అంతర్జాతీయ ప్రతి కూలతలు దేశీయ మార్కెట్‌లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో గురువారం స్టాక్ మార్కెట్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 53,744 వద్ద నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 16,036 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది.
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లోని 15 సెక్టార్‌లలోని 12 రంగాలకు చెందిన షేర్లు లాభాల వైపు పయనమవుతుండగా.. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ షేర్లు ఊహించని విధంగా 1.07 శాతం నుంచి 1.21శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.
నిఫ్టీలో అపోలో హాస్పిటల్ షేర్లు 2.13శాతంతో రూ.3,950 వద్ద ట్రేడ్ కంటిన్యూ చేస్తుంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, బ్రిటానియా, ఆల్ట్రా టెక సిమెంట్, హిందుస్తాన్ యూనిలివర్, మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్,నెస్లే,రిలయన్స్ షేర్లు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. యాక్సిస్ బ్యాంక్,టెక్ మహీంద్రా,టాటా స్టీల్,టీసీఎస్,ఎస్‌బీఐ,ఇన్ఫోసిస్,హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment