దేశీయ స్టాక్ మార్కెట్‌లపై జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం చూపుతున్నాయి. క్రూడ్ ఆయిల్ 6 నెలల కనిష్టానికి పడిపోవడం, ఆశాజనకంగా త్రైమాసిక ఫలితాలు, ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కొనుగోలు ఆసక్తిని ప్రోత్సహిస్తుండడం, గ్లోబల్ మార్కెట్లు లాభా పడ్డాయి. దీంతో సోమవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్‌లు స్తబ్ధుగా ప్రారంభమయ్యాయి.
ఇక సోమవారం ఉదయం 10.30గంటల సమయానికి సెన్సెక్స్ 218 పాయింట్లు నష్టపోయి 58617 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ సైతం 57 పాయింట్లు నష్టపోయి 17454 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది.
ఎం అండ్ ఎం,ఇండస్ ఇండ్ బ్యాంక్,హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, హిందాల్కో, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్,అపోలో హాస్పిటల్, లార్సెన్,హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీపీసీఎల్,ఎస్‌బీఐ, బ్రిటానియా,కిప్లా,ఇన్ఫోసిస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment