బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్ షేర్లలో జరిగిన అమ్మకాల ఫలితంగా శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి 19,727 పాయింట్ల వద్ద ముగిసింది. అధిక ద్రవ్యోల్బణం పట్ల రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేయడంతో వడ్డీ రేట్ల ద్వారా ప్రభావితమయ్యే బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో హఠాత్తుగా అమ్మకాలు మొదలయ్యాయి. అటుతర్వాత క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దాంతో సెన్సెక్స్ దాదాపు మూడు వారాల కనిష్టస్థాయి వద్ద ముగిసింది.
తాజా క్షీణతతో నాలుగువారాల ర్యాలీకి బ్రేక్‌పడినట్లయ్యింది. ఈ వారం మొత్తం మీద సూచీ 536 పాయింట్లు నష్టపోయింది. ఈ వారంలో 179 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 49 పాయింట్ల నష్టంతో 5,833 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధాన బ్యాంకింగ్ షేర్లయిన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 2 శాతం మేర క్షీణించాయి. రియల్టీ షేర్లు డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్ 3-5 శాతం మధ్య నష్టపోయాయి. బీహెచ్‌ఈఎల్ 4 శాతం, టాటా స్టీల్, హిందాల్కోలు 3 శాతం చొప్పున తగ్గాయి. సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 2 శాతం మేర పెరిగాయి. మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 245 కోట్లు ఉపసంహరించుకున్నారు. దేశీయ సంస్థలు రూ. 115 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించాయి.
బ్యాంకింగ్ షేర్లు డీలా
Published Sat, Sep 28 2013 1:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement