షారుక్ కు థ్యాంక్యూ చెప్పిన బిగ్ బీ!
షారుక్ కు థ్యాంక్యూ చెప్పిన బిగ్ బీ!
Published Sun, Jul 6 2014 9:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
ముంబై: సినీ పరిశ్రమలో సాధారణంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటేనే వారి మధ్య ఇగో అడ్డుగా మారుతుంది. అదే బాలీవుడ్ లో అగ్రహీరోలుగా రాణిస్తున్నవారైతే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.. అయితే అలాంటి వాతావరణాన్ని పక్కనపెట్టి స్నేహపూరితంగా అమితాబ్ బచ్చన్ , షారుక్ ఖాన్ లు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు.
యుద్ద్ అనే టెలివిజన్ సీరియల్ ను ప్రారంభిస్తున్న సందర్భంగా అమితాబ్ కు షారుక్ శుభాకాంక్షలు తెలిపారు. అందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు థ్యాంక్యూ చెప్పారు.
టెలివిజన్ కార్యక్రమం సూపర్ హిట్ కావాలని షారుక్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. షారుక్ ట్విట్ పై స్పందించిన అమితాబ్..థ్యాంక్యూ.. కాని హిట్ అవుతుందో లేదో తెలియదు అని పోస్ట్ చేశారు. మొహబ్బతే, కభీ కుషీ కభీ ఘమ్, కభీ అల్విదా నా కెహనా, భూత్ నాథ్, భూత్ నాథ్ రిటర్న్ అనే చిత్రాల్లో కలిసి నటించారు.
Advertisement
Advertisement