official website
-
ఇన్వెస్టర్లకు అలర్ట్: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్లో అంతరాయం..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) అధికారిక వెబ్సైట్ (bseindia.com)లో శనివారం (జూన్ 17) సాయంత్రం నుంచి అంతరాయం ఉంటుందని తెలియజేసింది. జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్సైట్ పని చేయదని వెల్లడించింది. నిర్వహణ పనుల నిమిత్తం వెబ్సైట్ 12 గంటల పాటు అందుబాటులో ఉండదు. "మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్సైట్ అందుబాటులో ఉండదు" అని బీఎస్ఈ తన వెబ్సైట్లో పేర్కొంది. ఏదైనా అత్యవసర ఫైలింగ్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో corp.relations@bseindia.com ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. -
ఆ వెబ్సైట్ మాకు ఇప్పించండి!
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నిర్వాహకులకు చిత్రమైన సమస్య వచ్చిపడింది. కొన్నేళ్ల క్రితం మెడికల్ కాలేజీతో సంయుక్తంగా వీరు తయారు చేయించిన వెబ్సైట్ ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో కనీసం అప్డేట్ చేయడానికి సాధ్యం కావట్లేదని, ఆ వెబ్‌సైట్‌ను తమకు ఇప్పించాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సమాలోచన చేస్తున్నారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ► గాంధీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలకు కలిపి కొన్నేళ్ల క్రితం గాంధీహాస్పిటల్.ఇన్ పేరుతో వెబ్సైట్ రూపొందించారు. ప్రైవేట్ సంస్థ యూసీ ద్వారా దీనిని తయారు చేయించడంతో పాటు వాళ్లే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ► యూసీ సంస్థ ఈ వెబ్‌సైట్‌ను మరో సంస్థకు చెందిన సర్వర్‌లో హోస్ట్ చేసింది. దీని నిమిత్తం నిర్ణీత సమయానికి సర్వర్ నుంచి స్పేస్ ఖరీదు చేయడంతో పాటు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ► అలా కాని పక్షంలో సదరు వెబ్సైట్ ఓపెన్ స్పేస్‌లోకి వచ్చేయడంతో పాటు మరొకరు ఖరీదు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొన్నాళ్లుగా గాంధీ ఆసుపత్రి వర్గాలు రెన్యువల్ చేయించలేదు. ► దీనికితోడు యూసీ సంస్థ కూడా నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలగింది. సర్వర్‌ను అందించిన సంస్థ ఈ సైట్‌ను సేల్‌లో పెట్టడంతో డైనాడాట్.కామ్ వారు కొనుగోలు చేయడంతో వెబ్సైట్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ► ఇటీవల ఆ వెబ్‌సైట్‌ను అప్డేట్ చేయడానికి గాంధీ ఆసుపత్రి నిర్వాహకులు ప్రయత్నించినా సా ధ్యం కాలేదు. యాక్సస్ కూడా లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఆరా తీయగా వెబ్సైట్ డైనాడాట్.కామ్ చేతిలో ఉన్నట్లు గుర్తించారు. ► ఆసుపత్రి నిర్వాహకులు సదరు సంస్థతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు గత వారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అధీకృతం కాని వారి చేతిలో వెబ్సైట్ ఉందని ఆరోపించారు. ► ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని 419, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66–డీ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా డైనాడాట్.కామ్‌ను సంప్రదించి కంటెంట్‌తో ఉన్న వెబ్సైట్ ఎలా ఆధీనంలో ఉంచుకుంటారని ప్రశ్నించారు. (చదవండి: ఆన్లైన్లో అమెరికాకే ‘మత్తు’) ► ఆ వెంటనే స్పందించిన ఆ సంస్థ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మొత్తం తొలగించింది. ఈ విషయంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సైబర్ క్రైమ్ పోలీసులు సమాలోచన చేస్తున్నారు. చట్ట ప్రకారం ఆ సంస్థపై చర్యలకు ఆస్కారం లేదని తెలుస్తోంది. ► సాధారణంగా ప్రభుత్వ వెబ్సైట్లన్నీ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఆధీనంలో జీఓవీ.ఇన్‌తో రూపొందుతాయి. ఇలాంటి వెబ్సైట్లు పూర్తి భద్రమైనవే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లవు. గాంధీ ఆసుపత్రి నిర్వాహకులు అలా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. (క్లిక్: 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన) -
బీజేపీ వెబ్సైట్ హ్యాకింగ్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ అధికారిక వెబ్సైట్ మంగళవారం హ్యాకింగ్‌కు గురైంది. పార్టీ వెబ్‌పేజ్ ఎర్రర్ 522 మెసేజ్ చూపడంతో గందరగోళం నెలకొంది. కాగా అంతకుముందు బీజేపీ వెబ్సైట్లో ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరకర ఫోటోలు, భాషతో కూడిన వ్యాఖ్యలు కనిపించాయని కొందరు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి త్వరలో వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచుతామని అడ్మిన్ పేర్కొన్న సందేశం ఉంచారు. అయితే పార్టీ వెబ్సైట్ హ్యాకింగ్‌పై బీజేపీ ఇంతవరకూ అధికారిక ప్రకటన వెల్లడించలేదు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ అధికారిక వెబ్సైట్ హ్యాక్ కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ఇటీవల పలు భారత ప్రభుత్వ వెబ్సైట్లను పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో బీజేపీ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌ల వీడియా అభ్యంతరకర పదజాలంతో కనిపించిందని హిందీ న్యూస్ వెబ్సైట్ అమర్ ఉజాలా పేర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే వెబ్సైట్ అందుబాటులో లేదని ఎర్రర్ మెసేజ్ చూపిందని ఆ వెబ్సైట్ తెలిపింది. -
ఏపీపీఎస్సీ గ్రూప్స్ సిలబస్ ఖరారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను కమిషన్ ఒక కొలిక్కి తెచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు తుది ముసాయిదా సిలబస్‌ను కమిషన్ అధికారులు దాదాపుగా ఖరారు చేశారు. ఈ సిలబస్‌ను కమిషన్ శుక్రవారం తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే ఈ ముసాయిదాకు స్వల్పంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది సిలబస్‌ను త్వరలో అభ్యర్ధులకు అందుబాటులోకి తేనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లో దీన్ని ఫైనల్ సిలబస్‌గా అప్లోడ్ చేశారు. ఫైనల్ సిలబస్‌గా అప్లోడ్ చేసినప్పటికీ వాటిలో కొన్నిటికి స్వల్ప మార్పులు చేయనున్నామని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, 4లకు మాత్రమే సిలబస్‌ను ఇచ్చేది. ఈసారి గ్రూప్ 3 సిలబస్‌ను రూపొందించి వెబ్సైట్లో పెట్టింది. 2011 గ్రూప్1 పోస్టులలో కోత.. ఇదిలా ఉండగా 2011 గ్రూప్1 నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల్లో దాదాపు 30 పోస్టులకు కోతపెట్టాలని ఏపీపీఎస్సీ చూస్తోందని ఆ గ్రూప్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 గ్రూప్1 పోస్టులకు సంబంధించి మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నోటిఫికేషన్‌లోని 312 పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ, తెలంగాణలకు సంబంధించినవి. ప్రస్తుతం తొలగించాలని భావిస్తున్న పోస్టులు 30 పోస్టులను రెండు రాష్ట్రాల పోస్టులనుంచి తొలగించాల్సి ఉంది. కానీ ఏపీపీఎస్సీ ఏకపక్షంగా విభజిత ఏపీకి సంబంధించిన కోటాలోని 172 పోస్టుల నుంచి మినహాయించాలని చూస్తోందని అభ్యర్ధులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల ఏపీలోని అభ్యర్ధులు తీవ్రంగా నష్టపోతారని చెబుతున్నారు. ఉమ్మడి నోటిఫికేషన్‌లోని పోస్టులను తగ్గించాల్సి వస్తే రెండు రాష్ట్రాల పోస్టుల నుంచి తొలగింపు ఉండాలే తప్ప ఒక్క రాష్ట్రం నుంచే మినహాయించడం సరికాదని వారంటున్నారు. -
మార్చి 19న టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఆవిష్కరణ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్ ఈనెల 19 నుంచి అందుబాటులోకి రాబోతోంది. దీనిని గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. రాజ్‌భవన్‌లో 19న మధ్యాహ్నం 3:30 గంటలకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అలాగే కమిషన్ లోగోను కూడా ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.టీఎస్పీ ఎస్సీ వెబ్సైట్ ద్వారా నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ తమ పేరు, అర్హతలను, మొబైల్ నంబరు తదితర వివరాలతో రిజస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని మొదటిసారిగా కల్పించబోతున్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరి వివరాలు సర్వీసు కమిషన్‌కు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు సర్వీసు కమిషన్ ఏదైనా నోటిఫికేషన్‌ను జారీ చేసిన వెంటనే దానికి సంబంధించిన అర్హతలు కలిగిన నిరుద్యోగులు అందరికీ ఆటోమేటిక్‌గా ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఫలానా నోటిఫికేషన్ జారీ అయిందని, ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సమాచారం అందుతుంది. దీంతో సదరు అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించి తమ వివరాలను అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. అలాగే ఆన్లైన్ ద రఖాస్తుల విధానం అమలు చేయనున్నారు. మరోవైపు వెబ్సైట్ ప్రారంభం అయిన వెం టనే మొదటి నోటిఫికేషన్‌గా డిపార్ట్మెంటల్ టెస్టుల నిర్వహణకు నోటిఫికేషన్‌ను వచ్చే వారం పది రోజుల్లో జారీ చేయనున్నారు. -
స్తంభించిన అమెరికా ఎన్ఎస్ఏ వెబ్సైట్
అమెరికా భద్రత, సాంకేతికతకు మరోసారి సవాల్ ఎదురైంది. జాతీయ భద్రత సంస్థ (ఎన్ఎస్ఏ) అధికారిక వెబ్సైట్ శుక్రవారం కొన్ని గంటల పాటు స్తంభించిపోయింది. కంప్యూటర్ నెట్‌వర్క్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో హ్యాక్ చేయడం వల్లే వెబ్సైట్ స్తంభించిపోయిందంటూ ట్విట్టర్లో వార్తలు హల్చల్ చేశాయి. ఎన్ఎస్ఏ ప్రతినిధి మాత్రం వీటిని తోసిపుచ్చారు. తమ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు. అంతర్గత సాంకేతికత లోపం వల్లే అది కొన్ని గంటలు పనిచేయలేదని వెల్లడించారు. అనంతరం రాత్రి పదిగంటల ప్రాంతంలో వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. ఈ మొత్తం తతంగం హాస్యాస్పదమంటూ ఓ హ్యాకర్ గ్రూప్ ట్వీట్ చేసింది.