Bombay Stock Exchange
-
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వేగ జ్యువెలర్స్
-
రూ. 300 లక్షల కోట్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపకుడు ఈయనే..
భారతదేశ ఆర్థిక రాజధాని మొదటి వ్యాపార దిగ్గజాలలో ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ జైన్ ఒకరు. ఆయన్ను ముంబైలో (అప్పట్లో బొంబాయి) బిగ్ బుల్, బులియన్ కింగ్, కాటన్ కింగ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. జమ్సెట్జీ టాటా, డేవిడ్ సాసూన్, జమ్సెట్జీ జెజీబోయ్లతో పాటు నలుగురు బాంబే వ్యాపార యువరాజులలో ఒకరిగా పేరు పొందారు. ప్రేమ్‌చంద్ తన కాలంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ స్థాపనతో అందరికీ గుర్తుండిపోయారు. అదే ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్గా మారింది. బీఎస్ఈ దేశంలో రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. దాంట్లోని అన్ని లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ రూ. 300 లక్షల కోట్లకు మించి ఉంది. 1865లో దీనిని స్థాపించినప్పుడు, దక్షిణ బొంబాయిలోని ఒక మర్రిచెట్టు కింద 22 మంది బ్రోకర్లు, ఒక్కొక్కరి నుంచి కేవలం రూపాయి మూలధనంతో ఇది ఏర్పడింది. మొదటి స్టాక్ బ్రోకర్ రాయ్‌చంద్ 1832లో సూరత్‌లో రాయ్‌చంద్ డిప్చంద్ అనే కలప వ్యాపారికి జన్మించారు. ఆయన చిన్నప్పుడే వారి కుటుంబం బొంబాయికి వచ్చేసింది. ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో రాయ్‌చంద్ విద్యాభ్యాసం సాగింది. అదే ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడగల, చదవగల, రాయగల మొదటి భారతీయ బ్రోకర్‌గా అవతరించడానికి సహాయపడింది. రాయ్‌చంద్ 1852లో ఓ విజయవంతమైన స్టాక్ బ్రోకర్‌కు సహాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. అసమాన్య జ్ఞాపకశక్తి అసమానమైన జ్ఞాపకశక్తి ప్రేమ్‌చంద్ సొంతం. ఆయన ఎప్పుడూ పెన్ను, పేపర్ వాడలేదు. రాసుకోవడానికి బదులు తన వ్యాపారాలన్నింటినీ కంఠస్థం చేసిన ఆయన కేవలం 6 సంవత్సరాలలో 1858 నాటికి దాదాపు రూ. 1 లక్ష సంపదను ఆర్జించారు. 1861లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పత్తి వ్యాపారానికి భారత్ హాట్‌స్పాట్‌గా మారింది. దీన్ని ఆయన మరింత విస్తృతం చేశారు. దాతృత్వంలోనూ.. భారీ లాభాలను చవిచూసిన ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్, అంతర్యుద్ధం ముగిశాక 1865లో పత్తి వ్యాపార ప్రాభవం తగ్గడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత తిరిగి పుంజుకుని దాతృత్వం వైపు నడిచారు. ఇందులో భాగంగా బాంబే విశ్వవిద్యాలయంలో రాజాబాయి క్లాక్ టవర్‌కు నిధులు అందించారు. బాలికా విద్యను ప్రోత్సహించారు. అవార్డులు, స్కాలర్షిప్లు అందించేందుకు ఆర్థికంగా సహకరించారు. ప్రేమ్‌చంద్ 1906లో మరణించారు. అతని కుటుంబంలోని నాలుగో తరం ఇప్పుడు ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ సంస్థను నడుపుతోంది. వ్యాపార పరంగా ఒక చిన్న సంస్థే అయినా గొప్ప చరిత్ర దీనికి ఉంది. బైకుల్లాలోని ప్రేమ్‌చంద్ నివసించిన బంగ్లాను తరువాత అనాథాశ్రమం, పాఠశాలగా మార్చారు. -
ఇన్వెస్టర్లకు అలర్ట్: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్లో అంతరాయం..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) అధికారిక వెబ్సైట్ (bseindia.com)లో శనివారం (జూన్ 17) సాయంత్రం నుంచి అంతరాయం ఉంటుందని తెలియజేసింది. జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్సైట్ పని చేయదని వెల్లడించింది. నిర్వహణ పనుల నిమిత్తం వెబ్సైట్ 12 గంటల పాటు అందుబాటులో ఉండదు. "మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్సైట్ అందుబాటులో ఉండదు" అని బీఎస్ఈ తన వెబ్సైట్లో పేర్కొంది. ఏదైనా అత్యవసర ఫైలింగ్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో corp.relations@bseindia.com ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. -
నిధుల సమీకరణకు ‘ద్వంద్వ లిస్టింగ్’ మార్గం
ముంబై: చిన్న వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తమ మూలధన సమీకరణ పక్రియను విస్తృతం చేయడానికి ‘‘ద్వంద్వ లిస్టింగ్’’ను పరిగణనలోకి తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. బొంబాయి స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌తోపాటు గాంధీనగర్ గిఫ్ట్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో లిస్ట్ అయ్యే అవకాశాలు, ప్రయోజనాలను పరిశీలించాలని కోరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 400 కంపెనీల లిస్టింగ్ అయిన సందర్భాన్ని పురష్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► నిధుల సమీకరణకు సంబంధించి లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని గిఫ్ట్ సిటీ ప్లాట్‌ఫామ్ లేదా ముంబై బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ లేదా రెండింటిలో ద్వంద్వ లిస్టింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ దిశలో మార్గాలను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తగిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. ఉంటుందన్నది పరిశీలించాలి. ► ద్వంద్వ లిస్టింగ్ దేశీయ మూలధన సమీకరణకు దోహదపడుతుంది. అదే విధంగా గిఫ్ట్ సిటీలో పెట్టుబడుల యోచనలో ఉన్న అంతర్జాతీయ సంస్థల నిధులను పొందడంలోనూ ఇది సహాయపడుతుందని భావిస్తున్నాం. ► అంతర్జాతీయ ఫండ్లు కూడా ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకునేలా తగిన చర్యలు అవసరం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సావరిన్ వెల్త్ ఫండ్లు ఈ ఎక్సే్ఛంజ్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా బీఎస్ఈ ప్రయత్నాలు జరపాలి. ► ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం దానిని మరింత విస్తృతం చేయాలి. మరింత మంది దేశీయ పెట్టుబడిదారులను పొందాలి. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వీటిపై అవగాహన కల్పించాలి. ► ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో మొదట లిస్టయిన 150 చిన్న కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై వ్యాపారం చేయడానికి అన్ని అర్హతలూ పొందాయి. ► మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రలను పునరుద్ధరించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంది. ఈ దిశలో ఈసీఎల్‌జీసీ, టీఆర్‌ఈడీఎస్‌సహా పలు పథకాలను, చర్యలను అమలు చేసింది. ► మనం మహమ్మారిని అధిగమించగలిగాము. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన పరిశ్రమ విశ్వాసం, స్ఫూర్తిని నిరోధించలేదు. ► స్టార్టప్‌ల విషయంలో దేశం పురోగమిస్తోంది. భారత్ 100 కంటే ఎక్కువ యునికార్న్‌లకు (బిలియన్ డాలర్లపైన విలువగలిగిన సంస్థలు), 70–80 ‘సూనికార్న్‌లకు‘ (యూనికార్న్‌లుగా మారడానికి దగ్గరిగా ఉన్న సంస్థలు) నిలయంగా ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానానికి బీఎస్ఈ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్టార్టప్స్‌లోకి భారీ దేశీయ పెట్టుబడులు వెళ్లడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నాం. దేశీయ ఇన్వెస్టర్లు యూనికార్న్స్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ధోరణి మారాలి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) ప్లాట్‌పామ్‌పై 400 కంపెనీలు లిస్టయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్‌లో బుల్ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. కార్యక్రమంలో బీఎస్ఈ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఈ ఎంఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 60,000 కోట్లు దాటింది. -
గోల్డ్ రిసీట్స్‌లో ట్రేడింగ్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రూపంలో గోల్డ్ రీసీట్స్ (ఈజీఆర్)ను తన ప్లాట్‌ఫామ్‌పై ప్రారంభించేందుకు సెబీ నుంచి తుది అనుమతి లభించినట్టు బీఎస్ఈ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించి సెబీకి సూత్రప్రాయ ఆమోదం రాగా, ఎన్నో విడతలుగా ఈజీఆర్ ట్రేడింగ్‌లో మాక్ టెస్టింగ్ కూడా నిర్వహించింది. వ్యక్తిగత ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు సహా ఎవరైనా బీఎస్ఈ ఈజీఆర్‌లలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి అవకాశం అందుబాటులోకి రానుంది. తుది ఆమోదం మంజూరు చేసినందుకు సెబీకి బీఎస్ఈ ధన్యవాదాలు తెలియజేసింది. త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని బీఎస్ఈ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ పాటిల్ తెలిపారు. ఈజీఆర్ ప్లాట్‌ఫామ్ వల్ల బంగారం సరఫరాలో గొప్ప నాణ్యతకు దారితీస్తుందన్నారు. అలాగే, న్యాయమైన ధరలు, లావాదేవీల్లో పారదర్శకత ఉంటుందన్నారు. అన్ని డిపాజిటరీలు, వోల్ట్‌లతో సంప్రదింపులు చేస్తున్నామని, ఈజీఆర్ ట్రేడ్‌కు కావాల్సిన ఎకోసిస్టమ్ అభివృద్ధికి పనిచేస్తున్నట్ట బీఎస్ఈ ప్రకటించింది. మన దేశం ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసకుంటూ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
ఈజీఆర్ విభాగం ఏర్పాటు దిశలో బీఎస్ఈ అడుగులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) విభాగం ఏర్పాటు దిశలో బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) కీలక అడుగులు వేసింది. ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడానికి మహారాష్ట్ర, తమిళనాడు నుంచి నాలుగు ప్రాంతీయ అసోసియేషన్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బీఎస్ఈ తెలిపింది. వీటిలో తిరునెల్వేలి గోల్డ్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్, నాందేడ్ సరాఫా అసోసియేషన్, సరాఫ్ సువర్కర్ సంత్నా పూసద్, ఘడ్చిరోలి జిలా సరాఫా అసోసియేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిలోని దాదాపు 1,000 మంది సభ్యులు జ్యూయలరీ, బులియన్ ట్రేడ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యాలతో దేశీయ, అంతర్జాతీయ జోన్లలో శక్తివంతమైన గోల్డ్ ఎక్సే్చంజ్‌ని అభివృద్ధి చేయడంలో పరివర్తనాత్మక పాత్రను పోషించగలదనే విశ్వాసాన్ని బీఎస్ఈ వ్యక్తం చేసింది. ఈజీఆర్ సెగ్మెంట్ ఏర్పాటుకు కొద్ది రోజుల క్రితమే బీఎస్ఈకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో గోల్డ్ ఎక్సే్చంజ్‌ల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని కూడా సెబీ ఇటీవలే నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సే్చంజ్‌ల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సే్చంజ్ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గోల్డ్ ఎక్సే్ఛంజ్, వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్లు్యడీఆర్ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు శుభవార్త! బాంబే స్టాక్ ఎక్సేంజీ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్ సిటీ)లో వీటిని తొలిసారిగా ఆవిష్కరించడంపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్‌చెయిన్ ఐఎఫ్ఎస్సీ, బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ) అంతర్జాతీయ విభాగం ఇండియా ఐఎన్ఎక్స్ చేతులు కలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. ఈటీఎఫ్‌లు, డిస్కౌంట్ సర్టిఫికెట్ల ద్వారా బ్లాక్‌చెయిన్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లతో తొలి రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) సాధించాలని నిర్దేశిం చుకున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చెయిన్ ఐఎఫ్ఎస్సీ సీఈవో కృష్ణ మోహన్ మీనవల్లి తెలిపారు. చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ ట్రేడింగ్‌పై బీఎస్ఈ కసరత్తు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ట్రేడింగ్‌ను తమ ప్లాట్‌ఫాంపై ఆవిష్కరించేందుకు అవసరమైన టెక్నాలజీతో సిద్ధంగా ఉన్నట్లు బాంబే స్టాక్ ఎక్సే్చంజీ (బీఎస్ఈ)చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ పాటిల్ తెలిపారు. త్వరలో దీనికి అనుమతులు పొందేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పసిడి ధరలు దాదాపు ఒకే రకంగా ఉండేలా చూసేందుకు ఈజీఆర్‌లు తోడ్పడగలవని పాటిల్ చెప్పారు. ఇతర షేర్ల లావాదేవీల తరహాలోనే ఈజీఆర్‌ల ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈజీఆర్‌లను డీమ్యాట్ తరహాలోనే ఉంచుకోవచ్చని, అవసరమైనప్పుడు భౌతిక బంగారం రూపంలోకి మార్చుకోవచ్చని పాటిల్ చెప్పారు. ఇదంతా మూడు అంచెల్లో జరుగుతుందన్నారు. ముందుగా భౌతిక బంగారాన్ని ఈజీఆర్ల్లోకి మార్చడం, ఈజీఆర్ రూపంలో ట్రేడింగ్ నిర్వహించడం, తర్వాత ఈజీఆర్‌ను తిరిగి భౌతతిక రూపంలోకి మార్చడం ఉంటుందని పాటిల్ చెప్పారు. ముందుగా 1 కేజీ, 100 గ్రాముల డినామినేషన్లో ఈజీఆర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు దశలవారీగా 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాముల పరిమాణంలో కూడా ఈజీఆర్‌లను అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. క్లయింట్లు కావాలనుకుంటే భౌతిక బంగారాన్ని నిర్దిష్ట డెలివరీ సెంటర్లో జమ చేసి ఈజీఆర్‌ను కూడా పొందవచ్చని పాటిల్ వివరించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రస్తుతం భౌతిక రూపంలో బంగారం ట్రేడింగ్‌కు కూడా స్పాట్ ఎక్సే్చంజీలు ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం గోల్డ్ డెరివేటివ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతి ఉంటోంది. -
బీఎస్ఈ లాభం తగ్గింది
న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్(బీఎస్ఈ) గత ఆర్థిక సంవత్సరం (2018–19) మార్చి క్వార్టర్లో రూ.52 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.62 కోట్లతో పోలిస్తే 16 శాతం క్షీణించిందని బీఎస్ఈ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.195 కోట్ల నుంచి రూ.182 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్టాండ్ అలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.61 కోట్ల నుంచి రూ.44 కోట్లకు తగ్గింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో స్టాండ్అలోన్ నికర లాభం రూ.201 కోట్లు, కన్సాలిడేటెట్ నికర లాభం రూ.199 కోట్లుగా ఉన్నాయని బీఎస్ఈ తెలియజేసింది. రూ.460 కోట్ల షేర్ల బైబ్యాక్ ఒక్కో షేర్‌ను రూ.680 ధరకు (మంగళవారం ముగింపు ధర, రూ.637తో పోల్చితే 7% అధికం) టెండర్ ఆఫర్ మార్గంలో బైబ్యాక్ చేయనున్నామని బీఎస్ఈ తెలిపింది. మొత్తం రూ.460 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నామని పేర్కొంది. -
రిజల్ట్స్ ఎఫెక్ట్ : ఐడియా షేర్లు ఢమాల్
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఐడియా సెల్యులార్ కంపెనీ షేర్లు నేటి మార్కెట్లో భారీగా నష్టపోతున్నాయి. ఇప్పటికే ఈ షేర్లు 8 శాతం మేర పడిపోయాయి. శనివారం ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాలతో కంపెనీ షేర్లు ఈ నష్టాలను చవిచూస్తున్నాయి. రిలయన్స్ జియో దెబ్బకు ఐడియా సెల్యులార్ కంపెనీ వరుసగా రెండో క్వార్టర్ లోనూ నష్టాలనే నమోదుచేసింది. 2017 మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో కంపెనీ కన్సాలిడేటెడ్ నష్టాలు 325.6 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు ప్రకటించింది. గత ఆర్థికసంవత్సరం ఇదే క్వార్టర్ లో కంపెనీ రూ.449.2 కోట్ల లాభాలను నమోదుచేసింది. ఈ క్వార్టర్ కు ముందు క్వార్టర్ 2016 డిసెంబర్ లోనూ కంపెనీకి రూ.383.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాలే ఉన్నాయి.. ఇలావరుసగా ఐడియా నష్టాలను నమోదుచేస్తుండటం షేర్లపై తీవ్రప్రభావాన్ని చూపుతోంది. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో కంపెనీ స్టాక్ 8.28 శాతం పడిపోయి, రూ.84.65 వద్ద ట్రేడవుతోంది. -
డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 33,500 పాయింట్లు: నొమురా
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మంచి పురోగతిలో ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ- నొమురా తన తాజా నివేదికలో అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ డిసెంబర్ నాటికి 33,500 పాయింట్లకు చేరుతుందన్నది తమ అంచనా అని సంస్థ భారత్ చీఫ్ ఎకనమిస్ట్ సోనల్ వర్మ ఇక్కడ తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5.6 శాతంగా ఉంటుందని డీబీఎస్ పేర్కొంది. గత ఏడాది ఈ రేటు 6.1 శాతం. -
ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యానికి చర్యలు
బీఎస్ఈ 140వ వార్షికోత్సవం... న్యూఢిల్లీ : ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మేనేజింగ్ డెరైక్టర్ అండ్ సీఈఓ అశిశ్కుమార్ చౌహాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి రానున్న 6 నుంచి 9 నెలల్లో ఒక ‘ఐపీఓ’ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ బాండ్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్... తద్వారా ప్రభుత్వం సులభతరంగా నిధుల సమీకరణకు తాజా ఎలక్ట్రానిక్-ఐపీఓ వ్యవస్థ వీలుకల్పిస్తుందని, ప్రభుత్వ బాండ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి తగిన పరిస్థితిని సృష్టిస్తుందని తెలిపారు. బీఎస్ఈ 140 వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో చౌహాన్ ఈ విషయాలు మాట్లాడారు. -
అమ్మకాల రూట్లోనే ఎఫ్ఐఐలు
మూడు నెలల కనిష్టానికి సెన్సెక్స్.. ⇒ ఇన్ఫోసిస్ ఫలితాలు, వర్షాభావ అంచనాల దెబ్బ కూడా... ముంబై: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ గురువారం 297 పాయింట్లు నష్టపోయి, 27,438 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు నెలల కనిష్ట స్థాయి ఇది. గత ఎనిమిది ట్రేడింగ్ దినాల్లో 7 రోజులు మార్కెట్ నష్టాల్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే... ఈ వారంలో సెన్సెక్స్ ఏకంగా 1,004 పాయింట్లు (3.53 శాతం) నష్టపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం శుక్రవారం 93 పాయింట్ల పతనంతో 8,305 పాయింట్ల వద్దకు దిగింది. మూడు ప్రధాన కారణాలు! ⇒ పన్ను అంశాలకు సంబంధించి విదేశీ పెట్టుబడిదారు విశ్వాసం దెబ్బతినడం మార్కెట్‌పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. దాదాపు రూ. 40,000 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకోవాలంటూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గే ప్రసక్తే లే దని రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎఫ్ఐఐల అమ్మకాలు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ⇒ శుక్రవారం విడుదలైన ఇన్ఫోసిస్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో ఈ షేర్ ధర దాదాపు 6 శాతం నష్టపోయింది. మార్కెట్ నష్టంలో 150 పాయింట్ల మేర కేవలం ఈ షేర్ పతనం వల్లే చోటుచేసుకోవడం గమనార్హం. మొదటినుంచీ అప్రమత్తంగా సాగిన ట్రేడింగ్‌పై చివరి మూడు గంటల్లో ఇన్ఫోసిస్ ఫలితాల ప్రభావమూ కనిపించింది. ⇒ వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్న అంచనాలూ మార్కెట్ పతనానికి ఒక కారణం. టర్నోవర్ చూస్తే..: ఎన్ఎస్ఈలో రూ.19,630 కోట్లుగా, ఎన్ఎన్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.3,31,143 కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో ఈ పరిమాణం రూ. 3,664కోట్లు. జూన్‌లో రూ.15,000 కోట్ల ఎస్బీఐ ఇష్యూ ! ముంబై: దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలపెట్టిన షేర్ల ఇష్యూ.. జూన్‌లో రావొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనువుగా లేనందువల్ల అప్పటిదాకా వేచి ఉండే అవకాశం ఉందని సమాచారం. -
నెల కనిష్టానికి మార్కెట్
- అమెరికా ఫెడ్ పాలసీ నేపథ్యం - 66 పాయింట్ల నష్టంతో 28,438కు సెన్సెక్స్ - 15 పాయింట్ల మైనస్‌తో 8,633కు నిఫ్టీ - మార్కెట్ అప్డేట్ ముంబై: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ -30, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ -50 సోమవారం నెల కనిష్ట స్థాయికి పడ్డాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంలో 28,438 వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8,633 వద్దకు దిగింది. మార్కెట్ ట్రేడింగ్ మొత్తం భారీ ఒడిదుకుల మధ్య సాగి, చివరకు నష్టాల్లో ముగిసింది. ఊగిసలాట..: ప్రారంభ ట్రేడింగ్‌లో 28,582 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్, బ్లూచిప్స్‌లో భారీ అమ్మకాల ఒత్తిడితో 28,384 కనిష్టానికి పడింది. చివరికి కొంత కోలుకుంది. ఇక నిఫ్టీ 8,664 గరిష్ట-8,612 కనిష్ట శ్రేణిలో కదలాడింది. లాభ నష్టాల్లో..: 30 సెన్సెక్స్ షేర్లలో 19 నష్టాల్లో ముగిశాయి. రంగాల వారీ సూచీలను చూస్తే, మెటల్ (1.49%), ఎఫ్ఎంసీజీ (0.96%), కేపిటల్ గూడ్స్ (0.63%) నష్టపోయాయి. ఐటీ (1.1%), రియల్టీ (1.15%), టెక్ (0.52 %) పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 0.87%, 0.34% చొప్పున పడ్డాయి. మొత్తం 1,859 స్టాక్స్ నష్టపోగా, 1,024 లాభపడ్డాయి. 126 స్థిరంగా ఉన్నాయి. టర్నోవర్..: బీఎస్ఈలో మొత్తం టర్నోవర్ రూ.3,866 కోట్ల నుంచి రూ.3,233 కోట్లకు పడింది. ఎన్ఎస్ఈలో క్యాష్ టర్నోవర్ రూ. 16,726 కోట్లు. డెరివేటివ్స్‌లో ఈ విలువ రూ. 1,91,059 కోట్లు. కారణం...! బుధవారం అమెరికా ఫెడరల్ బ్యాంక్ సమావేశం, వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఊహాగానాల నేపథ్యంలో మార్కెట్ నష్టంలో ముగిసింది. అమెరికా వడ్డీరేట్లు పెంచితే, భారత్ వంటి వర్థమాన మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కు మళ్లవచ్చన్న ఆందోళన మార్కెట్లో నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శుక్రవారం కూడా సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయిన సంగతి విదితమే. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషణలు వినిపించాయి. సోమవారం విడుదలైన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు ‘మైనస్’గా ఉన్నా... ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలోనే ఉండడం, దీనితో భారత్‌లో కీలక పాలసీ రేటు రెపో మరింత తగ్గబోదన్న ఊహాగానాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని కొందరి విశ్లేషణ. -
మళ్లీ రయ్... రయ్
⇒ కొత్త రికార్డులకు మార్కెట్ ⇒ లోతుకు పడినా తిరిగి రికవరీ ⇒ సెన్సెక్స్ 123 ప్లస్‌తో 29,682కు జంప్ ⇒ నిఫ్టీ 38 కలుపుకుని 8,952కు అప్ మార్కెట్ అప్డేట్ ముంబై: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) 30 సెన్సెక్స్ ఒకరోజు వెనకడుగు తర్వాత... మళ్లీ రయ్యిన ముందుకు దూసుకుపోయింది. అంటే వరుసగా 8 రోజుల వరుస లాభాల తర్వాత బుధవారం స్వల్ప నష్టంలో ముగిసినప్పటికీ, గురువారం మళ్లీ లాభాలను నమోదుచేసుకుంది. 123 పాయింట్ల లా భంతో 28,682 వద్ద ముగిసింది. తద్వారా అటు ఇంట్రాడేలోనూ, ఇటు ముగింపులోనూ కొత్త చరిత్రాత్మక స్థాయిలను చూసింది.ఇక నిఫ్టీ వరుసగా 10వ ట్రేడింగ్ సెషన్లోనూ పురోగతిలో నిలిచింది. 38 పాయింట్లు కలుపుకుని 8,952 వద్ద ముగిసింది. నిఫ్టీ... గడచిన ఆరు రోజులుగా ఏరోజుకారోజు కొత్త ‘గరిష్ట స్థాయి’ రికార్డులను నమోదుచేసుకుంటూ వస్తోంది. మొదట పడినా... తిరిగి పరుగు బుధవారం ముగింపుకన్నా (29,559) 43 పాయింట్ల దిగువ స్థాయిలో 29,516 పాయింట్ల వద్ద గురువారం సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైంది. అటు తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో మరింతగా 29,378కు పడిపోయింది. అటు తర్వాత రికవరీ బాట పట్టి 29,741 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 123 పాయింట్ల లాభంతో ముగిసింది. తద్వారా ఇంట్రాడే, ముగింపుల్లో ఆల్‌టైమ్ హై రికార్డుల మోత మోగించింది. ఇక నిఫ్టీ ఇంట్రాడే హై 8,966 పాయింట్లకు ఎగసింది. చివరకు 38 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. ప్రభావిత అంశాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై వ్యక్తీకరించిన సానుకూల అంచనాలు... అలాగే తన పాలసీ విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం... జనవరి నెలకు సంబంధించి నెలవారీ ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో నిర్దిష్ట బ్లూచిప్స్‌లో కొనుగోళ్లు జరిగాయి. కొన్ని సంస్థల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడం, పటిష్ట రీతిలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. 30 షేర్ సెన్సెక్స్‌లో 17 లాభపడ్డాయి. 13 నష్టాలతో ముగిశాయి. మ్యాన్ ఇన్ఫ్రా షేర్లు కొన్న ఝున్‌ఝున్ వాలా ముంబై: టాప్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 30 లక్షల మ్యాన్ఇన్ఫ్రాకన్స్ట్రక్షన్ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఆ కంపెనీ ప్రమోటర్ మన్శి పరాగ్ షా నుంచి ఒక్కో షేర్‌ను రూ.36 చొప్పున 30 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు రూ.10.8 కోట్లు వెచ్చించారు. ఈ కోనుగోలు కారణంగా కంపెనీ షేర్ 20 శాతం (ఒక రోజులో అధిక శాతం పెరిగే పరిమితి ఇదే) వృద్ధితో రూ.43.20 వద్ద ముగిసింది. -
స్వల్ప లాభాలతో రికవరీ
బ్లూచిప్ షేర్ల పెరుగుదలతో దేశీ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో రికవర్ అయ్యాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు పెరిగి 28,386 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 8,476 వద్ద ముగిసింది. ఢిల్లీలో ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని ప్రభుత్వం పెంచిన సానుకూల పరిణామంతో డీఎల్ఎఫ్ తదితర రియల్టీ స్టాక్స్ ఎగిశాయి. అటు వచ్చే నెలలో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న అంచనాలు, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ నెలవారీ ముగింపు ముందు రోజున షార్ట్‌కవరింగ్ కూడా మార్కెట్ల పెరుగుదలకు దోహదపడ్డాయని ట్రేడర్లు తెలిపారు. బీఎస్ఈలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 4% పెరగ్గా.. విద్యుత్, మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. రియల్టీలో అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ మొదలైన షేర్లు 4-10 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజున 5 శాతం క్షీణించిన ఐటీసీ బుధవారం 2 శాతం మేర పెరిగింది. మరోవైపు, అంతర్జాతీయంగా చాలా మటుకు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. -
కొత్త గరిష్టం నుంచి కిందకు
ఎఫ్ఐఐల నిరవధిక పెట్టుబడులతో మార్కెట్లు మరోసారి కొత్త గరిష్టాలను తాకాయి. అయితే లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మిడ్ సెషన్లో నష్టాలలోకి మళ్లాయి. ఆపై ఒడిదుడుకుల మధ్య కదిలి చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. వెరసి తొలుత సెన్సెక్స్ 105 పాయింట్లు ఎగసి 28,283ను తాకగా, నిఫ్టీ సైతం 8,454ను దాటింది. ఆపై నష్టాలలోకి మళ్లిన సెన్సెక్స్ చివరికి 15 పాయింట్లు తక్కువగా 28,163 వద్ద నిలిచింది. నిఫ్టీ 5 పాయింట్లు తగ్గి 8,426 వద్ద స్థిరపడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 237 పాయింట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం చిన్న షేర్లకు డిమాండ్ కనిపించింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.3-0.9% మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,743 లాభపడితే, 1,366 నష్టపోయాయి. సెసాస్టెరిలైట్ జోరు సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, ఓఎన్జీసీ, టీసీఎస్ 2-1% మధ్య నష్టపోగా, సెసాస్టెరిలైట్ 4%పైగా ఎగసింది. ఈ బాటలో భెల్, ఎల్అండ్టీ, భారతీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2-1.5% మధ్య లాభపడ్డాయి. -
స్టాక్ మార్కెట్ విలువ 100 లక్షల కోట్లకు చేరువలో..
న్యూఢిల్లీ: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ)లో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 100 లక్షల కోట్ల మార్క్‌కు చేరువైంది. బీఎస్ఈలో మొత్తం 5,508 షేర్లు లిస్ట్‌కాగా, 1,330 కంపెనీలు సస్పెండ్ అయ్యాయి. దీంతో 4,178 కంపెనీల షేర్లు మాత్రమే ట్రేడింగ్‌కు అర్హత కలిగి ఉన్నాయి. బుధవారం(5న) ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 97,13,196 కోట్లను తాకింది. రూ.100 లక్షల కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి కేవలం రూ. 2.86 లక్షల కోట్ల దూరంలో నిలిచింది. ఇక డాలర్లలో చూస్తే(ఒక డాలరుకు రూ. 61.41 లెక్క ప్రకారం) 1.58 ట్రిలియన్లుగా ఉంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం, సంస్కరణలు వేగవంతం చేయడం వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) సైతం జనవరి మొదలు ఇప్పటివరకూ స్టాక్స్‌లో రూ. 82,226 కోట్లను(13.7 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వెరసి బీఎస్ఈ ప్రధానసూచీ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 6,745 పాయింట్లు(32 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో సెన్సెక్స్ 28,000 పాయింట్ల శిఖరాన్ని సైతం అధిరోహించింది. సెన్సెక్స్‌లోని పలు బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. టీసీఎస్ అయితే ఏకంగా రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి దేశీయ కంపెనీగా కొత్త రికార్డును సృష్టించింది. -
‘క్రిస్’కు ఇన్ఫోసిస్ వీడ్కోలు
బెంగళూరు: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో వ్యవస్థాపకుల శకం పూర్తిగా ముగిసింది. తాజాగా క్రిస్ గోపాలకృష్ణన్ పదవీ విరమణ చేశారు. దీంతో మొత్తం వ్యవస్థాపకులందరూ కంపెనీ నుంచి వైదొలిగినట్లయింది. బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో క్రిస్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఇప్పుడంతా కంప్యూటర్లమయంగా మారింది. ఇది భారీ పరిశ్రమగా రూపొందింది. డెబ్భై సంవత్సరాల ఈ రంగంలో దాదాపు 35 ఏళ్ల పాటు భాగమవడం నా అదృష్టం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ ఏర్పాటు, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పరిశ్రమపై తమదైన ముద్ర వేయగలిగామని క్రిస్ పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ.. పరిశోధన, ఎంట్రప్రెన్యూర్షిప్పై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. నీలేకని తదితర మాజీ సహచరుల తరహాలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. ఈ ఏడాది జూన్ 14న ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వైదొలిగిన క్రిస్.. ఆ తర్వాత నుంచి కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మిగతా వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎన్ఎస్ రాఘవన్, ఎస్డీ శిబులాల్, కె. దినేష్‌లు కూడా ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మూర్తి సహా వ్యవస్థాపక బృందం 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. నభూతో నభవిష్యత్.. ఎంతో నిబద్ధతతో, ఎన్నో త్యాగాలకోర్చి ఏకంగా 33 ఏళ్ల పాటు ఒక సంస్థను తీర్చిదిద్దిన వ్యవస్థాపక సభ్యుల బృందాన్ని దేశం గతంలో ఎన్నడూ చూడలేదని, ఇకపై కూడా చూడకపోవచ్చని ఈ సందర్భంగా నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ‘బోంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1993లో ఈ సంస్థ లిస్టయినప్పుడు మార్కెట్ విలువ రూ. 28.5 కోట్లు. అక్కణనుంచి 2014లో రూ. 2,00,000 కోట్లకు పెరిగింది. అంటే 21 సంవత్సరాల్లో 6,50,000 శాతం మేర రాబడులు ఇచ్చినట్లు లెక్క. కంపెనీని ఇంత ఘనమైన స్థాయికి తీసుకొచ్చిన సంతృప్తితో వైదొలుగుతున్నాం’ అని ఆయన చెప్పారు. ఈ నెల 10 దాకా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్న మూర్తి.. అటు తర్వాత నుంచి గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు, కస్టమర్ల అవసరాలను గుర్తెరిగి, వారితో సత్సంబంధాలు కొనసాగించడం ఏ వ్యాపారానికైనా కీలకమని, అదే తాను ఆచరణలో పెట్టానని నీలేకని పేర్కొన్నారు. -
మార్కెట్.. అక్కడక్కడే అడుగులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5.5% చొప్పున నమోదుకాగలదని రిజర్వ్ బ్యాంక్ వేసిన అంచనా సెంటిమెంట్‌కు బూస్ట్‌నిచ్చింది. దీంతో మిడ్ సెషన్లో సెన్సెక్స్ 254 పాయింట్లవరకూ ఎగసి 26,851 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించడంతో చివరి గంటన్నరలో అమ్మకాలు పెరిగి లాభాలు కరిగిపోయాయి. వెరసి సెన్సెక్స్ 33 పాయింట్ల లాభాన్ని మిగుల్చుకుని 26,630 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 9 పాయింట్లు బలపడి 7,965 వద్ద నిలిచింది. గురువారం నుంచి మొదలుకానున్న వరుస సెలవుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. చైనా తయారీ రంగం అంచనాలు అందుకోకపోవడం, హాంకాంగ్ అనిశ్చితులు వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపాయని చెప్పారు. ప్రధానంగా రియల్టీ, పవర్, మెటల్ రంగాలు 3-1% మధ్య నీరసించగా, హెల్త్‌కేర్ 1%పైగా లాభపడింది. సెన్సెక్స్ దిగ్గజాలలో భెల్, యాక్సిస్, హిందాల్కో, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ, టీసీఎస్ 3-1% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, మారుతీ, సిప్లా, రిలయన్స్, ఐటీసీ 3-1% మధ్య పుంజుకుని మార్కెట్లను ఆదుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు ఇండియాబుల్స్, యూనిటెక్, డీఎల్ఎఫ్, అనంత్‌రాజ్, మహీంద్రా లైఫ్ 5-2% మధ్య పతనమయ్యాయి. కాగా, ఎఫ్ఐఐలు రూ. 486 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. -
ఒడిదుడుకుల బాటలో
ఆర్బీఐ విధాన సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో మార్కెట్లు పలుమార్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసింది. ప్రధానంగా వడ్డీ ప్రభావిత రంగాలు డీలాపడటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. దీంతో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు నష్టపోయి 26,597 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు క్షీణించి 7,959 వద్ద నిలిచింది. కాగా, రోజు మొత్తంలో సెన్సెక్స్ 26,715-26,518 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఫార్మా, ఐటీ రంగ షేర్లు వెలుగులో నిలవగా, మెటల్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ నీరసించాయి. అమెరికా గణాంకాల ఎఫెక్ట్ అమెరికా ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా వెలువడటంతో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 1-3% మధ్య పుంజుకున్నాయి. వీటికితోడు సన్‌ఫార్మా 3.4% ఎగసింది. అయితే మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఓఎన్జీసీ, సెసాస్టెరిలైట్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హీరోమోటో, కోల్ ఇండియా తదితరాలు 1%పైగా నష్టపోవడంతో మార్కెట్లు బలహీనపడ్డాయి. సెంటిమెంట్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లకు డిమాండ్ కనిపించింది. -
సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారి 27 వేలు అధిగమించింది. సెన్సెక్స్152 పాయింట్లు లాభపడి 27,019 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 8,083 వద్ద ముగిశాయి. -
బుల్ కొమ్ములు పట్టి.. గంట కొట్టిన అమితాబ్!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం ఓపెనింగ్ బెల్ కొట్టి బాంబే స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను ఆరంభించారు. తాజాగా నటిస్తున్న 'యుద్ధ్' అనే టెలివిజన్ సీరియల్ ప్రమోషన్ లో భాగంగా బుల్ కొమ్ములు పట్టుకుని.. అమితాబ్ గంటను మోగించారు. 'యుద్ధ్' టెలివిజన్ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నటిస్తున్నారు. అరుదైన అవకాశాన్ని అందించిన బాంబే స్టాక్ ఎక్చ్సెంజికి ధన్యవాదాలు అంటూ బీగ్ బీ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. బీఎస్ఈలో 'శాంతి కన్ స్ట్రక్షన్' పేరిటి ఓ ఊహజనిత కంపెనీని లిస్ట్ చేశారు. 'శాంతి కన్ స్ట్రక్షన్' కంపెనీని 'యుద్ద్' లిస్ట్ చేసింది అంటూ ట్విట్ లో పేర్కొన్నారు. వచ్చేనెల ఈ టెలివిజన్ సీరియల్ సోని టెలివిజన్ లో ప్రసారం కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ క్రియెటివ్ డైరెక్టర్ గా, మద్రాస్ కెఫే దర్శకుడు షూజిత్ సర్కార్ క్రియెటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సారిక, కేకే మీనన్, నవాజుద్దీన్ సిద్దికీ, తిగ్ మాన్షు ధూలియాలు నటిస్తున్నారు. -
చిన్న షేర్లు విలవిల
భారీ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే అధిక శాతం చిన్న షేర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 22,418 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 19 పాయింట్లు తగ్గి 6,696 వద్ద నిలిచింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, సెన్సెక్స్ తొలుత 214 పాయింట్ల వరకూ లాభపడింది. ఆపై ఉన్నట్టుండి పతనబాటపట్టి 180 పాయింట్ల వరకూ దిగజారింది. ఎన్డీఏకు తగిన మెజారిటీ లభించకపోవచ్చన్న అంచనాలు మిడ్ సెషన్లో సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,704 నష్టపోగా, 973 మాత్రమే బలపడ్డాయి. రియల్టీ బోర్లా రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, యూనిటెక్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, డీబీ, ఇండియాబుల్స్, ఒబెరాయ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 9-3% మధ్య పతనంకావడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5.3% పడిపోయింది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, పవర్, వినియోగ వస్తు రంగాలు సైతం 2% చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, భెల్, సెసాస్టెరిలైట్, భారతీ, ఎల్అండ్టీ, హిందాల్కో, ఐసీఐసీఐ 3.5-1.5% మధ్య తిరోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ 3-1.5% మధ్య లాభపడ్డాయి. బుధవారం ఎఫ్ఐఐలు రూ. 454 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
ఒడిదుడుకుల వారము
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో మార్చి నెల ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నదని తెలిపారు. వచ్చే నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో వడ్డీ ప్రభావిత రంగాలలో లావాదేవీలు పుంజుకుంటాయని అంచనా వేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నందున ట్రేడర్ల కార్యకలాపాలు ఊపందుకుంటాయని దీంతో ఇండెక్స్‌లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. వెరసి ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాల షేర్లవైపు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. వెలుగులో చిన్న షేర్లు : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో మార్చి డెరివేటివ్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులు చవిచూస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఇందుకు లోక్‌సభ ఎన్నికలు, రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష వంటి అంశాలు కూడా కారణంకానున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు వెలుగులో నిలుస్తాయని, వీటికితోడు చిన్న షేర్లకు డిమాండ్ కనిపిస్తుందని చెప్పారు. ఇకపై క్యూ4 ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్లను నడిపిస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,475 స్థాయి కీలకంగా నిలవనున్నదని తెలిపారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికలపై అంచనాలు: వచ్చే నెల 7 నుంచి మే 12 మధ్య కాలంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఇది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు(ఎఫ్ఐఐలు) ప్రోత్సాహాన్నిస్తున్నదని చెప్పారు. దీంతో గడిచిన నెల రోజుల్లో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్, నిఫ్టీ 5%పైగా పురోగమించాయని వివరించారు. ఫెడ్ ఎఫెక్ట్: వచ్చే ఏడాది(2015) ద్వితీయార్థంలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో సంకేతాలిచ్చింది. మరోవైపు నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున సహాయక ప్యాకేజీలో కోతను పెంచుతూ వస్తోంది. దీంతో ప్రస్తుతం ప్యాకేజీ 55 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా, త్వరలో పూర్తిస్థాయిలో ప్యాకేజీని ఉపసంహరించే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు విదేశీ పెట్టుబడుల రాకపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ అంటోంది. ఎఫ్ఐఐల జోష్ న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌పై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆసక్తి కొనసాగుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 9,600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహమిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మార్చి నెలలో (21 వరకూ) ఎఫ్ఐఐలు నికరంగా రూ. 9,600 కోట్లను(156 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇక ఇదే కాలంలో రుణ(డెట్) సెక్యూరిటీలలో మరింత అధికంగా రూ. 12,816 కోట్లను(200 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
టెలికం షేర్లు డీలా
రానున్న స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు 8 కంపెనీలు బిడ్స్ దాఖలు చేయనున్న వార్తలు టెలికం షేర్లను పడగొట్టాయి. రిలయన్స్ జియో ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం సేవలకు సిద్ధపడటం మరోసారి పోటీకి తెరలేపనుందన్న అంచనాలు టెలికం షేర్లలో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు విశ్లేషించారు. దీనికితోడు పెరగనున్న పోటీ నేపథ్యంలో క్రెడిట్ సూసీ టెలికం షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని వివరించారు. వెరసి ఐడియా సెల్యులార్ 7% పతనంకాగా, భారతీ ఎయిర్టెల్ 5%, ఆర్‌కామ్ 4%, టాటా టెలీ 3.3%, టాటా కమ్యూనికేషన్, ఎంటీఎన్ఎల్ 2% చొప్పున నష్టపోయాయి. కాగా, మరోవైపు మార్కెట్లు స్థిరీకరణ బాటలో సాగుతూ అక్కడక్కడే సంచరించాయి. 21,484-21,265 పాయింట్ల మధ్య కదిలిన సెన్సెక్స్ చివరికి 24 పాయింట్లు క్షీణించి 21,265 వద్ద ముగిసింది. నిఫ్టీ అయితే 2 పాయింట్ల నామమాత్ర నష్టంతో 6,319 వద్ద నిలిచింది. ఇక ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించిన కోల్ ఇండియా మరో 2.6% లాభపడింది. ఇన్ఫీకి పూర్వవైభవం మార్కెట్ల గమనాన్ని ప్రతిబింబించే ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపగల వెయిటేజీని ఇన్ఫోసిస్ తిరిగి సాధించింది. నిఫ్టీలో 8.67% వెయిటేజీ పొందడం ద్వారా ఐటీసీ(8.66%)ను రెండో స్థానంలోకి నెట్టింది. గురువారం ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ 0.3% లాభపడి రూ. 3,722 వద్ద ముగియగా, ఐటీసీ 0.7% క్షీణించి రూ. 327 వద్ద నిలిచింది. -
నాలుగో రోజూ నష్టాలే
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా భారత్ స్టాక్ సూచీలు వరుసగా నాలుగోరోజూ తగ్గాయి. క్యూ 3 ఫలితాల సీజన్ దగ్గరపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంకావడం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశపు మినిట్స్ వెల్లడికానుండటం, భారత్ సర్వీసుల రంగం నెమ్మదించిందంటూ హెచ్ఎస్బీసీ సూచి వెల్లడించడం వంటి అంశాలతో తాజా అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 20,787 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 పాయింట్ల క్షీణతతో 6,191 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీల్లో ఎక్కువ వెయిటేజి వున్న ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2% మధ్య నష్టపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తగ్గాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకింగ్, రియల్టీ, పవర్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. కొద్ది రోజుల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు దృష్టిపెడుతున్న మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ మాత్రం కొనసాగింది. ఎఫ్ఐఐలు రూ. 318 కోట్లు వెనక్కు తీసుకున్నారు. దేశీయ సంస్థలు రూ. 22 కోట్ల షేర్లను విక్రయించాయి. నిఫ్టీ 6,200 పుట్ ఆప్షన్లలో బిల్డప్... వరుసగా రెండోరోజూ 6,170 సమీపంలో నిఫ్టీ మద్దతు పొందడంతో 6,200 స్ట్రయిక్ వద్ద ఇన్వెస్టర్లు పుట్ ఆప్షన్లను విక్రయించారు. దాంతో ఈ పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో మరో 3 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 43.42 లక్షల షేర్లకు పెరిగింది. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో కూడా 3.98 లక్షల షేర్లు యాడ్‌అయినా, మొత్తం ఓఐ పరిమితంగా 22.34 లక్షలే వుంది. కానీ 6,300 స్ట్రయిక్ వద్ద భారీగా కాల్ రైటింగ్ జరగడంతో 8.47 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 49.21 లక్షల షేర్లకు పెరిగింది. ఏదైనా ప్రతికూల వార్త వెలువడితే తప్ప, నిఫ్టీ 6,200పైకి తిరిగి చేరవచ్చని, రానున్న రోజుల్లో 6,300 స్థాయి నిరోధించవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు ఈ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. ఫలానా స్థారుుని మించి షేరు లేదా ఇండెక్స్ పెరగదన్న అంచనాలతో కాల్ ఆప్షన్‌ను, లేదా తగ్గదన్న అంచనాలతో పుట్ ఆప్షన్‌ను విక్రరుుంచడాన్ని ఆప్షన్ రైటింగ్‌గా వ్యవహరిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లు షేరు పెరగకపోతే కాల్ ఆప్షన్ ప్రీమియుం, తగ్గకపోతే పుట్ ఆప్షన్ ప్రీమియుం తగ్గిపోతుంది. ఎక్కువ ప్రీమియుంకు విక్రరుుంచిన ఆప్షన్ కాంట్రాక్టును ప్రీమియుం తగ్గిన తర్వాత కొంటే, అవ్ముకం కొనుగోలు ధర వుధ్య వ్యత్యాసం లాభంగా మిగులుతుంది. అంచనాలకు భిన్నంగా ప్రీమియుం పెరిగితే ఆప్షన్లు రైట్ చేసినవారు నష్టపోతారు. అలా అమ్మకందార్లు రైట్ చేసిన కాంట్రాక్టులను కొన్నవారు లాభపడతారు. -
ఫెడ్ ఎఫెక్ట్... ఎగసిపడిన మార్కెట్
వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌వేస్తూ రిజర్వుబ్యాంక్ ఇన్వెస్టర్లకు ఇచ్చిన ఊరట ఒక్కరోజుకే పరిమితమయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ టాపరింగ్‌కు శ్రీకారం చుట్టడంతో తిరిగి మార్కెట్లు క్షీణించాయి. ఆర్బీఐ చర్యతో క్రితం రోజు 248 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్ ఫెడ్ ఎఫెక్ట్‌తో 151 పాయింట్లు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం ప్రతీ నెలా ఉద్దేశించిన 85 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నుంచి 10 బిలియన్ డాలర్లు ఉపసంహరించాలన్న నిర్ణయాన్ని గతరాత్రి ఫెడ్ తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదన్న సంకేతాన్ని ఈ టాపరింగ్ ద్వారా ఫెడ్ అందించడంతో అమెరికా సూచీలు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ ప్రభావంతో గురువారం ఉదయం 20,959 స్థాయికి గ్యాప్‌అప్‌తో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్, తదుపరి కొన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో పడిపోయింది. చివరకు 20,708 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 6,166 వద్ద క్లోజయ్యింది. పెరిగిన బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్. షేర్లలో విక్రయాలు జరిగాయి. అమెరికా రికవరీతో లబ్దిచేకూరవచ్చన్న అంచనాలతో ఐటీ, ఫార్మా షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలుచేయడంతో ఆ షేర్లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎస్బీఐలు 2-3 శాతం మధ్య తగ్గాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు కొత్త రికార్డుస్థాయికి చేరాయి. విప్రో 13యేళ్ల గరిష్ట స్థాయిలో రూ. 530 వద్ద, టెక్ మహీంద్రా ఆరేళ్ల గరిష్ట స్థాయి రూ. 1,799 వద్ద ముగిసాయి. ఫార్మా దిగ్గజాలు సిప్లా, ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు 2-3 శాతం మధ్య ఎగిసాయి. ఆటోమొబైల్ షేరు మారుతి సైతం కొత్త రికార్డుస్థాయి రూ. 1,798 స్థాయికి పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఒకే రోజున భారీగా రూ. 2,264 కోట్ల పెట్టుబడుల్ని కుమ్మరించారు. నిఫ్టీలో లాంగ్ ఆఫ్‌లోడింగ్: ఫెడ్ టాపరింగ్ నిర్ణయంతో నిఫ్టీ 6,200 మద్దతుస్థాయిని కోల్పోయినా, సమీప భవిష్యత్తులో పెద్ద పతనం జరగకపోవొచ్చని డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. 6,263 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 6,150 పాయింట్ల కనిష్టస్థాయివరకూ నిఫ్టీ క్షీణించడానికి లాంగ్ ఆఫ్‌లోడింగ్ కారణం. షార్టింగ్ వల్ల ఈ తగ్గుదల జరగలేదు. ఈ ప్రక్రియను సూచిస్తూ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 30.69 లక్షల షేర్లు (14%) కట్ అయ్యాయి దాంతో మొత్తం ఓఐ 1.89 కోట్ల షేర్లకు తగ్గింది. 6,200 స్ట్రయిక్ వద్ద కాల్‌రైటింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్ ఓఐలో 18.18 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం బిల్డప్ 54.79 లక్షల షేర్లకు చేరింది. 6,200, 6,100 స్ట్రయిక్స్ వద్ద స్వల్పంగా పుట్ కవరింగ్ జరిగింది. 6,200 వద్ద ఏర్పడిన తాజా నిరోధాన్ని దాటితేనే అప్‌ట్రెండ్ సాధ్యమని, ఈ స్థాయి దిగువన బలహీనంగా రేంజ్బౌండ్లో ట్రేడ్‌కావొచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
6 నెలల్లోగా బీఎస్ఈ పబ్లిక్ ఇష్యూ
కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చే ఆరు నెలల్లోగా స్టాక్ మార్కెట్లో నమోదు కానుంది. వాటాల ఉపసంహరణకు సంబంధించి అనుమతి కోరుతూ ఇప్పటికే సెబీకి దాఖలు చేశామని, అనుమతులు రాగానే పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు బీఎస్ఈ మేనేజింగ్ డెరైక్టర్ అండ్ సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్యూ పరిమాణం చెప్పలేమని, అది రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు ఉండొచ్చన్నారు. సెబీ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ ఇష్యూపై స్పష్టత వస్తుందన్నారు. బీఎస్ఈలో 7,000 మందికిపైగా వాటాదారులు ఉన్నారు. అందులో 40 శాతం బ్రోకింగ్ కమ్యూనిటీకి సంబంధించినవాళ్లు ఉండగా, మరో 30 శాతం విదేశీ సంస్థలు ఉన్నాయి. షేర్లను వేలం వేయడం ద్వారా (ఆఫర్ ఫర్ సేల్) వాటాలను విక్రయించాలని బీఎస్ఈ నిర్ణయించింది. ఇందుకోసం గత జనవరిలో సెబీకి దరఖాస్తు చేసింది. -
పరుగులు పెట్టిన సెన్సెక్స్!
త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో రెపో రేట్ ను 0.25 శాతం పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో రంగాల కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఓ దశలో 20493 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్న సెన్సెక్స్.. చివరికి 358 పాయింట్ల లాభంతో 20929 పాయింట్ల వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల కోల్పోయి 6220 పాయింట్ల వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో మారుతి సుజుకీ అత్యధికంగా 8 శాతం, జయప్రకాశ్ 7.30, ఐసీఐసీఐ బ్యాంక్ 5.88, ఇండస్ ఇండ్ బ్యాంక్ 5.55, యాక్సీస్ బ్యాంక్ 4.94 శాతం వృద్ధిని సాదించాయి. రాన్ బాక్సీ, గెయిల్, ఐటీసీ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
సెన్సెక్స్ 385 పాయింట్లు జంప్
దేశీ స్టాక్ మార్కెట్లకు దసరా పండుగ ముందే వచ్చిందా అన్నట్లు ఇన్వెస్టర్లలో ఉత్సాహం జోరందుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 385 పాయింట్లు దూసుకెళ్లి వరుసగా రెండోరోజూ లాభాలతో ముగిసింది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్) కారణంగా... అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(టాపరింగ్)ను మరికొన్నాళ్లు వాయిదావేయొచ్చన్న అంచనాలు మార్కెట్లకు ఆక్సిజన్‌గా పనిచేసింది. వారం రోజుల గరిష్టానికి చేరిన సెన్సెక్స్ 19,902 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల షేర్ల దూకుడుతో సూచీలు పరుగులు తీశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 130 పాయింట్లు దూసుకెళ్లి 5,910 పాయింట్ల వద్ద స్థిరపడటం గమనార్హం. కాగా, గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పుంజుకుంది. ఏకంగా 73 పైసలు బలపడి 61.73కు ఎగబాకింది. ఇది ఏడు వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. రూపాయి బలోపేతం కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్ మెరుగయ్యేందుకు ఉపకరించిందని మార్కెట్ పరిశీలకులు విశ్లేషించారు. పండుగ సీజన్లో వాహన, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాల వినియోగదారులకు మరిన్ని రుణాలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన పెట్టుబడుల నిధులను పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించడం కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. బ్యాంకింగ్ స్టాక్స్‌కు మద్దతుగా నిలిచింది. 12 రంగాలు లాభాల్లోనే... బీఎస్ఈలోని మొత్తం 13 రంగాల సూచీల్లో 12 సూచీలు లాభాల బాట పట్టాయి. వీటిలో అత్యధికంగా ఎగబాకిన వాటిలో మెటల్స్(3.94%), బ్యాంకింగ్(3.41%), క్యాపిటల్ గూడ్స్(2.82%), ఆయిల్-గ్యాస్(2.46%) ఇండెక్స్‌లు ముందువరుసలో నిలిచాయి. సెనెక్స్ జాబితాలోని 30 షేర్లలో కేవలం రెండు మాత్రమే(ఐటీసీ, హెచ్‌యూఎల్) నష్టాలతో ముగిశాయి. సెసాగోవా షేరు అత్యధికంగా 7.21 శాతం దూసుకెళ్లి రూ.188 వద్ద స్థిరపడింది. ప్రధానంగా లాభపడిన వాటిలో బజాజ్ ఆటో(5.1%), హిందాల్కో(4.34%), టాటా పవర్(4.04%), టీసీఎస్(4.02%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(4%), టాటా స్టీల్(3.68%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2.89%) ఉన్నాయి. గురువారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం దాదాపు రూ.1,000 కోట్ల విలువైన నికర పెట్టుబడులు వెచ్చించారు. దేశీ ఫండ్స్ రూ.449 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. నిఫ్టీ, టాటా గ్రూప్ షేర్లలో లాంగ్ బిల్డప్... గురువారం అనూహ్యంగా పెరిగిన వూర్కెట్లో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ ఫ్యూచర్లో లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ పొజిషన్లను సూచిస్తూ స్పాట్ నిఫ్టీతో పోలిస్తే అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు 56 పాయింట్ల ప్రీమియుంతో 5,966 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 10.09 లక్షల షేర్లు (6.18 శాతం) యూడ్ అయ్యూయి. దాంతో మొత్తం ఓఐ 1.73 కోట్ల షేర్లకు చేరింది. 5,800, 5,900 స్ట్రరుుక్స్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది. దాంతో 5,800 కాల్ ఆప్షన్ ఓఐ నుంచి 2.96 లక్షల షేర్లు, 5,900 కాల్ ఆప్షన్ ఓఐ నుంచి 3.23 లక్షల షేర్ల చొప్పున కట్ అయ్యూయి. అలాగే 5,900 పుట్ ఆప్షన్ ఓఐలో 5.77 లక్షల షేర్లు, 5,800 పుట్ ఆప్షన్లో 10.29 లక్షల షేర్ల చొప్పున యూడ్ అయ్యూయి. 5,800 పుట్ ఆప్షన్ వద్ద అధికంగా 42 లక్షల షేర్ల ఓఐ వున్నందున, సమీప భవిష్యత్తులో నాటకీయుంగా క్షీణత ఏదైనా సంభవిస్తే, ఈ స్థాయి వద్ద నిఫ్టీ వుద్దతు పొందవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. టాటా గ్రూప్ షేర్లలో కూడా...: 10 రోజుల్లో ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో టాప్ ఐటీ షేర్లు 2-4% వుధ్య పెరిగారుు. క్యాష్ వూర్కెట్లో 4%పైగా ర్యాలీ జరిపిన టీసీఎస్ ఫ్యూచర్లో జోరుగా లాంగ్ బిల్డప్ జరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ఈ ఫ్యూచర్ రూ. 14 ప్రీమియుంతో ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో 2.53 లక్షల షేర్లు (4.45%) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 59.41 లక్షల షేర్లకు చేరింది. వాహన రుణాల పెంపునకు తగిన నిధులు ప్రభుత్వ బ్యాంకులకు లభిస్తున్నాయున్న వార్తలతో టాటా మోటార్స్ షేరు కూడా 3% పెరిగింది. ఈ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో 15.17 లక్షల షేర్లు (8.54%) తాజాగా యూడ్ అయ్యూయి. మొత్తం ఓఐ 1.92 కోట్ల షేర్లకు పెరిగింది. మెటల్స్ రంగంలోని టాటా స్టీల్ కౌంటర్లోనూ తాజాగా 1.87 లక్షల షేర్లు యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.62 కోట్ల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో షేరు వురింత పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలు చేసే కాంట్రాక్టును లాంగ్ పొ జిషన్గా పరిగణిస్తారు. షేరు పెరుగుతూ ఓఐ యూడ్అవుతూవుంటే ఆ కాంట్రాక్టులో లాంగ్ పొజిషన్లు పెరుగుతున్నాయుని డెరివేటివ్ విశ్లేషకులు భావిస్తారు. -
బలపడిన రూపాయి, సెన్సెక్స్ జెట్ స్పీడ్!
ఉద్దీపన కార్యక్రమంపై యూఎస్ ఫెడరల్ రిజర్వు అనూహ్యమైన నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ప్రభావం, రూపాయి నెలరోజుల గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్న వార్తల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం జెట్ స్పీట్ తో దూసుకెళ్లాయి. బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లు ముందుండి సూచీలను పరిగెత్తించాయి. గురువారం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 20354 పాయింట్ల వద్ద ఆరంభమై.. 20739 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. చివరికి 684 పాయింట్ల లాభంతో 20646 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 6044 పాయింట్ల ప్రారంభమై.. ఓ దశలో 6142 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. చివరికి నిన్నటి ముగింపుకు 216 పాయింట్ల వృద్ధితో 6115 పాయింట్ల వద్ద క్లోజైంది. ఇండెక్స్ ఆధారిత కంపెనీ షేర్లలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా 9.36 శాతం, జయప్రకాశ్ అసోసియేట్స్ 8.86 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.81 శాతం, ఎస్ బీఐ 8.01 శాతం, కొటాక్ మహేంద్ర 7.95 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. హెచ్ సీఎల్ టెక్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ ను పోల్చితే రూపాయి 156 పైసలు లాభపడి 61.82 వద్ద ట్రేడ్ అవుతోంది. -
స్వల్ప హెచ్చుతగ్గులు
ఇన్వెస్టర్లను ప్రభావితం చేయగల అంశాలేవీ లేకపోవడంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు నత్తనడక నడిచాయి. అయితే రోజు మొత్తంలో స్వల్పశ్రేణిలో పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో గరిష్టంగా 19,899ను, కనిష్టంగా 19,676 పాయింట్లను తాకింది. చివరికి 49 పాయింట్లు క్షీణించి 19,733 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ మాత్రం యథాతథంగా 5,851 వద్దే స్థిరపడింది. ఇందుకు గత రెండు వారాల్లో మార్కెట్లు 10% పుంజుకోవడం కూడా కారణంగా నిలుస్తోంది. ప్రధాని ఆర్థిక సలహాదారు రంగరాజన్ జీడీపీ వృద్ధి అంచనాను 6.4% నుంచి 5.3%కు కుదించడం కూడా కొంతమేర సెంటిమెంట్‌ను బలహీనపరచింది. వచ్చే వారం ఇటు రిజర్వ్ బ్యాంక్, అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలు ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఐటీ షేర్లు డీలా బీఎస్ఈలో రియల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 2.5% స్థాయిలో పుంజుకోగా వినియోగ వస్తువులు, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు 1.5-1% మధ్య క్షీణించాయి. దిగ్గజాలలో విప్రో అత్యధికంగా 3.6% పతనంకాగా, టాటా స్టీల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, భారతీ, టీసీఎస్, హెచ్‌యూఎల్ 1.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు భెల్ 5.6% ఎగసింది. ఈ బాటలో కోల్ ఇండియా, ఎల్అండ్టీ, టాటా పవర్, హీరో మోటో, ఎంఅండ్ఎం 3-2% మధ్య పుంజుకున్నాయి. వెలుగులో చిన్న షేర్లు? మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.6% బలపడ్డాయి. బీఎస్ఈ-500లో కోల్టేపాటిల్ 17% దూసుకెళ్లగా సింటెక్స్, ఫినోలె క్స్, పటేల్ ఇంజినీరింగ్, యూబీ హోల్డిం గ్స్, జేకే లక్ష్మీ సిమెంట్, బాంబే డయింగ్, బిల్ట్, జేపీ పవర్, లవబుల్ లింగరీ తదితరాలు 11-7% మధ్య జంప్‌చేశాయి. ఎఫ్ఐఐలు రూ. 98 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 152 కోట్లు చొప్పున అమ్మకాలు జరిపాయి. -
సెన్సెక్స్ 590 పాయింట్ల పతనం
స్టాక్ మార్కెట్లను మంగళవారం అమంగళమై ఉరిమింది. దీనికి రూపాయి మహా పతనం పిడుగుపాటులా జత కలిసింది. ఇదిచాలదన్నట్లు ఆహార భద్రత బిల్లువల్ల పెరగనున్న సబ్సిడీ ఆందోళనలు పెనుతుపానులా చెలరేగాయి. ఇంకేముంది? ఒక్కసారిగా దెబ్బతిన్న సెంటిమెంట్‌తో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్రారంభంనుంచీ అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో సెన్సెక్స్ 590 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ ఏడాది కనిష్టాన్ని తాకింది. ఒక్క రోజులో రూ. 1.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది!! నిరంతర పతనంతో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న దేశీ కరెన్సీ స్టాక్ మార్కెట్లను కూడా వణికిస్తోంది. ఇదివరకు ఎన్నడూ ఎరుగని విధంగా డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతుండటంతో ఉదయం నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. చరిత్రలోలేని విధంగా మిడ్ సెషన్లో 2.7% పతనమై 66కుపైగా పడిపోయిన రూపాయి దెబ్బకు సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు సోమవారం రాత్రి లోక్‌సభలో ఆహార భద్రత బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పటికే కరెంట్ ఖాతాలోటుతో కుదేలైన ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింత పెరుగుతుందన్న ఆందోళనలు కూడా దీనికి జత కలిశాయి. వెరసి సెన్సెక్స్ 590 పాయింట్లు కుప్పకూలి 18,000 దిగువ కు చేరింది. గత మూడు రోజుల్లో ఆర్జించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయి 17,968 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 189 పాయింట్లు కోల్పోయి 5,300 దిగువన 5,287 వద్ద స్థిరపడింది. ఇది ఏడాది కనిష్టం. నిఫ్టీ అంతక్రితం 2012 సెప్టెంబర్ 6న మాత్రమే ఈ స్థాయిలో ముగిసింది. కాగా, ఏ దశలోనూ కోలుకోని రూపాయి ట్రేడింగ్ ముగిసేసరికి ఏకంగా 3%(194 పైసలు) పడిపోయి కొత్త రికార్డును నెలకొల్పింది! ఫలితంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 66.24 వద్ద నిలిచింది!! చమురు మంటలు... మధ్యప్రాచ్యంలో చెలరేగిన అశాంతి నేపథ్యంలో చమురు ధరలు 5 నెలల గరిష్టానికి చేరడంతో దిగుమతుల బిల్లు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీల ఉపసంహరణ త్వరలో మొదలుకావచ్చునన్న అంచనాలు కూడా మూకుమ్మడి అమ్మకాలకు కారణమయ్యాయని విశ్లేషించారు. కాగా, రూ. 1.83 లక్షల కోట్ల విలువైన 27 ప్రాజెక్ట్‌లకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయడాన్ని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకుంటుందన్న భరోసా ఇచ్చినప్పటికీ మార్కెట్లు పెడచెవిన పెట్టాయి. తయారీ రంగంతోపాటు, పెట్టుబడుల వాతావరణం మెరుగుపడటం మొదలైతే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుందని ఆశావహంగా చెప్పినప్పటికీ ఇన్వెస్టర్లు అమ్మకాలను ఆపకపోవడం గమనార్హం. పాతాళమే హద్దు... బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ 0.5-5.5% మధ్య కుప్పకూలాయి. ఐటీ ఒక్కటే కాస్త నిలదొక్కుకుంది. మొండి బకాయిల భారంతో బ్యాంకింగ్ ఇండెక్స్ అత్యధికంగా 5.5% పతనంకాగా, బ్యాంక్ షేర్లన్నీ నష్టపోయాయి. ఇక క్యాపిటల్ గూడ్స్, పవర్, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు సైతం 5-3% మధ్య పడిపోయాయి. బ్యాంక్ షేర్లలో యస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ, ఇండస్ఇండ్, ఫెడరల్, బీవోఐ, యాక్సిస్, యూనియన్, కెనరా, పీఎన్బీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ 10-2.5% మధ్య పడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్‌లో కేవలం ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, సెసా గోవా నిలదొక్కుకోగా, భెల్ 10% కుప్పకూలింది. ఈ బాటలో హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, జిందాల్ స్టీల్, హిందాల్కో, భారతీ, మారుతీ 8-4% మధ్య దిగజారగా, ఇండెక్స్ హెవీవెయిట్స్ ఐటీసీ, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్, ఆర్ఐఎల్ సైతం 3.5-2% మధ్య తిరోగమించాయి. ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మొత్తం స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో రూ. 1.7 లక్షల కోట్లు హరించుకుపోయింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% క్షీణించాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,538 నష్టపోగా, కేవలం 719 బలపడ్డాయి. సోమవారం రూ. 607 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 1,374 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. దేశీయ ఫండ్స్ రూ. 480 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి. మిడ్ క్యాప్స్‌లో ఐడీఎఫ్సీ మరోసారి 17% నేలకూలగా, జేపీ పవర్, పటేల్ ఇంజినీరింగ్, జేపీ అసోసియేట్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా, పీఎఫ్సీ, సింటెక్స్, ఫైనాన్షియల్ టెక్, ఆర్ఈసీ, స్పైస్‌జెట్, శ్రీరాం ట్రాన్స్, ఆదిత్యబిర్లా నువో, హింద్ కాపర్ తదితరాలు 9-7% మధ్య పడ్డాయి. బీఎస్ఈలో 177 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకాయి. వీటిలో హెచ్డీఎఫ్సీ ద్వయం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఏసీసీ వంటి బ్లూచిప్స్ ఉన్నాయి! బీఎస్ఈలో రూ. 2,065 కోట్లు, ఎన్ఎస్ఈలో రూ. 12,078 కోట్లు చొప్పున టర్నోవర్ జరిగింది. ఎన్ఎస్ఈ ఎఫ్అండ్ఓలో రూ. 2,93,346 కోట్లు నమోదైంది. కడపటి వార్తలందేసరికి యూఎస్‌లోని డోజోన్స్, ఎస్అండ్పీ-500, నాస్డాక్ సూచీలు 1% క్షీణించి ట్రేడవుతున్నాయి. ఇక యూరప్‌లోని యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మార్కెట్లు 1-3% మధ్య నష్టపోయాయి. -
వెలుగులో పవర్, ఫార్మా షేర్లు
పవర్, ఫార్మా, మెటల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో వరుసగా మూడోరోజు స్టాక్ సూచీలు పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ తొలిదశలో 208 పాయింట్లు పెరిగి 18,728 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. అయితే బ్యాంకింగ్, ఆయిల్ షేర్లలో అమ్మకాల కారణంగా తొలి లాభాలను కోల్పోయిన సెన్సెక్స్ చివరకు 39 పాయింట్ల లాభంతో 18,558 పాయింట్ల వద్ద ముగిసింది. తొలుత 5,528 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 5 పాయింట్ల స్వల్పలాభంతో 5,476 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. షార్ట్ రోలోవర్స్ యాక్టివిటీ.... నిఫ్టీ ఆగస్టు కాంట్రాక్టులో షార్ట్ పొజిషన్ల స్క్వేర్‌ఆఫ్ చేయడం, ఆ పొజిషన్లను వచ్చే నెలకు రోలోవర్ చేసుకోవడంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిమగ్నమైనట్లు డెరివేటివ్ డేటా సూచిస్తోంది. మరో మూడురోజుల్లో ఆగస్టు ఫ్యూచర్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల నిఫ్టీ ఫ్యూచర్లో షార్ట్ పొజిషన్ల స్క్వేరింగ్ ఆఫ్ యాక్టివిటీ జరగడంతో ఆ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 19.12 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 2.13 కోట్ల షేర్లకు దిగింది. సెప్టెంబర్ డెరివేటివ్ సెటిల్మెంట్ ప్రారంభంకాబోయే శుక్రవారంనాడు జీడీపీ గణాంకాలు వెలువడనుండటం, రూపాయి మారకపు విలువ తిరిగి 64.30 స్థాయికి తగ్గడం వంటి అంశాల కారణంగా ఇన్వెస్టర్లు షార్ట్ పొజిషన్లను వచ్చే నెల ఫ్యూచర్లోకి రోలోవర్ చేసివుండవచ్చు. షార్ట్ రోలోవర్స్ను ప్రతిబింబిస్తూ సెప్టెంబర్ నిఫ్టీ కాంట్రాక్టు ప్రీమియం 10 పాయింట్లకే పరిమితంకావడంతో పాటు ఓఐలో 24.96 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. గతంలో విక్రయించిన ఈ నెల ఫ్యూచర్ కాంట్రాక్టును తిరిగి కొనుగోలు చేయడాన్ని షార్ట్ స్క్వేర్ఆఫ్గా, వచ్చే నెలకు సంబంధించిన అదే కాంట్రాక్టును మళ్లీ విక్రయించడాన్ని షార్ట్ రోలోవర్గా పరిగణిస్తారు. ఇక స్టాక్ ఫ్యూచర్లలో 9 శాతం ర్యాలీ జరిపిన సేసా గోవా కాంట్రాక్టులో అసాధారణమైన ట్రేడింగ్ జరిగింది. సేసా గోవాలో విలీనం కానున్న స్టెరిలైట్ ఇండస్ట్రీస్ షేరుకు సోమవారం చివరి ట్రేడింగ్రోజు కావడంతో ఈ రెండు షేర్లకు సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్టుల యాక్టివిటీ అంతా సేసా గోవాలోనే జరిగింది. ఫలితంగా ఆగస్టు సేసా గోవా ఫ్యూచర్లో 3.28 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 87.78 లక్షల షేర్లకు పెరిగింది. షార్ట్ సెల్లింగ్‌ను సూచిస్తూ ఆగస్టు కాంట్రాక్టు క్యాష్ ధరతో పోలిస్తే రూ. 8 డిస్కౌంట్‌తో ముగిసింది. సెప్టెంబర్ ఫ్యూచర్లో భారీగా 76.72 లక్షల షేర్ల మేర షార్ట్స్ రోలోవర్ అయ్యాయి. దాంతో ఆ నెల ఫ్యూచర్లో ఓఐ 1.75 కోట్ల షేర్లకు పెరిగింది. ఇది సేసా గోవా కౌంటర్లో రికార్డు. కొద్ది రోజుల నుంచి క్యాష్ మార్కెట్లో షేర్లను కొంటున్న ఇన్వెస్టర్లు, ఆ షేర్లను హెడ్జ్ చేసుకునే ప్రక్రియలో ఫ్యూచర్ కాంట్రాక్టును షార్ట్ చేస్తున్నట్లు ఈ డేటా సూచిస్తోంది. -
మిడ్‌క్యాప్స్ హవా సెన్సెక్స్ 124 పాయింట్లు
గురువారం ట్రేడింగ్‌లో అటు రూపాయితోపాటు ఇటు స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. కరెన్సీకి మద్దతుగా ప్రభుత్వం మరిన్ని చర్యలను తీసుకోనుందన్న అంచనాలు రూపాయికి బలాన్నివ్వగా, జూలై నెలకు చైనా వాణిజ్య గణాంకాలు ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహం లభించింది. వెరసి సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 18,789 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి 5,566 వద్ద స్థిర పడింది. కాగా, ఇటీవల అమ్మకాల వెల్లువతో బేర్‌మంటున్న చిన్న షేర్లు వెలుగులో నిలవడం విశేషం! దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో పురోగమించాయి. ట్రేడైన షేర్లలో 1,381 లాభపడగా, కేవలం 867 నష్టపోయాయి. ఇక బుధవారం ట్రేడింగ్ ముగిశాక ఫలితాలను ప్రకటించిన ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ షేరు దాదాపు 28% దూసుకెళ్లి రూ. 359 వద్ద ముగిసింది. ఒక దశలో 34% జంప్‌చేసి రూ. 377 వద్ద గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,279 కోట్లు పెరిగి రూ. 15,206 కోట్లకు చేరింది. అంచనాలకు మించి నష్టాలను తగ్గించుకోవడంతో ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారని, మరోవైపు షార్ట్ కవరింగ్ కూడా ఇందుకు జతకలసిందని నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల్లో ఈ షేరు దాదాపు 18% పతనమైంది. ఎఫ్ఐఐల అమ్మకాలు వరుసగా రెండో రోజు ఎఫ్ఐఐలు నికరంగా అమ్మకాలకే కట్టుబడ్డారు. బుధవారం రూ. 351 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, తాజాగా రూ. 396 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 516 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మెటల్, రియల్టీ రంగాలు 2.5% స్థాయిలో పుంజుకోగా, సెన్సెక్స్‌లో హిందాల్కో, టాటా స్టీల్, సిప్లా 5% చొప్పున ఎగశాయి. ఈ బాటలో మారుతీ, భారతీ, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ 4-2% మధ్య లాభపడ్డాయి. మరోవైపు సన్ ఫార్మా, ఎస్బీఐ 3%పైగా తిరోగమించాయి. నేడు మార్కెట్లకు సెలవు ఈద్ఉల్ఫితర్(రంజాన్) సందర్భంగా శుక్రవారం(9న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతోపాటు, ఫారెక్స్, కమోడిటీ టోకు మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే బులియన్ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. -
మరో 68 పాయింట్లు డౌన్
డాలరుతో మారకంలో రూపాయి విలువ మరో కొత్త కనిష్టాన్ని తాకడంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ ఒడిదొడుకులను ఎదుర్కొంది. 18,811-18,551 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 18,665 వద్ద స్థిరపడింది. ఇది 68 పాయింట్ల నష్టంకాగా, నిఫ్టీ కూడా 23 పాయింట్లు క్షీణించింది. 17 వారాల కనిష్టమైన 5,519 వద్ద నిలిచింది. అయితే మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లు పుంజుకున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.3% లాభపడగా, మిడ్ క్యాప్ 0.7% బలపడింది. వెరసి ట్రేడైన మొత్తం షేర్లలో 1,249 లాభపడగా, 1,042 నష్టపోయాయి. ఏప్రిల్-జూన్ కాలానికి కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.7% స్థాయిలో వృద్ధి చెందడంతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలలో కోత విధించవచ్చునన్న అంచనాలు బలపడుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లుతాయన్న ఆందోళనతో అమ్మకాలు కొనసాగుతున్నాయని విశ్లేషించారు. రియల్టీ హైజంప్ ప్రధానంగా ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% స్థాయిలో డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5% ఎగసింది. ఐటీ షేర్లపై ఫండ్స్ మక్కువ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై దేశీయ మ్యూ చువల్ ఫండ్స్‌కు మక్కువ పెరుగుతోంది. జూన్ చివరికి ఐటీ రంగ షేర్లలో ఫండ్స్ మొత్తం పెట్టుబడులు రూ. 18,430 కోట్లకు చేరాయి. ఇవి మూడు నెలల గరిష్టంకాగా, ఫండ్స్ నిర్వహణలోగల మొత్తం ఆస్తులలో(ఏయూఎం) 10% వాటాకు సమానం. సెబీ గణాంకాల ప్రకారం జూన్ 30కల్లా ఫండ్స్ ఏయూఎం రూ. 1.80 లక్షల కోట్లుగా నమోదైంది.