మార్చి 19న టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్ ఆవిష్కరణ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) వెబ్‌సైట్ ఈనెల 19 నుంచి అందుబాటులోకి రాబోతోంది. దీనిని గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. రాజ్‌భవన్‌లో 19న మధ్యాహ్నం 3:30 గంటలకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అలాగే కమిషన్ లోగోను కూడా ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.టీఎస్‌పీ ఎస్‌సీ వెబ్‌సైట్ ద్వారా నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ తమ పేరు, అర్హతలను, మొబైల్ నంబరు తదితర వివరాలతో రిజస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని మొదటిసారిగా కల్పించబోతున్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరి వివరాలు సర్వీసు కమిషన్‌కు అందుబాటులోకి రానున్నాయి.
అంతేకాదు సర్వీసు కమిషన్ ఏదైనా నోటిఫికేషన్‌ను జారీ చేసిన వెంటనే దానికి సంబంధించిన అర్హతలు కలిగిన నిరుద్యోగులు అందరికీ ఆటోమేటిక్‌గా ఎస్‌ఎంఎస్ వెళ్తుంది. ఫలానా నోటిఫికేషన్ జారీ అయిందని, ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సమాచారం అందుతుంది. దీంతో సదరు అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించి తమ వివరాలను అప్‌లోడ్ చేస్తే నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. అలాగే ఆన్‌లైన్ ద రఖాస్తుల విధానం అమలు చేయనున్నారు. మరోవైపు వెబ్‌సైట్ ప్రారంభం అయిన వెం టనే మొదటి నోటిఫికేషన్‌గా డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు నోటిఫికేషన్‌ను వచ్చే వారం పది రోజుల్లో జారీ చేయనున్నారు.