
రెండు రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఏప్రిల్ నెలలో యూకే ద్రవ్యోల్బణం 40ఏళ్లలో తొలిసారి 9 శాతానికి చేరడంతో పాటు ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, వడ్డీరేట్ల పెంపు, పెరిగిపోతున్న కరోనా కేసులు వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్‌లతో పాటు దేశీయ మార్కెట్‌లపై ప్రభావం చూపాయి.దీంతో ఉదయం సానుకూలంగా ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం నుంచి ఒత్తిడికి లోనయ్యాయి. చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టపోయి 54,209 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 16,240 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఎన్‌ఎస్‌ఈలో 15సెక్టార్‌లలో 12 సెక్టార్‌లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్స్ 1.57శాతం , ఐటీ షేర్లు 0.47శాతం నష్టపోయాయి.
ఇక నిఫ్టీలో అన్నీ కంపెనీల షేర్లలో పవర్ గ్రిడ్ షేర్లు 4.53శాతం వృద్దితో రూ.227.85 లాభాల్ని గడించి ప్రదమ స్థానంలో నిలిచింది. బీపీసీఎల్,టెక్ మహీంద్రా,అపోలో హాస్పటిల్, ఎస్‌బీఐ షేర్లు లాభాలతో ముగియగా..
బీఎస్‌ఈలో పవర్ గ్రిడ్, టెక్ ఎం,ఎస్‌బీఐ,ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్‌టెల్,ఎన్టీపీసీ,విప్రో,హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ షేర్లు నష్టపోయాయి.హిందుస్తాన్ యూనిలివర్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీ బీఎస్‌ఈ షేర్లు లాభాలతో ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment