న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. ఆయన పదవి కాలన్ని పొడగించాలని కేంద్రం చేసిన అభ్యర్థణపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత ధర్మాసనం.. ఎస్‌కే మిశ్రాను సెప్టెంబర్ 15 వరకు ఈడీ చీఫ్ బాధ్యతల్లో కొనసాగేందుకు అనుమతినిచ్చింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ కుమార్ మిశ్రా(63) పదవీ కాలాన్ని అక్టోబర్ 15 వరకు పెంచమని కోరుతూ బుధవారం కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలసిందే. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టును కేంద్రం గడువు కోరగా సెప్టెంబర్ 15 వరకు ఎస్.కె. మిశ్రా ఆ పదవిలో కొనసాగవచ్చంటూ తెలిపింది.
సెప్టెంబర్ 15 అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ఎట్టిపరిస్థితుల్లో తప్పుకోవాల్సిందేనంటూ జస్టిస్ బిఆర్ గవై, విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్ సభ్యలుగా ఉన్న త్రిసభ్య కమిటీ ఆదేశించింది. ఈడీ చీఫ్ పదవీ కాలాన్ని మూడు సార్లు కంటే ఎక్కువసార్లు పొడిగించడం చట్ట వ్యతిరేకమని చెబుతూ గతంలో జులై 31 వరకు ఎస్.కె.మిశ్రా పదవిని పొడిగించింది సుప్రీం కోర్టు. అంతకు ముందు ఏడాది నవంబరులో, మిశ్రా రిటైర్మెంటుకు ఒక్కరోజు ముందు ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సుప్రీం కోర్టు ఇప్పుడు మూడోసారి కూడా ఆ సౌలభ్యాన్ని కల్పించడం విశేషం.
ఇది కూడా చదవండి: మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు
Comments
Please login to add a commentAdd a comment