
ఖమ్మం: నగరంలోని ప్రశాంతినగర్ సమీపంలో సాగర్ ప్రధానకాల్వలో ఆదివారం ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. కాల్వలోని నీటిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడటంతో ఖమ్మం అర్బన్ పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావుతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
యువతి మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం వద్ద లభించిన పర్సులో రూ.6,600 నగదు ఉందని అన్నం శ్రీనివాసరావు తెలిపారు. యువతి వయస్సు 20 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు చెప్పారు.