ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యానికి చర్యలు
బీఎస్‌ఈ 140వ వార్షికోత్సవం...
న్యూఢిల్లీ : ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) మేనేజింగ్ డెరైక్టర్ అండ్ సీఈఓ అశిశ్‌కుమార్ చౌహాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి రానున్న 6 నుంచి 9 నెలల్లో ఒక ‘ఐపీఓ’ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ బాండ్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్... తద్వారా ప్రభుత్వం సులభతరంగా నిధుల సమీకరణకు తాజా ఎలక్ట్రానిక్-ఐపీఓ వ్యవస్థ వీలుకల్పిస్తుందని, ప్రభుత్వ బాండ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి తగిన పరిస్థితిని సృష్టిస్తుందని తెలిపారు. బీఎస్‌ఈ 140 వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో చౌహాన్ ఈ విషయాలు మాట్లాడారు.