న్యూఢిల్లీ: డిస్కమ్ బీఎస్‌ఈఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల వసూలుతోపాటు ఢిల్లీలో మరోసారి కరెంటు చార్జీల పెంపునకు అనుమతించడానికి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని సోమవారం అభ్యర్థించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై జూలై మూడున తదుపరి విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే కోరుతూ బీఎస్‌ఈఎస్ చేసిన వినతిపైనా అప్పుడే విచారణ నిర్వహిస్తామని తెలిపింది. చార్జీల పెంపు, బకాయిల వసూలు చేసుకోవడానికి బీఎస్‌ఈఎస్‌కు అనుమతి ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న ఆదేశాలు జారీ చేసింది. అయితే తీర్పు అమలుపై మాత్రం స్టే విధించింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈఎస్ తాజా విచారణ సందర్భంగా స్పంది స్తూ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాల అమలుకు అనుమతించాలని కోరింది.
తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) కరెంటు టారిఫ్‌ను పెంచుకునేందుకు అనుమతించడం లేదని బీఎస్‌ఈఎస్ ఆక్షేపించింది. నష్టాల కారణంగా ఎన్డీపీసీ వంటి ప్రభుత్వం విద్యు త్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించలేకపోతున్నామని కోర్టుకు తెలిపింది. వ్యయాలకు అనుగుణంగా చార్జీలను పెంచేందుకు అనుమతి
చార్జీల పెంపునకు అనుమతించండి
Published Tue, May 20 2014 11:15 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement