న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు సగానికి క్షీణించి రూ. 34 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 65 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 240 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 226 కోట్ల ఆదాయం నమోదైంది.
అయితే నిర్వహణ మార్జిన్లు 28 శాతం నుంచి 7 శాతానికి భారీగా పతనమయ్యాయి. ఇందుకు కారణాలను ఎక్ఛేంజీ వెల్లడించలేదు. కాగా.. మొత్తం వ్యయాలు 36 శాతం పెరిగి రూ. 184 కోట్లను దాటాయి. ఎక్సే్ఛంజీలో రిజిస్టరైన మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 11.7 కోట్లకు ఎగశాయి.
రోజువారీ సగటు టర్నోవర్ ఈక్విటీ విభాగంలో 17 శాతం వృద్ధితో రూ. 4,740 కోట్లను తాకగా.. డెరివేటివ్స్ నుంచి 88 శాతం అధికంగా రూ. 2.26 లక్షల కోట్లు చొప్పున నమోదైంది. కరెన్సీ డెరివేటివ్స్‌లో సైతం సగటు టర్నోవర్ 31 శాతం ఎగసి రూ. 32,161 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment