ఇన్వెస్టర్లకు అలర్ట్‌: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్‌లో అంతరాయం.. | BSE official website to remain temporarily unavailable | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు అలర్ట్‌: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్‌లో అంతరాయం..

Published Sat, Jun 17 2023 5:48 PM | Last Updated on Sat, Jun 17 2023 5:49 PM

BSE official website to remain temporarily unavailable - Sakshi

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) అధికారిక వెబ్‌సైట్ (bseindia.com)లో శనివారం (జూన్‌ 17) సాయంత్రం నుంచి అంతరాయం ఉంటుందని తెలియజేసింది. జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్‌సైట్‌ పని చేయదని వెల్లడించింది. నిర్వహణ పనుల నిమిత్తం వెబ్‌సైట్‌ 12 గంటల పాటు అందుబాటులో ఉండదు.

"మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్‌సైట్ అందుబాటులో ఉండదు" అని బీఎస్‌ఈ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏదైనా అత్యవసర ఫైలింగ్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో corp.relations@bseindia.com ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement