బుల్ కొమ్ములు పట్టి.. గంట కొట్టిన అమితాబ్!
బుల్ కొమ్ములు పట్టి.. గంట కొట్టిన అమితాబ్!
Published Tue, Jun 17 2014 5:05 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం ఓపెనింగ్ బెల్ కొట్టి బాంబే స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను ఆరంభించారు. తాజాగా నటిస్తున్న 'యుద్ధ్' అనే టెలివిజన్ సీరియల్ ప్రమోషన్ లో భాగంగా బుల్ కొమ్ములు పట్టుకుని.. అమితాబ్ గంటను మోగించారు.
'యుద్ధ్' టెలివిజన్ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నటిస్తున్నారు. అరుదైన అవకాశాన్ని అందించిన బాంబే స్టాక్ ఎక్చ్సెంజికి ధన్యవాదాలు అంటూ బీగ్ బీ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. బీఎస్ఈలో 'శాంతి కన్ స్ట్రక్షన్' పేరిటి ఓ ఊహజనిత కంపెనీని లిస్ట్ చేశారు.
'శాంతి కన్ స్ట్రక్షన్' కంపెనీని 'యుద్ద్' లిస్ట్ చేసింది అంటూ ట్విట్ లో పేర్కొన్నారు. వచ్చేనెల ఈ టెలివిజన్ సీరియల్ సోని టెలివిజన్ లో ప్రసారం కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ క్రియెటివ్ డైరెక్టర్ గా, మద్రాస్ కెఫే దర్శకుడు షూజిత్ సర్కార్ క్రియెటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సారిక, కేకే మీనన్, నవాజుద్దీన్ సిద్దికీ, తిగ్ మాన్షు ధూలియాలు నటిస్తున్నారు.
Advertisement
Advertisement