సెన్సెక్స్ 385 పాయింట్లు జంప్ | Sensex closes 385 points up; bank stocks gain | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 385 పాయింట్లు జంప్

Published Fri, Oct 4 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

సెన్సెక్స్ 385 పాయింట్లు జంప్

సెన్సెక్స్ 385 పాయింట్లు జంప్

 దేశీ స్టాక్ మార్కెట్లకు దసరా పండుగ ముందే వచ్చిందా అన్నట్లు ఇన్వెస్టర్లలో ఉత్సాహం జోరందుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 385 పాయింట్లు దూసుకెళ్లి వరుసగా రెండోరోజూ లాభాలతో ముగిసింది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్) కారణంగా... అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(టాపరింగ్)ను మరికొన్నాళ్లు వాయిదావేయొచ్చన్న అంచనాలు మార్కెట్లకు ఆక్సిజన్‌గా పనిచేసింది. వారం రోజుల గరిష్టానికి చేరిన సెన్సెక్స్ 19,902 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల షేర్ల దూకుడుతో సూచీలు పరుగులు తీశాయి.
 
  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 130 పాయింట్లు దూసుకెళ్లి 5,910 పాయింట్ల వద్ద స్థిరపడటం గమనార్హం.  కాగా, గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పుంజుకుంది. ఏకంగా 73 పైసలు బలపడి 61.73కు ఎగబాకింది. ఇది ఏడు వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. రూపాయి బలోపేతం కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్ మెరుగయ్యేందుకు ఉపకరించిందని మార్కెట్ పరిశీలకులు విశ్లేషించారు. పండుగ సీజన్‌లో వాహన, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాల వినియోగదారులకు మరిన్ని రుణాలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన పెట్టుబడుల నిధులను పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించడం కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. బ్యాంకింగ్ స్టాక్స్‌కు మద్దతుగా నిలిచింది.
 
 12 రంగాలు లాభాల్లోనే...
 బీఎస్‌ఈలోని మొత్తం 13 రంగాల సూచీల్లో 12 సూచీలు లాభాల బాట పట్టాయి. వీటిలో అత్యధికంగా ఎగబాకిన వాటిలో మెటల్స్(3.94%), బ్యాంకింగ్(3.41%), క్యాపిటల్ గూడ్స్(2.82%), ఆయిల్-గ్యాస్(2.46%) ఇండెక్స్‌లు ముందువరుసలో నిలిచాయి.  సెనెక్స్ జాబితాలోని 30 షేర్లలో కేవలం రెండు మాత్రమే(ఐటీసీ, హెచ్‌యూఎల్) నష్టాలతో ముగిశాయి. సెసాగోవా షేరు అత్యధికంగా  7.21 శాతం దూసుకెళ్లి రూ.188 వద్ద స్థిరపడింది. ప్రధానంగా లాభపడిన వాటిలో   బజాజ్ ఆటో(5.1%), హిందాల్కో(4.34%), టాటా పవర్(4.04%), టీసీఎస్(4.02%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(4%), టాటా స్టీల్(3.68%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2.89%) ఉన్నాయి.  గురువారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం దాదాపు రూ.1,000 కోట్ల విలువైన నికర పెట్టుబడులు వెచ్చించారు. దేశీ ఫండ్స్ రూ.449 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి.
 
 నిఫ్టీ, టాటా గ్రూప్ షేర్లలో లాంగ్ బిల్డప్...
 గురువారం అనూహ్యంగా పెరిగిన వూర్కెట్లో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ ఫ్యూచర్లో లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ పొజిషన్లను సూచిస్తూ స్పాట్ నిఫ్టీతో పోలిస్తే అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు 56 పాయింట్ల ప్రీమియుంతో 5,966 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 10.09 లక్షల షేర్లు (6.18 శాతం) యూడ్ అయ్యూయి. దాంతో మొత్తం ఓఐ 1.73 కోట్ల షేర్లకు చేరింది. 5,800, 5,900 స్ట్రరుుక్స్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది. దాంతో 5,800 కాల్ ఆప్షన్ ఓఐ నుంచి 2.96 లక్షల షేర్లు, 5,900 కాల్ ఆప్షన్ ఓఐ నుంచి 3.23 లక్షల షేర్ల చొప్పున కట్ అయ్యూయి. అలాగే 5,900 పుట్ ఆప్షన్ ఓఐలో 5.77 లక్షల షేర్లు, 5,800 పుట్ ఆప్షన్లో 10.29 లక్షల షేర్ల చొప్పున యూడ్ అయ్యూయి. 5,800 పుట్ ఆప్షన్ వద్ద అధికంగా 42 లక్షల షేర్ల ఓఐ వున్నందున, సమీప భవిష్యత్తులో నాటకీయుంగా క్షీణత ఏదైనా సంభవిస్తే, ఈ స్థాయి వద్ద నిఫ్టీ వుద్దతు పొందవచ్చని ఈ డేటా సూచిస్తున్నది.
 
  
 టాటా గ్రూప్ షేర్లలో కూడా...: 10 రోజుల్లో ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో టాప్ ఐటీ షేర్లు 2-4% వుధ్య పెరిగారుు. క్యాష్ వూర్కెట్లో 4%పైగా ర్యాలీ జరిపిన టీసీఎస్ ఫ్యూచర్లో జోరుగా లాంగ్ బిల్డప్ జరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ఈ ఫ్యూచర్ రూ. 14 ప్రీమియుంతో ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో 2.53 లక్షల షేర్లు (4.45%) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 59.41 లక్షల షేర్లకు చేరింది. వాహన రుణాల పెంపునకు తగిన నిధులు ప్రభుత్వ బ్యాంకులకు లభిస్తున్నాయున్న వార్తలతో టాటా మోటార్స్ షేరు కూడా 3% పెరిగింది. ఈ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో 15.17 లక్షల షేర్లు (8.54%) తాజాగా యూడ్ అయ్యూయి. మొత్తం ఓఐ 1.92 కోట్ల షేర్లకు పెరిగింది. మెటల్స్ రంగంలోని టాటా స్టీల్ కౌంటర్లోనూ తాజాగా 1.87 లక్షల షేర్లు యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.62 కోట్ల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో షేరు వురింత పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలు చేసే కాంట్రాక్టును లాంగ్ పొ జిషన్‌గా పరిగణిస్తారు. షేరు పెరుగుతూ ఓఐ యూడ్‌అవుతూవుంటే ఆ కాంట్రాక్టులో లాంగ్ పొజిషన్లు పెరుగుతున్నాయుని డెరివేటివ్ విశ్లేషకులు భావిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement