
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ అధికారుల కఠినతర ద్రవ్య విధాన వైఖరి, రష్యాపై ఆంక్షలు,ఆర్బీఐ పాలసీ కమిటీ సమావేశాలు,భారత్ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.1.4 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు ముడిచమురు ధరల అనిశ్చితులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు వెంటాడటం దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి.
ఈ ప్రతికూల పరిణామాలతో గురువారం ఉదయం 9.26 నిమిషాలకు సెన్సెక్స్ 363పాయింట్లు నష్టపోయి 59250 వద్ద సెన్సెక్స్ 94పాయింట్లు నష్టపోయి 17706 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. కిప్లా, సన్‌ఫార్మా, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, టాటా కాన్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టైటాన్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఎల్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లార్సెన్, టీసీఎస్, నెస్లే, రిలయన్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment