not available
-
ఇన్వెస్టర్లకు అలర్ట్: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్లో అంతరాయం..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) అధికారిక వెబ్సైట్ (bseindia.com)లో శనివారం (జూన్ 17) సాయంత్రం నుంచి అంతరాయం ఉంటుందని తెలియజేసింది. జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్సైట్ పని చేయదని వెల్లడించింది. నిర్వహణ పనుల నిమిత్తం వెబ్సైట్ 12 గంటల పాటు అందుబాటులో ఉండదు. "మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్సైట్ అందుబాటులో ఉండదు" అని బీఎస్ఈ తన వెబ్సైట్లో పేర్కొంది. ఏదైనా అత్యవసర ఫైలింగ్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో corp.relations@bseindia.com ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. -
మూడొంతుల మందికి మంచి తిండి కలే
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు మూడొంతుల మందికి ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పటికీ కలే. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం తదితరాలతో కూడిన సమతులాహారం సగటు భారతీయులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. అంతేగాక ఏటా 17 లక్షల మందికి పైగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తద్వారా వచ్చే క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. సెంటర్‌పర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు అర్త్ మేగజీన్ విడుదల చేసిన ‘గణాంకాల్లో భారత పర్యావరణ స్థితిగతులు: 2022’ నివేదిక ఈ మేరకు పేర్కొంది. ఆహార వ్యయం వ్యక్తిగత ఆదాయంలో 63 శాతాన్ని మించితే సదరు వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేనట్టేనని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. 20 ఏళ్లు, అంతకు మించిన వాళ్ల రోజువారీ ఆహారంలో కనీసం 200 గ్రాముల పండ్లు తప్పనిసరి. కానీ భారత్‌లో మాత్రం సగటున 35 గ్రాములకు మించి తినడం లేదట. అలాగే రోజుకు 300 గ్రాముల దాకా కూరగాయలు తీసుకోవాల్సి ఉండగా 168 గ్రాములతో సరిపెడుతున్నారు. కొంతకాలంగా పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తున్నా మొత్తమ్మీద చూస్తే అంత సానుకూలంగా లేదని నివేదిక పేర్కొంది. ‘‘ఆహార ధరలు నానాటికీ కొండెక్కుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం ఏడాదిలోనే ఏకంగా 327 శాతం పెరిగిపోయింది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చింది. -
ఇంకా కోలుకోని హార్దిక్ పాండ్యా
న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిట్నెస్ సాధించకపోవడంతో భారత ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. హార్దిక్ ఇటీవల జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ ఫిజియో అయిన ఆశిష్ కౌశిక్‌తో కలిసి లండన్ వెళ్లాడు. అక్కడ తన వెన్నెముకకు సర్జరీ చేసిన డాక్టర్‌ను కలిసి గాయంపై సమీక్ష కోరగా... అతను పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమని చెప్పినట్లు బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. దాంతో హార్దిక్ బెంగళూరులోని ఎన్సీఏ పునరావాస శిబిరంలో పూర్తి ఫిట్నెస్ సాధించేంత వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సెలెక్టర్లు న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొనే భారత్ ‘ఎ’జట్టులో హార్దిక్‌కు మొదట స్థానం కల్పించారు. అయితే అనంతరం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో అతడు ఫెయిల్ అవ్వడంతో అతడిని జట్టు నుంచి తొలగించారు. అంతే కాకుండా అతడి కోసం న్యూజిలాండ్‌తో భారత్ ఆడే టెస్టు సిరీస్ కోసం ఇప్పటి వరకు జట్టును కూడా ప్రకటించలేదు. గత ఏడాది అక్టోబర్‌లో సర్జరీ చేయించుకున్న హార్దిక్ అప్పటి నుంచి మైదానంలో అడుగు పెట్టలేదు. -
నంద్యాలలొ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందని పోస్టర్ బ్యాలెట్లు
-
ఇంకెప్పుడు?
– రబీ వస్తున్నా సిద్ధం కాని విత్తన ప్రణాళిక – రాయితీ పప్పుశనగ పంపిణీకి కుదరని ముహూర్తం – రక్షకతడికే పరిమితమైన వ్యవసాయ శాఖ జిల్లాలో అక్టోబర్ ఒకటి నుంచి రబీ వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు సంబంధించి విత్తన ప్రణాళిక తయారు∙చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. రైతులకు విత్తన పప్పుశనగ, వేరుశనగ సకాలంలో అందడం కష్టంగానే కనిపిస్తోంది. అనంతపురం అగ్రికల్చర్ : నైరుతి రుతుపవనాలు తీవ్రంగా నిరుత్సాహపరచడంతో ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7.45 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. ఇందులో వేరుశనగ అత్యధికంగా 6.09 లక్షల హెక్టార్లలో సాగైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు కోట్లాది రూపాయల పెట్టుబడులను నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఆశలన్నీ ఈశాన్య రుతుపవనాలపైనే పెట్టుకున్నారు. కనీసం ‘ఈశాన్య’మైనా కరుణిస్తే ఖరీఫ్ కష్టాల నుంచి కాస్తయినా గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రబీ పంటల సాగుకు సన్నద్ధం చేయడంలో వ్యవసాయశాఖ నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. ఈ రబీలో 50 వేల క్వింటాళ్ల పప్పుశనగ, 13,500 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విత్తన ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. ఉన్నతస్థాయి అధికారుల ముద్ర ఎప్పుడు పడుతుందో, విత్తనం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. రక్షకతడి హడావుడిలో అధికారులు ఖరీఫ్‌లో ఎండిన వేరుశనగ పంటను కాపాడతామంటూ వ్యవసాయశాఖ అధికారులు ‘రక్షకతడి’ పేరుతో నానా హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో రబీ సీజన్‌ను విస్మరిస్తున్నారు. సీజన్ సమీపిస్తున్నా సన్నాహక చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఖరీఫ్‌తో పోల్చితే రబీలో పంటల విస్తీర్ణం తక్కువగానే ఉంటుంది. అయినా రైతులకు సకాలంలో విత్తన పప్పుశనగ, వేరుశనగ అందజేయాల్సిన బాధ్యత వ్యవసాయశాఖపై ఉంది. రబీలో జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి రానున్నాయి. ఇందులో ప్రధానంగా పప్పుశనగ 80 –90 వేల హెక్టార్లు, వేరుశనగ 20 వేల హెక్టార్లు, ఇతర పంటలు 40–50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసే అవకాశముంది. సెప్టెంబర్‌లోనే రైతులకు అవసరమైన విత్తన పప్పుశనగ రాయితీపై ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 23న విత్తన పప్పుశనగ పంపిణీ ప్రారంభించారు. ఈ సారి ఇంకా ఆ దిశగా దష్టి పెట్టలేదు. విత్తన పప్పుశనగ ధర ఈ సారి భారీగా పెంచేయడంతో గత ఏడాదితో పోల్చితే జిల్లా రైతులపై రూ.8 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. బయోమెట్రిక్ ద్వారా ఒక్కో రైతుకు గరిష్టంగా 50 కిలోలు మాత్రమే ఇవ్వనున్నారు. చెన్నై నుంచి విత్తన కూపన్లు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ నెలలో విత్తన పంపిణీ ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లా అధికారులు కూడా రబీపై శ్రద్ధ చూపకుండా వేరుశనగకు రక్షకతడి అంటూ కలెక్టరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూంలోనే నెల రోజులుగా తిష్ట వేశారు. రబీలో ఇంకా ఏ పంటలు వేసుకోవాలి, ఇతరత్రా సమాచారం గురించి చెప్పేనా«థులే కరువయ్యారు. ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తుండడంతో ఈ నెల ఆఖరి వారం నుంచే నల్లరేగడి నేలలు ఉన్న 27 మండలాల్లో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ... విత్తన పంపిణీ గురించి ఇప్పటికీ ప్రకటన చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మండలాల వారీగా కేటాయింపులు, పంపిణీ విధానం, పంపిణీ తేదీ వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు. -
హాస్టళ్ల విద్యార్థులకు అందని యూనిఫాం
నయీంనగర్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ హస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇంత వరకు యూనిఫాం అందలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటుతున్నా దుస్తులు ఇవ్వకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు వార్డెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన వారం రోజుల్లోనే మొత్తం నాలుగు జతల దుస్తులకు రెండు జతలైనా ఇస్తారు. అయితే, ఈసారి జిల్లాలోని 39 గిరిజన హస్టళ్లు, 39 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని మొత్తం 14వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తుల మాటేమో కానీ ఇంత వరకు కొలతలు తీసుకోకపోవడం గమనార్హం. ఇంకా జిల్లాలోని 90 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని పది వేల మంది, 47 బీసీ సంక్షేమ హాస్టళ్లలోని ఏడు వేల మంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సుమారు 20వేల మంది విద్యార్థులకు సైతం ఇంత వరకు యూనిఫాంలు అందలేదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీల ద్వారా బట్టలు కుట్టించాలని జిల్లా దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరక్టర్ అంకం శంకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు బట్ట ఇచ్చి విద్యార్థుల దుస్తులు కుట్టిస్తారు. కానీ ఈసారి బట్ట కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికప్పుడు బట్ట కొనుగోలు చేసినా విద్యార్థుల కొలతలు తీసుకుని దుస్తులు కుట్టించి పంపిణీ చేసే వరకు రెండు నెలలైనా పడుతుంది. అంటే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక నాలుగు నెలల తర్వాతే విద్యార్థులకు యూనిఫాం అందే అవకాశముందని చెప్పొచ్చు. -
నాటుసారా దొరకలేదని...
కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో నాటుసారాకు బానిసైన ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కొత్తగూడెం మండలం సర్వారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బిచ్చ(43) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బిచ్చ నాటుసారాకు బానిసయ్యాడు. కొన్ని రోజులుగా నాటు సారా దొరక్క పోవడంతో... మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతనిని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.