నాలుగో రోజూ నష్టాలే | Sensex falls over 64 points, below 21k | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ నష్టాలే

Published Tue, Jan 7 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

నాలుగో రోజూ నష్టాలే

నాలుగో రోజూ నష్టాలే

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా భారత్ స్టాక్ సూచీలు వరుసగా నాలుగోరోజూ తగ్గాయి. క్యూ 3 ఫలితాల సీజన్ దగ్గరపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంకావడం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశపు మినిట్స్ వెల్లడికానుండటం, భారత్ సర్వీసుల రంగం నెమ్మదించిందంటూ హెచ్‌ఎస్‌బీసీ సూచి వెల్లడించడం వంటి అంశాలతో తాజా అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 20,787 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల క్షీణతతో 6,191 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీల్లో ఎక్కువ వెయిటేజి వున్న ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2% మధ్య నష్టపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తగ్గాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకింగ్, రియల్టీ, పవర్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. కొద్ది రోజుల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు దృష్టిపెడుతున్న మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ మాత్రం కొనసాగింది. ఎఫ్‌ఐఐలు రూ. 318 కోట్లు వెనక్కు తీసుకున్నారు. దేశీయ సంస్థలు రూ. 22 కోట్ల షేర్లను విక్రయించాయి.
 
 నిఫ్టీ 6,200 పుట్ ఆప్షన్లలో బిల్డప్...
 వరుసగా రెండోరోజూ 6,170 సమీపంలో నిఫ్టీ మద్దతు పొందడంతో 6,200 స్ట్రయిక్ వద్ద ఇన్వెస్టర్లు పుట్ ఆప్షన్లను విక్రయించారు. దాంతో ఈ పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో మరో 3 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 43.42 లక్షల షేర్లకు పెరిగింది. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో కూడా 3.98 లక్షల షేర్లు యాడ్‌అయినా, మొత్తం ఓఐ పరిమితంగా 22.34 లక్షలే వుంది. కానీ 6,300 స్ట్రయిక్ వద్ద భారీగా కాల్ రైటింగ్ జరగడంతో 8.47 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 49.21 లక్షల షేర్లకు పెరిగింది. ఏదైనా ప్రతికూల వార్త వెలువడితే తప్ప, నిఫ్టీ 6,200పైకి తిరిగి చేరవచ్చని, రానున్న రోజుల్లో 6,300 స్థాయి నిరోధించవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు ఈ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది.  ఫలానా స్థారుుని మించి  షేరు లేదా ఇండెక్స్ పెరగదన్న అంచనాలతో కాల్ ఆప్షన్‌ను, లేదా తగ్గదన్న అంచనాలతో పుట్ ఆప్షన్‌ను విక్రరుుంచడాన్ని ఆప్షన్ రైటింగ్‌గా వ్యవహరిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లు షేరు పెరగకపోతే కాల్ ఆప్షన్ ప్రీమియుం, తగ్గకపోతే పుట్ ఆప్షన్ ప్రీమియుం తగ్గిపోతుంది. ఎక్కువ ప్రీమియుంకు విక్రరుుంచిన ఆప్షన్ కాంట్రాక్టును ప్రీమియుం తగ్గిన తర్వాత కొంటే, అవ్ముకం కొనుగోలు ధర వుధ్య వ్యత్యాసం లాభంగా మిగులుతుంది. అంచనాలకు భిన్నంగా ప్రీమియుం పెరిగితే ఆప్షన్లు రైట్ చేసినవారు నష్టపోతారు. అలా అమ్మకందార్లు రైట్ చేసిన కాంట్రాక్టులను కొన్నవారు లాభపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement