నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టాక్‌ మార్కెట్లు | Stock Market Live News Update | Sakshi
Sakshi News home page

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టాక్‌ మార్కెట్లు

Published Fri, Dec 2 2022 10:49 AM | Last Updated on Fri, Dec 2 2022 2:19 PM

Stock Market Live News Update - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు దేశీయ సూచీల మీద తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో వరుసగా 8 రోజులుగా లాభపడిన స్టాక్‌ మార్కెట్‌లు శుక్రవారం నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి.  

ఉదయం 10.30గంటల సమయానికి  సెన్సెక్స్‌ 372 పాయింట్ల నష్టంతో  62911 వద్ద  నిఫ్టీ 109 పాయింట్లు నష్టంతో 18703 వద్ద కొనసాగుతుంది. దీంతో ఎథేర్‌ మోటార్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, ఎం అండ్‌ ఎం, టాటా, బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, హెచ్‌యూఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్‌జీసీ,అపోలో ఆస్పటల్స్‌​, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement