న్యూఢిల్లీ: టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్... తమ మొబైల్ వ్యాపార విభాగాల విలీన ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా టెలికం శాఖ (డాట్) నిర్దేశించినట్లుగా రూ.7,248 కోట్లు చెల్లించాయి. నిర్దిష్ట షరతులపై తమ నిరసనను తెలియజేస్తూ.. టెలికం శాఖకు చెల్లింపులు జరిపినట్లు ఐడియా వర్గాలు చెప్పాయి. విలీనానికి డాట్ డిమాండ్ ప్రకారం రూ.3,926.34 కోట్లు నగదు రూపంలో, మరో రూ.3,322.44 కోట్లు బ్యాంక్ గ్యారంటీ రూపంలో ఇచ్చినట్లు తెలిపాయి.
ఇరు సంస్థల విలీనానికి జూలై 9న డాట్ షరతులతో అనుమతులిచ్చింది. 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) విలువ, 35% మార్కెట్ వాటా, 43 కోట్ల యూజర్లతో విలీన సంస్థ దేశీయంగా అతి పెద్ద టెల్కోగా ఇది ఆవిర్భవించనుంది. విలీన సంస్థ రుణభారం రూ.1.15 లక్షల కోట్ల మేర ఉంటుంది. ఈ కంపెనీలో వొడాఫోన్‌కి 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26%, ఐడియా షేర్‌హోల్డర్లకు 28.9% వాటాలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment