నాటుసారా దొరకలేదని... | man suicide due to not available of Sarah Wild | Sakshi
Sakshi News home page

నాటుసారా దొరకలేదని...

Published Fri, Nov 27 2015 1:32 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

man suicide due to not available of Sarah Wild

కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో నాటుసారాకు బానిసైన ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కొత్తగూడెం మండలం సర్వారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన బిచ్చ(43) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బిచ్చ నాటుసారాకు బానిసయ్యాడు. కొన్ని రోజులుగా నాటు సారా దొరక్క పోవడంతో... మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతనిని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement