవో కృష్ణ మోహన్ మీనవల్లి తెలిపారు.
చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్
Comments
Please login to add a commentAdd a comment