అమెరికా భద్రత, సాంకేతికతకు మరోసారి సవాల్ ఎదురైంది. జాతీయ భద్రత సంస్థ (ఎన్ఎస్ఏ) అధికారిక వెబ్సైట్ శుక్రవారం కొన్ని గంటల పాటు స్తంభించిపోయింది. కంప్యూటర్ నెట్వర్క్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో హ్యాక్ చేయడం వల్లే వెబ్సైట్ స్తంభించిపోయిందంటూ ట్విట్టర్లో వార్తలు హల్చల్ చేశాయి.
ఎన్ఎస్ఏ ప్రతినిధి మాత్రం వీటిని తోసిపుచ్చారు. తమ వెబ్సైట్ హ్యాకింగ్కు గురైందన్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు. అంతర్గత సాంకేతికత లోపం వల్లే అది కొన్ని గంటలు పనిచేయలేదని వెల్లడించారు. అనంతరం రాత్రి పదిగంటల ప్రాంతంలో వెబ్సైట్ను పునరుద్ధరించారు. ఈ మొత్తం తతంగం హాస్యాస్పదమంటూ ఓ హ్యాకర్ గ్రూప్ ట్వీట్ చేసింది.
స్తంభించిన అమెరికా ఎన్ఎస్ఏ వెబ్సైట్
Published Sat, Oct 26 2013 3:45 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement