closing trade
-
మార్కెట్‌కు ఫెడ్ బూస్ట్
ముంబై: దలాల్ స్ట్రీట్ గురువారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొనుగోళ్ల అండతో ట్రేడింగ్ ఆద్యంతం ఉత్సాహాంగా ఉరకలేసింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో స్టాక్ సూచీలు నాలుగు నెలల్లో అత్యధిక లాభాల్ని ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ 23 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల కౌంటర్లకు డిమాండ్ నెలకొనడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 1030 పాయింట్లు పెరిగి 59,957 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ 297 పాయింట్లు ఎగసి 17,844 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 276 పాయింట్ల లాభంతో 17,823 వద్ద స్థిరపడింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ షేర్లు వంటి లార్జ్‌క్యాప్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,173 కోట్ల షేర్లను కొన్నారు. డాలరు మారకంలో రూపాయి విలువ 73.64 వద్ద నిలిచింది. రాకెట్లా దూసుకెళ్లిన సూచీలు... ఆసియా మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న దేశీయ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 59,358 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 17,671 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బుల్ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ వంటి కీలక రంగాల షేర్లకు డిమాండ్ లభించడంతో సూచీలు రాకెట్లా దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1030 పాయింట్లు, నిఫ్టీ 297 పాయింట్లను ఆర్జించగలిగాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీల లాభాలకు కారణాలివే... చైనా ఎవర్ గ్రాండే సంక్షోభంపై గ్రూప్ చైర్మన్ హుయి కా యువాన్ వివరణ ఇచ్చారు. ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చైనా పీపుల్స్ బ్యాంక్ 17 బిలియన్ డాలర్లను చొప్పించింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లే యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బాండ్ల కొనుగోళ్లను నవంబర్ నుంచి తగ్గిస్తామనే ఫెడ్ నిర్ణయాన్ని ఈక్విటీ మార్కెట్లు అప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితిని తొలగించి సానుకూలతలను నెలకొల్పాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇటీవల కేంద్రం పలు రంగాల్లో సంస్కరణల పర్వానికి తెరతీయడం మార్కెట్‌కు జోష్ నిచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపుతుండటం మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుంది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బీఎస్ఈలో ఐదున్నర శాతం నష్టపోయి రూ.318 వద్ద ముగిసింది. ► యూఎస్ సంస్థ బ్లింక్ను కొనుగోలు చేయడంతో ఎంఫసిస్ షేరు మూడు శాతం ర్యాలీ చేసి రూ.3,339 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.3392 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి 500 సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి ఆర్డర్లను దక్కించుకోవడంతో జేఎంబీ ఆటో షేరు 12 శాతం లాభపడి రూ.516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 17 శాతం ర్యాలీ చేసి రూ.537 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ఒక్క రోజులో రూ.3.16 లక్షల కోట్లు ప్లస్ సూచీలు నాలుగునెలల్లో అతిపెద్ద ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.3.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.261.73 లక్షల కోట్లకు చేరింది. -
నామమాత్ర నష్టాలు
ఇటీవల కన్సాలిడేషన్ దిశలో కదులుతున్న మార్కెట్లు మరోసారి రోజు మొత్తం ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. దాదాపు 200 పాయింట్ల స్థాయిలో పలుమార్లు హెచ్చుతగ్గులను చవిచూసిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసేసరికి 17 పాయింట్లు నష్టపోయింది. 24,217 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించి 7,230 వద్ద నిలిచింది. ప్రధానంగా బ్యాంకింగ్, వినియోగ వస్తు రంగాలు 1.5% చొప్పున నీరసించగా, హెల్త్‌కేర్, రియల్టీ రంగాలు 2%పైగా బలపడ్డాయి. కొద్ది రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తుండటంతో సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు జీడీపీ గణాంకాలు, రిజర్వ్ బ్యాంక్ పాలసీ తదితర అంశాలపై దృష్టిపెట్టారని, దీంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ వారంలో సెన్సెక్స్ 476 పాయింట్లను కోల్పోవడం గమనార్హం. ఇంతక్రితం జనవరి 31న ముగిసిన వారంలో మాత్రమే సెన్సెక్స్ 620 పాయింట్లు నష్టపోయింది. హెచ్‌యూఎల్ జోరు బ్లూచిప్స్‌లో హెచ్‌యూఎల్ 8% జంప్‌చేయగా, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా పవర్ 5-3% మధ్య పుంజుకున్నాయి. అయితే మరోవైపు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ 2-1% మధ్య నష్టపోగా, టాటా మోటార్స్, మారుతీ సైతం 2% స్థాయిలో తిరోగమించాయి. కాగా, ఇటీవల అమ్మకాలకే కట్టుబడుతున్న ఎఫ్ఐఐలు వారాంతంలో రూ. 2,978 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 458 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. జేఅండ్‌కే బ్యాంక్ బోర్లా మిడ్ క్యాప్స్‌లో జేఅండ్‌కే బ్యాంక్ దాదాపు 20% పతనమైంది. రూ. 2,500 కోట్లమేర మొండిబకాయిలుగా మారిన రుణాలను ఖాతాలలో చూపించడం లేదన్న వార్తలు ఇందుకు కారణమయ్యాయి. మిగిలిన మిడ్‌క్యాప్స్‌లో చోళమండలం ఫైనాన్స్, మోనెట్ ఇస్పాత్, గ్రాఫైట్, కాక్స్‌అండ్‌కింగ్స్, పీసీ జ్యువెలర్, చంబల్ ఫెర్టిలైజర్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఓరియంట్ సిమెంట్ 9-5% మధ్య నష్టపోయాయి. -
చిన్న షేర్లు విలవిల
భారీ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే అధిక శాతం చిన్న షేర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 22,418 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 19 పాయింట్లు తగ్గి 6,696 వద్ద నిలిచింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, సెన్సెక్స్ తొలుత 214 పాయింట్ల వరకూ లాభపడింది. ఆపై ఉన్నట్టుండి పతనబాటపట్టి 180 పాయింట్ల వరకూ దిగజారింది. ఎన్డీఏకు తగిన మెజారిటీ లభించకపోవచ్చన్న అంచనాలు మిడ్ సెషన్లో సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,704 నష్టపోగా, 973 మాత్రమే బలపడ్డాయి. రియల్టీ బోర్లా రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, యూనిటెక్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, డీబీ, ఇండియాబుల్స్, ఒబెరాయ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 9-3% మధ్య పతనంకావడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5.3% పడిపోయింది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, పవర్, వినియోగ వస్తు రంగాలు సైతం 2% చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, భెల్, సెసాస్టెరిలైట్, భారతీ, ఎల్అండ్టీ, హిందాల్కో, ఐసీఐసీఐ 3.5-1.5% మధ్య తిరోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ 3-1.5% మధ్య లాభపడ్డాయి. బుధవారం ఎఫ్ఐఐలు రూ. 454 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
రికార్డుల బాటలో ముగిసిన సెన్సెక్స్
ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అండతో మార్కెట్ల జోరు కొనసాగుతోంది. వెరసి మరోసారి ప్రధాన ఇండెక్స్‌లు సరికొత్త రికార్డులకు తెరలేపాయి. 118 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 22,876 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో అత్యధికంగా 22,912ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 25 పాయింట్లు బలపడి 6,841 వద్ద నిలిచింది. ఒక దశలో 6,862 వరకూ ఎగసింది. ఇవన్నీ చ రిత్రాత్మక గరిష్ట స్థాయిలే కావడం విశేషం! ఫలితంగా వరుసగా మూడో రోజు పాత రికార్డులు చెరిగిపోయాయి. ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 1%పైగా పుంజుకోగా, రియల్టీ అదే స్థాయిలో డీలా పడింది. ఓవైపు క్యూ4 ఫలితాలు, మరోవైపు కొత్త ప్రభుత్వంపై అంచనాలు సెంటిమెంట్‌కు బలాన్నిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఎఫ్‌ఐఐలకుతోడు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లు చేపడుతుండటంతో మార్కెట్లు రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తున్నాయని విశ్లేషించారు. అయితే డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో గరిష్ట స్థాయిల వద్ద కొంతమేర అమ్మకాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఎఫ్ఐఐల జోష్ గత మూడు ట్రేడింగ్ రోజుల్లో రూ. 809 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు జోరు పెంచారు. తాజాగా రూ. 768 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 534 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. -
10 రోజుల ర్యాలీకి బ్రేక్...
వరుసగా పది రోజులపాటు లాభపడుతూ వచ్చిన స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు తగ్గి 22,509 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 16 పాయింట్ల నష్టంతో 6,736 వద్ద నిలిచింది. అయితే తొలుత సెన్సెక్స్ గరిష్టంగా 22,621ను చేరగా, నిఫ్టీ సైతం 6,777కు చేరింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఆపై అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకుని నష్టాల బాటపట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 22,369 వరకూ పతనంకాగా, నిఫ్టీ 6,697 వద్ద కనిష్టాన్ని తాకింది. గత మూడు రోజుల్లో రూ. 1,924 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు గురువారం మరో రూ. 717 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ యథావిధిగా రూ. 717 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. గత పది రోజుల్లో సెన్సెక్స్ 811 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. ఫైనాన్స్ షేర్లు డీలా: బ్యాంకింగ్ లెసైన్స్‌లపై అంచనాలతో ఇటీవల లాభపడుతూ వచ్చిన పలు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో భారీగా నష్టపోయాయి. నీరసించిన సెంటిమెంట్‌కు అనుగుణంగా ట్రేడైన షేర్లలో 1,511 నష్టపోతే 1,277 లాభపడ్డాయి. జేఎం ఫైనాన్షియల్, శ్రేయీ ఇన్ఫ్రా, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఐఎఫ్సీఐ, మ్యాగ్మా ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, రిలయన్స్ క్యాపిటల్ 8-5% మధ్య పతనమయ్యాయి. అయితే ఎడిల్వీస్ క్యాపిటల్ దాదాపు 6% ఎగసింది. ఇక బ్యాంక్ లెసైన్స్ పొందిన ఐడీఎఫ్సీ సైతం 2.5% క్షీణించడం గమనార్హం. -
60 దిగువకు రూపాయి
ముంబై: ఎట్టకేలకు దేశీ కరెన్సీ 60 దిగువకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 40 పైసలు బలపడటంతో ఎనిమిది నెలల తరువాత మళ్లీ 59.91కు చేరింది. ఇంతక్రితం జూలై 29న మాత్రమే ఈ స్థాయిలో 59.41 వద్ద ముగిసింది. ప్రధానంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో రూపాయికి బలం చేకూరుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఎగుమతిదారులు డాలర్లను విక్రయిస్తుండటం కూడా సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలి పారు. దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు శుక్రవారంతో కలిపి 5 రోజుల్లో రూ. 7,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయడం ఇందుకు సహకరించిందని వివరించారు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం ఒక దశలో 63 పైసల వరకూ లాభపడ్డ రూపాయి 59.68 వద్ద గరిష్టాన్ని కూడా తాకింది. చివరికి 0.66%(40 పైసలు) పుంజుకుని 59.91 వద్ద స్థిరపడింది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే రూపాయిపై ప్రతి కూల ప్రభావంపడే అవకాశమున్నదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజరర్ రమేష్ సింగ్ వ్యాఖ్యానించారు. -
ఒడిదుడుకుల వారము
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో మార్చి నెల ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నదని తెలిపారు. వచ్చే నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో వడ్డీ ప్రభావిత రంగాలలో లావాదేవీలు పుంజుకుంటాయని అంచనా వేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నందున ట్రేడర్ల కార్యకలాపాలు ఊపందుకుంటాయని దీంతో ఇండెక్స్‌లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. వెరసి ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాల షేర్లవైపు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. వెలుగులో చిన్న షేర్లు : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో మార్చి డెరివేటివ్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులు చవిచూస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఇందుకు లోక్‌సభ ఎన్నికలు, రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష వంటి అంశాలు కూడా కారణంకానున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు వెలుగులో నిలుస్తాయని, వీటికితోడు చిన్న షేర్లకు డిమాండ్ కనిపిస్తుందని చెప్పారు. ఇకపై క్యూ4 ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్లను నడిపిస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,475 స్థాయి కీలకంగా నిలవనున్నదని తెలిపారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికలపై అంచనాలు: వచ్చే నెల 7 నుంచి మే 12 మధ్య కాలంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఇది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు(ఎఫ్ఐఐలు) ప్రోత్సాహాన్నిస్తున్నదని చెప్పారు. దీంతో గడిచిన నెల రోజుల్లో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్, నిఫ్టీ 5%పైగా పురోగమించాయని వివరించారు. ఫెడ్ ఎఫెక్ట్: వచ్చే ఏడాది(2015) ద్వితీయార్థంలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో సంకేతాలిచ్చింది. మరోవైపు నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున సహాయక ప్యాకేజీలో కోతను పెంచుతూ వస్తోంది. దీంతో ప్రస్తుతం ప్యాకేజీ 55 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా, త్వరలో పూర్తిస్థాయిలో ప్యాకేజీని ఉపసంహరించే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు విదేశీ పెట్టుబడుల రాకపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ అంటోంది. ఎఫ్ఐఐల జోష్ న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌పై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆసక్తి కొనసాగుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 9,600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహమిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మార్చి నెలలో (21 వరకూ) ఎఫ్ఐఐలు నికరంగా రూ. 9,600 కోట్లను(156 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇక ఇదే కాలంలో రుణ(డెట్) సెక్యూరిటీలలో మరింత అధికంగా రూ. 12,816 కోట్లను(200 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
రికార్డుకి చేరువలో...
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోపాటు విదేశీ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి బలపడ్డాయి. సెన్సెక్స్ 67 పాయింట్లు లాభపడి 21,277 వద్ద ముగియగా, 31 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ 6,329 వద్ద నిలిచింది. వెరసి సూచీలు రెండూ చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరువయ్యాయి. ఇంతక్రితం జనవరి 21న సెన్సెక్స్ 21,374 వద్ద కొత్త గరిష్టాన్ని తాకగా, ఇంట్రాడేలో 2013 డిసెంబర్ 9న 21,484కు చేరింది. ఇక నిఫ్టీ డిసెంబర్ 9న ఇంట్రాడేలో 6,394ను తాకి, 6,364 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ఆందోళనలు తొలగడం, ఈ ఏడాదికి చైనా విధించుకున్న 7.5% ఆర్థిక వృద్ధి లక్ష్యం వంటి అంశాలు సెంటిమెంట్‌ను మెరుగుపరచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బ్యాంకింగ్ ర్యాలీ అవసరమైన మూలధన పెట్టుబడులను సమకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆర్థికమంత్రి చిదంబరం భరోసా ఇవ్వడం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీకి కారణమైంది. మొండిబకాయిల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు, ఇకపై లాభదాయకతపై దృష్టిపెట్టేందుకు వీలుగా బ్యాంకింగ్ రంగానికి అండగా నిలవనున్నట్లు మంత్రి ప్రకటించడం కూడా ర్యాలీకి బలాన్నిచ్చింది. వెరసి బీవోబీ, ఓబీసీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ 6-1.5% మధ్య పుంజుకోగా, ప్రైవేట్ రంగ సంస్థలు ఐసీఐసీఐ, యస్ బ్యాంక్ సైతం 3% స్థాయిలో ఎగశాయి. మరోవైపు సెన్సెక్స్‌లో టాటా పవర్ అత్యధికంగా 3.2% క్షీణించగా, రియల్టీ షేర్లు ప్రెస్టేజ్, అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, డీబీ, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్ 7-2% మధ్య జంప్ చేశాయి. ఎఫ్ఐఐలు రూ. 737 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 202 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. -
173 పాయింట్లు డౌన్
ఎట్టకేలకు ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. క్యూ3లో అంచనాలను అందుకోని జీడీపీ, చైనా ఆర్థిక మందగమనం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ భయాలు కలసి సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. దీంతో సెన్సెక్స్ 173 పాయింట్లు పడి 21,000 దిగువన 20,947 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 56 పాయింట్లు క్షీణించి 6,221 వద్ద నిలిచింది. ఇది వారం రోజుల కనిష్టంకాగా, హెల్త్‌కేర్, ఐటీ, విద్యుత్, ఆటో రంగాలు 1%పైగా నీరసించాయి. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 583 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. యుద్ధ భయాల కారణంగా చమురు ధరలు పుంజుకోవడంతో దేశీయంగా ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యాపించాయని నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం 62 స్థాయికి బలహీనపడిందని పేర్కొన్నారు. ఇటీవల భారీగా లాభపడ్డ హెల్త్‌కేర్, ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టగా, ఫిబ్రవరి నెలకు అమ్మకాలు తగ్గడంతో ఆటో షేర్లు డీలాపడ్డాయని విశ్లేషించారు. మరిన్ని విశేషాలివీ... సెన్సెక్స్ దిగ్గజాలలో ఆర్ఐఎల్, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, కోల్ ఇండియా మాత్రమే అదికూడా నామమాత్రంగా లాభపడ్డాయి. హెల్త్‌కేర్ షేర్లలో పిరమల్ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా తదితరాలు 3-2% మధ్య నష్టపోయాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్ 4.5% పతనంకాగా, భెల్, ఎంఅండ్ఎం, సెసాస్టెరిలైట్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టీసీఎస్, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ 3-1% మధ్య తిరోగమించాయి. డీలిస్టింగ్ వార్తలతో ఆస్ట్రాజెనెకా 20% దూసుకెళ్లి రూ. 1,111 వద్ద ముగిసింది. కంపెనీలో స్వీడిష్ మాతృ సంస్థకు 75% వాటా ఉంది. మరోవైపు అబుదాబీ కంపెనీకి రెండు జల విద్యుత్ ప్లాంట్లను విక్రయిస్తున్న నేపథ్యంలో జేపీ పవర్ వెంచర్స్ 15%పైగా పతనమైంది. రైల్వేలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందన్న అంచనాలతో కెర్నెక్స్ మైక్రో, కాళిందీ రైల్, టిటాగఢ్ వ్యాగన్స్, టెక్సమాకో రైల్ 12%-3% మధ్య జంప్‌చేశాయి. ఇతర షేర్లలో జూబిలెంట్ లైఫ్, పేపర్ {పొడక్ట్స్ 10% చొప్పున పురోగమించాయి. రష్యా ఇండెక్స్ 9% పతనం ఉక్రెయిన్‌లోకి రష్యా మిలటరీ దళాల ప్రవేశం నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో రష్యా కరెన్సీ రూబుల్ 2.5% పతనమై కొత్త కనిష్టం 36.5కు చేరింది. వెరసి మాస్కో ఇండెక్స్ ఎంఐసీఈఎక్స్ 9% దిగజారింది. రష్యా కేంద్ర బ్యాంకు ఉన్నపళాన రుణాలపై వడ్డీ రేట్లను 5.5% నుంచి 7%కు పెంచింది. అంతేకాకుండా రూబుల్‌కు బలాన్నిచ్చేందుకు 10 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలను విక్రయించింది. మరోవైపు ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు 0.5-2% మధ్య నీరసించాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు 1 శాతంపైగా క్షీణతతో ట్రేడవుతున్నాయి. -
మెటల్, సిమెంట్ షేర్ల ర్యాలీ
మెటల్, సిమెంటు షేర్లు ర్యాలీ జరపడంతో బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా నాలుగోరోజు లాభపడింది. శుక్రవారం పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన సెన్సెక్స్ చివరకు 66 పాయింట్లు ఎగిసి 20,376 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 6,063 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికాలో విడుదలకానున్న జాబ్స్ డేటా మెరుగ్గా వుంటుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌కావడం ఇక్కడి సెంటిమెంట్‌ను బలపర్చిందని ట్రేడర్లు చెప్పారు. అయితే భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు వెలువడనున్న నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా లాభాలు స్వీకరించారని, దాంతో రోజంతా సూచీలు ఒడుదుడుకులకు లోనయ్యాయని ట్రేడర్లు వివరించారు. మెటల్ షేర్లు టాటా స్టీల్ 6.5 శాతం, సేసా స్టెరిలైట్ 3.5 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. సిమెంటు షేర్లు అంబూజా, ఏసీసీ, అల్ట్రాటెక్లు 2.5-5 శాతం మధ్య పెరిగాయి. ఫైనాన్షియల్ షేర్లు ఐడీఎఫ్సీ, బీఓబీ, యాక్సిస్ బాంక్లు 2-4 శాతం మధ్య ఎగిసాయి. ఐటీ షేర్లు టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్‌లు 1-1.5 శాతం మధ్య. ఎఫ్ఎంసీజీ షేర్లు హెచ్‌యుఎల్, ఐటీసీలు 0.5-1.5 శాతం మధ్య తగ్గాయి. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో షార్ట్ కవరింగ్.... అమెరికా జాబ్స్ డేటా, భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు వెలువడనున్న నేపథ్యంలో నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ కవరింగ్ జరిగింది. శుక్రవారం ట్రేడింగ్ సందర్భంగా ఒకదశలో నిఫ్టీ షేర్ల బాస్కెట్ సెల్లింగ్ జరగడంతో సూచీ హఠాత్తుగా క్షీణించింది. ఆ సమయంలో షార్ట్ కవరింగ్ ప్రారంభంకావడంతో నిఫ్టీ చివరకు పాజిటివ్‌గా ముగిసింది. కవరింగ్‌ను సూచిస్తూ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 6.54 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.53 కోట్ల షేర్లకు తగ్గింది. కొద్దిరోజుల నుంచి మద్దతును అందిస్తున్న 6,000 స్థాయి వద్ద తాజా పుట్ రైటింగ్ ఫలితంగా 7.78 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 83.30 లక్షల షేర్లకు చేరింది. 6,100 స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో 6 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 48.23 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో క్షీణత సంభవిస్తే 6,000 స్థాయి వద్ద గట్టి మద్దతు లభించవచ్చని, ఈ మద్దతు సాయంతో నెమ్మదిగా 6,100 స్థాయిని నిఫ్టీ దాటవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది. -
వారం రోజుల గరిష్టం
ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో స్టాక్ సూచీలు వారంరోజుల గరిష్టస్థాయిలో ముగిసాయి. గురువారం 20,358-20,080 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 50 పాయింట్ల లాభంతో 20,311 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జనవరి 31 తర్వాత బీఎస్ఈ సూచీకి ఇదే గరిష్ట ముగింపు. ఒకదశలో 5,965 పాయింట్ల స్థాయికి పడిపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 14 పాయింట్ల లాభంతో 6,036 పాయింట్ల వద్ద ముగిసింది. మూడురోజులుగా సెన్సెక్స్ 101 పాయింట్లు పెరగగలిగింది. అంతకుముందు ఏడు రోజుల్లో 1,100 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. సూచీల్లో ఎక్కువ వెయిటేజీ వున్న ఎఫ్ఎంసీజీ షేర్లు ఐటీసీ, హెచ్‌యూఎల్‌లు 2-3 శాతం మధ్య ర్యాలీ జరపడంతో తాజాగా మార్కెట్ వారంరోజుల గరిష్టాన్ని అందుకోవడం సాధ్యపడింది. ఆటో షేర్లు మారుతి, మహీంద్రాలు 2 శాతం మేర పెరగ్గా, పీఎస్‌యూ షేర్లు కోల్ ఇండియా 5 శాతం, ఎన్ ఎండీసీ 2.5 శాతం చొప్పున ఎగిసాయి. రియల్టీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ 2 శాతం తగ్గాయి. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బీఓబీ, పీఎన్‌బీలు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. కొద్ది రోజులగా కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కాస్త నెమ్మదించింది. తాజాగా వీరు రూ. 10 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలుచేయగా, దేశీయ సంస్థలు రూ. 610 కోట్లు పెట్టుబడి చేసాయి. ఐటీసీ కౌంటర్లో షార్ట్ కవరింగ్ గురువారం మార్కెట్ హఠాత్తుగా టర్న్ ఎరౌండ్కావడానికి సూచీల్లో 10% పైగా వెయిటేజి వున్న ఐటీసీ కౌంటర్లో షార్ట్ కవరింగ్ జరగడం కారణం. కవరింగ్‌ను సూచిస్తూ ఐటీసీ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 9.56 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.76 కోట్ల షేర్లకు తగ్గింది. రూ. 320 స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 1.06 లక్షల షేర్లు కట్‌కాగా, ఇదే స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో 84 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ కాల్ ఆప్షన్లో ఓఐ 2.06 లక్షలు, పుట్ ఆప్షన్లో 3.11 లక్షల షేర్ల వరకూ వుంది. రూ. 330 కాల్ ఆప్షన్లో మాత్రం 45 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 6.97 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 320పైన స్థిరపడగలిగితే రూ. 330 స్థాయిని సమీపించవచ్చని, తదుపరి అప్‌ట్రెండ్ జరగాలంటే రూ. 330 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించాల్సివుంటుందని ఈ ఆప్షన్ డేటా పేర్కొంటోంది. -
టెలికం షేర్లు డీలా
రానున్న స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు 8 కంపెనీలు బిడ్స్ దాఖలు చేయనున్న వార్తలు టెలికం షేర్లను పడగొట్టాయి. రిలయన్స్ జియో ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం సేవలకు సిద్ధపడటం మరోసారి పోటీకి తెరలేపనుందన్న అంచనాలు టెలికం షేర్లలో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు విశ్లేషించారు. దీనికితోడు పెరగనున్న పోటీ నేపథ్యంలో క్రెడిట్ సూసీ టెలికం షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని వివరించారు. వెరసి ఐడియా సెల్యులార్ 7% పతనంకాగా, భారతీ ఎయిర్టెల్ 5%, ఆర్‌కామ్ 4%, టాటా టెలీ 3.3%, టాటా కమ్యూనికేషన్, ఎంటీఎన్ఎల్ 2% చొప్పున నష్టపోయాయి. కాగా, మరోవైపు మార్కెట్లు స్థిరీకరణ బాటలో సాగుతూ అక్కడక్కడే సంచరించాయి. 21,484-21,265 పాయింట్ల మధ్య కదిలిన సెన్సెక్స్ చివరికి 24 పాయింట్లు క్షీణించి 21,265 వద్ద ముగిసింది. నిఫ్టీ అయితే 2 పాయింట్ల నామమాత్ర నష్టంతో 6,319 వద్ద నిలిచింది. ఇక ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించిన కోల్ ఇండియా మరో 2.6% లాభపడింది. ఇన్ఫీకి పూర్వవైభవం మార్కెట్ల గమనాన్ని ప్రతిబింబించే ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపగల వెయిటేజీని ఇన్ఫోసిస్ తిరిగి సాధించింది. నిఫ్టీలో 8.67% వెయిటేజీ పొందడం ద్వారా ఐటీసీ(8.66%)ను రెండో స్థానంలోకి నెట్టింది. గురువారం ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ 0.3% లాభపడి రూ. 3,722 వద్ద ముగియగా, ఐటీసీ 0.7% క్షీణించి రూ. 327 వద్ద నిలిచింది. -
నాలుగో రోజూ నష్టాలే
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా భారత్ స్టాక్ సూచీలు వరుసగా నాలుగోరోజూ తగ్గాయి. క్యూ 3 ఫలితాల సీజన్ దగ్గరపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంకావడం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశపు మినిట్స్ వెల్లడికానుండటం, భారత్ సర్వీసుల రంగం నెమ్మదించిందంటూ హెచ్ఎస్బీసీ సూచి వెల్లడించడం వంటి అంశాలతో తాజా అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 20,787 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 పాయింట్ల క్షీణతతో 6,191 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీల్లో ఎక్కువ వెయిటేజి వున్న ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2% మధ్య నష్టపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తగ్గాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకింగ్, రియల్టీ, పవర్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. కొద్ది రోజుల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు దృష్టిపెడుతున్న మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ మాత్రం కొనసాగింది. ఎఫ్ఐఐలు రూ. 318 కోట్లు వెనక్కు తీసుకున్నారు. దేశీయ సంస్థలు రూ. 22 కోట్ల షేర్లను విక్రయించాయి. నిఫ్టీ 6,200 పుట్ ఆప్షన్లలో బిల్డప్... వరుసగా రెండోరోజూ 6,170 సమీపంలో నిఫ్టీ మద్దతు పొందడంతో 6,200 స్ట్రయిక్ వద్ద ఇన్వెస్టర్లు పుట్ ఆప్షన్లను విక్రయించారు. దాంతో ఈ పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో మరో 3 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 43.42 లక్షల షేర్లకు పెరిగింది. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో కూడా 3.98 లక్షల షేర్లు యాడ్‌అయినా, మొత్తం ఓఐ పరిమితంగా 22.34 లక్షలే వుంది. కానీ 6,300 స్ట్రయిక్ వద్ద భారీగా కాల్ రైటింగ్ జరగడంతో 8.47 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 49.21 లక్షల షేర్లకు పెరిగింది. ఏదైనా ప్రతికూల వార్త వెలువడితే తప్ప, నిఫ్టీ 6,200పైకి తిరిగి చేరవచ్చని, రానున్న రోజుల్లో 6,300 స్థాయి నిరోధించవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు ఈ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. ఫలానా స్థారుుని మించి షేరు లేదా ఇండెక్స్ పెరగదన్న అంచనాలతో కాల్ ఆప్షన్‌ను, లేదా తగ్గదన్న అంచనాలతో పుట్ ఆప్షన్‌ను విక్రరుుంచడాన్ని ఆప్షన్ రైటింగ్‌గా వ్యవహరిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లు షేరు పెరగకపోతే కాల్ ఆప్షన్ ప్రీమియుం, తగ్గకపోతే పుట్ ఆప్షన్ ప్రీమియుం తగ్గిపోతుంది. ఎక్కువ ప్రీమియుంకు విక్రరుుంచిన ఆప్షన్ కాంట్రాక్టును ప్రీమియుం తగ్గిన తర్వాత కొంటే, అవ్ముకం కొనుగోలు ధర వుధ్య వ్యత్యాసం లాభంగా మిగులుతుంది. అంచనాలకు భిన్నంగా ప్రీమియుం పెరిగితే ఆప్షన్లు రైట్ చేసినవారు నష్టపోతారు. అలా అమ్మకందార్లు రైట్ చేసిన కాంట్రాక్టులను కొన్నవారు లాభపడతారు. -
వెలుగులో ఐటీ, ఫార్మా షేర్లు
ప్రపంచ మార్కెట్ల బలహీనత కారణంగా కొత్త సంవత్సరం వరుసగా మూడోరోజూ స్టాక్ సూచీలు క్షీణించాయి. గత రాత్రి అమెరికా, శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు తగ్గడంతో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 20,731 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో ముగింపులో చాలావరకూ నష్టాల్ని పూడ్చుకుని, చివరకు 37 పాయింట్ల స్వల్పనష్టంతో 20,851 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గత మూడురోజుల్లో సెన్సెక్స్ 320 పాయింట్ల వరకూ నష్టపోయింది. మరో 10 రోజుల్లో టెక్నాలజీ కంపెనీల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ప్రధాన ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్ 2 శాతంపైగా ర్యాలీ జరిపాయి. ఇదేబాటలో ఫార్మా షేర్లు ర్యాన్‌బాక్సీ, లుపిన్లు 3-4 శాతం మధ్య పెరిగాయి. పవర్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన షేర్లు క్షీణించాయి. టాటా పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, లార్సన్ అండ్ టూబ్రోలు 2-4 శాతం మధ్య క్షీణించాయి. ఆయిల్ షేర్లు ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్‌లు 1-3 శాతం మధ్య పడిపోయాయి. మిడ్‌క్యాప్ జోరు : ఒక రోజు విరామం తర్వాత తిరిగి మిడ్‌క్యాప్ షేర్లు బాగా పుంజుకున్నాయి. డెరివేటివ్ విభాగంలో ట్రేడయ్యే అశోక్ లేలాండ్, హెక్సావేర్, బయోకాన్, అరబిందో ఫార్మా, ఫ్యూచర్ రిటైల్, సెంచురీ టెక్స్టైల్స్, యునెటైడ్ స్పిరిట్స్, జేపీ పవర్, టాటా కమ్యూనికేషన్ షేర్లు 3-7% మధ్య ర్యాలీ జరిపాయి. నగదు విభాగంలో ట్రేడయ్యే ఎంసీఎక్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేర్లు 17-20 శాతం మధ్య ఎగిసాయి. ఎంసీఎక్స్‌లో ప్రమోటర్లు తాజా పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనను ప్రకటించడంతో ఈ షేర్లు పెరిగాయి. సొనాటా సాఫ్ట్వేర్, ఎంబీఎల్ ఇన్ఫ్రా, జస్ట్ డయిల్, టీసీఐ షేర్లు 10-15 శాతం మధ్య పరుగులు తీసాయి. చాలా రోజుల తర్వాత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్వల్పంగా నికర విక్రయాలు జరిపారు. వీరు రూ. 18 కోట్లు వెనక్కు తీసుకోగా, దేశీయ సంస్థలు రూ. 280 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. -
సెన్సెక్స్ 385 పాయింట్లు జంప్
దేశీ స్టాక్ మార్కెట్లకు దసరా పండుగ ముందే వచ్చిందా అన్నట్లు ఇన్వెస్టర్లలో ఉత్సాహం జోరందుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 385 పాయింట్లు దూసుకెళ్లి వరుసగా రెండోరోజూ లాభాలతో ముగిసింది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్) కారణంగా... అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(టాపరింగ్)ను మరికొన్నాళ్లు వాయిదావేయొచ్చన్న అంచనాలు మార్కెట్లకు ఆక్సిజన్‌గా పనిచేసింది. వారం రోజుల గరిష్టానికి చేరిన సెన్సెక్స్ 19,902 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల షేర్ల దూకుడుతో సూచీలు పరుగులు తీశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 130 పాయింట్లు దూసుకెళ్లి 5,910 పాయింట్ల వద్ద స్థిరపడటం గమనార్హం. కాగా, గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పుంజుకుంది. ఏకంగా 73 పైసలు బలపడి 61.73కు ఎగబాకింది. ఇది ఏడు వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. రూపాయి బలోపేతం కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్ మెరుగయ్యేందుకు ఉపకరించిందని మార్కెట్ పరిశీలకులు విశ్లేషించారు. పండుగ సీజన్లో వాహన, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాల వినియోగదారులకు మరిన్ని రుణాలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన పెట్టుబడుల నిధులను పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించడం కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. బ్యాంకింగ్ స్టాక్స్‌కు మద్దతుగా నిలిచింది. 12 రంగాలు లాభాల్లోనే... బీఎస్ఈలోని మొత్తం 13 రంగాల సూచీల్లో 12 సూచీలు లాభాల బాట పట్టాయి. వీటిలో అత్యధికంగా ఎగబాకిన వాటిలో మెటల్స్(3.94%), బ్యాంకింగ్(3.41%), క్యాపిటల్ గూడ్స్(2.82%), ఆయిల్-గ్యాస్(2.46%) ఇండెక్స్‌లు ముందువరుసలో నిలిచాయి. సెనెక్స్ జాబితాలోని 30 షేర్లలో కేవలం రెండు మాత్రమే(ఐటీసీ, హెచ్‌యూఎల్) నష్టాలతో ముగిశాయి. సెసాగోవా షేరు అత్యధికంగా 7.21 శాతం దూసుకెళ్లి రూ.188 వద్ద స్థిరపడింది. ప్రధానంగా లాభపడిన వాటిలో బజాజ్ ఆటో(5.1%), హిందాల్కో(4.34%), టాటా పవర్(4.04%), టీసీఎస్(4.02%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(4%), టాటా స్టీల్(3.68%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2.89%) ఉన్నాయి. గురువారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం దాదాపు రూ.1,000 కోట్ల విలువైన నికర పెట్టుబడులు వెచ్చించారు. దేశీ ఫండ్స్ రూ.449 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. నిఫ్టీ, టాటా గ్రూప్ షేర్లలో లాంగ్ బిల్డప్... గురువారం అనూహ్యంగా పెరిగిన వూర్కెట్లో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ ఫ్యూచర్లో లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ పొజిషన్లను సూచిస్తూ స్పాట్ నిఫ్టీతో పోలిస్తే అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు 56 పాయింట్ల ప్రీమియుంతో 5,966 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 10.09 లక్షల షేర్లు (6.18 శాతం) యూడ్ అయ్యూయి. దాంతో మొత్తం ఓఐ 1.73 కోట్ల షేర్లకు చేరింది. 5,800, 5,900 స్ట్రరుుక్స్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది. దాంతో 5,800 కాల్ ఆప్షన్ ఓఐ నుంచి 2.96 లక్షల షేర్లు, 5,900 కాల్ ఆప్షన్ ఓఐ నుంచి 3.23 లక్షల షేర్ల చొప్పున కట్ అయ్యూయి. అలాగే 5,900 పుట్ ఆప్షన్ ఓఐలో 5.77 లక్షల షేర్లు, 5,800 పుట్ ఆప్షన్లో 10.29 లక్షల షేర్ల చొప్పున యూడ్ అయ్యూయి. 5,800 పుట్ ఆప్షన్ వద్ద అధికంగా 42 లక్షల షేర్ల ఓఐ వున్నందున, సమీప భవిష్యత్తులో నాటకీయుంగా క్షీణత ఏదైనా సంభవిస్తే, ఈ స్థాయి వద్ద నిఫ్టీ వుద్దతు పొందవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. టాటా గ్రూప్ షేర్లలో కూడా...: 10 రోజుల్లో ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో టాప్ ఐటీ షేర్లు 2-4% వుధ్య పెరిగారుు. క్యాష్ వూర్కెట్లో 4%పైగా ర్యాలీ జరిపిన టీసీఎస్ ఫ్యూచర్లో జోరుగా లాంగ్ బిల్డప్ జరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ఈ ఫ్యూచర్ రూ. 14 ప్రీమియుంతో ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో 2.53 లక్షల షేర్లు (4.45%) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 59.41 లక్షల షేర్లకు చేరింది. వాహన రుణాల పెంపునకు తగిన నిధులు ప్రభుత్వ బ్యాంకులకు లభిస్తున్నాయున్న వార్తలతో టాటా మోటార్స్ షేరు కూడా 3% పెరిగింది. ఈ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో 15.17 లక్షల షేర్లు (8.54%) తాజాగా యూడ్ అయ్యూయి. మొత్తం ఓఐ 1.92 కోట్ల షేర్లకు పెరిగింది. మెటల్స్ రంగంలోని టాటా స్టీల్ కౌంటర్లోనూ తాజాగా 1.87 లక్షల షేర్లు యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.62 కోట్ల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో షేరు వురింత పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలు చేసే కాంట్రాక్టును లాంగ్ పొ జిషన్గా పరిగణిస్తారు. షేరు పెరుగుతూ ఓఐ యూడ్అవుతూవుంటే ఆ కాంట్రాక్టులో లాంగ్ పొజిషన్లు పెరుగుతున్నాయుని డెరివేటివ్ విశ్లేషకులు భావిస్తారు. -
బ్యాంకింగ్ షేర్లు డీలా
బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్ షేర్లలో జరిగిన అమ్మకాల ఫలితంగా శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి 19,727 పాయింట్ల వద్ద ముగిసింది. అధిక ద్రవ్యోల్బణం పట్ల రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేయడంతో వడ్డీ రేట్ల ద్వారా ప్రభావితమయ్యే బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో హఠాత్తుగా అమ్మకాలు మొదలయ్యాయి. అటుతర్వాత క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దాంతో సెన్సెక్స్ దాదాపు మూడు వారాల కనిష్టస్థాయి వద్ద ముగిసింది. తాజా క్షీణతతో నాలుగువారాల ర్యాలీకి బ్రేక్పడినట్లయ్యింది. ఈ వారం మొత్తం మీద సూచీ 536 పాయింట్లు నష్టపోయింది. ఈ వారంలో 179 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం 49 పాయింట్ల నష్టంతో 5,833 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధాన బ్యాంకింగ్ షేర్లయిన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 2 శాతం మేర క్షీణించాయి. రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ 3-5 శాతం మధ్య నష్టపోయాయి. బీహెచ్ఈఎల్ 4 శాతం, టాటా స్టీల్, హిందాల్కోలు 3 శాతం చొప్పున తగ్గాయి. సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 2 శాతం మేర పెరిగాయి. మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 245 కోట్లు ఉపసంహరించుకున్నారు. దేశీయ సంస్థలు రూ. 115 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించాయి. -
స్వల్ప హెచ్చుతగ్గులు
ఇన్వెస్టర్లను ప్రభావితం చేయగల అంశాలేవీ లేకపోవడంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు నత్తనడక నడిచాయి. అయితే రోజు మొత్తంలో స్వల్పశ్రేణిలో పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో గరిష్టంగా 19,899ను, కనిష్టంగా 19,676 పాయింట్లను తాకింది. చివరికి 49 పాయింట్లు క్షీణించి 19,733 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ మాత్రం యథాతథంగా 5,851 వద్దే స్థిరపడింది. ఇందుకు గత రెండు వారాల్లో మార్కెట్లు 10% పుంజుకోవడం కూడా కారణంగా నిలుస్తోంది. ప్రధాని ఆర్థిక సలహాదారు రంగరాజన్ జీడీపీ వృద్ధి అంచనాను 6.4% నుంచి 5.3%కు కుదించడం కూడా కొంతమేర సెంటిమెంట్‌ను బలహీనపరచింది. వచ్చే వారం ఇటు రిజర్వ్ బ్యాంక్, అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలు ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఐటీ షేర్లు డీలా బీఎస్ఈలో రియల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 2.5% స్థాయిలో పుంజుకోగా వినియోగ వస్తువులు, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు 1.5-1% మధ్య క్షీణించాయి. దిగ్గజాలలో విప్రో అత్యధికంగా 3.6% పతనంకాగా, టాటా స్టీల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, భారతీ, టీసీఎస్, హెచ్‌యూఎల్ 1.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు భెల్ 5.6% ఎగసింది. ఈ బాటలో కోల్ ఇండియా, ఎల్అండ్టీ, టాటా పవర్, హీరో మోటో, ఎంఅండ్ఎం 3-2% మధ్య పుంజుకున్నాయి. వెలుగులో చిన్న షేర్లు? మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.6% బలపడ్డాయి. బీఎస్ఈ-500లో కోల్టేపాటిల్ 17% దూసుకెళ్లగా సింటెక్స్, ఫినోలె క్స్, పటేల్ ఇంజినీరింగ్, యూబీ హోల్డిం గ్స్, జేకే లక్ష్మీ సిమెంట్, బాంబే డయింగ్, బిల్ట్, జేపీ పవర్, లవబుల్ లింగరీ తదితరాలు 11-7% మధ్య జంప్‌చేశాయి. ఎఫ్ఐఐలు రూ. 98 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 152 కోట్లు చొప్పున అమ్మకాలు జరిపాయి. -
రూపాయి.. చావుకేక!
దేశీ కరెన్సీ చావుకేక పెట్టింది. గత కొద్దిరోజులుగా పాతాళానికి దారులుతీసున్న రూపాయి.. చరిత్రలో ఎన్నడూఎరుగని రీతిలో కుప్పకూలింది. ఒక్కరోజే ఏకంగా 200 పైసలు పడిపోయి 66 దిగువకు జారిపోయింది. సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టాలను నమోదుచేసి ప్రభుత్వం, ఆర్బీఐలకు ముచ్చెమటలు పోయిస్తోంది. ముంబై: లోక్‌సభ ఆమోదం పొందిన ఆహార భద్రత బిల్లు రూపాయికి మరిన్ని తూట్లు పొడిచింది. ఈ చట్టం అమలుతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం భారీగా పెరిగిపోయి.. ద్రవ్యలోటు దూసుకెళ్తుందనే భయాలు దేశీ కరెన్సీని వణికించాయి. దీంతో మంగళవారం ఒకేరోజు 200 పైసలు పడిపోయి కనీవినీఎరుగని పతనాన్ని రూపాయి చవిచూసింది. క్రితం ముగింపు 64.30తో పోలిస్తే ఒకానొక దశలో 66.30ని కూడా తాకింది. చివరకు 194 పైసలు(3.02 శాతం) క్షీణించి 66.24 వద్ద ముగిసింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం అన్నిచర్యలూ తీసుకుంటుందని ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఇచ్చిన హామీకూడా ఎలాంటి సానుకూల ప్రభావం చూపలేదు. మరోపక్క, ఆహార భద్రత బిల్లు భయాలతో అటు స్టాక్ మార్కెట్ కూడా 600 పాయింట్ల మేర కుప్పకూలడం రూపాయిని ఛిన్నాభిన్నం చేసింది. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకడం కూడా దేశీ కరెన్సీని దిగజార్చాయి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు యథేచ్ఛగా డిమాండ్ పెరిగిపోవడంతో రూపాయి విలువ హారతికర్పూరంలా ఆవిరైందని ఫారెక్స్ డీలర్లు వ్యాఖ్యానించారు.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 65 వద్ద బలహీనంగా ఆరంభమైంది. ఆతర్వాత పూర్తిగా నష్టాల్లోనే కొనసాగుతూ 66 స్థాయి దిగువకు పడిపోయింది. మంగళవారంనాటి ఇంట్రాడే, ముగింపులు రెండూ కొత్త ఆల్‌టైమ్ కనిష్టాలే కావడం గమనార్హం. సోమవారం కూడా దేశీ కరెన్సీ విలువ 110 పైసలు క్షీణించడం తెలిసిందే. కాగా, ఈ నెల 19న రూపాయి 148 పైసలు పడిపోయి దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేసింది. ఇప్పుడు చరిత్రలోనే కనీవినీఎరుగని రీతిలో ఒకేరోజు కుప్పకూలింది. 22న నమోదైన 65.56 స్థాయి ఇంట్రేడేలో ఇప్పటిదాకా ఆల్‌టైమ్ కనిష్టంగా ఉంది. చమురు దెబ్బ... బ్రెంట్ క్రూడ్ ధర అంతర్జాతీయంగా 113 డాలర్లకు ఎగబాకడంతో దిగుమతుల భారం పెరిగేందుకు దారితీస్తుందన్న ఆందోళనలు రూపాయికి మంటపెట్టాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్రెజరర్ మోహన్ షెనాయ్ వ్యాఖ్యానించారు. సిరియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో చమురుధరలకు రెక్కలొస్తున్నాయి. మరోపక్క, ఆహార భద్రత బిల్లుతో ద్రవ్యలోటు ఎగబాకనుండటం కూడా ఆర్థిక వ్యవస్థకు గుదిబండే. ఈ ఏడాది ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాన్ని(4.8%) భారత్ రేటింగ్‌ను కట్ చేస్తామంటూ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోపక్క, అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగైన రికవరీతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను ఉపసంహరించొచ్చన్న భయాలు కూడా రూపాయిని కొద్దిరోజులుగా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి తమ నిధులను వెనక్కి తరలించుకుపోతారన్న ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే ఎఫ్ఐఐల అమ్మకాలు అటు డెట్, ఇటు స్టాక్ మార్కెట్లో జోరందు కుంటున్నాయి.67ను తాకొచ్చు...: చమురు దిగుమతిదారుల నుంచి భారీ డిమాండ్‌తో రూపాయి బలహీన ధోరణినే కొనసాగించొచ్చని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ పేర్కొన్నారు. 65-67 స్థాయిలో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఇదిలాఉండగా.. బ్రిటిష్ పౌండ్తో రూపాయి విలువ కూడా కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారింది. క్రితం ముగింపు 100.12తో పోలిస్తే 268 పైసలు కుప్పకూలి 102.80 వద్ద స్థిరపడింది. -
మరో 68 పాయింట్లు డౌన్
డాలరుతో మారకంలో రూపాయి విలువ మరో కొత్త కనిష్టాన్ని తాకడంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ ఒడిదొడుకులను ఎదుర్కొంది. 18,811-18,551 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 18,665 వద్ద స్థిరపడింది. ఇది 68 పాయింట్ల నష్టంకాగా, నిఫ్టీ కూడా 23 పాయింట్లు క్షీణించింది. 17 వారాల కనిష్టమైన 5,519 వద్ద నిలిచింది. అయితే మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లు పుంజుకున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.3% లాభపడగా, మిడ్ క్యాప్ 0.7% బలపడింది. వెరసి ట్రేడైన మొత్తం షేర్లలో 1,249 లాభపడగా, 1,042 నష్టపోయాయి. ఏప్రిల్-జూన్ కాలానికి కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.7% స్థాయిలో వృద్ధి చెందడంతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలలో కోత విధించవచ్చునన్న అంచనాలు బలపడుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లుతాయన్న ఆందోళనతో అమ్మకాలు కొనసాగుతున్నాయని విశ్లేషించారు. రియల్టీ హైజంప్ ప్రధానంగా ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% స్థాయిలో డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5% ఎగసింది. ఐటీ షేర్లపై ఫండ్స్ మక్కువ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై దేశీయ మ్యూ చువల్ ఫండ్స్‌కు మక్కువ పెరుగుతోంది. జూన్ చివరికి ఐటీ రంగ షేర్లలో ఫండ్స్ మొత్తం పెట్టుబడులు రూ. 18,430 కోట్లకు చేరాయి. ఇవి మూడు నెలల గరిష్టంకాగా, ఫండ్స్ నిర్వహణలోగల మొత్తం ఆస్తులలో(ఏయూఎం) 10% వాటాకు సమానం. సెబీ గణాంకాల ప్రకారం జూన్ 30కల్లా ఫండ్స్ ఏయూఎం రూ. 1.80 లక్షల కోట్లుగా నమోదైంది.