BSES
-
బుల్ జోష్: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
ఈ వారంలో జరిగే నాలుగు రోజుల ట్రేడింగ్‌లో బడ్జెట్‌పై అంచనాలు, కార్పొరేట్ క్యూ3 ఫలితాలు, నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ, ప్రపంచ పరిణామాలతో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం ఉదయం 9.46 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 413 పాయింట్ల లాభంతో 61035 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 110 పాయింట్లు లాభ పడి 18138 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఆల్ట్రాటెక్ సిమెంట్,ఎన్టీపీసీ,జేఎస్‌డబ్ల్యూ స్టీల్,అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రసిం,టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా..హీరోమోటో కార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, టాటా మోటార్స్, హిందాల్కో, కొటక్ మహీంద్రా, ఎథేర్ మోటార్స్,ఎస్బీఐ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతకు ముందు ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 288 పాయింట్లు లాభంతో 60909 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 18106 ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇక 1620 షేర్లు అడ్వాన్స్‌గా ట్రేడ్ అవుతుండగా.. 616 షేర్లు నష్టాల్లో నష్టాలతో ఆరంభించాయి. 143 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. -
సూచీలకు మాంద్యం భయం
ముంబై: ఆర్థిక మాంద్యం భయాలతో దేశీయ స్టాక్ సూచీల రెండురోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. కేంద్ర బడ్జెట్, రానున్న ప్రధాన కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వ్యవహరించారు. ఆటో, విద్యుత్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 60,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు పతనమై 17,108 వద్ద నిలిచింది. అయితే ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ రంగ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య కదలాడాయి. సెన్సెక్స్ 60,716 వద్ద కనిష్టాన్ని, 61,032 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 18,064 – 18,155 పరిధిలో కదలాడింది. అమెరికా తయారీ రంగ, రిటైల్ అమ్మకాలు మెప్పించకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఏషియన్ పెయింట్స్ షేరు 3% నష్టపోయి రూ.2,868 వద్ద స్థిరపడింది. ► ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) ప్రకటన తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. బీఎస్ఈలో నాలుగుశాతం క్షీణించి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.3462 వద్ద స్థిరపడింది. ►బలమైన ఆదాయాల వృద్ధి నమోదు ఆశలతో ఓఎన్జీసీ షేరు రెండు శాతం పెరిగి ఆరు నెలల గరిష్టం రూ.152 వద్ద స్థిరపడింది. -
క్రిస్మస్ తర్వాత శాంటాక్లాజ్ ర్యాలీ
ముంబై: క్రిస్మస్ పండుగ తర్వాత రోజు స్టాక్ మార్కెట్లో శాంటాక్లాజ్ ర్యాలీ కనిపించింది. కోవిడ్ భయాలతో గతవారం అమ్మకాల ఒత్తిడికి లోనైన దేశీయ మార్కెట్ సోమవారం భారీ లాభాలను ఆర్జించింది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు డిమాండ్ లభించింది. అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు ట్రేడింగ్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఉదయం సెన్సెక్స్ 90 పాయింట్ల స్వల్ప నష్టంతో 59,845 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల పతనంతో 17,830 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 989 పాయింట్లు దూసుకెళ్లి 60,834 వద్ద, నిఫ్టీ 277 పాయింట్లు బలపడి 18,084 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఆఖర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి సెన్సెక్స్ 721 పాయింట్ల లాభంతో 60,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 208 పాయింట్లు పెరిగి 18,015 వద్ద నిలిచింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఐదు మాత్రమే నష్టపోయాయి. దీంతో స్టాక్ సూచీల నాలుగురోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు రాణించాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఇంధన, ఐటీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. విస్తృత స్థాయిలో మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు వరుసగా 3.13%, 2.31 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.498 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1286 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆసియా అరశాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మార్కెట్లో రూపాయి విలువ 17 పైసలు బలపడి 82.65 స్థాయి వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఒకశాతానికి పైగా ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లో రూ. 5.79 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.277.91 లక్షల కోట్లకు చేరింది. రాయ్ దంపతులు ఎన్డీటీవీలోని తమ వాటాను అదానీకి విక్రయించనుండటంతో 5% బలపడి రూ. 358 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన ఎన్డీటీవీ, చివరికి 1% లాభంతో రూ.343 వద్ద స్థిరపడింది. -
దేశంలో తగ్గని ఐపీవో జోరు..ఐపీవోకి సిద్దంగా దిగ్గజ కంపెనీలు
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ భారత్ హైవేస్ ఇన్విట్, వైట్ ఆయిల్స్ తయారీ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఈ జాబితాలో చేరాయి. ఈ రెండు సంస్థలూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. వివరాలు ఇలా.. రూ. 2,000 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా భారత్ హైవేస్ ఇన్విట్ బుక్బిల్డింగ్ ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన యూనిట్లను ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకోనుంది. నిధులను ప్రాజెక్టŠస్ ఎస్పీవీకి చెందిన కొన్ని రుణాల చెల్లింపుతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎస్పీవీ ప్రాజెక్టŠస్లో.. పోర్బందర్– ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, వారణాశి– సంగమ్ ఎక్స్‌ప్రెస్‌వే, జీఆర్ సంగ్లీ– సోలాపూర్ హైవే, జీఆర్ అక్కల్కోట్– సోలాపూర్ హైవే, జీఆర్ ఫగ్వారా ఎక్స్‌ప్రెస్‌వే, జీఆర్ గుండుగొలను– దేవరాపల్లి హైవే ఉన్నాయి. 2022 ఆగస్ట్‌లో ఏర్పాటైన భారత్ హైవేస్ ఇన్విట్ ప్రాజెక్ట్ ఎస్పీవీలో ప్రతీ ప్రాజక్టులోనూ 100 శాతం చొప్పున వాటా కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా 49 శాతం వాటాను సొంతం చేసుకుంటుంది. రూ. 500 కోట్లపై కన్ను పబ్లిక్ ఇష్యూలో భాగంగా గాంధార్ ఆయిల్ రిఫైనరీ రూ. 357 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఎక్విప్మెంట్ కొనుగోలుసహా.. సిల్వస్సా ప్లాంటులో ఆటోమోటివ్ ఆయిల్ తయారీ సామర్థ్య విస్తరణకు అవసరమైన సివిల్ వర్క్‌లకూ వెచ్చించనుంది. అంతేకాకుండా తలోజా ప్లాంటులో పెట్రోలియం జెల్లీతోపాటు.. సంబంధిత కాస్మెటిక్ ప్రొడక్టుల తయారీ విస్తరణకు సైతం వినియోగించనుంది. వైట్ ఆయిల్స్ తయారీకి మరిన్ని బ్లెండింగ్ ట్యాంకులను సైతం ఏర్పాటు చేయనుంది. -
ఐపీవోకి రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్.. స్టాక్ ప్రైస్ ఎంతంటే?
న్యూఢిల్లీ: వారాంతాన(23న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రూ. 94–99 ధరల శ్రేణిని ఖరారు చేసింది. మంగళవారం(27న) ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3,31,25,000 షేర్లను ప్రమోటర్ డేవిడ్ దేవసహాయంతోపాటు, పీఈ సంస్థ అసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఇండియా ఆఫర్ చేయనుంది. తద్వారా కంపెనీ రూ. 388 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 2015లో అసెంట్ క్యాపిటల్ రేడియంట్‌లో 37.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. ప్రత్యేకంగా రూపొందిన రక్షణాత్మక వ్యాన్లను సొంతం చేసుకునేందుకు వెచ్చించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 150 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చెయ్యాలి. జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ రెడీ ఫిన్‌టెక్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.05 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2011లో ప్రారంభమైన కంపెనీ బిజినెస్ టు బిజనెస్ టు కస్టమర్ విభాగంలో పనిచేస్తోంది. -
నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు దేశీయ సూచీల మీద తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో వరుసగా 8 రోజులుగా లాభపడిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉదయం 10.30గంటల సమయానికి సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 62911 వద్ద నిఫ్టీ 109 పాయింట్లు నష్టంతో 18703 వద్ద కొనసాగుతుంది. దీంతో ఎథేర్ మోటార్స్, దివిస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం, టాటా, బజాజ్ ఆటో, టీసీఎస్, సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్జీసీ,అపోలో ఆస్పటల్స్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
స్టాక్ మార్కెట్లో డబ్బులు బాగా సంపాదించాలంటే...ఈ టిప్స్ తెలిస్తే చాలు!
పెట్టుబడులకు కొన్ని విధానాలు అంటూ ఉంటాయి. ఆచరణీయ సూత్రాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో సంపదను సృష్టించుకున్న ప్రతీ ఇన్వెస్టర్ విజయం వెనుక కచ్చితంగా వీటి పాత్ర ఉంటుంది. అనుభవం మీద కానీ, వీటి గురించి ఇన్వెస్టర్లకు తెలియదు. ‘డబ్బులతో మార్కెట్లోకి అడుగుపెడితే అనుభవం మిగులుతుంది. అనుభవంతో మార్కెట్లోకి ప్రవేశిస్తే సంపద సృష్టి జరుగుతుంది’ అని చెబుతుంటారు. అందుకని మార్కెట్ పండితులు అనుసరించిన విధానాలను ముందే తెలుసుకుంటే, విలువైన సమయం ఆదా చేసుకోవడంతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్ని మూటగట్టుకోవచ్చు. అమెరికాకు చెందిన సర్ జాన్ టెంపుల్టన్ ప్రపంచంలోని దిగ్గజ ఇన్వెస్టర్లలో ఒకరు. 38 ఏళ్లపాటు ఏటా తన పెట్టుబడులపై 15 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులను ఆయన సంపాదించగలిగారు. ఆయన అనుసరించిన సూత్రాలను, అనుభవ పాఠాలను ఈ ప్రాఫిట్ ప్లస్ కథనంలో తెలుసుకుందాం. తగినంత కసరత్తు పెట్టుబడులు పెట్టే ముందు తగినంత పరిశోధన అవసరం. విజయవంతమైన కంపెనీలకు సాయపడిన అంశాలు ఏంటన్నవి తెలుసుకోవాలి. కంపెనీల ఎర్నింగ్స్ (లాభాలు), ఆస్తులన్నవి స్టాక్ ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కంపెనీ ఎర్నింగ్స్ భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే అంచనాలతో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్టాక్ ధరలు కూడా భవిష్యత్తు లాభాల అంచనాలకు తగ్గట్టే చలిస్తుంటాయి. కనుక, భవిష్యత్తులో ఇవి తారుమారు అయితే? స్టాక్స్ ధరలు కూడా పతనమవుతాయి. ఈ రిస్క్‌ను ముందే దృష్టిలో పెట్టుకుని అధ్యయనం తర్వాతే అడుగులు వేయాలి. కొని, మర్చిపోవద్దు.. బేర్ మార్కెట్ శాశ్వతం కాదు. అలా అని బుల్ మార్కెట్ శాశ్వతం కాదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో స్పందించాల్సి వస్తుంది. కొనుగోలు చేసి, మర్చిపోయే స్టాక్స్ అన్న వి చాలా అరుదు. ఏ కంపెనీ అయినా కానీ వెలుపలి పరిణామాలకు ప్రభావితం అవుతుంటుంది. అందుకుని పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, అవసరమైతే మార్పులకు వెనుకాడొద్దు. భయపడిపోవద్దు.. అందరూ ఆశావాదంతో ఎగబడి కొంటున్న వేళ విక్రయించాలని చెప్పుకున్నాం. కానీ, ఆ సమయంలో అమ్ముకోకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత మార్కెట్లు పడిపోవచ్చు. 2008, 2020లో మన స్టాక్ మార్కెట్ పతనాలు గుర్తున్నాయి కదా. ఒక్కో స్టాక్ ఒక రోజులో 20% వరకు నష్టపోయింది. ఆ సమయంలో భయపడిపోయి వచ్చినంత చాలనే ధోరణితో అమ్ముకో వడం సరికాదు. పతనానికి ముందే విక్రయించాలి. అది చేయలేకపోతే, ఒకసారి పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ను అధ్యయనం చేయాలి. ఏ అంశాల ఆధారంగా వాటిని కొనుగోలు చేశారో, వాటి ల్లో మార్పు రానంత వరకు మార్కెట్ పడిపోతుందని విక్రయించాల్సిన పనిలేదు. వేరే స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని, ఉన్నవి అమ్మేసుకుని వాటిని కొనుగోలు చేసుకోవడం కూడా సరికాదు. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే ముందు ద్రవ్యోల్బణం, పన్నులను పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరికి వారు తమకు అనుకూలమైన పెట్టుబడుల విధానాన్ని అనుసరించాలి. పెట్టుబడుల తర్వాత ప్రశాంతత కోల్పోయేలా ఉండకూడదు. వాస్తవ రాబడులు అంటే ఇక్కడ.. వచ్చిన రాబడి నుంచి పన్నులు చెల్లించగా మిగిలే మొత్తం. అలాగే, ద్రవ్యోల్బణాన్ని సైతం రాబడి నుంచి మినహాయించి చూడాలి. పన్నులు, ద్రవ్యోల్బణం ప్రభావం పట్టించుకోని ఏ పెట్టుబడి అయినా వైకల్యంతో సమనమేనని టెంపుల్టన్ అంటారు. స్పెక్యులేషన్ వద్దు.. ఈక్విటీ మార్కెట్లో స్పెక్యులేషన్ (అంచనాల ఆధారంగా చేసే ట్రేడింగ్) అన్నది వేగంగా నష్టపోయే మార్గం. స్టాక్ మార్కెట్ క్యాసినో కాదు. తరచూ స్టాక్స్ కొని విక్రయిస్తుండడం, ఆప్షన్లను షార్ట్ సెల్ చేస్తుండడం, ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేయడం ఇదంతా క్యాసినోనే అని టెంపుల్టన్ అంటారు. ఇక్కడ అంతిమంగా ఇన్వెస్టర్ సంపాదించేదేమీ ఉండదన్నది ఆయన నమ్మే సిద్ధాంతం. మార్కెట్ పెరుగుతుందని, తగ్గుతుందని అంచనాల ఆధారంగా చేసే ట్రేడ్లు ఎప్పుడూ సక్సెస్ కావాలని లేదు. వీటిల్లో పెట్టుబడి నష్టానికి అదనంగా.. కమీషన్లు, చార్జీల రూపంలోనూ నష్టపోవాల్సి వస్తుంది. వాల్‌స్ట్రీట్ లెంజెడరీ ఇన్వెస్టర్ లూసీన్ హూపర్ నిర్వచనం ప్రకారం.. స్టాక్స్‌కు దీర్ఘకాల యజమానులుగా ఎంత ప్రశాతంగా ఉంటామన్నదే ముఖ్యం. ఇన్వెస్టర్ ఎంత ప్రశాంతంగా ఉంటే కనీస విలువల గురించి మరింతగా అర్థం చేసుకోగలడు. సహనంతో, భావోద్వేగాలకు లోను కాకుండా ఉండగలడు. తక్కువ మూలధన లాభాల పన్ను చెల్లిస్తాడు. అనవసర బ్రోకరేజీ కమీషన్లు చెల్లించే పని ఉండదు. జూదగాళ్ల మాదిరిగా ఆలోచించడు. మార్పునకు సిద్ధం.. ప్రతి పెట్టుబడుల విధానంలోనూ అనుకూల, ప్రతికూలతలు ఉంటాయి. తనకు అనుకూలమైన విధానాన్ని అనుసరిస్తూ, అవసరమైతే అందులో మార్పులు చేసుకునేందుకు సానుకూల దృక్పథంతో కొనసాగాలి. బ్లూచిప్ స్టాక్స్, సైక్లికల్ స్టాక్స్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్, కార్పొరేట్ బాండ్స్.. ఇలా ఒక్కో విభాగంలో పెట్టుబడులకు అనుకూల, ప్రతికూల సందర్భాలు ఉంటాయి. అంతేకాదు, అవసరమైతే నగదు రూపంలోనే కొనసాగాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే నగదు ఉంచుకోవడం వల్ల మంచి అవకాశాలను సొంతం చేసుకోగలరు. అందుకే ఏదో ఒక్క పెట్టుబడి విధానం అన్నది అత్యుత్తమం అని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో కొన్ని విభాగాలకు ఎంతో ఆదరణ లభిస్తుంది. అది తాత్కాలికం కావచ్చు. అటువంటప్పుడు లాభాలు దీర్ఘకాలం పాటు కొనసాగలేవు. అందుకని మార్పునకు సదా సిద్ధంగా ఉండాలి. మార్కెట్ పెట్టుబడి సూత్రాలకూ ఇది వర్తిస్తుంది. కాలంతోపాటు ఈ విధానాల్లోనూ మార్పులు రావచ్చు. స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే దీన్ని గుర్తిస్తాడు. కనిష్ట స్థాయి కనిష్ట స్థాయిల్లో కొనుగోలు చేసి, గరిష్ట స్థాయిల్లో విక్రయించడమన్నది వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ, ఆచరణ అంత ఈజీ కాదు. సాధారణంగా స్టాక్స్ ధరలు పెరుగుతున్నప్పుడే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆకర్షితులై, ఇంకా పెరుగుతుందన్న అంచనాతో కొనుగోలుకు ముందుకు వస్తుంటారు. షేరు ధర పడిపోతుంటే, ధైర్యం చేసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. ఎందుకంటే తాము ఇన్వెస్ట్ చేసిన తర్వాత, అది మరింత పడిపోతుందేమో, ఇక ఎప్పటికీ పెరగదేమో? అన్న భయం వారిని వెనక్కి లాగుతుంటుంది. నిజానికి అమ్మకాల ఒత్తిడి ఉందంటే నిరాశావాదం పెరిగినట్టు. కొనుగోళ్లకు అదే సరైన సమయం. అంతేకానీ, మార్కెట్లు ఇంకా పడిపోతాయని, ఆ తర్వాతే కొనుగోలు చేద్దామని అనుకోవద్దు. నిరాశావాదం ఎక్కువగా ఉన్నప్పుడే స్టాక్స్ ఎక్కవ నష్టాలు చూస్తాయి. దాన్నే తెలివైన ఇన్వెస్టర్ అనుకూలంగా మలుచుకోవాలి. కానీ, ఎక్కువ మంది దీనికి విరుద్ధంగా అధిక స్థాయిల్లో కొనుగోలు చేసి, తక్కువ ధరల వద్ద విక్రయిస్తుంటారు. మార్కెట్లలో ఆశావా దం పెరిగినప్పుడు విక్రయించి, నిరాశావాదం ఎక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేయాలని విఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సైతం చెబుతుంటారు. నాణ్యమైన స్టాక్స్ ఒక కంపెనీ వ్యాపారం ఎంత నాణ్యమైనది అనేది రాబడులకు కీలకం అవుతుంది. నాణ్యమైన వ్యాపారమే ఎక్కువ అమ్మకాలను నమోదు చేయగలదు. కస్టమర్ విశ్వాసాన్ని గెలుచుకుంటుంది. ఆయా రంగంలో టెక్నాలజీ పరంగా కంపెనీ బలమైన స్థానంలో ఉండాలి. బలమైన యాజమాన్యం, వ్యాపారాన్ని మెరుగ్గా నిర్వహించిన ట్రాక్ రికార్డ్ ఉండాలి. కంపెనీ వద్ద నిధుల సమస్య ఉండకూడదు. ఒక కంపెనీ తక్కవ ధరకే ఉత్పత్తి చేసినంత మాత్రాన నాణ్యమైనదిగా భావించడం సరికాదు. కానీ, టెక్నాలజీ పరంగా ఆధునికమైన, పటిష్టమైన కంపెనీ అయితే.. మరో కంపెనీ వచ్చి ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడం అంత తేలిక కాదు. మార్కెట్ కాదు.. కంపెనీ ముఖ్యం విడిగా కంపెనీలను, వాటి వ్యాపార బలాలను చూడాలే కానీ, మార్కెట్ గమనాన్ని కాదు. ఎలాంటి స్టాక్ అయినా బుల్ మార్కెట్లలో పరుగులు పెట్టగలదు. కానీ, బేర్ మార్కెట్లో పెరిగే స్టాక్స్ కూడా ఉంటాయి. బుల్ మార్కెట్లో పతనాన్ని చూసేవీ ఉంటాయి. మార్కెట్లు అనేవి ఎన్నో పరిణామాల ఆధారంగా చలిస్తుంటాయి. కానీ, ఇన్వెస్టర్ పెట్టుబడులకు నాణ్యమైన కంపెనీలు, బలమైన వ్యాపారా లు, పటష్టమైన యాజమాన్యాలనే సూత్రాలను అనుసరించాలి. మార్కెట్ గమనాన్ని కాదు. వైవిధ్యం.. పెట్టుబడులు అన్నింటిని తీసుకెళ్లి ఒకే చోట పెట్టేయరాదు. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. ఎవరూ నియంత్రించలేరు. అందుకని పెట్టుబడుల పరంగా వైవిధ్యం అవసరం. సరఫరా దారు వైపు సమ్మె ఏర్పడవచ్చు. తుఫాను లేదా భూకంపం.., పోటీ కంపెనీ అసాధారణ స్థాయిలో టెక్నాలజీ పరంగా పై చేయి సాధించొచ్చు. లేదంటే ఓ ఉత్పత్తిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించొచ్చు. ఇలాంటి పరిణామాలు కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టాన్ని తీసుకొస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మెరుగ్గా నడుస్తున్న కంపెనీ సైతం సమస్యల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వివిధ రంగాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. ఆ తర్వాత అంతర్జాతీయం మార్కెట్లలోనూ గొప్ప పెట్టుబడుల అవకాశాలు కనిపిస్తాయి. వాటిని సైతం పరిశీలించొచ్చు. తప్పులే పాఠాలు పెట్టుబడుల పరంగా తప్పులు చేస్తున్నామని, అసలు ఇన్వెస్ట్ చేయకపోవడం అన్నది మరింత పెద్ద తప్పిదం అవుతుంది. తప్పులను చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేనే లేదు. నష్టపోయిన మొత్తాన్ని తిరిగి సంపాదించాలనే ధోరణితో మరింత రిస్క్ తీసుకోవద్దు. ప్రతి తప్పు నుంచి అనుభవాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ముందు చేసిన పెట్టుబడుల్లో నష్టాలకు దారితీసిన అంశాల గురించి తెలుసుకోవాలి. వాటిని తదుపరి పెట్టుబడుల్లో మళ్లీ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు కారణాలకు బదులు, నష్టానికి వేరే వాటిని ఆపాదించుకుంటే, మళ్లీ అదే నష్టమే ఎదురవుతుంది. పెట్టుబడుల్లో విజేతలు, పరాజితుల మధ్య తేడా.. తప్పుల నుంచి పాఠాలను తెలుసుకోవడమే. మార్కెట్‌ను మించి రాబడులు.. మార్కెట్ కంటే మెరుగ్గా పెట్టుబడులపై రాబడులు రావాలంటే అందుకు మిగిలిన వారితో పోలిస్తే భిన్నంగా వ్యవహరించాల్సిందే. ఇందుకు మంచి మార్గదర్శకుడిని ఎంపిక చేసుకోవాలి. తగిన పెట్టుబడుల విధానాన్ని రూపొందించుకోవాలి. నిపుణులైన ఫండ్ మేనేజర్ల కంటే మెరుగైన పెట్టుబడుల నిర్ణయాలతోనే, గొప్ప ఫలితాలు సాధించడం సాధ్యపడుతుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అయినా మార్కెట్ కంటే అన్ని సమయాల్లోనూ మెరుగైన ఫలితాలను చూపిస్తుందంటే, అది ఇన్వెస్టర్ కంటే గొప్పగా పనిచేస్తున్నట్టే. కనుక అవసరమైతే అలాంటి సంస్థల సాయాన్ని తీసుకునేందుకు వెనుకాడొద్దు. గుడ్డి విధానం వద్దు మీకు మొదటిసారి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ షేరు, లేదంటే మీరు కొనుగోలు చేసిన మొదటి కారు కంపెనీపై అభిమానంతో షేరులో పెట్టుబడులు పెట్టడం సరైనది అనిపించుకోదు. మీరు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసినంత మాత్రాన అది పెట్టుబడులకు మంచి కంపెనీ అవ్వాలని లేదు. ఆ షేరు అందుబాటు ధరలోనూ లేకపోవచ్చు. ఇక క్రేజీ ఉన్న ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా సరికాదు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారని, లిస్టింగ్ రోజు లాభానికి విక్రయిద్దామని ఐపీవోలో దరఖాస్తు చేసుకోవడం అన్నది పెట్టుబడి కాదు, స్పెక్యులేషన్ అవుతుంది. కంపెనీకి మంచి భవిష్యత్తు ఉండి, దీర్ఘకాలం పాటు కంపెనీతో కొనసాగుతానని అనుకున్నప్పుడే ఐపీవోకు దరఖాస్తు చేసుకోవాలి. ఒకరి సలహాపై ఆధారపడి ఇన్వెస్ట్ చేయడం కూడా సరికాదు. ఎందుకంటే చెప్పిన వారి అనుభవం, పరిశీలన, అధ్యయనం మీకు సాయానికి రావు. సొంత అధ్యయనం తర్వాత, తమ పెట్టుబడుల సూత్రాలకు అనుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్లాలి. ప్రతికూల ధోరణి విడిచి పెట్టాలి రిస్క్ భయంతో తరచూ ప్రతికూల ధోరణితో మార్కెట్‌ను చూడడం సరికాదు. పెట్టుబడికి ఎంపిక చేసుకునే ముందే ప్రతికూల కోణంలోనూ పరిశోధన చేయడం మంచి చర్య అవుతుంది. ఒక్కసారి అన్ని అంశాల్లో స్పష్టత వచ్చి, పెట్టుబడి పెట్టిన తర్వాత.. రంధ్రాన్వేషణ ఫలితమివ్వదు. అప్పుడు చిన్న అంశాలు సైతం పెద్దవిగా అనిపిస్తాయి. ప్రతీ పెట్టుబడి రాబడులనే ఇస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. వాస్తవికంగా, సానుకూల ధోరణితో వ్యవహరించడం ద్వారానే దీర్ఘకాలంలో ఈక్విటీల్లో సంపదను సృష్టించుకోగలరు. -
బీఎస్ఈ లాభాల్లో క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు సగానికి క్షీణించి రూ. 34 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 65 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 240 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 226 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే నిర్వహణ మార్జిన్లు 28 శాతం నుంచి 7 శాతానికి భారీగా పతనమయ్యాయి. ఇందుకు కారణాలను ఎక్ఛేంజీ వెల్లడించలేదు. కాగా.. మొత్తం వ్యయాలు 36 శాతం పెరిగి రూ. 184 కోట్లను దాటాయి. ఎక్సే్ఛంజీలో రిజిస్టరైన మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 11.7 కోట్లకు ఎగశాయి. రోజువారీ సగటు టర్నోవర్ ఈక్విటీ విభాగంలో 17 శాతం వృద్ధితో రూ. 4,740 కోట్లను తాకగా.. డెరివేటివ్స్ నుంచి 88 శాతం అధికంగా రూ. 2.26 లక్షల కోట్లు చొప్పున నమోదైంది. కరెన్సీ డెరివేటివ్స్‌లో సైతం సగటు టర్నోవర్ 31 శాతం ఎగసి రూ. 32,161 కోట్లకు చేరింది. -
నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు రెండోరోజూ లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి ర్యాలీ, విదేశీ కొనుగోళ్లు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో మెటల్ షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ ఉదయం 238 పాయింట్ల లాభంతో 61,188 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 61,401 – 60,714 మధ్య కదలాడింది. చివరికి 235 పాయింట్లు పెరిగి 61,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 18,212 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 18,065 వద్ద కనిష్టాన్ని, 18,256 వద్ద గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి నిఫ్టీ 86 పాయింట్లు బలపడి 18,203 వద్ద నిలిచింది. వెరసి ఇరు సూచీలు పదినెలల గరిష్టంపై స్థిరపడ్డాయి. ఫార్మా, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1949 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.844 కోట్ల షేర్లను అమ్మారు. కేంద్ర బ్యాంకులు అంచనాల కంటే ముందుగానే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే ఆశలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా (నేడు)మంగళవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్ఛేంజీలు పనిచేయవు. నెల గరిష్టానికి రూపాయి దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం నెలరోజుల గరిష్టంపై ముగిసింది. డాలర్ మారకంలో సోమవారం ఒక్కరోజే 43 పైసలు బలపడి 81.92 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 82.14 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 82.32 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడుతుండటం, దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు మళ్లీ పెరుగుతుండటం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి దోహదపడ్డాయని ఫారెక్స్ విశ్లేషకులు తెలిపారు. -
ఈ వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి
ముంబై: దేశీయంగా నెలకొన్న సానుకూల పరిణామాల దృష్ట్యా ఈ వారంలోనూ స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువపై దృష్టి సారించవచ్చంటున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం(నంబర్ 6న) సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్, బ్యాంక్ ఇంగ్లాండ్‌లు కఠిన ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపినప్పటికీ.., దేశీయ కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం, భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆశావహ ధృక్పథంతో గతవారంలో సూచీలు రెండు శాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 991 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్లు బలపడ్డాయి. ‘‘రెండు వారాల పాటు స్తబ్ధుగా ట్రేడైన బ్యాంకింగ్ షేర్లలో తాజాగా కొనుగోళ్లు నెలకొన్నాయి. దీంతో సూచీలు క్రమంగా రికార్డు స్థాయిల దిశగా కదులుతున్నాయి. అన్ని రంగాల్లో మూమెంటమ్ కన్పిస్తున్నందున.., స్థిరీకరణలో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,200 స్థాయి వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దిగువ స్థాయిలో 17,900–18,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్‌పై సైనిక చర్యను తీవ్రతరం చేసే ప్రయత్నాల్లో భాగంగా రష్యా అణ్వాయుధాలను ప్రయోగించే వీలుందనే వార్తలు ప్రపంచ మార్కెట్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. చైనా జీరో కోవిడ్ విధానంపై డ్రాగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను మార్కెట్ వర్గాలను క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఇక చైనా అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా రేపు(మంగళవారం), అమెరికా అక్టోబర్ ద్రవ్యోల్బణం గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం బ్రిటన్ జీడీపీ, యూఎస్ కన్జూమర్ సెంటిమెంట్ డేటా వెల్లడి అవుతాయి. తొలివారంలో రూ.15,280 కోట్లు పెట్టుబడులు గడిచిన రెండు నెలల్లో నికర అమ్మందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్ తొలి వారంలో దేశీయ మార్కెట్లో రూ.15,280 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి అనూహ్యంగా రూ.2,410 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో రూ.1,586 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. ఈ ఏడాదిలో నికరంగా 1.53 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 85కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ముందుగా నేడు మార్కెట్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, ఎంఅండ్ఎం, బీపీసీఎల్, పేటీఎం, గోద్రేజ్ కన్జూమర్, పీఐ ఇండస్ట్రీస్, భాష్, పిడిలైట్ ఇండస్ట్రీస్, స్టార్ హెల్త్, జొమాటో అదానీ పవర్ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. -
స్పందన స్ఫూర్తి వివాదానికి ముగింపు..సెబీకి రూ.25లక్షలు చెల్లింపు
న్యూఢిల్లీ: నియంత్రణ పరమైన నిబంధనల అమలులో విఫలమైన కేసును స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ పరిష్కరించుకుంది. సెబీకి రూ.25 లక్షలు చెల్లించడం ద్వారా ఈ వివాదానికి ముగింపు పలికింది. ‘‘ప్రతిపాదిత ఉల్లంఘనల ఆరోపణల విషయంలో పరిష్కారానికి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సెబీని సంప్రదించింది. సెబీ గుర్తించిన వాస్తవాలను అంగీకరించ లేదు. అలా అని తిరస్కరించ లేదు. నిబంధనల అమలులో వైఫల్యాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చర్యలపై దరఖాస్తుదారుతో పరిష్కారం కుదిరింది’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 2015 ఏప్రిల్ నుంచి ఆర్బీఐ వద్ద నమోదిత సంస్థగా ఉంది. 2019 ఆగస్ట్‌లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఐపీవో ద్వారా లిస్ట్ అయింది. ఆడిటర్ విషయంలో స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సంస్థ, లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ డిస్క్లోజర్ నిబంధనల అమలులో విఫలమైందన్నది సెబీ ఆరోపణగా ఉంది. -
టాటా కంపెనీపై సైబర్ దాడి కలకలం
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ సంస్థ టాటా పవర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మౌలిక సదుపాయాలు .. సైబర్ దాడికి గురయ్యాయి. దీంతో కొన్ని ఐటీ సిస్టమ్స్‌పై ప్రభావం పడిందని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. సిస్టమ్స్‌ను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించింది. కీలకమైన అన్ని సిస్టమ్‌లు యథాప్రకారం పని చేస్తున్నాయని, అయితే ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులు, కస్టమర్లు వినియోగించే పోర్టల్స్, టచ్ పాయింట్లపై కొన్ని పరిమితులు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. -
కొనుగోళ్లకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు, లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఇన్వెస్టర్లు ప్రారంభంలోనే కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 513 పాయింట్లు ఎగసి 58,579కు చేరింది. చివరికి 157 పాయింట్ల లాభంతో 58,222 వద్ద ముగిసింది. తొలుత 17,428ను దాటిన నిఫ్టీ సైతం 58 పాయింట్లు జమ చేసుకుని 17,332 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ ఉత్సాహం రెండో రోజూ కొనసాగడంతో మార్కెట్లు రోజంతా లాభాల్లోనే కదిలినట్లు విశ్లేషించారు. మెటల్స్ జోరు..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, మీడియా, రియల్టీ, ఐటీ 3.2–1.6 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా 0.4 శాతం డీలాపడ్డాయి. బ్లూచిప్స్‌లో జేఎస్‌డబ్ల్యూ, సీఐఎల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫీ, యాక్సిస్, 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇండస్ఇండ్, దివీస్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా 2.6–1 శాతం మధ్య క్షీణించాయి. స్టాక్ హైలైట్స్ ►రూ. 1,000 కోట్ల అదనపు అత్యవసర రుణ సహాయం అందనున్న వార్తలతో చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 42 వద్ద ముగిసింది. ►కొన్ని షరతులకులోబడి సోనీ పిక్చర్స్‌తో విలీనానికి సీసీఐ అనుమతించడంతో జీ ఎంటర్టైన్మెంట్ 4.6% ఎగసి రూ. 281 వద్ద ముగిసింది. ►ఉత్తర అమెరికా నుంచి క్లాస్8 ట్రక్కుల ఆర్డర్లు పెరగడంతో భారత్ ఫోర్జ్ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 763 వద్ద ముగిసింది. రూ‘పాయే’: 82.17 రూపాయి రికార్డుల పతనం ఆగట్లేదు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం మొదటిసారి భారీగా 55 పైసలు నష్టపోయి 82 దిగువన 82.17 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ పటిష్టత, క్రూడ్ ధరలు స్థిరంగా ఉండడం దీనికి కారణం. రూపాయి మంగళవారం ట్రేడింగ్‌లో 20 పైసలు లాభపడి 81.62 వద్ద ముగిసింది. దసరా సందర్బంగా బుధవారం మార్కెట్‌కు సెలవు. గురువారం కొంత సానుకూలంగా 81.52 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.51ని చూసినా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. -
మళ్లీ అమ్మకాలదే పైచేయి
ముంబై: గత వారం చివర్లో ఒక్కసారిగా జోరందుకున్న స్టాక్ ఇండెక్సులు తిరిగి తోకముడిచాయి. ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకే మొగ్గుచూపడంతో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 638 పాయింట్లు పతనమై 56,789 వద్దకు చేరగా.. 207 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 16,887 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆర్థిక మాంద్య ఆందోళనలు సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణ అదుపునకు వడ్డీ రేట్ల పెంపును చేపడుతుండటం స్టాక్స్‌లో అమ్మకాలకు దారితీస్తున్నట్లు తెలియజేశారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ట్రెజరీ ఈల్డ్స్ జోరు సైతం ఇందుకు కారణమవుతున్నట్లు వివరించారు. ఫార్మా ఎదురీత: ఎన్ఎస్ఈలో ఫార్మా (1.1%) మినహా అన్ని రంగాలూ నీరసించాయి. ప్రధానంగా మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ 3–1.6 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్, ఐషర్, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్, మారుతీ, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ 8.4–2.2% మధ్య పతనమయ్యాయి. అయితే ఓఎన్జీసీ 4.6% జంప్‌చేయగా.. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్, కోల్ ఇండియా 2–1% మధ్య బలపడ్డాయి. మిడ్ క్యాప్స్ వీక్ మార్కెట్ల బాటలో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.2–0.5 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,194 నష్టపోగా 1,356 మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తాజాగా అమ్మకాల బాట వీడీ రూ. 591 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 423 కోట్ల స్టాక్స్ విక్రయించాయి. ఎల్ఐసీ పెట్టుబడి: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇటీవల కొద్ది రోజులుగా పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ మొత్తం 33.86 లక్షలకుపైగా షేర్లను కొనుగోలు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పేర్కొంది. దీంతో కంపెనీలో ఎల్ఐసీ వాటా తాజాగా 7.7 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. -
ఆల్‌టైమ్ గరిష్టానికి.. జోరు మీదున్న ఎస్బీఐ షేరు!
ముంబై: స్టాక్ సూచీలు రెండోరోజూ డీలాపడ్డాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు నష్టపోయి 60 వేల దిగువున 59,866 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 18 వేల స్థాయిని కోల్పోయింది. చివరికి 126 పాయింట్లు పతనమై 17,877 వద్ద నిలిచింది. డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్(3%), రిలయన్స్(ఒకశాతం) పతనమై సూచీలను ఏదశలోనూ కోలుకోనివ్వలేదు. అయితే ఆటో, మెటల్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి రూ.79.71 వద్ద స్థిరపడింది. ఆయిల్ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూపాయిపై ఒత్తిడి పడిందని నిపుణులు తెలిపారు. లాభాల్లోంచి నష్టాల్లోకి... సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 60,454 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 18,046 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 329 పాయింట్లు, నిఫ్టీ 92 పాయింట్లను ఆర్జించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. మెప్పించని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిస్టింగ్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ షేరు లిస్టింగ్ తొలిరోజే నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.510తో పోలిస్తే ఫ్లాటుగా రూ.510 వద్దే లిస్టయ్యింది. రూ.484.5 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 0.5శాతం స్వల్ప నష్టంతో రూ.508 వద్ద ముగిసింది. పీవీఆర్ షేర్ల అమ్మకం మూడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ఫండ్లు మల్టీప్లెక్స్ వ్యాపార సంస్థ పీవీఆర్‌కు చెందిన 40.45 లక్షల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించాయి. ఈ లావాదేవీ విలువ రూ.759.14 కోట్లుగా ఉంది. ఫలితంగా బీఎస్ఈలో పీవీఆర్ షేరు 4.40 శాతం నష్టపోయి రూ.1,844 వద్ద స్థిరపడింది. కొనసాగిన ఎస్బీఐ రికార్డు రెండోరోజూ ఎస్బీఐ షేరు జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్‌లోనూ ఒకశాతానికి పైగా లాభపడి రూ.579 వద్ద ఆల్‌టైం హై స్థాయిని తాకింది. చివరికి క్రితం ముగింపు(రూ.572)తో పోలిస్తే ఎలాంటి లాభ, నష్టానికి లోనవకుండా రూ.572 వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల తర్వాత మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరిన మూడో బ్యాంకు, తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించింది. ► ఆటో షేర్లలో భాగంగా మారుతీ సుజుకీ షేరు ట్రేడింగ్‌లో నాలుగు శాతం లాభపడి రూ.9,351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 3% పెరిగి రూ.9,245 వద్ద నిలిచింది. -
రంకెలేస్తున్న బుల్..60 వేలు దాటిన సెన్సెక్స్!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో బుల్ స్థిరమైన ర్యాలీతో సెన్సెక్స్ సూచీ ఏప్రిల్ ఐదో తేదీ తర్వాత మరోసారి 60,000 స్థాయిని అధిగమించింది. లాభాల స్వీకరణతో ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 418 పాయింట్లు బలపడి 60,260 వద్ద స్థిరపడింది. మొత్తం 30 షేర్లలో ఏడు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17,944 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌కిది వరుసగా నాలుగో రోజూ, నిఫ్టీకి ఏడోరోజూ లాభాల ముగింపు. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,347 కోట్ల షేర్లను కొనడంతో 13వ రోజూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.510 కోట్ల షేర్లను అమ్మారు. ఆసియాలో కొరియా ఇండెక్స్ తప్ప మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభపడ్డాయి. బ్రిటన్ ద్రవ్యోల్బణం నలభై ఏళ్ల గరిష్టస్థాయిలో నమోదవడంతో యూరప్ మార్కెట్లు 1–2% నష్టపోయాయి. యూఎస్ రిటైల్ సేల్స్, ఫెడ్ పాలసీ రిజర్వ్ జూలై సమావేశపు మినిట్స్ వెల్లడికి ముందు అమెరికా మార్కెట్లు అరశాతం స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. కాగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 29 పైసలు బలపడి 79.45 వద్ద ముగిసింది. నాలుగురోజుల్లో రూ.7.41 లక్షల కోట్లు సెన్సెక్స్ 4 రోజుల ర్యాలీతో రూ.7.41 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.279 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►నాలుగేళ్లకు సరిపడా 5జీ స్పెక్ట్రం వేలం సొమ్మును ముందుగానే చెల్లించడంతో భారతీ ఎయిర్టెల్ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.722 వద్ద స్థిరపడింది. ►బోర్డు షేర్ల బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకోవడంతో భారత్ గేర్స్ షేరు 18% లాభపడి రూ.178 వద్ద నిలిచింది. -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం, కుప్పకూలిపోతున్న షేర్లు!
స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత తొలిసారి ప్రారంభమైన స్టాక్ మార్కెట్లో బిగ్‌బుల్‌కు చెందిన అన్నీ షేర్లు కుప్పకూలిపోతున్నాయి. ♦ ముఖ్యంగా యాప్‌టెక్ లిమిటెడ్,స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ షేర్లు 5శాతం నష్టపోయాయి. ♦ బిగ్ బుల్ టైటాన్ షేర్లు 1.54శాతం నష్టపోయాయి. గతవారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేర్ వ్యాల్యూ రూ.2,471.95 ఉండగా.. ఇప్పుడు అదే షేర్ ప్రైస్ రూ.2,433వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ♦ జూన్ నెల త్రైమాసికం(వార్షిక ఫలితాలు)లో టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్ ఝున్ వాలా, ఆయన భార్య రేఖ షేర్లు 5.10శాతంతో రూ.11,086.9కోట్లుగా ఉంది. ♦ తొలి త్రైమాసికంంలో యాప్ టెక్ లిమిటెడ్‌లో రాకేష్ ఝన్‌ఝున్‌వాలా 23.40శాతంతో రూ.225కోట్లను పెట్లుబడులు పెట్టగా.. ఆయన మరణం కారణంగా బీఎస్ఈలో ఆ షేర్ వ్యాల్యూ క్షీణించింది. 3.67శాతం కంటే తక్కువగా రూ.224.20వద్ద ట్రేడ్ అవుతుంది. ♦ బిగ్‌బుల్‌కు పెద్దమొత్తంలో పెట్టుబడులున్న స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ షేర్లు భారీ పతనమవుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ కొనసాగే సమయానికి మునుపటి ముగింపు రూ .696.10తో పోలిస్తే 4.79 శాతం క్షీణించి రూ .662.75 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. జూన్ 2022 త్రైమాసికం నాటికి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఝున్‌ఝున్ వాలాకు 14.39 శాతంతో 8.28 కోట్ల షేర్లు, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 3.10 శాతంతో 1.78 కోట్ల షేర్లు ఉన్నాయి. స్టార్ హెల్త్‌లో ఝున్ఝున్వాటా విలువ రూ.7,017.5 కోట్లుగా ఉంది. ♦ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఫోర్ట్పోలియోకి చెందిన టాటా మోటార్స్ స్టాక్స్ 0.68 శాతం క్షీణించి రూ .480.75 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. జూన్ త్రైమాసికం చివరి నాటికి టాటా మోటార్స్‌లో రూ .1731.1 కోట్ల విలువైన షేర్లున్నాయి. ♦ బీఎస్ఈలో ఝున్‌ఝున్‌వాలా షేర్లున్న క్రిసిల్ లిమిటెడ్ షేరు మునుపటి ముగింపు రూ.3261.60 తో పోలిస్తే 0.56 శాతం క్షీణించి రూ .3243కు పడిపోయింది. జూన్ త్రైమాసికంలో క్రెడిట్ రేటింగ్ సంస్థలో ఆయనకు రూ .1301.9 కోట్ల విలువైన వాటా ఉంది. ♦ ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు బీఎస్ఈలో 0.20 శాతం తగ్గి రూ .281.30 వద్ద ట్రేడవుతుండగా.. ఇలా బిగ్బుల్ కు చెందిన అన్నీ షేర్లు నష్టాల పాలవ్వడంతో మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భలే సరదా మనిషి!
ఆత్మీయులకు ‘భాయ్’... మార్కెట్‌కు ‘రాకీ’... ప్రపంచానికి ‘బిగ్ బుల్’... స్టాక్ మార్కెట్‌కు పర్యాయపదంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన మన భారతీయ ‘వారెన్ బఫెట్’ అర్ధాంతరంగా అల్విదా చెప్పేశారు!! ఒక సాధారణ ఇన్వెస్టర్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా... అట్టడుగు స్థాయి నుంచి ‘ఆకాశ’మే హద్దుగా దూసుకెళ్లారు. ఆయన మాటే ఒక ఇన్వెస్ట్మెంట్ పాఠం... నడిచొచ్చే స్టాక్ ఎక్సే్ఛంజ్... ఇలా ఎన్ని చెప్పినా తక్కువేనేమో ఆయన గురించి! పట్టిందల్లా బంగారమే అనేంతలా, ఆయన పెట్టుబడులు కనక వర్షం కురిపించాయి. ఇప్పటికీ ‘రంకె’లేస్తూనే ఉన్నాయి. ‘ఇన్వెస్ట్మెంట్ గురు’గా పేరొందడమే కాదు... నవతరం ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ వైపు చూసేలా చేసిన ‘జూమ్ జూమ్’వాలా.. భారతీయ ఇన్వెస్ట్మెంట్ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతారు!! అలాంటి ఇన్వెస్టింగ్ మాంత్రికుడి హఠాన్మరణంపై పలువురు సంతాపం తెలిపారు. ఆర్థిక ప్రపంచంలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా చెరగని ముద్ర వేశారు. భారతదేశ పురోగతిపై ఆయనకు ఎంతో ఆశావహంగా ఉండేవారు. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి ‘ఇన్వెస్టరు, రిస్కులు తీసుకునే సాహసి, స్టాక్ మార్కెట్లపై అపారమైన పట్టు గల రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇక లేరు. ఆయనకు భారత సామర్థ్యాలు, సత్తాపై అపార విశ్వాసం ఉండేది.‘ – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలపై రాకేశ్‌కు గల అవగాహన అపారం. సరదా వ్యక్తిత్వం, దయాగుణం, దూరదృష్టికి గాను ఆయన గుర్తుండిపోతారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ భారతదేశ వృద్ధి అవకాశాలపై గట్టి నమ్మకంతో రాకేశ్ సాహసోపేత నిర్ణయాలు తీసుకునేవారు. టాటా గ్రూప్ అంటే రాకేశ్‌కు ఎంతో గౌరవం. ఆయన లేని లోటు తీర్చలేనిది. – ఎన్ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ నా స్నేహితుడి మరణం ఎంతో బాధ కలిగించింది. స్టాక్ మార్కెట్లపై అవగాహన కల్పించిన వ్యక్తిగా ఆయన అందరికీ గుర్తుండిపోతారు. – అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత రిసోర్సెస్ రాకేశ్ నా స్కూల్, కాలేజీ స్నేహితుడు. తను నాకన్నా ఒక ఏడాది జూనియర్. భారత్ విలువ మరెంతో ఎక్కువగా ఉంటుందని గట్టిగా నమ్మినవాడు. ఆర్థిక మార్కెట్లను అర్థం చేసుకోవడంలో నిష్ణాతుడు. కోవిడ్ సమయంలో మేము తరచూ మాట్లాడుకునేవాళ్లం. – ఉదయ్ కొటక్, ఎండీ, కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రఖ్యాత ఇన్వెస్టరు ఝున్‌ఝున్‌వాలా అకాల మరణం ఎంతగానో బాధ కలిగించింది. తన అద్భుతమైన విశ్లేషణలతో మన ఈక్విటీ మార్కెట్ల సత్తాపై ప్రజల్లో నమ్మకం కలిగేలా ఆయన స్ఫూర్తినిచ్చారు. ఆయన్ను ఎన్నటికీ మర్చిపోలేము. – గౌతమ్ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్ చదవండి👉రాకేష్ ఝున్‌ఝున్ వాలా విజయ రహస్యం అదే! -
పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా!
వివాహమైన 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాకేశ్ దంపతులకు 2004లో సంతానం (కుమార్తె) కలిగింది. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా కాగా, కుమార్తె పేరు నిష్ఠ. 2009లో ఇద్దరు కుమారులు ఆర్యమాన్.. ఆర్యవీర్ (కవలలు) పుట్టారు. తన కుమారులిద్దరూ పాతికేళ్ల వారయ్యాకా చూడాలని కోరుకుంటున్నానని 2010లో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాకేశ్ చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కుమారులిద్దరికీ దాదాపు పదమూడేళ్లు. మరోవైపు, 2021లో 13 అంతస్తుల భవంతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. చదవండి👉 '1992 స్కాం' వెబ్ సిరీస్‌లో రాకేష్ ఝున్‌ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా? -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా: 5 వేలతో మొదలై.. 50 వేల కోట్లకు!
రాజస్తానీ మార్వాడీల కుటుంబానికి చెందిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. ముంబైలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ముంబైలో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేసేవారు. స్టాక్‌మార్కెట్లలో తండ్రి ఇన్వెస్ట్ చేస్తుండటం, వాటి గురించి స్నేహితులతో చర్చిస్తుండటం వంటి వాతావరణంలో పెరగడంతో తనకు చిన్నతనం నుంచే పెట్టుబడులపై ఆసక్తి ఏర్పడినట్లు రాకేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వార్తల్లో ఉన్న తీరును బట్టి కంపెనీలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయని తండ్రి వివరించడంతో 15 ఏళ్ల ప్రాయం నుంచే మార్కెట్ వార్తల్ని, షేర్లను పరిశీలించడం ప్రారంభించారు. డిగ్రీ తర్వాత స్టాక్ మార్కెట్ల వైపు వెళ్తానంటూ తండ్రికి చెప్పారు. కానీ సీఏ చేసి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాతే ఆ విషయాన్ని ఆలోచించాలని తండ్రి సూచించారు. ఆయన మాట ప్రకారమే సీఏ చదివిన తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టారు. తొలి పెట్టుబడి బంపర్ హిట్..! 1985లో సోదరుడు రాజేశ్ దగ్గర రూ. 5,000 తీసుకుని రాకేశ్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 5,000తో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. రూ. 43కి కొన్న షేరు మూడు నెలల్లోనే రూ. 143కి ఎగిశాయి. మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి సెసా గోవా, టైటాన్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లారు. మార్కెట్లోకి రాకేశ్ అడుగుపెట్టినప్పుడు సెన్సెక్స్ 150 పాయింట్లుగా ఉండేది. ప్రస్తుతం అది 60,000 పాయింట్ల వద్ద ఉంది. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాకేశ్ సంపద కూడా రాకెట్లా దూసుకెళ్లి సుమారు రూ. 46,000 కోట్ల స్థాయికి చేరింది. 2017లో టైటాన్ షేరు జోరు మీద ఉన్నప్పుడు 1 రోజులోనే ఏకంగా రూ. 900 కోట్లు ఆర్జించారు. రాకేశ్ కొన్న కంపెనీ షేరు పెరుగుతుంది.. అమ్మితే పడిపోతుంది అనే సెంటిమెంటుతో అసంఖ్యాకంగా ఇన్వెస్టర్లు ఆయన్ను ఫాలో అవుతున్నారు. వైఫల్యాలూ ఉన్నాయి.. రాకేశ్‌కు నష్టాలు తెచ్చిపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ప్రధానంగా ఇన్ఫ్రా విభాగంలో పెట్టుబడులు ఆయనకు కలిసిరాలేదు. రియల్టీ భవిష్యత్ బాగుంటుందనే అంచనాలతో 2013లో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌లో రూ. 34 కోట్లు పెట్టి 25 లక్షల షేర్లు కొన్నారు. 2018లో కంపెనీ దెబ్బతిన్నప్పటికీ మరికాస్త కొన్నారు. కానీ చివరికి ఆ కంపెనీ దివాలా తీసింది. మంధన రిటైల్లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. 2016లో సంస్థ షేరు రూ. 247గా ఉన్నప్పుడు 12.7% వాటా కొన్నారు. 2021లో రూ. 16కి అమ్మేశారు. అలాగే డీబీ రియల్టీలోనూ, ప్రైవేట్ ఈక్విటీ కింద చేసిన పెట్టుబడుల్లో కొన్ని ఇన్వెస్ట్‌మెంట్లూ నష్టాలు తెచ్చిపెట్టాయి. వివాదాలూ ఉన్నాయి.. బిగ్ బుల్గా పేరొందినప్పటికీ ఆయన బేర్ పాత్ర పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1992 హర్షద్ మెహతా స్కామ్ సందర్భంలో షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభాలు గడించారు. సాధారణంగా షేర్లంటేనే స్కాములనే దురభిప్రాయం కొంత ఉండే మార్కెట్లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ లాంటి వారికి భిన్నంగా రాకేశ్‌కి కాస్త క్లీన్ ఇమేజే ఉంది. అయినప్పటికీ ఆయనపైనా ఆరోపణలు ఉన్నాయి. ఆప్టెక్లో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును 2021లో ఆయనతో పాటు మరికొందరు రూ. 37 కోట్లతో సెటిల్ చేసుకున్నారు. అలాగే సోనీ పిక్చర్స్‌లో విలీనం కావాలని జీ ఎంటర్ప్రైజెస్ నిర్ణయం తీసుకోవడానికి కొద్ది రోజుల ముందే.. జీ ఎంటర్‌ప్రైజెస్‌లో రాకేశ్ ఇన్వెస్ట్ చేయడం, స్వల్ప వ్యవధిలోనే రూ. 70 కోట్లు లాభాలు పొందడం, ఆయన వ్యవహారాలపై సందేహాలు రేకెత్తించాయి. కంపెనీల పోర్ట్‌ఫోలియో.. రాకేశ్‌కు 40 పైచిలుకు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. టాటా గ్రూప్‌లో భాగమైన టైటాన్ వీటన్నింటిలోకెల్లా ప్రత్యేకమైనది. వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. టైటాన్లో ఆయనకున్న 5.05% వాటాల విలువే రూ. 11,000 కోట్ల మేర ఉంటుంది. స్టార్ హెల్త్, ర్యాలీస్, ఎస్కార్ట్స్, కెనరా బ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, టాటా మోటర్స్ మొదలైన సంస్థలలోనూ ఆయన ఇన్వెస్ట్ చేశారు. హంగామా మీడియా, ఆప్టెక్ సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరించారు. వైస్రాయ్ హోటల్స్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, కాంకర్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదలైన వాటిల్లో డైరెక్టరుగా ఉన్నారు. భార్య రేఖ, తన పేరు కలిసి వచ్చేలా రేర్ (RARE) ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసి, కార్యకలాపాలు సాగించేవారు. ఇటీవలే ప్రారంభమైన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో రాకేశ్, ఆయన భార్య రేఖకు 40% వాటాలు ఉన్నాయి. -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మాటే పెట్టు'బడి'..!
కంపెనీల ఎంపిక... ఝున్‌ఝున్‌వాలా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారంటే స్టాక్ మార్కెట్లో ఎంతో మంది ఇన్వెస్టర్లకు అది అనుసరణీయంగా మారుతుందనడంలో అతిశయోక్తి కాదు. మరో ఆలోచన లేకుండా అవే కంపెనీల్లో పెట్టుబడి పెట్టి గుడ్డిగా అనుసరించే వారూ ఉన్నారు. కానీ, ఎవరైనా స్వీయ అధ్యయనంతో పెట్టుబడి పెట్టినప్పుడే దాన్ని కొనసాగించగలరు. పెట్టుబడికి ముందు ఒక కంపెనీకి సంబంధించి ఎన్నింటినో ఝున్‌ఝున్‌వాలా చూస్తారు. ఎదుగూ, బొదుగూ లేని వ్యాపారంతో కూడిన క్రిసిల్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? అన్నది అప్పట్లో చాలా మంది నిపుణులు, ఇన్వెస్టర్లకు అర్థం కాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా వృద్ధి సాధిస్తుంటే, విశ్వసనీయమైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల సేవలకు డిమాండ్ భారీగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. అదే నిజమైంది. రేటింగ్ ఏజెన్సీ మార్కెట్లో ఇప్పటికీ క్రిసిల్ లీడర్. 2002లో రూ.200 పెట్టి ఒక్కో క్రిసిల్ షేరు కొంటే, దాని విలువ ఇప్పుడు రూ.3,250. అన్ని సందర్భాల్లో ‘రైట్’ కానక్కర్లేదు విజయవంతమైన ఇన్వెస్టర్లు ఆచితూచి, సరైన స్టాక్స్ ఎంపిక చేసుకుంటారని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ, ఎంతో తలపండిన వారెన్ బఫెట్ దగ్గర్నుంచి ఝున్‌ఝున్‌వాలా వరకు స్టాక్స్ పెట్టుబడుల్లో ఎదురుదెబ్బలు సహజం. కనుక వైఫల్యాలను ఆమోదించి, పాఠాన్ని నేర్వడమే ఇన్వెస్టర్ చేయాల్సింది. ఝున్‌ఝున్‌వాలా ట్రాక్ రికార్డును పరిశీలిస్తే డిష్ టీవీ, డీహెచ్ఎఫ్ఎల్, మంధన రిటైల్ వెంచర్స్ ఇవన్నీ పెట్టుబడులను హరించివేసినవి. ఆయన పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న జియోజిత్ ఫైనాన్షియల్, బిల్కేర్, ఆటోలైన్ ఇండస్ట్రీస్ ఇలా చాలా కంపెనీలు విజయాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అదే సమయంలో ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీల్లో మిగిలినవి గొప్ప రాబడులను ఇచ్చాయి. అందుకే ఆయన నష్టపోయిదానికంటే కూడబెట్టుకున్నది ఎక్కువ. టైటాన్ ఒక్కో షేరును రూ.5 కొనుగోలు చేశారు. నేడు అదే షేరు ధర రూ.2,472. ఈ ఒక్క పెట్టుబడి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మొత్తం స్టాక్ మార్కెట్ జర్నీలో నష్టాలను పూడ్చేసి, అదనపు సంపదను తెచ్చిపెట్టింది. కనుక తప్పిదాలను గుర్తించి, అవసరమైతే ఆ కంపెనీల నుంచి తప్పుకోవడం, రానున్న రోజుల్లో సంపద సృష్టికి అవకాశం ఉన్న వాటిని గుర్తించి పెట్టుబడులు పెట్టడం కీలకం. ట్రేడింగ్/ఇన్వెస్టింగ్... చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ వేర్వేరు అని భావించరు. నిజానికి ఈ రెండూ విరుద్ధమైనవి. వీటికి అనుసరించే సూత్రాలూ భిన్నమైనవే. రాకేశ్ రూ.5,000తోనే ఇంతటి సంపద సాధించగలిగారా..? కాదు. పెట్టుబడికి నిధి కావాలి. ఆ విషయం ఝున్‌ఝున్‌వాలా త్వరగానే గుర్తించారు. మంచి పెట్టుబడి నిధి కోసం ఆయన ఆరంభంలో దశాబ్దం పాటు ట్రేడింగ్‌ను వృత్తిగా మలుచుకున్నారు.ఎదురుదెబ్బలు తగిలినా, కిటుకులు పట్టుకున్నారు. భారీ నిధితో పాటు, మార్కెట్ గురించి మంచి విజ్ఞానాన్నీ సంపాదించారు. ట్రేడింగ్ స్వల్పకాల రాబడిని ఇస్తుందని.. స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే, దీర్ఘకాల సంపదగా మారుతుందని ఆయన చెప్పేవారు. అధ్యయనం/ప్యాషన్... జీవితం అంటే పశ్చాత్తాపాలు కాదు.. ప్రతి తప్పిదం నుంచి నేర్చుకునే మజిలీ అని ఝున్‌ఝున్‌వాలా చెబుతారు. తప్పులే తనను మెరుగైన ఇన్వెస్టర్‌గా మార్చాయని ఆయన స్వయంగా చెప్పారు. వేరే వారిని గుడ్డిగా అనుసరించి ఇన్వెస్ట్ చేయడం విజయాన్ని ఇవ్వదు. ఎవరికి వారు మార్కెట్‌ను అధ్యయనం చేయాలి. ప్రముఖ ఇన్వెస్టర్లు చేసిన తప్పులు, వారి విజయానికి దోహదం చేసిన అంశాలను నేర్చుకోవాలి. దీనివల్ల మరింత పరిణతితో లాభాలు పెంచుకోవడం సాధ్యం. రాకేశ్‌కు స్టాక్స్‌లో పెట్టుబడి అంటే ఓ ప్యాషన్. ఆయన సంపదలో 99 శాతం స్టాక్స్‌లోనే ఉందంటే ఈక్విటీల పట్ల ఆయనకున్న విశ్వాసం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘మార్కెట్లో సంపద కూడబెట్టుకోవాలంటే సొంతంగా పరిశోధన చేయాలి. నేర్చుకోవడాన్ని అభిరుచిగా మార్చుకోవాలి’ అని ఆయన సూచిస్తారు. నమ్మకం ఉంచాలి.. సరైన అవకాశం అని భావించినప్పుడు భారీగా పెట్టుబడి పెట్టడం ఝున్‌ఝున్‌వాలా విధానం. 1980ల్లో సెసాగోవా (ఇప్పుడు వేదాంతలో భాగం) అనే ఐరన్‌ఓర్ కంపెనీ షేరు రూ.24–25లో ఉన్న సందర్భంలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రూ.కోటి ఇన్వెస్ట్ చేశారు. ఐరన్‌ఓర్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉన్న రోజులవి. కానీ, ఆ కంపెనీలో ఎంతో విలువ దాగుందని ఆయన భావించి పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత నష్టాలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ, అదే షేరు తర్వాతి కాలంలో ఎన్నో రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. టైటాన్‌లోనూ అంతే. కంపెనీ అంతర్గత విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంటే అలాంటి కంపెనీలను ఝున్‌ఝున్‌వాలా విస్మరించరు. 2020 మార్కెట్ పతనంలో టాటా మోటార్స్ షేరు రూ.65కు పడిపోయింది. మార్కెట్ విలువ రూ.24,000 కోట్లకు దిగొచ్చింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌తోపాటు, రూ.2,00,000 కోట్ల అమ్మకాలు కలిగిన కంపెనీ ఇంత తక్కువలో ట్రేడ్ అవ్వడం చాలా చౌక అని భావించి ఎక్స్పోజర్ తీసుకున్నారు. అక్కడి నుంచి టాటా మోటార్స్ ఏడు రెట్లకు పైగా పెరిగింది. సహనం ఓర్పు అన్నది ఈక్విటీ మార్కెట్లో రెండువైపులా పదునైన కత్తి వంటిది. మంచి యాజమాన్యం, ఆర్థిక బలం, కంపెనీ ఉత్పత్తి లేదా సేవల పట్ల ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఇలాంటి ఎన్నో బలాలున్న కంపెనీని ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టామంటే.. మంచి లాభాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ, అంచనాలు నిజమై మంచి రాబడినిచ్చే వరకు ఆగే ఓపిక కూడా ఉండాలి. ‘స్టాక్ మార్కెట్ ఓపిక లేని వాడి పెట్టుబడిని తీసుకెళ్లి ఓపిక వహించిన వాడికి రాబడిగా ఇస్తుంది’అన్నది వారెన్ బఫెట్ చెప్పేమాట. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్ది రాబడికే విక్రయించడం, బాగా నష్టం వచ్చిందని వెంటనే విక్రయించి బయటపడడం సక్సెస్‌ను ఇవ్వదు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడుల ప్రయాణాన్ని గమనిస్తే చాలా స్టాక్స్‌లో ఆయన దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించినట్టు తెలుస్తుంది. తాను కొనుగోలు చేసింది వ్యాపారాన్నే కానీ, స్టాక్‌ను కాదని ఆయన నమ్ముతారు. కంపెనీ పనితీరు బాగుండి, ఆర్థిక మూలాలు బలంగా ఉన్నంత కాలం.. భవిష్యత్తు బాగుంటుందన్న విశ్వాసం ఉన్నంత కాలం ఆ పెట్టుబడులను ఓపిగ్గా కొనసాగిస్తారు. అదే రూ.5లో కొన్న టైటాన్ స్టాక్ రూ.2,500 అయినా అమ్మకుండా ఆయన్ను కొనసాగించేలా చేసింది. చదవండి👉 ఈ టిప్స్ పాటిస్తే స్టాక్ మార్కెట్లో మీరే మెగాస్టార్లు : రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లపై జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం చూపుతున్నాయి. క్రూడ్ ఆయిల్ 6 నెలల కనిష్టానికి పడిపోవడం, ఆశాజనకంగా త్రైమాసిక ఫలితాలు, ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కొనుగోలు ఆసక్తిని ప్రోత్సహిస్తుండడం, గ్లోబల్ మార్కెట్లు లాభా పడ్డాయి. దీంతో సోమవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు స్తబ్ధుగా ప్రారంభమయ్యాయి. ఇక సోమవారం ఉదయం 10.30గంటల సమయానికి సెన్సెక్స్ 218 పాయింట్లు నష్టపోయి 58617 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ సైతం 57 పాయింట్లు నష్టపోయి 17454 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది. ఎం అండ్ ఎం,ఇండస్ ఇండ్ బ్యాంక్,హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్,అపోలో హాస్పిటల్, లార్సెన్,హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీపీసీఎల్,ఎస్బీఐ, బ్రిటానియా,కిప్లా,ఇన్ఫోసిస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
బుల్ రంకెలు..5 రోజుల్లో రూ.10 లక్షల కోట్ల సంపద సృష్టి!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ.., దలాల్ స్ట్రీట్‌లో అయిదోరోజూ కొనుగోళ్లు కొనసాగాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో పాటు డాలర్ మారకంలో రూపాయి రికవరీ అంశాలు దేశీయ మార్కెట్లో సెంటిమెంట్ బలపరిచాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 284 పాయింట్లు పెరిగి 55,682 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 84 పాయింట్లు బలపడి 16,605 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు ఏడువారాల గరిష్టం కావడం విశేషం. ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన ఐటీ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. విస్తృత స్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.25%, స్మాల్‌క్యాప్ సూచీ ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,799 కోట్ల విలువ షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.313 కోట్ల విలువ షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టం(80.06) నుంచి కోలుకొని 20 పైసలు బలపడి 79.85 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! సెన్సెక్స్ ఉదయం ఐదు పాయింట్లు పతనమై 55,392 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్ల నష్టపోయి 16,524 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో పరిమితి శ్రేణిలో స్తబ్ధుగా కదలాడిన సూచీలు క్రమంగా పుంజుకొని ట్రేడింగ్ చివర్లో అనూహ్యరీతిలో లాభాలను ఆర్జించాయి. 5 రోజులు : రూ.10 లక్షల కోట్లు సెన్సెక్స్ అయిదు రోజుల్లో 2,266 పాయింట్లు దూసుకెళ్లిన బీఎస్ఈలో రూ.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు ఎగసింది. ఇదే ఐదు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 556 పాయింట్లు పెరిగింది. ‘‘చమురు ధరలు దిగివచ్చాయి. యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు దూకుడుగా ఉండకపోవచ్చనే ఆశలు చిగురించాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొంటున్నారు. మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ అంశాలతో భారత మార్కెట్ 5 ట్రేడింగ్ సెషన్లలో 4% ర్యాలీ చేసింది’’ అని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦జూన్ త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబరచడంతో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 8% లాభపడి రూ.948 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో తొమ్మిది శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.961 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన ఈ షేరు ఇదే. ♦ఐటీసీ షేరు బీఎస్ఈలో అరశాతం లాభపడి రూ.299.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.5% లాభపడి మూడేళ్ల తర్వాత రూ.300 స్థాయిని అధిగమించి రూ.302.20 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వార్షిక సమావేశంలో హోటల్ వ్యాపార విభజనతో పాటు తన అనుబంధ సంస్థ టెక్నాలజీ వెంచర్‌ను లిస్టింగ్ చేసే అంశాలపై చర్చించడం షేరు ర్యాలీకి కారణమైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦జూన్ త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబరచడంతో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 8% లాభపడి రూ.948 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో తొమ్మిది శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.961 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన ఈ షేరు ఇదే. ♦ఐటీసీ షేరు బీఎస్ఈలో అరశాతం లాభపడి రూ.299.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.5% లాభపడి మూడేళ్ల తర్వాత రూ.300 స్థాయిని అధిగమించి రూ.302.20 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వార్షిక సమావేశంలో హోటల్ వ్యాపార విభజనతో పాటు తన అనుబంధ సంస్థ టెక్నాలజీ వెంచర్‌ను లిస్టింగ్ చేసే అంశాలపై చర్చించడం షేరు ర్యాలీకి కారణమైంది. -
ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్ ఫలితాలు సూచీలకు దిశానిర్దేశం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు క్రూడాయిల్, కమోడిటీ ధరలు, పార్లమెంట్వర్షాకాల సమావేశాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘ఇటీవల క్రూడాయిల్‌తో పాటు కమోడిటీ ధరలు దిగివచ్చాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల ఉధృతి తగ్గింది. మరోవైపు ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్టాక్ సూచీలు మరికొంత పాటు పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చు. చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 16,00 స్థాయిపైన ముగిసింది. కొనుగోళ్లు కొనసాగితే జూన్ నెల గరిష్టం 16,275 స్థాయి వద్ద నిరోధం ఎదుర్కోనుంది. అటు పిదప 16,400–16,500 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 15,858 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,700–15,500 రేంజ్లో మద్దతు లభించొచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టానికి దిగిరావడం, ఇప్పటి వరకు విడుదలైన కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ద్రవ్యోల్బణ పెరగడంతో ఫెడ్ రిజర్వ్ అంచనాలకు మించి వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో గతవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 721 పాయింట్లు, నిఫ్టీ 171 పాయింట్లు చొప్పున క్షీణించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే.., కీలక దశలో కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ముందుగా నేడు మార్కెట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్, విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హావెల్స్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఆర్బీఎల్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తే.., యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ రేపు ద్రవ్య విధానాన్ని వెల్లడించనుంది. వడ్డీరేట్ల పెంపుకే మొగ్గు చూపవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నాయి. యూరో కరెన్సీ పదేళ్ల కనిష్టానికి దిగివచ్చని నేపథ్యంలో ఈసీబీ కఠినతర వైఖరి అనుసరించే వీలుందంటున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ కేంద్ర బ్యాంక్ గురువారం ద్రవ్య పాలసీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈ జూలై తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,432 కోట్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుత నెలలో సైతం అమెరికా డాలర్ బలపడటం, అమెరికా మాంద్యంపై పెరుగుతున్న ఆందోళనలు ఇందుకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. కాగా గత నెల జూన్‌లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐ అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ.., కొనుగోలు చేసే ప్రత్యేక పరిస్థితులేవీ లేకపోవడంతో అమ్మకాల ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
అంతర్జాతీయ ప్రతి కూలతలు దేశీయ మార్కెట్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 53,744 వద్ద నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 16,036 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లోని 15 సెక్టార్లలోని 12 రంగాలకు చెందిన షేర్లు లాభాల వైపు పయనమవుతుండగా.. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ షేర్లు ఊహించని విధంగా 1.07 శాతం నుంచి 1.21శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో అపోలో హాస్పిటల్ షేర్లు 2.13శాతంతో రూ.3,950 వద్ద ట్రేడ్ కంటిన్యూ చేస్తుంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, బ్రిటానియా, ఆల్ట్రా టెక సిమెంట్, హిందుస్తాన్ యూనిలివర్, మారుతి, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్,నెస్లే,రిలయన్స్ షేర్లు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. యాక్సిస్ బ్యాంక్,టెక్ మహీంద్రా,టాటా స్టీల్,టీసీఎస్,ఎస్బీఐ,ఇన్ఫోసిస్,హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
దేశీయ స్టాక్ మార్కెట్, కొనసాగుతున్న నష్టాల పరంపర!
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ సూచీలకు మూడోరోజూ నష్టాలు తప్పలేదు. ఇంధన, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో బుధవారం సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 53,514 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 16,000 స్థాయి దిగువున 15,967 వద్ద నిలిచింది. మరోవైపు ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, కార్పొరేట్ ఫలితాలకు వెల్లడి ముందు అప్రమత్తత, డాలర్ మారకంలో రూపాయి సరికొత్త జీవితకాల కనిష్టానికి దిగిరావడం తదితర అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచాయి. గత 3 సెషన్లలో సెన్సెక్స్ 967 పాయింట్లు, నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,840 కోట్ల షేర్లను అమ్మేయగా.. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,799 కోట్ల షేర్లు కొన్నారు. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ అమ్మకాల ఒత్తిడి భారత ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదుకావడంతో పాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 323 పాయింట్లు పెరిగి 54,210 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 16,128 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో ట్రేడింగ్ ప్రారంభం నుంచీ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్‌సెషన్ కల్లా ఆరంభ లాభాల్ని కోల్పోయిన సూచీలు.., యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో మరింత ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(54,211) నుంచి 756 పాయింట్లు నష్టపోయి 53,455 వద్ద నిఫ్టీ 190 పాయింట్లను కోల్పోయి 15,950 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►తొలి త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్‌సీఎల్ టెక్ షేరు ఒక దశలో 2.5% నష్టపోయి రూ.905 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి ఒకశాతం పతనంతో రూ.918 వద్ద స్థిరపడింది. ►ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణపై వివరణ ఇచ్చినప్పటికీ.. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరుకు నష్టాలు తప్పలేదు. మూడున్నర శాతం నష్టంతో రూ. 818 వద్ద ముగిసింది. ►నష్టాల మార్కెట్లోనూ అరబిందో పార్మా, లారస్ ల్యాబ్స్, దివీస్, లుపిన్ షేర్లు 4–5% రాణించాయి. -
బుల్ రన్ అదిరింది, 5 రోజుల్లో రూ.7.5 లక్షల కోట్ల సంపద సృష్టి!
ముంబై: బ్యాంకింగ్, మౌలిక, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. ప్రపంచ మార్కెట్లోని సానుకూలతలు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి 54,482 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88 పాయింట్లు బలపడి 16,221 వద్ద నిలిచింది. మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. మిడ్‌సెషన్ తర్వాత స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ.., చివరి గంట కొనుగోళ్ల అండతో సూచీలు వారాంతాన్ని లాభాల్లోనే ముగించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 449 పాయింట్ల పెరిగి 54,627 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 16,275 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.109 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.35 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి విలువ శుక్రవారం 13 పైసలు పతనమై 79.26 వద్ద స్థిరపడింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె హత్యతో ఆసియా మార్కెట్లు మిడ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్, యూఎస్ సూచీలు 1–0.50% లాభపడ్డాయి. 5 రోజుల్లో రూ.7.5 లక్షల కోట్ల సంపద సృష్టి క్రూడాయిల్, కమోడిటీ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఈ వారంలో బుల్ రన్ అదిరింది. సెన్సెక్స్ 1,574 పాయింట్లు నిఫ్టీ 469 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ మూడు శాతం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.5 లక్షల కోట్లు పెరిగింది. జూలై 8న బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.251.59 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు తన అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైందనే వార్తలతో పాటు మెటల్ ధరలు దిగిరావడంతో టాటా మోటార్స్ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.442 వద్ద స్థిరపడింది. విద్యుత్ వాహనాల అనుబంధ కంపెనీలో బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్(బీఐఐ) రూ.1,925 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ షేరు ఇంట్రాడేలో 5% పెరిగి రూ.1191 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. గరిష్ట స్థాయి వద్ద లాభాల స్వీకరణ కారణంగా చివరికి ఫ్లాటుగా రూ.1,133 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనానికి గ్రీన్‌సిగ్నల్!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనానికి స్టాక్ ఎక్ఛేంజ్‌లు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీగా నమోదుకానున్న ఈ విలీనానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ..నో అబ్జక్షన్ను మంజూరు చేశాయి. అయితే విలీనానికి వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. రిజర్వ్ బ్యాంక్, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ), జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)తోపాటు.. రెండు సంస్థల వాటాదారులు, రుణదాతలు ఆమోదించవలసి ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 4న దేశీయంగా అతిపెద్ద మార్టిగేజ్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకునేందుకు బ్యాంక్ బోర్డు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. విలీన సంస్థ 40 బిలియన్ డాలర్ల విలువైన ఫైనాన్షియల్ రంగ దిగ్గజంగా ఆవిర్భవించనుంది. విలీన సంస్థ ఆస్తుల విలువ(అసెట్ బేస్) రూ. 18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం 2023–24 మూడో త్రైమాసికానికల్లా పూర్తి కావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒప్పందంలో భాగంగా హెచ్డీఎఫ్సీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 25 షేర్లకుగాను 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లభించనున్నాయి. -
స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండే
-
స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్! రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి!
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్ ఆయిల్ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేశాయి. దీంతో సోమవారం మొత్తం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతననమవడంతో రోజంతా బ్లడ్ బాత్ కొనసాగింది. కేవలం ఒక్కరోజులోనే రూ7లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1456 పాయింట్ల భారీ నష్టంతో 52,846 వద్ద నిఫ్టీ 427 పాయింట్ల నష్టంతో 15,744 వద్ద ట్రేడింగ్ ముగిసింది. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయాయి. బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, మెటల్, ఐటీ, రియల్ ఎస్టేట్, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్‌తో సహా ఇలా అన్నీ సెక్టార్ల షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో సోమవారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ..సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి. దీంతో బీఎస్ఈ 38 పాయింట్ల నష్టంతో 54,289వద్ద ముగియగా..నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 16,215 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈలో టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్,ఎస్బీఐ,భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టపోయాయి. ఎల్ఐసీ షేర్ 1.14శాతం నష్టపోయి రూ.816.85తో సరిపెట్టుకుంది. ఎంఅండ్ ఎం, మారుతి, హిందుస్తాన్ యూనిలివర్, ఏసియన్ పెయింట్స్,ఎల్ అండ్ టీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీ షేర్లు లాభాలతో ముగిశాయి. స్టాక్ మార్కెట్‌పై స్టీల్ దెబ్బ ఇక ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్,పీసీఐ కోల్,కేక్,సెమీ కేక్ వంటి ముడి పదార్ధాలపై కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసింది. దీంతో పాటు దేశీయ పరిశ్రమలకు ఇనుప ఖనిజం అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎగుమతి సుంకాన్ని 30 నుంచి 50శాతానికి పెంచారు. ఐరన్ పెల్లెట్ల ఎగుమతిపై 45శాతం, స్టీల్ ఇంటర్ మీడియరీస్‌పై 15శాతం పెంచారు. దీంతో ఆ ప్రభావం దేశీయ స్టాక్స్‌పై పడింది. ముఖ్యంగా స్టీల్ స్టాక్ విభాగంలో నిఫ్టీ షేర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 13.21శాతంతో రూ.83.35 నష్ట పోయింది. వీటితో పాటు టాటా స్టీల్, దివిల్యాబ్స్,ఓఎన్జీసీ,హిందాల్కో షేర్లు నష్టాలతో ముగిశాయి. -
రెండు రోజులే..మళ్లీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
రెండు రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఏప్రిల్ నెలలో యూకే ద్రవ్యోల్బణం 40ఏళ్లలో తొలిసారి 9 శాతానికి చేరడంతో పాటు ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, వడ్డీరేట్ల పెంపు, పెరిగిపోతున్న కరోనా కేసులు వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి.దీంతో ఉదయం సానుకూలంగా ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం నుంచి ఒత్తిడికి లోనయ్యాయి. చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టపోయి 54,209 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 16,240 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఎన్ఎస్ఈలో 15సెక్టార్లలో 12 సెక్టార్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్స్ 1.57శాతం , ఐటీ షేర్లు 0.47శాతం నష్టపోయాయి. ఇక నిఫ్టీలో అన్నీ కంపెనీల షేర్లలో పవర్ గ్రిడ్ షేర్లు 4.53శాతం వృద్దితో రూ.227.85 లాభాల్ని గడించి ప్రదమ స్థానంలో నిలిచింది. బీపీసీఎల్,టెక్ మహీంద్రా,అపోలో హాస్పటిల్, ఎస్బీఐ షేర్లు లాభాలతో ముగియగా.. బీఎస్ఈలో పవర్ గ్రిడ్, టెక్ ఎం,ఎస్బీఐ,ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్టెల్,ఎన్టీపీసీ,విప్రో,హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ షేర్లు నష్టపోయాయి.హిందుస్తాన్ యూనిలివర్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీ బీఎస్ఈ షేర్లు లాభాలతో ముగిశాయి. -
ఆర్బీఐ కీలక ప్రకటన, దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా!
దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపడంతో వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్బీఐ తీసుకున్న కీలక ప్రకటనతో దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మధ్యాహ్నం 2.20 గంటల సమయానికి సెన్సెక్స్ 956 పాయింట్ల భారీ నష్టపోయి 567019 వద్ద నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 16781 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. -
కంపెనీల ఐపీవోకి సెబీ గ్రీన్ సిగ్నల్, టార్గెట్ రూ.7వేల కోట్లు!
న్యూఢిల్లీ: లైఫ్‌స్టయిల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ఇండియా, స్పెషాలిటీ కెమికల్ కంపెనీ ఏథర్ ఇండస్ట్రీస్ సహా మొత్తం ఏడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్, సనాతన్ టెక్స్టైల్స్, క్యాపిలరీ టెక్నలజీస్ ఇండియా, హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు దాదాపు రూ. 9,865 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇవి గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో దరఖాస్తు చేసుకున్నాయి. ఏప్రిల్ 27–30 మధ్యలో సెబీ అనుమతులు మంజూరు చేసింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ఫ్యాబ్ఇండియా .. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల వరకూ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.5 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనుంది. ఈ ఇష్యూ సుమారు రూ. 4,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అటు ఏథర్ ఇండస్ట్రీస్ ఆఫర్ ప్రకారం రూ. 757 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ మార్గంలో 27.51 లక్షల షేర్లను విక్రయించనుంది. మొత్తం మీద రూ. 1,000 కోట్ల వరకూ సమీకరించవచ్చని తెలుస్తోంది. మిగతా సంస్థలు.. ►ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ రూ. 765 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, హాథ్‌వే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ రూ. 465 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనుంది. ►ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల సంస్థ సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీస్ దాదాపు రూ. 1,000–1,200 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. రూ. 926 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ వీణా కుమారి టాండన్ 33.69 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు. ► యార్న్ తయారీ సంస్థ సనాతన్ టెక్స్టైల్స్ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,200–1,300 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల మేర కొత్త షేర్లు, ఓఎఫ్ఎస్ కింద 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ►ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూష న్స్ అందించే క్యాపిలరీ టెక్నాలజీస్ .. ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమకూర్చుకోనుంది. పబ్లిక్ ఇష్యూ కింద తాజాగా రూ. 200 కోట్ల విలువ చేసే షేర్లు, అలాగే ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 650 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ►హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ రూ. 750 కోట్లు సమీకరిస్తోంది. రూ. 455 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుత షేర్హోల్డర్లు రూ. 300 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు. -
రష్యా దెబ్బ..దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్ బాత్..కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
ముంబై: ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ దిగ్గజాలలో అమ్మకాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 537 పాయింట్లు పతనమై 56,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 వద్ద ముగిసింది. యూఎస్ మార్కెట్ల క్షీణత, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ వేడి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు తదితర ప్రతికూల అంశా లు సెంటిమెంటును బలహీనపరచినట్లు స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో తొలి నుంచీ ఇన్వెస్ట ర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 773 పాయింట్లు పతనమై 56,584ను తాకింది. నిఫ్టీ సైతం 242 పాయింట్లు కోల్పోయి 17,000 దిగువన 16,958కు చేరింది. బజాజ్ ఫైనాన్స్ వీక్ సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాలలో భాగమైన బజాజ్ ఫైనాన్స్ 7.25 శాతం పతనంకాగా.. గ్రూప్‌లోని మరో కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్ 4 శాతం క్షీణించింది. దీంతో బజాజ్ ఫైనాన్స్ షేరు రూ. 6,717 వద్ద ముగిసింది. మార్కెట్ విలువలో రూ. 31,727 కోట్లమేర కోత పడింది. రూ. 4,06,646 కోట్లకు పరిమితమైంది. అయితే క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 2,420 కోట్ల నికర లాభం ఆర్జించడం గమనార్హం! కాగా.. ఇతర దిగ్గజాలలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ 2.2–1.8 శాతం మధ్య నీరసించాయి. ఐటీ బ్లూచిప్స్‌లో విప్రో, ఇన్ఫోసిస్ దాదాపు 2 శాతం వెనకడుగు వేయగా.. టైటన్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ఎం, మారుతీ 2.2–1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టాటా స్టీల్ 1 శాతం బలపడగా.. ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, కొటక్ బ్యాంక్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బలపడటంతో మార్కెట్లు కొంతమేర నష్టాలను తగ్గించుకున్నాయి. కన్సాలిడేషన్ దశ ప్రస్తుతం నడుస్తున్న కన్సాలిడేషన్ దశలో భాగంగా మార్కెట్లు వెనకడుగు వేసినట్లు రెలిగేర్ బ్రోకింగ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లకుతోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు, కంపెనీల ఫలితాలు మార్కెట్లలో ఒడిదొడుకులకు కారణమవుతున్నట్లు తెలియజేశారు. హెచ్చుతగ్గులు.. గ్లోబల్ మార్కెట్లలో భారీ అమ్మకాల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు సైతం హెచ్చుతగ్గులు చవిచూస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ముదురుతున్న ఇంధన సంక్షోభం, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన ఔట్లుక్, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఇటీవల కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతుండటంతో ప్రపంచ ఆర్థిక మందగమనానికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చైనాలో అమలవుతున్న లాక్డౌన్లు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు సైతం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు వివరించారు. దీంతో ఈక్విటీ ఫండ్స్ నుంచి పెట్టుబడులు రక్షణాత్మక అవకాశాలవైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో ప్రధానంగా విద్యుత్, యుటిలిటీస్, టెలికం, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 2–1.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే మెటల్ నామమాత్రంగా నిలదొక్కుకుంది. ఇక మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ అమ్మకాలు పెరగడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.9–0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,202 క్షీణించగా.. 1,161 బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,065 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,918 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు..నష్టాల్లో దేశీయ మార్కెట్లు!
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ అధికారుల కఠినతర ద్రవ్య విధాన వైఖరి, రష్యాపై ఆంక్షలు,ఆర్బీఐ పాలసీ కమిటీ సమావేశాలు,భారత్ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.1.4 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు ముడిచమురు ధరల అనిశ్చితులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు వెంటాడటం దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. ఈ ప్రతికూల పరిణామాలతో గురువారం ఉదయం 9.26 నిమిషాలకు సెన్సెక్స్ 363పాయింట్లు నష్టపోయి 59250 వద్ద సెన్సెక్స్ 94పాయింట్లు నష్టపోయి 17706 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. కిప్లా, సన్‌ఫార్మా, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, టాటా కాన్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ, యూపీఎల్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్, టీసీఎస్, నెస్లే, రిలయన్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
మార్కెట్లో ‘అణు’ టెర్రర్!
ముంబై: మిడ్‌సెషన్‌లో ఆరంభ నష్టాలను పూడ్చుకున్నప్పటికీ.., చివరి గంట అమ్మకాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ నష్టాలతో ముగిశాయి. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలకు శుక్రవారమూ పతనం తప్పలేదు. సెన్సెక్స్ 769 పాయింట్లు క్షీణించి 54,334 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 253 పాయింట్లను కోల్పోయి 16,245 వద్ద నిలిచింది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో 23 షేర్లు నష్టపోయాయి. మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో అధిక అమ్మకాలు జరిగాయి. గత రెండు సెషన్లో స్వల్ప నష్టాలను చవిచూసిన మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు ఇంట్రాడేలో భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు రెండున్నర శాతానికి పైగా క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,631 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,739 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లలోనూ బలహీనతలు కొనసాగుతున్నాయి. ఆసియాలో ఒక్క ఇండోనేసియా మినహా అన్ని దేశాలకు స్టాక్ సూచీలు రెండు శాతం క్షీణించాయి. యూరప్ మార్కెట్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్ 1,525 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. సూచీలకిది వరుసగా నాలుగోవారమూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ‘‘రష్యా బలగాలు యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ జాపోరిజియాపై దాడి తర్వాత అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు అనూహ్య పతనాన్ని చవిచూశాయి. మండిపోతున్న క్రూడాయిల్ ధరలు, సప్లై అవాంతరాలతో ద్రవ్యోల్బణ స్థాయి ఆర్బీఐ అంచనాలను మించిపోవచ్చనే ఆందోళనలు తెరపైకి వచ్చాయి. యుద్ధంతో సరఫరాకు విఘాతం కలిగించవచ్చనే భయాలు నెలకొన్నాయి’’ జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 54 వేల దిగువకు... స్టాక్‌మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 452 పాయింట్లు నష్టంతో 54,654 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 16,723 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలిసెషన్లో అమ్మకాలతో సెన్సెక్స్ 1,215 పాయింట్లు పతనమై 53,888 వద్ద, నిఫ్టీ 364 పాయింట్లు నష్టపోయి 16,134 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. గతేడాది ఆగస్ట్ 3వ తేదీ తర్వాత సెన్సెక్స్ 54 వేల స్థాయిని కోల్పోవడం ఇదేతొలిసారి. మిడ్‌సెషన్‌లో సూచీలకు కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాలన్నీ పూడ్చుకోగలిగాయి. అయితే మార్కెట్ మరోగంటలో ముగిస్తుందన్న సమయంలో అమ్మకాలు జోరందుకుని సూచీలు వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. 3 రోజుల్లో రూ.5.59 లక్షల కోట్లు మాయం గత మూడు రోజుల్లో సెన్సెక్స్ సూచీ 1,913 పాయింట్లు క్షీణించడంతో ఇన్వెస్టర్లు రూ.5.59 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల నమోదిత మొత్తం విలువ రూ.247 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవచ్చనే భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీమార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రైట్స్ ఇష్యూ ప్రకటన తర్వాత రోజు వొకార్డ్ షేరు బీఎస్ఈలో ఒకటిన్నర శాతం పుంజుకుని రూ. 346 వద్ద ముగిసింది. ► వొడాఫోన్ ఐడియా షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో షేరు దాదాపు 7% క్షీణించి రూ. 10.33 వద్ద స్థిరపడింది. -
వెల్లువెత్తిన అమ్మకాల షేర్లు, భారీగా నష్టపోయిన ఐటీ, ప్రభుత్వ రంగ షేర్లు!
ముంబై: అమెరికా ద్రవ్యోల్బణ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ అంచనాల కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో ఈక్విటీ మార్కెట్లు వారాంతాన కుప్పకూలాయి. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు నష్టపోయి 7 వారాల కనిష్ట స్థాయి 75.36కు పతనమైంది. ఆయా పరిస్థితుల్లో శుక్రవారం సెన్సెక్స్ 773 పాయింట్లు క్షీణించి 58,153 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 231 పాయింట్లు నష్టపోయి 17,375 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడురోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో కేవలం షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, ప్రభుత్వరంగ షేర్లు అధిక నష్టాన్ని చవిచూశాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లను విక్రయాల ఒత్తిడికి లోనుకావడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు రెండుశాతం క్షీణించాయి. ఈ జనవరి 12 తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.108 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.697 కోట్ల షేర్లను అమ్మేశారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి. ఆసియాలో హాంగ్‌కాంగ్, కొరియా, చైనా దేశాల స్టాక్ సూచీలు ఒకశాతం నుంచి అరశాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడికిలోనై అరశాతం మేర క్షీణించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ప్రథమార్ధంలో సెన్సెక్స్ 1012 పాయింట్లు పతనమై 57,914 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,303 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్‌లో కనిష్టస్థాయిల వద్ద పలు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో అమ్మకాల ఉధృతి తగ్గింది. -
పెట్టుబడుల్లో ‘రిటైల్’ దూకుడు
ముంబై: ఈ క్యాలండర్ ఏడాది(2021) ప్రైమరీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల హవా నడిచింది. పబ్లిక్ ఇష్యూలకు సగటున 14.36 లక్షల దరఖాస్తులు లభించగా.. గతేడాది(2020)లో ఇవి 12.77 లక్షలుగా నమోదయ్యాయి. ఇక అంతక్రితం అంటే 2019లో సగటున రిటైలర్ల నుంచి 4.05 లక్షల దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. ఐపీవోలలో గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్స్ 33.95 లక్షల అప్లికేషన్లతో అగ్రస్థానం వహించగా.. దేవయాని ఇంటర్నేషనల్‌కు 32.67 లక్షలు, లేటెంట్ వ్యూ ఎనలిటిక్స్‌కు 31.87 లక్షల బిడ్స్ వచ్చాయి. పబ్లిక్ ఇష్యూకి వచ్చిన కంపెనీలలో సిగాచీ ఇండస్ట్రీస్ ఏకంగా 270 శాతం లాభంతో లిస్ట్‌కాగా.. పరస్ డిఫెన్స్ 185 శాతం, లేటెంట్ వ్యూ 148 శాతం ప్రీమియంతో తొలి రోజు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎస్ఎంఈ) ఇష్యూలు సైతం రెట్టింపై 55ను తాకాయి. వీటి విలువ రూ. 727 కోట్లుకాగా.. 2020లో 27 ఎస్ఎంఈలు ఐపీవోల ద్వారా కేవలం రూ. 159 కోట్లు సమీకరించాయి. ప్రైమ్‌డేటా బేస్ నివేదిక పొందుపరచిన వివరాలివి. ఇతర వివరాలు ఇలా.. పేటీఎమ్ జోరు ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లో పేటీఎమ్ బ్రాండ్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ పెట్టుబడుల సమీకరణలో ఆధిపత్యం వహించింది. ఐపీవో ద్వారా రూ. 18,300 కోట్లు అందుకుంది. ఈ బాటలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో రూ. 9,300 కోట్లు సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో సగటు ఇష్యూ పరిమాణం రూ. 1,884 కోట్లకు చేరింది. 59 ఇష్యూలను విశ్లేషిస్తే 36 కంపెనీలకు 10 రెట్లుకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. వీటిలో ఆరు ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి 100 రెట్లు స్పందన లభించడం విశేషం! ఇక 8 ఇష్యూలు 3 రెట్లు, మరో 15 కంపెనీల ఆఫర్లకు 1–3 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. ఈక్విటీ నిధుల హవా ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలలో కొత్తతరం టెక్నాలజీ కంపెనీలు ఆధిపత్యం వహించినట్లు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు. నష్టాలలో ఉన్నప్పటికీ పలు స్టార్టప్‌లు విజయవంతంగా నిధులను సమీకరించినట్లు తెలియజేశారు. ఇందుకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా మద్దతు లభించినట్లు వివరించారు. దీంతో పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో భారీ లాభాలతో లిస్టయినట్లు ప్రస్తావించారు. మొత్తంమీద కంపెనీలు ఈక్విటీ(ఐపీవోలు, ఆఫర్ ఫర్ సేల్) మార్గంలో 2020లో సమకూర్చుకున్న రూ. 1,76,914 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ. 2 లక్షల కోట్లకు మించిన పెట్టుబడులను అందుకున్నాయని వెల్లడించారు. నిధుల సమీకరణ రికార్డ్ ఈ ఏడాది దేశీయంగా కంపెనీలు సమీకరించిన నిధులు రూ. 2 లక్షల కోట్లను దాటేశాయ్. వీటిలో 51 శాతం అంటే రూ. 1,03,621 కోట్లు తాజా పెట్టుబడులుకాగా..మరో రూ. 98,388 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమకూర్చుకున్నాయి. వెరసి ఈ ఏడాది కార్పొరేట్లు రూ. 2,02,009 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు నివేదిక తెలియజేసింది. ప్రధానంగా ప్రైమరీ మార్కెట్ ద్వారా ఇప్పటివరకూ 63 కంపెనీలు రూ. 1,18,704 కోట్లు అందుకున్నాయి. గతేడాది అంటే 2020లో 15 ఐపీవోల ద్వారా కంపెనీలు కేవలం రూ. 26,613 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే ఈ ఏడాది ప్రధాన పబ్లిక్ ఇష్యూల ద్వారా 4.5 రెట్లు అధికంగా పెట్టుబడులు ప్రవహించాయని ప్రైమ్‌డేటా బేస్ తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం 2017లో ప్రైమరీ మార్కెట్లో నమోదైన రూ. 68,827 కోట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోగా.. లక్ష కోట్లను దాటడం ద్వారా ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు తెరతీసింది. కాగా.. గత వారం ఇష్యూలను సైతం చేరిస్తే 65 కంపెనీలు రూ. 1.35 లక్షల కోట్ల(15.3 బిలియన్ డాలర్లు)ను సమీకరించినట్లవుతుందని బ్రోకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా క్యాపిటల్ ముందురోజు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
మార్కెట్ల నష్టాల్లోనూ'ఐపీఓ'ల జోరు
ముంబై: మార్కెట్ల నష్టాల్లోనూ ఐపీఓల జోరు కొనసాగుతుంది. తాజాగా మూడు కంపెనీలు ఐపీఓ కోసం సెబీకి ప్రాస్పెక్ట్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వాటిలో క్లినికల్ రీసెర్చ్ సంస్థ 'వీడా' పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 832 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు వీడా క్లినికల్ రీసెర్చ్ పేర్కొంది. ఇష్యూలో భాగంగా దాదాపు రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, అనుబంధ సంస్థ బయోనీడ్స్ ఇండియాకు నిధులు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు వీడా క్లినికల్ రీసెర్చ్ తెలియజేసింది. 'వీడా' తో పాటు సౌర ఇంధన కంపెనీ వారీ ఎనర్జీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా దాదాపు రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు మరో 40 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంత భాగాన్ని 2 గిగావాట్ల వార్షిక సామర్థ్యంగల సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా 1 గిగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్‌కూ వెచ్చించనుంది. గుజరాత్‌లోని చిఖ్లీలో వీటిని ఏర్పాటు చేయనుంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం సైతం.. మొబైల్ ఫోన్ల తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.37 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను బ్రాండ్ నిర్మాణం, మార్కెటింగ్‌లతోపాటు.. ఇతర కంపెనీల కొనుగోళ్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్‌లో లావా ఇంటర్నేషనల్ పేర్కొంది. చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్ -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. సెన్సెక్స్ సూచీలు 58,900మార్క్‌ను టచ్ చేయగా..నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిలో17550 మార్క్ టచ్ చేసి ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది. దీంతో గురువారం స్టాక్క్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.50 గంటల సమయంలో నిఫ్టీ 44 పాయింట్లు లాభంతో 17560 వద్ద, సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగి 58,866 వద్ద ట్రేడవుతున్నాయి. టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడంతో వొడాఫోన్ ఐడియా షేర్ల లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ టవర్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, అపోలో ట్రైకోటా ట్యూబ్స్, జేటీఈకేటీ ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా.. హట్సన్ అగ్రో ప్రొడక్ట్స్,హింద్ కాపర్, జెన్సార్ టెక్నాలజీస్, రెస్పాన్సీవ్ ఇండస్ట్రీస్, పాలీ మెడీక్యూర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.సోమవారం ఉదయం 9.38గంటల సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు నష్టపోయి 58,115 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ 56.70 పాయింట్లతో స్వల్పంగా నష్టపోయి 17,312 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, టీసీఎస్,హెచ్డీఎఫ్సీ, మారుతీ, టీసీఎస్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. రిలయన్స్,ఇండస్ఇండ్ బ్యాంక్,బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. -
అదే జోరు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ లాభాల్ని మూటగట్టుకుంటున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు, క్యూ1లో జీడీపీ ఫలితాల ప్రభావంతో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9.30గంటల సమయానికి నిఫ్టీ 47.65 పాయింట్లు లాభపడి 17,179 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఇక సెన్సెక్స్ 159.67 పాయింట్లు లాభపడి 57,712.06 వద్ద అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్యాస్, అదానీ పవర్, యాక్సెస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాస్ ఫైనాన్స్, జేకే సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్, మారుతి సుజికి, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ప్రపంచ ప్రతికూలతలు పడేశాయ్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్ రెండో రోజూ వెనకడుగు వేసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలను ఉపసంహరించుకునే(ట్యాపరింగ్) అంశంపై ఫెడ్ అధికారులు చర్చించినట్లు మినిట్స్‌లో వెల్లడైంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతారన్న భయాలు తెరపైకి వచ్చాయి. చదవండి : 5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు వ్యాక్సినేషన్ తక్కువగా నమోదైన ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ తమ దేశానికే చెందిన దిగ్గజ ఐటీ సంస్థలపై చైనా రెగ్యులేటరీ కఠిన ఆంక్షలను విధించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు పతనబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ క్షీణించాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 55,329 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లను కోల్పోయి 16,500 దిగువను 16,450 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలో భాగంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు ఆగలేదు. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 15 పైసలు పతనమై 74.39 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,287 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.119 కోట్ల షేర్లను కొన్నారు. మెటల్ షేర్లలో మంటలు... ఈ ఏడాదిలో చైనా స్టీల్ ఉత్పత్తి భారీగా తగ్గిపోవచ్చని ప్రముఖ మైనింగ్ కంపెనీ బీహెచ్పీ గ్రూప్ తన కమోడిటీ అవుట్‌లుక్‌లో తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐరన్ ఓర్ ఫ్యూచర్లు నెలరోజుల కనిష్టానికి కుప్పకూలిపోయాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్ షేర్లపైనా పడటంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆరున్నర పతనాన్ని చవిచూసింది. ఎన్ఎండీసీ, వేదాంత, టాటా స్టీల్, సెయిల్, జిందాల్ స్టీల్ షేర్లు పదిశాతం నుంచి ఎనిమిదిశాతం క్షీణించాయి. కార్‌ట్రేడ్ టెక్ ... లిస్టింగ్‌లో డీలా ఆటో క్లాసిఫైడ్ సంస్థ కార్‌ట్రేడ్ టెక్ షేర్లు లిస్టింగ్ తొలిరోజే డీలాపడ్డాయి. ఇష్యూ ధర రూ.1,618తో పోలిస్తే బీఎస్ఈలో ఒకశాతం డిస్కౌంట్‌తో రూ.1,600 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో 9% క్షీణించి రూ.1475 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 7% నష్టంతో రూ.1501 వద్ద ముగిశాయి. -
లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో మంగళవారం ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 53,264.33 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా..నిఫ్టీ 66 పాయింట్లతో 15,963.85 వద్ద లాభాలతో ట్రేడింగ్ కొనసాగుతుంది. కాగా, టాప్ టెన్ స్టాక్స్ లో ఏషియన్ పెయింట్స్, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్, అదానీ పోర్ట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కో లిమిటెడ్, టెక్ మహీంద్రా, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో లిమిటెడ్, బజాస్ ఫిన్ సర్వ్, టాటా కన్సెల్టెన్సీ సర్వీస్‌లు లాభాల్ని మూటగట్టుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌సీఎల్,శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రసీమ్ ఇండస్ట్రీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
బీఎస్ఈతో తెలంగాణ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్లోబల్ లింకర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా స్టాక్ ఎక్సే్ఛంజ్ బీఎస్ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆర్థిక వనరుల లభ్యత, కంపెనీల విశ్వసనీయతను పెంచే కీలక సవాల్‌ను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. అలాగే లిస్టింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి కంపెనీలకు అవగాహన కల్పించేందుకు బీఎస్ఈ సాయం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల లభ్యత ఎంఎస్ఎంఈలకు పరిమితంగా ఉంటోంది. ఇది కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విస్తరణ మొదలుకుని కొనుగోళ్ల స్థాయికి వ్యాపారం ఎదిగేందుకు ఎంఎస్ఎంఈలకు నిధుల సమీకరణకు తోడ్పాటు లభిస్తుందన్నారు. ప్రస్తు తం స్టాక్ ఎక్సే్ఛంజీల్లో రాష్ట్రానికి చెందిన కొన్ని ఎంఎస్ఎంఈలు మాత్రమే నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ఈ సంఖ్య త్వరలో పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
హెచ్డీఎఫ్సీ లైఫ్, స్టీల్ స్ట్రిప్స్ వీల్స్‌పై ఫోకస్
క్యూ4 ఫలితాలు: డీఎల్ఎఫ్, ఎన్ఐఐటీ, పీఐ ఇండస్ట్రీస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్పోర్ట్, ఎస్ఆర్ఎఫ్, సఫారి ఇండస్ట్రీస్, పీఎన్బీ గ్లిట్, ఇగార్షి మోటార్స్, టీడీ పవర్ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం ఫలితాలను గురువారం వెల్లడించనున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్: అహ్మాదాబాద్, లక్నో, మంగళూరులోని మూడు ప్రైవేటు విమానాశ్రయాలను స్వాదీనం చేసుకోలేమని అదానీ గ్రూపు ఎయిర్పోర్ట్ డెవలపర్ వెల్లడించింది. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన అంతరాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదాని ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. హెచ్డీఎఫ్సీ లైఫ్: 4 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ.1,900 కోట్ల నిధులను హెచ్డీఎఫ్సీ లైఫ్ సమీకరించనుంది. ఇందుకోసం గురవారం బహిరంగ మార్కెట్లో బ్లాక్డీల్ను జరపనుంది. కాగా రూ.1,274 కోట్లకు సమానమైన 2.6 కోట్ల షేర్లను హెచ్డీఎఫ్సీ లైఫ్ బుధవారం విక్రయించింది. టాటా మొటార్స్:టాటా గ్రూపు ఎదుర్కోంటున్న సమస్యలపై చర్చించేందుకు టాటా సన్స్ బోర్డు శుక్రవారం సమావేశం కానుంది. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్: యూరప్, అమెరికా మార్కెట్లలో 8,000కుపైగా వీల్స్‌ను సరఫరా చేసేందుకు 3.35 లక్షల యూరోల ఆర్డరు పొందినట్లు ఈ కంపెనీ వెల్లడించింది.చెన్నై ట్రక్ వీల్ ప్లాంట్ నుంచి ఈ వీల్స్‌ను సరఫరా చేయనున్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. జేఎస్పీఎల్: మే నెలలో కన్సాలిడేటెడ్ క్రూడ్ స్టీల్ ఉత్పత్తి 9 శాతం తగ్గి 6.20 లక్షల టన్నులుగా నమోదైందని జేఎస్పీఎల్ తెలిపింది. గతేడాది ఇదే నెలలో ఉత్పత్తి 6.81లక్షల టన్నులుగా ఉంది. టాటా స్టీల్: డెట్ ఇష్యూ ద్వారా రూ.400 కోట్ల నిధులను సమీకరించే ప్రతిపాదనకు టాటా స్టీల్ కమిటి ఆప్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారని ఈ కంపెనీ వెల్లడించింది. ప్రైటు ప్లేస్మెంట్ ప్రాతిపదికన మఖ విలువ రూ.10 లక్షల కోట్లు కలిగిన 4,000 ఎన్సీడీలను ఇష్యూ చేసేందుకు కంపెనీ డైరెక్టర్లు ఆమోదించారు. ఎన్సీఎల్: కమర్షియల్ పేపర్స్ జారీ ద్వారా రూ.1,200 కోట్ల నిధులను సమీకరించినట్లు ఎన్సీఎల్ వెల్లడించింది. ముఖ విలువ రూ.5,00,000 కలిగిన 24 వేల కమర్షియల్ పేపర్ల్ను విక్రయించింది. రెలీగేర్ ఎంటర్ప్రైజెస్: రూ.300 కోట్ల నిధులను సమీకరించినట్లు రెలీగేర్ వెల్లడించింది. దీంతో తమకున్న రుణాలను చెల్లించేస్తామని కంపెనీ వెల్లడించింది. కోల్ ఇండియా: మే నెలలో ఉత్పత్తి 11.2 శాతం తగ్గి 41.43 మిలియన్ టన్నులుగా నమోదైనట్లు కోల్ ఇండియా వెల్లడించింది. కాగా గతేడాది ఇదే నెలలో ఉత్పత్తి 46.69 మిలియన్ టన్నులుగా ఉంది. భారతీ ఇన్ఫ్రాటెల్: తమ కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పూజ జైన్‌ను నియమిస్తున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ వెల్లడించింది. జూన్ 4 నుంచి ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ తెలిపింది. గెయిల్: ఇండియాలో ట్రై జనరేషన్ ప్రాజెక్టులను చేపట్టేందుకు గెయిల్, ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్(ఈఈఎస్ఎల్)లు ఎంఓయూపై సంతకాలు చేసినట్లు ఈ కంపెనీ వెల్లడించింది. -
ఈ ఏడాది విక్రయాలు బావుంటాయ్: గోద్రేజ్ ప్రాపర్టీస్
గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా ప్రాపర్టీ విక్రయాలు బావుంటాయని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎక్సిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రేజ్ అన్నారు.కోవిడ్-19 కారణంగా నిర్మాణ రంగ కార్యక్రమాలు నెమ్మదించినప్పటికీ, ప్రాపర్టీ కంపెనీలు ప్రాజెక్టులను పూర్తిచేసే ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.గత ఆర్థిక సంవత్సరం గోద్రేజ్ ప్రాపర్టీస్‌లో రూ.5,915 కోట్ల రికార్డు స్థాయి బుకింగ్స్ జరిగాయని ఈ ఆర్థిక సంవత్సరంలో అదే స్థాయి విక్రయాలు జరుగుతాయని పిరోజ్షా ధీమా వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు నెలల కాలంలో గోద్రేజ్ ప్రాపర్టీస్ బుకింగ్స్ పెరిగాయని,మార్చి నెల చివరి 10-15 రోజుల్లో కూడా అమ్మకాలు జరిపామని తెలిపారు. లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి నిర్మాణ రంగ పనులతోపాటు, భౌతిక విక్రయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లోకూడా అమ్మకాలు మంచిగా జరిగి ఈ ఆర్థిక సంవత్సరం కూడా బావుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కొనుగోలు దారులపై సంస్థ ఆసక్తి కనబరుస్తుందన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా 10-15 శాతం ఎన్ఆర్ఐలు విక్రయాల బుకింగ్స్ జరిగాయని,లాక్డౌన్ కాలంలో ఇది ఎంతో సాయపడిందని తెలిపారు. నగదు ప్రవాహ పరిస్థితి, నిర్మాణ రంగ పనుల వేగం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంటుందని, నగదు ప్రవాహంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్‌కు ఎటువంటి నగదు ఇబ్బంది లేదని రూ.2000 కోట్ల బ్యాలెన్స్ షీట్, ఆరోగ్యకరమైన డెట్ ఈక్విటీ రేషియో ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హౌసింగ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్నిఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, వేతనాల్లో కోతలవల్ల కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతింటుదని చెప్పారు. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో గోద్రేజ్ ప్రాపర్టీస్ షేరు దాదాపు 4 శాతం లాభపడి రూ.715.55 వద్ద ముగిసింది. -
బీఎస్ఈ లాభం తగ్గింది
న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్(బీఎస్ఈ) గత ఆర్థిక సంవత్సరం (2018–19) మార్చి క్వార్టర్లో రూ.52 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.62 కోట్లతో పోలిస్తే 16 శాతం క్షీణించిందని బీఎస్ఈ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.195 కోట్ల నుంచి రూ.182 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్టాండ్ అలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.61 కోట్ల నుంచి రూ.44 కోట్లకు తగ్గింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో స్టాండ్అలోన్ నికర లాభం రూ.201 కోట్లు, కన్సాలిడేటెట్ నికర లాభం రూ.199 కోట్లుగా ఉన్నాయని బీఎస్ఈ తెలియజేసింది. రూ.460 కోట్ల షేర్ల బైబ్యాక్ ఒక్కో షేర్‌ను రూ.680 ధరకు (మంగళవారం ముగింపు ధర, రూ.637తో పోల్చితే 7% అధికం) టెండర్ ఆఫర్ మార్గంలో బైబ్యాక్ చేయనున్నామని బీఎస్ఈ తెలిపింది. మొత్తం రూ.460 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నామని పేర్కొంది. -
దేశీయ కంపెనీల్లో మళ్లీ కదలిక
న్యూఢిల్లీ: దేశీయ కార్పొరేట్ రంగం ప్రతికూలతల నుంచి బయటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ మూలధన వ్యయ ప్రణాళికలను అమల్లోకి తేవటం మొదలెట్టాయి. అస్థిర మార్కెట్లు, చమురు ధరలు పెరగడం తదితర అంశాల కారణంగా ఏడాది పాటు స్తబ్ధత నెలకొనగా... ఇపుడిపుడే మళ్లీ పెట్టుబడుల పునరుద్ధరణ దిశగా అడుగులేస్తున్నాయి. టాటా స్టీల్, అంబుజా సిమెంట్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, సియట్, అపోలో టైర్స్, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ తదితర కంపెనీలు వెల్లడించిన పెట్టుబడుల ప్రణాళికల మొత్తం రూ.50,000 కోట్లపైనే ఉంది. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ గత ఆర్థిక సంవత్సరంలో స్టోర్ల విస్తరణ జోలికే వెళ్లలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం 75 స్టోర్లను ప్రారంభించే ప్రణాళికతో ఉంది. ఇందుకోసం రూ.150 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. గత మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయ వృద్ధి ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరడం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ప్రోత్సాహాన్నిచ్చింది. మార్చి క్వార్టర్లో కంపెనీ వృద్ధి 26.6%గా ఉంది. అధిక సామర్థ్య వినియోగం, డిమాండ్ ఆశాజనకంగా ఉండడం వంటి అంశాలు కంపెనీలను విస్తరణ దిశగా పురికొల్పాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారీ తగ్గుదల బీఎస్ఈ 200 కంపెనీల (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కంపెనీలు మినహా) మూలధన పెట్టుబడుల్లో వృద్ధి రేటు 2010–11 నుంచి 2016–17 మధ్య 7 శాతం లోపునకు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులను మినహాయించి చూస్తే వృద్ధి రేటు 2 శాతమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున చేసిన పెట్టుబడులతో వృద్ధి రేటు ఈ మాత్రమైనా కనిపిస్తోంది. నిజానికి 2003 ఆర్థిక సంవత్సరం నుంచి 2011 ఆర్థిక సంవత్సరం మధ్య మూలధన పెట్టుబడుల వృద్ధి చాలా వేగంగా 35 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. 2017–18 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ కంపెనీల స్థూల క్యాపిటల్ ఫార్మేషన్ (ఆస్తులపై చేసే పెట్టుబడులు) దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 27 శాతానికి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. మెరుగైన ఆర్థిక వృద్ధికి క్యాపిటల్ ఫార్మేషన్ రేటు 40 శాతానికి పైగా ఉండాలి. అయితే, పరిశ్రమ పరిశీలకులు మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చిందని, మరింత మూలధ పెట్టుబడుల వృద్ధి ఉండొచ్చని చెబుతున్నారు. కొన్ని రంగాలు పుంజుకోవడం, ప్రభుత్వ మద్దతు కొనసాగడం సానుకూలతలుగా పైన్ఓక్ క్యాపిటల్ పార్ట్నర్ అమిత్ తివారి తెలిపారు. -
చార్జీల పెంపునకు అనుమతించండి
న్యూఢిల్లీ: డిస్కమ్ బీఎస్ఈఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల వసూలుతోపాటు ఢిల్లీలో మరోసారి కరెంటు చార్జీల పెంపునకు అనుమతించడానికి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని సోమవారం అభ్యర్థించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై జూలై మూడున తదుపరి విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే కోరుతూ బీఎస్ఈఎస్ చేసిన వినతిపైనా అప్పుడే విచారణ నిర్వహిస్తామని తెలిపింది. చార్జీల పెంపు, బకాయిల వసూలు చేసుకోవడానికి బీఎస్‌ఈఎస్‌కు అనుమతి ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న ఆదేశాలు జారీ చేసింది. అయితే తీర్పు అమలుపై మాత్రం స్టే విధించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈఎస్ తాజా విచారణ సందర్భంగా స్పంది స్తూ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాల అమలుకు అనుమతించాలని కోరింది. తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) కరెంటు టారిఫ్‌ను పెంచుకునేందుకు అనుమతించడం లేదని బీఎస్ఈఎస్ ఆక్షేపించింది. నష్టాల కారణంగా ఎన్డీపీసీ వంటి ప్రభుత్వం విద్యు త్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించలేకపోతున్నామని కోర్టుకు తెలిపింది. వ్యయాలకు అనుగుణంగా చార్జీలను పెంచేందుకు అనుమతి -
విద్యుత్ కోతలతో వెతలు
- నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్లోనూ అదే సమస్య - గగ్గోలు పెడుతున్న వినయోగదారులు - పత్యామ్నాయాల్లో డిస్కమ్‌లు న్యూఢిల్లీ: ఉడికిస్తున్న వేడికి తోడు... పలుచోట్ల విద్యుత్ కోతలతో తూర్పు ఢిల్లీ వాసులు శుక్రవారం తిప్పలుపడ్డారు. కొన్ని అవరోధాల కారణంగా విద్యుత్ సరఫరా ఆగిపోయిందని విద్యుత్ పంపిణీ కంపెనీ బీఎస్ఈఎస్ తెలిపింది. ఇదిలా ఉంటే బీైవె పీఎల్ సంతృప్తికరంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న బదర్పూర్-నోయిడా-ఘాజిపూర్ 220 కిలోవాట్ల ట్రాన్స్మిషన్ లైన్లో ఊహించని అడ్డంకుల వల్ల మే ఒకటి నుంచి 75 నుంచి 100 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని సంస్థ తెలిపింది. ఆ సమస్యను సవరిస్తున్నామని, రెండు మూడు వారాల్లో పూర్తిగా పరిష్కారమవుతుందని సంస్థ అధికారి ప్రతినిధి తెలిపారు. మండోలా-సౌత్ వజీరాబాద్-పత్పర్గంజ్ ట్రాన్స్మిషన్ లైన్లో 220 కిలోవాట్ల ఓవర్‌లోడ్ వల్ల సమస్య తలెత్తిందన్నారు. అందువల్ల అత్యవసర సమయాల్లోనే 20 నుంచి 25 మెగావాట్ల కొరత ఏర్పడుతోందని చెప్పారు. కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్లను ప్రారంభించిందని, ఏవైనా సమస్యలుంటే వినియోగదారులు ఆయా నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. విద్యుత్ సంబంధిత సమస్య ఏదైనా ఎదురైత్తే... బీఎస్ఈఎస్ 24్ఠ7కాల్ సెంటర్ 399 99 808(బీవైపీఎల్), 399 99 707 (బీఆర్‌పీఎల్) నంబర్లకు కాల్ చేయొచ్చని తెలిపారు. ఈ సమస్యలను అధిగమించి విద్యుత్ సరఫరా చేయడానికి బీవైపీఎల్ ప్రత్యామ్నాయ వనరుల కోసం చూస్తోందని చెప్పారు. కోండ్లి, డల్లుపురా, ఘాజీపూర్, వివేక్ విహార్, నంద్ నగరి, యమునా విహార్, మయూర్ విహార్ ప్రాంతాల్లో పాక్షికంగా విద్యుత్ సమస్య ఉండొచ్చని అన్నారు. ప్రస్తుతం తూర్పు, మధ్య ఢిల్లీలో 1,150 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, దక్షిణ, పశ్చిమ ఢిల్లీలకు 1800 మెగావాట్లు అవసరమవుతున్నది. భవిష్యత్‌లో ఈఅవసరం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. నోయిడా: ఢిల్లీలోనే కాదు... నోయిడా, ఘజియాబాద్‌లలో ప్రతిరోజూ ఆరు నుంచి 18 గంటల విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో తప్పనసరి పరిస్థితుల్లో డీజిల్‌తో నడిచే పవర్ సిస్టమ్స్‌పై ఆధారపడుతున్న నెలసరి వేతన కుటుంబాలకు కష్టాల కడలిని ఈదుతున్నాయి. ఇందిరాపురం, వైశాలి, కౌశాంబి ప్రాంతాల్లోని హౌజింగ్ సొసైటీల్లో విద్యుత్ కోతల సమయంలో పవర్ బ్యాకప్ సరఫరాకు యూనిట్‌కు 17 నుంచి 19 రూపాయలు చెల్లిస్తున్నారు. దీనివల్ల 150 నుంచి 200 ఫ్లాట్లున్న చిన్న సొసైటీలు రోజుకు రూ. 13 వేల నుంచి 17 వేల వరకూ విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాయి. ఇక పెద్ద సొసైటీల్లో రూ. 70 వేల నుంచి లక్ష వరకు చెల్లిస్తున్నట్టు ఘజియాబాద్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. అపార్ట్మెంట్లలో వాళ్లే కాకుండా స్వతంత్ర ఇళ్ల యజమానులుకూడా విద్యుత్ కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆరెంజ్ కౌంటీ హౌసింగ్ సొసైటీలో వ్యాపారి మనోజ్ గుప్తానే ఇందుకు ఉదాహరణ. నలుగురు సభ్యులున్న కుటుంబానికి వేసవిలో సగటున వెయ్యి యూనిట్లకు గాను 11 వేల రూపాయలు బిల్లు చెల్లించాల్సి వ స్తోంది. సాధారణ సమయాలతో పోల్చుకుంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. డీజిల్‌తో నడిచే జనరేటర్ల విద్యుత్ మినహాయిస్తే... 500 యూనిట్లకు గాను ప్రతి నెలా రూ. 2,350 బిల్లు వచ్చేది. అయితే కోతల వల్ల విద్యుత్ బిల్లులకోసం మిగిలిన ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోందని గుప్తా తెలిపారు. ఎక్కువ గంటలు కోతలు ఉండటంతో ఇన్వర్టర్ల పవర్ సరిపోక... నోయిడాలోని రెసిడెన్షియల్ సెక్టార్లలో నివసించేవారు జెనరేటర్ల మీద ఆధారపడుతున్నారు. విద్యుత్ బిల్లు 3వేలకు అదనంగా... ప్రత్యామ్నాయ విద్యుత్‌కోసం 2,500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని సుశీల్ జైన్ చెబుతున్నారు. గుర్గావ్: గుర్గావ్ పవర్ డిస్కమ్ డీహెచ్‌బీవీఎన్ కష్టకాలాన్ని ఎదుర్కొంటుండటంతో విద్యుత్ కొరతతో ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. విద్యుత్ కోతలు లేని జోన్‌గా గుర్గావ్కు మంచిపేరున్నా... మౌలిక వసతులను పెంచుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించింది డీహెచ్‌బీవీఎన్. ఓవర్లోడింగ్, స్థానిక పొరపాట్లు, నిర్వహణా లోపాలు, విద్యుత్ చౌర్యంవల్ల కోట్ల రూపాయల నష్టాలతో డిస్కమ్ కష్టాల్లో పడింది. దీంతో కొత్త, పాత గుర్గావ్లోని ప్రజలు ఈ వేసవిలో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఓవర్ లోడింగ్, తరచుగా స్థానికంగా జరుగుతున్న తప్పులవల్ల విద్యుత్ కోతలు తప్పడం లేదని డిస్కమ్ అధికార వర్గాలు చెబుతున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి ప్రతినిధులు వెళ్లి డీహెచ్‌బీవీఎన్ చీఫ్ ఇంజనీర్‌ను కలిస్తే... స్థానికంగా జరుగుతున్న పొరపాట్లు, నిర్వహణ లోపాలే అందుకు కారణమని చెబుతున్నాడని గుర్గావ్ సిటిజన్ కౌన్సిల్ సభ్యుడు ఆర్ ఎస్ రథీ తెలిపారు. ఒక లైన్ మరమ్మతులో ఉండటం వల్ల సమస్య తలెత్తిందని, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఇంజనీర్ చెప్పాడన్నారు. అయితే డీహెచ్‌బీవీఎన్ సరఫరాలో కోతలే లేవంటున్నారు డిస్కమ్ మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్‌కుమార్. గుర్గావ్ ప్రజల అవసరాలకు తగినంత విద్యుత్‌ను తాము సరఫరా చేస్తున్నామని, అయితే ప్రజలకు చేరేముందు ట్రాన్స్మిషన్ స్థాయిలో ఏవైనా సమస్యల వల్ల కొరత ఉండొచ్చన్నారు. సెక్టార్ 43, 51ల్లోని సబ్ స్టేషన్లలో ఎప్పుడూ ఓవర్‌లోడ్ అవుతుందని, దీనివల్ల సమస్య వస్తోందని, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అనుమతించామని, ఈ నెల ఆఖరుకల్లా అది పూర్తవుతుందని అరుణ్‌కుమార్ చెప్పారు. విద్యుత్ చౌర్యం కూడా ఇందుకు ఒక కారణమన్నారాయన. స్థానికంగా జరుగుతున్న పొరపాట్లను ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తూ, అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ లోడ్ పడకుండా చూస్తున్నామని, అవసరమున్న చోట్ల కొత్త కేబుళ్లు అమరుస్తున్నామని తెలిపారు. డిస్కమ్ ఇప్పటికే 400 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిందని డీహెచ్‌బీవీఎన్ జనరల్ మేనేజర్ సంజీవ్ చోప్రా చెప్పారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో కోత తప్పనిసరి అని తెలిపారు. 10 కిలోవాట్ల నుంచి 50 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఉన్న చోట మామూలు మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నట్టు తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్లను తాము వైర్లెస్ సాయంతో నియంత్రించే అవకాశం ఉందని, దీనివల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయని చోప్రా చెప్పారు. -
కోత ముప్పు..?
నగరవాసులకు వచ్చే నెల ఒకటో తేదీనుంచి విద్యుత్ కోత సమస్యతలెత్తే ప్రమాదం పొంచివుంది. ఇందుకు కారణం ఈ నెలాఖరులోగా ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించాలని బీఎస్ఈఎస్ కంపెనీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆలోగా చెల్లించనట్లయితే ఎన్టీపీసీ... బీఎస్ఈఎస్లకు జారీ చేసిన నోటీసుపై విధించిన స్టేను ఎత్తివేస్తామని హెచ్చరించింది. సాక్షి, న్యూఢిల్లీ:ఈ నెల 31వ తేదీలోగా ఎన్టీపీసీకి బకాయిలను చెల్లించాలని బీఎస్ఈఎస్ కంపెనీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటిదాకా విద్యుత్ సరఫరా యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. జస్టిస్ సురీందర్‌సింగ్ నిజ్జార్, జస్టిస్ ఎ.కె.సిక్రి ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ ఆ లోగా చెల్లించనట్లయితే ఎన్టీపీసీ... బీఎస్‌ఈఎస్‌కు జారీ చేసిన నోటీసుపై విధించిన స్టేను ఎత్తివేస్తామని హెచ్చరించింది. ఒకవేళ ఇదే కనుక జరిగితే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నగరవాసులకు కరెంటు కష్టాలు తప్పవు. కాగా విద్యుత్ కొనుగోలు తాలూకు బకాయిలు చెల్లించాలంటూ కోర్టు ఆదేశించినప్పటికీ బీఎస్ఈఎస్ రాజధాని, బీఎస్ఈఎస్ యమునా పవర్ కంపెనీలు పట్టించుకోవడం లేదని, అందువల్ల ఢిల్లీకి విద్యుత్ సరఫరాలో కోత విధింపునకు అనుమతించాలని ఎన్టీపీసీ గత గురువారం సుప్రీంకోర్టును కోరింది. రిలయన్స్ అనుబంధ బీఎస్ఈఎస్ సంస్థ తనకు రూ. 800 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉందని ఎన్టీపీసీ తన పిటిషన్లో పేర్కొంది. బకాయిలు చెల్లించనట్లయితే బీఎస్‌ఈఎస్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తానని ఎన్టీపీసీ గతంలో నోటీ సు జారీ చేసింది. అయితే సుప్రీం కోర్టు సదరు నోటీసుపై స్టే విధిస్తూ, బకాయిలు చెల్లించాల్సిందిగా ఒకవైపు బీఎస్‌ఈఎస్‌ను, ఢిల్లీకి విద్యుత్ సరఫరాను కొనసాగించాలని మరోవైపు ఎన్టీపీసీని ఆదేశించింది. ఇందుకు సంబంధించి మార్చి నెల 26వ తేదీన కోర్టు జారీ చేసిన ఆదేశాలను బీఎస్ఈఎస్ ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదని, తనకు బకాయిలు చెల్లించడం లేదని ఎన్టీపీసీ న్యాయస్థానానికి తెలియజేసింది. మరో విద్యుత్ పంపిణీ సంస్థ టాటా పవర్ ఢిల్లీ డి స్ట్రిబ్యూషన్ లిమిటెడ్ పైసా బకాయి లేకుండా తన బిల్లులను చెల్లిస్తున్నప్పటికీ బీఎస్ఈఎస్ క ంపెనీలు మాత్రం బకాయిలు చెల్లించడం లేదని ఎన్టీపీసీ పేర్కొంది. బీఎస్ఈఎస్ కంపెనీలు చెల్లించే డబ్బులో 75 శాతాన్ని తాము కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీపీసీ తెలియజేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి తాము విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటామని, బీఎస్ఈఎస్ కంపెనీలు చెలింపులు జరపనున్నట్లయితే బదర్పుర్లోని తమ థర్మల్ ప్లాంట్ ఢిల్లీకి విద్యుత్తు సరఫరా చేయలేదని ఎన్టీపీసీ స్పష్టం చేసింది. ఢిల్లీకి తాము సరఫరా చేసే విద్యుత్‌లో కోత విధించాలనుకుంటున్నామని పేర్కొంది. అందువల్ల ఢిల్లీకి నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వును ఎత్తివేయాలని ఎన్టీపీసీ తరఫు న్యాయవాది కె.కె. వేణుగోపాల్ సుప్రీంకోర్టును కోరారు. ఢిల్లీ ప్రభుత్వం తమకు బకాయిలు చెల్లించడం లేదని, ఈ కారణంగా తమ ఆదాయం తగ్గిపోయిందంది. బకాయిల చెల్లింపు కోసం తమకు సబ్సిడీ ఇవ్వాలని లేదా విద్యుత్ చార్జీలను పెంచాలని బీఎస్ఈఎస్ అంటోంది. ‘గ్యాస్ కోసం కేంద్రానికి విన్నవిస్తాం’ న్యూఢిల్లీ: బవానా ప్లాంట్‌కు గ్యాస్ సరఫరా కోసం ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శ్రీవాస్తవ వెల్లడించారు. త్వరలో పెట్రోలియం శాఖ మంత్రిని కలిసి తగినంత గ్యాస్‌ను సరఫరా చేయాల్సిందిగా కోరతామన్నారు. 2013వ సంవత్సరం నుంచి రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. కాగా 1,500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం 2012లో నిర్మించింది. అయితే గ్యాస్ తగినంత సరఫరా కాకపోవడంతో ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 350 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. వాయవ్య ఢిల్లీలోని ఈ ప్లాంట్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శ్రీవాస్తవ ఇటీవల సందర్శించారు. ఉత్తర భారత్‌లో అతి పెద్ద గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రమిదే. ఇందులో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. అందులో నాలుగు గ్యాస్ యూనిట్లు కాగా మిగతావి ఆవిరి ఆధారిత యూనిట్లు. ఈ ప్లాంట్ నిర్మాణానికి దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయమైంది. -
విద్యుత్ వినియోగదారులకు ఊరట
న్యూఢిల్లీ: సర్దుబాటు చార్జీల పేరుతో నగరవాసులపై భారం మోపేందుకు ప్రయత్నించిన డిస్కంలకు చుక్కెదురైంది. మరో రెండు నెలలపాటు ప్రస్తుతం కొనసాగిస్తున్న విధంగానే చార్జీలు వసూలు చేయాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి(డీఈఆర్సీ)ఆదేశించింది. జూలైలో వార్షిక టారిఫ్ విధానాన్ని మరోసారి సమీక్షిస్తామని చెప్పింది. ప్రస్తుతం సర్దుబాటు చార్జీల పేరుతో బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ 6 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 7 శాతం, బీఎస్ఈఎస్ యమున పవర్ లిమిటెడ్ 8 శాతం వసూలు చేస్తున్నాయి. మరో రెండు నెలలపాటు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని డిస్కంలను డీఈఆర్సీ ఆదేశించింది. గత మూడు నెలలుగా ఇవే చార్జీలను వసూలు చేస్తున్నామని, టారిఫ్‌ను 14 నుంచి 15 శాతం పెంచాలని డిస్కంలు డీఈఆర్సీని కోరడంతో అందుకు తిరస్కరిస్తూ మరో రెండు నెలల తర్వాత వార్షిక టారిఫ్ విధానాన్ని సమీక్షిస్తామని తెలిపింది. రూ. 2.95 పెరిగిన సీఎన్జీ నగరంలో సీఎన్జీ ధర రూ. 2.95 పెరిగింది. ప్రస్తుతం కిలో సీఎన్జీ ధర రూ.35.20 ఉండగా నేటి నుంచి రూ. 38.15 వెచ్చించి కొనాల్సి ఉంటుంది. పీఎన్జీ ధర కూడా యూనిట్‌కు రూపాయి చొప్పన పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో పన్నుల విధానమే వీటి ధర పెరగడానికి కారణమని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్ బిల్లులు పెరగవంటూ డీఈఆర్సీ ప్రకటించిన విషయంపై సంతోష పడేలోపే ఇలా సీఎన్జీ, పీఎన్జీ భారం పడడంపై నగరవాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎన్జీ ధరలను తగ్గించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ముదురుతున్న విద్యుత్ కిరికిరి
న్యూఢిల్లీ: నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు కంపెనీలు కోర్టు బాటపట్టాయి. తమ పిటిషన్లను వీలైనంత త్వరగా విచారించాలని కోర్టును కోరాయి. వివరాల్లోకెళ్తే... ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ మరుసటి రోజే నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్న టాటా పవర్, బీఎస్ఈఎస్ రాజధాని, బీఎస్ఈఎస్ యమున సంస్థలకు సంబంధించిన లెక్కలను కాగ్‌తో అడిట్ జరిపించాలని నిర్ణయించారు. ఈ కాగ్ అధిపతిని కూడా కలిశారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేయడంతో టాటా పవర్ సంస్థ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. దీనిపై కోర్టు తీర్పునిస్తూ.. ఆడిట్‌కు సహకరించాలని సూచించింది. దీంతో టాటా పవర్ హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఎన్టీపీసీ నోటీసుపై బీఎస్ఈఎస్.. బకాయిలు చెల్లించనట్లయితే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తానని హెచ్చరిస్తూ ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఇచ్చిన నోటీసును సవాలుచేస్తూ బీఎస్ఈఎస్ రాజధాని, బీఎస్ఈఎస్ యము న సుప్రీం కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశాయి. తక్షణం విచారణ జరిపించవలసిందిగా కోరిన ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని ధర్మాసనంశుక్రవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన అంశం శుక్రవారం విచారణకు రానున్నందున తాము తాజాగా దాఖలు చేసే విజ్ఞప్తిపై కూడా దానితోపాటు విచారణ జరపాలని బీఎస్ఈఎస్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు. అందుకు సుప్రీకోర్టు ధర్మాసనం అంగీకరించి శుక్రవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చింది. బకాయిలు చెల్లించనట్లయితే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తానని ఎన్టీపీసీ ఈ నెల 1న బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌లకు నోటీసు జారీచేసింది. బకాయిల వసూలు కష్టమవుతోంది: టాటా నగరంలో డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని టాటా పవర్ కంపెనీ అభిప్రాయపడింది. ఓవైపు బీఎస్‌ఈఎస్‌తో పోటీ వాతావరణం, మరోవైపు డిస్కమ్‌ల పట్ల ఆప్ ప్రభుత్వ వైఖరితో తమకు రావాల్సిన దాదాపు రూ. 5,000 కోట్లమేర బకాయిలు పేరుకుపోయాయని వాపోయింది. కాగా రిలయన్స్‌కు చెందిన బీఎస్ఈఎస్ వెంచర్ లెసైన్సును రద్దు చేసి, దానిని టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్‌కు ఇవ్వాలని కేజ్రీవాల్ సర్కారు భావి స్తోందన్న వార్తలపై ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి, తమకు మధ్య ఈ విషయమై అధికారికంగా ఎటువంటి చర్చలు జరగలేదని తెలిపింది. -
కరెంట్ తీసేస్తాం!
బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ సకాలంలో బకాయిలు చెల్లించనట్లయితే కరెంటు సరఫరా నిలిపి వేస్తామని ఎన్టీపీసీ తాజాగా హెచ్చరించడంతో ఈ నెల 11 నుంచి భారీగా కరెంటు కోతలు తప్పకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూపునకు చెందిన విద్యుత్ కంపెనీలు (డిస్కమ్‌లు) బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ సకాలంలో బకాయిలు చెల్లించనట్లయితే కరెంటు సరఫరా నిలిపి వేయకతప్పదని జాతీయ బొగ్గు విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) హెచ్చరించింది. ఫిబ్రవరి 11లోగా బకాయిలు చెల్లించాలని ఎన్టీపీసీ ఈ రెండు డిస్కమ్‌లకు శనివారం నోటీసులు జారీ చేసింది. తమ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉందని, డిస్కమ్‌లు బకాయిలు చెల్లించకుంటే రెండువేల మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయవలసి వస్తుందని, దానిని కొనడానికి ఇతరులు సిద్ధంగా ఎన్టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అరూప్‌రాయ్ చౌదరి మంగళవారం స్పష్టం చేశారు. దీనిపై స్పందించాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను విలేకరులు కోరగా, ఇది ఢిల్లీ డిస్కమ్‌లు, డీఈఆర్ సీ, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య సమస్య కాబట్టి, తాము మాట్లాడవలసింది ఏమీ లేదని అన్నారు. అయితే ఎన్టీపీసీకి చెల్లించవలసిన బకాయిలను డిస్కమ్‌లు వీలైనంత త్వరగా చెల్లిస్తాయని తాము ఆశిస్తున్నామని సింధియా చెప్పారు. బీఎస్ఈఎస్ గతంలో కూడా చెల్లింపుల విషయంలో సమస్య సృష్టించిందని అరూప్‌రాయ్ చౌదరి చెప్పారు. బీఎస్‌ఈఎస్‌కు ఇది మొదటి నోటీసు కాదని, ఈ డిస్కమ్‌తో సమస్యలు రావడం ఇది మూడోసారని ఆయన చెప్పారు. ఆ కంపెనీ ఎప్పుడూ సకాలంలో చెల్లింపులు జరపడం లేదని, ఈసారి బకాయిలు కూడా చెల్లించలేదని చౌదరి చెప్పారు. డిసెంబర్లో వాడుకున్న విద్యుత్‌కు బీఎస్ఈఎస్ చెల్లింపులు జరపవలసి ఉంది. ఢిల్లీలోని మరో డిస్కమ్ టాటాపవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ చెల్లింపుల విషయంలో తమకు ఎన్నడూ సమస్య సృష్టించలేదని ఆయన చెప్పారు. ఆ కంపెనీ సకాలంలో బిల్లులు చెలిస్తుందని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమకు ఢిల్లీ ప్రభుత్వంతో ‘థర్డ్ పార్టీ అగ్రిమెంట్’ లేదని అరూప్‌రాయ్ చౌదరి చెప్పారు. బీఆర్‌పీఎల్ రాజధాని -
కరెంటు కహానీ!
న్యూఢిల్లీ:తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను సగానికి తగ్గించడం, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్) ఖాతాలను ఆడిటింగ్ చేయిస్తామన్న ఆప్ ప్రకటనపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. డిస్కమ్ ఖాతాలకు స్వతంత్ర సంస్థతో ఆడిటింగ్ చేయిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని, టారిఫ్ తగ్గింపు సాధ్యమేనని ఆప్ బలంగా వాదిస్తోంది. ప్రభుత్వ అధీనంలోని కంప్ట్రోలర్ అండ్ జనరల్ లేదా ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిటింగ్ నిర్వహించి టారిఫ్ తగ్గించే పరిస్థితి ఉన్నదీ లేనిదీ నిర్ధారించాల్సి ఉంటుంది. రాజధానిలోని డిస్కమ్‌ల ఖాతాలపై ఆడిటింగ్‌కు డిమాండ్ చేస్తూ ఆప్ ఇది వరకే పలుసార్లు యాజమాన్యాలకు నివేదికలు పంపించింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వాదనలు ఇలా ఉన్నాయి. బీఎస్ఈఎస్ రాజధాని వాదన తమ ఆదాయంలో 80 శాతం కరెంటు కొనుగోళ్లకే వెళ్లిపోతోందని బీఎస్ఈఎస్ రాజధాని వాదిస్తోంది. విద్యుత్ కొనుగోలుకు ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ కరెంటు ఉత్పత్తి కేంద్రాలతో ఒప్పందాలు కుదుర్చోవడం వంటి ఈ విషయంలో తనకు ఎలాంటి నియంత్రణా ఉండబోదు. 2003 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకు విద్యుత్ టోకు ధరలు దాదాపు 300 శాతం పెరిగాయి. 2003లో యూనిట్‌కు రూ.1.42 చెల్లించగా, ఇప్పుడు రూ.5.71 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలకు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ) ఆమోదం కూడా ఉంది కాబట్టి తప్పుడు నివేదికలు ఇచ్చేందుకు అవకాశమే లేదు. నిజానికి గత పదేళ్లలో కరెంటు చార్జీలు పెరిగింది 65 శాతం మాత్రమేని ఇది తెలిపింది. 2003లో యూనిట్‌కు రూ.3.06 చెల్లిం చగా, ఇప్పుడు రూ.6.55 చెల్లించాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా ధరలు భారీగా పెరిగాయి. అంతకుముందు ఐదేళ్లుగా డిస్కమ్‌లు తక్కువ చార్జీలు వసూలు చేశాయి. నగరంలోని డిస్కమ్‌లపై ఇప్పటికీ రూ.20 వేల కోట్ల భారం ఉందని రాజధాని వాదిస్తోంది. గత పదేళ్లలో వినియోగ ధర సూచిక 120 శాతం పెరిగిందని, ఆ ప్రకారం యూనిట్ ధర రూ.7.40 ఉండాని పేర్కొంది. ఇదీ ఆప్ వాదన... అయితే బీఎస్ఈఎస్ వాదనలో ఎన్నో లోపాలున్నాయని ఆప్ వాదిస్తోంది. పదేళ్లలో కరెంటు ధరలు 300 శాతం పెరిగితే, డిస్కమ్‌లు కేవలం 65 శాతం పెంపుతో సర్దుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. పైగా నగరంలో కరెంటు చౌర్యం తక్కువేమీ కాదు. బీఎస్ఈఎస్ వాదన ప్రకారం కరెంటు చౌర్యం, లీకేజీలు ఒకప్పుడు 57 శాతం ఉండగా, దానిని డిస్కమ్‌లు రికార్డుస్థాయిలో 17 శాతానికి తగ్గించాయట! గణాంకాల్లో చెప్పాలంటే విద్యుత్ పొదుపు వల్ల డిస్కమ్ 2003 నుంచి 2013 వరకు రూ.37,500 కోట్లు (ఏడాదికి రూ.7,500 కోట్లు) ఆదా చేశాయి. అంటే ఇది ఢిల్లీ వార్షిక బడ్జెట్లో 25 శాతం! ఇలా ఆదా చేశాం కాబట్టే సబ్సిడీలను భరిస్తున్నామన్నది డిస్కమ్‌ల వాదన. ఈ వాదనలన్నీ తప్పని పేర్కొంటూ కేజ్రీవాల్ డీఈఆర్సీ, ప్రభుత్వానికి పలు నివేదికలు సమర్పించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. విద్యుత్ కంపెనీలు తమకు 2010-2011 ఆర్థిక సంవత్సరంలో రూ.630 కోట్ల నష్టాలు వచ్చాయని ప్రకటించుకున్నాయి. అయితే అప్పటి డీఈఆర్సీ చైర్మన్ బ్రిజేందర్ సింగ్ డిస్కమ్‌లు రూ.3,577 కోట్ల లాభాలు ఆర్జించాయి కాబట్టి, టారిఫ్‌ను 23 శాతం తగ్గించవచ్చని ప్రకటించారు. ఈ ప్రతిపాదన నచ్చని అప్పటి షీలా ప్రభుత్వం సింగ్‌ను తొలగించి కొత్త వ్యక్తిని చైర్మన్‌గా నియమించింది. ఆయన టారిఫ్‌ను తగ్గించడానికి బదులు 22 శాతం పెంచడానికి అంగీకరించారు. విద్యుత్ పంపిణీ నష్టాలపై డిస్కమ్‌లు చెబుతున్న లెక్కలు ఎంతమాత్రమూ సహేతుకంగా లేవని ఆప్ వాదిస్తోంది. కంపెనీల నుంచి భారీ రేట్లకు కరెంటు కొంటున్నామని చెబుతున్న డిస్కమ్‌లు వాటి అనుబంధ సంస్థలకు మాత్రమే చౌకరేట్లకు దానిని అమ్మడం గమనార్హం. సింగ్ ప్రతిపాదనలు అమలైతే రూ.100 చెల్లించే వినియోగదారుడి బిల్లు రూ.77కు తగ్గేది. ఇప్పుడది రూ.161కి చేరుకుంది. అంటే నెలకు 200 యూనిట్లు వాడుకుంటే రూ.503 చెల్లించాల్సి ఉండగా, ఇపుపడు ఏకంగా రూ.1,505 కట్టాల్సి వస్తోంది. ఈ రెండు వర్గాలు వాదనల్లో వైరుద్ధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆడిటింగ్‌కు ఆదేశిస్తే వాస్తవాలు బయటికి వస్తాయి. ఇది సాధ్యమైనంత త్వరగా జరగాలని ఆశిద్దాం.