
ముంబై: మార్కెట్ల నష్టాల్లోనూ ఐపీఓల జోరు కొనసాగుతుంది. తాజాగా మూడు కంపెనీలు ఐపీఓ కోసం సెబీకి ప్రాస్పెక్ట్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వాటిలో క్లినికల్ రీసెర్చ్ సంస్థ 'వీడా' పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 832 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు వీడా క్లినికల్ రీసెర్చ్ పేర్కొంది. ఇష్యూలో భాగంగా దాదాపు రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, అనుబంధ సంస్థ బయోనీడ్స్ ఇండియాకు నిధులు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు వీడా క్లినికల్ రీసెర్చ్ తెలియజేసింది.
'వీడా' తో పాటు సౌర ఇంధన కంపెనీ వారీ ఎనర్జీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా దాదాపు రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు మరో 40 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంత భాగాన్ని 2 గిగావాట్ల వార్షిక సామర్థ్యంగల సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా 1 గిగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్‌కూ వెచ్చించనుంది. గుజరాత్‌లోని చిఖ్లీలో వీటిని ఏర్పాటు చేయనుంది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం సైతం..
మొబైల్ ఫోన్ల తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.37 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను బ్రాండ్ నిర్మాణం, మార్కెటింగ్‌లతోపాటు.. ఇతర కంపెనీల కొనుగోళ్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్‌లో లావా ఇంటర్నేషనల్ పేర్కొంది.
చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్
Comments
Please login to add a commentAdd a comment