రిజల్ట్స్ ఎఫెక్ట్ : ఐడియా షేర్లు ఢమాల్
Published Mon, May 15 2017 2:15 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఐడియా సెల్యులార్ కంపెనీ షేర్లు నేటి మార్కెట్లో భారీగా నష్టపోతున్నాయి. ఇప్పటికే ఈ షేర్లు 8 శాతం మేర పడిపోయాయి. శనివారం ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాలతో కంపెనీ షేర్లు ఈ నష్టాలను చవిచూస్తున్నాయి. రిలయన్స్ జియో దెబ్బకు ఐడియా సెల్యులార్ కంపెనీ వరుసగా రెండో క్వార్టర్ లోనూ నష్టాలనే నమోదుచేసింది. 2017 మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో కంపెనీ కన్సాలిడేటెడ్ నష్టాలు 325.6 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు ప్రకటించింది.
గత ఆర్థికసంవత్సరం ఇదే క్వార్టర్ లో కంపెనీ రూ.449.2 కోట్ల లాభాలను నమోదుచేసింది. ఈ క్వార్టర్ కు ముందు క్వార్టర్ 2016 డిసెంబర్ లోనూ కంపెనీకి రూ.383.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాలే ఉన్నాయి.. ఇలావరుసగా ఐడియా నష్టాలను నమోదుచేస్తుండటం షేర్లపై తీవ్రప్రభావాన్ని చూపుతోంది. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో కంపెనీ స్టాక్ 8.28 శాతం పడిపోయి, రూ.84.65 వద్ద ట్రేడవుతోంది.
Advertisement