ఐడియా సెల్యులార్ షేర్లలో రివర్స్ ట్రెండ్
ఐడియా సెల్యులార్ షేర్లలో రివర్స్ ట్రెండ్
Published Mon, Mar 20 2017 2:02 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
ముంబై : ఒక్కసారిగా భారీగా ఎగిసిన ఐడియా సెల్యులార్ షేర్లు కిందకి పడిపోయాయి. ఇంట్రాడేలో 15 శాతం లాభాలు కురిపించిన షేర్లు, 14.57 శాతం ఢమాల్ మన్నాయి. వొడాఫోన్ ఇండియా విలీనానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ మార్నింగ్ ట్రేడింగ్ అవర్స్ ప్రకటించింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలో కంపెనీ ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. కానీ ప్రస్తుత మార్కెట్ ధర కంటే స్టాక్ వాల్యు తక్కువుగానే డీల్ కుదిరినట్టు తెలియడంతో స్టాక్ రూ.92 వద్ద ట్రేడవుతోంది.
ఐడియా వాల్యుయేషన్స్ తో అనుమానం వ్యక్తమవుతున్నట్టు ట్రేడర్స్ చెప్పారు. మరోవైపు రికార్డులు సృష్టిస్తూ ట్రేడైన స్టాక్ మార్కెట్లో నేడు లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం కూడా ఈ కంపెనీ షేర్ల పతనానికి కారణమైంది. విలీనం పూర్తయిన తర్వాత వొడాఫోన్ ఆ సంస్థలో 45.1 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది. ఐడియా 26 శాతం స్టాక్ ను పొందుతోంది. మిగతదంతా పబ్లిక్ షేర్ హోల్డర్స్ చేతిలో ఉంటుంది. విలీనం అనంతరం ఏర్పడబోయే అతిపెద్ద టెలికాం దిగ్గజానికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లానే చైర్మన్ గా ఉండనున్నారు.
Advertisement
Advertisement