
న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్(బీఎస్‌ఈ) గత ఆర్థిక సంవత్సరం (2018–19) మార్చి క్వార్టర్‌లో రూ.52 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం రూ.62 కోట్లతో పోలిస్తే 16 శాతం క్షీణించిందని బీఎస్‌ఈ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.195 కోట్ల నుంచి రూ.182 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్టాండ్ అలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.61 కోట్ల నుంచి రూ.44 కోట్లకు తగ్గింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో స్టాండ్‌అలోన్ నికర లాభం రూ.201 కోట్లు, కన్సాలిడేటెట్ నికర లాభం రూ.199 కోట్లుగా ఉన్నాయని బీఎస్‌ఈ తెలియజేసింది.
రూ.460 కోట్ల షేర్ల బైబ్యాక్
ఒక్కో షేర్‌ను రూ.680 ధరకు (మంగళవారం ముగింపు ధర, రూ.637తో పోల్చితే 7% అధికం) టెండర్ ఆఫర్ మార్గంలో బైబ్యాక్ చేయనున్నామని బీఎస్‌ఈ తెలిపింది. మొత్తం రూ.460 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment