brent crude oil
-
బీజేపీకి జై..సూచీలు రయ్
ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ‘జై’ కొట్టడంతో సోమవారం స్టాక్ సూచీలు ఏకంగా రెండు శాతం ర్యాలీ చేశాయి. ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదు ఉత్సాహాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు దిగువకు చేరుకుంది. ఫలితంగా సూచీలు 18 నెలల్లో (మే 20, 2022 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,384 పాయింట్లు పెరిగి 68,865 ముగిసింది. నిఫ్టీ 419 పాయింట్లు బలపడి 20,687 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ట ముగింపు. ట్రేడింగ్‌లోనూ జీవితకాల గరిష్టాల నమోదు జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉదయం సూచీలు భారీ లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 945 పాయింట్లు పెరిగి 68,435 వద్ద, నిఫ్టీ 334 పాయింట్ల లాభంతో 20,602 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. మీడియా తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్థిరమైన లాభాలతో ట్రేడయ్యా యి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడం ఓ దశలో సెన్సెక్స్ 1,437 పాయి ంట్లు దూసుకెళ్లి 53 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 68,918 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 435 పాయింట్లు ఎగసి 20,703 వద్ద రెండో రోజూ రికార్డు ర్యాలీ చేసింది. ► సూచీల రికార్డు ర్యాలీని అందిపుచ్చుకున్న అదానీ షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 9%, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 7%, అదానీ పోర్ట్స్, ఏసీసీ 6%, అదానీ పవర్, అదానీ ఎనర్జీ 5%, అదానీ టోటల్ గ్యాస్ 4%, ఎన్డీటీవీ 3%, అదానీ విల్మార్ 2% చొప్పున లాభపడ్డాయి. మొత్తం పది కంపెనీల షేర్లూ రాణించడంతో ఇంట్రాడేలో గ్రూప్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 31 తర్వాత తొలిసారి రూ.12 లక్షల కోట్లను తాకింది. చివరికి రూ.11.95 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ►ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఐసీఐసీఐ బ్యాంక్ 5%, ఎస్బీఐ 4%, కోటక్ బ్యాంక్, పీఎన్బీ, ఇండస్ ఇండ్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 3% లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఏ యూ బ్యాంక్‌లు 2%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు ఒకశాతం పెరిగాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 91 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 46,484 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఆల్‌టైం హైకి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ రెండుశాతం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.81 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ. 343.48 లక్షల కోట్లకు చేరింది. కాగా అయిదు రోజుల ర్యాలీతో బీఎస్ఈలో రూ.14.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్వసించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, స్థూల ఆర్థిక అంశాలు మెప్పించడంతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగొచ్చు. రికార్డు ర్యాలీ నేపథ్యంలో స్థిరీకరణ జరిగితే నిఫ్టీకి 20,400 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ -
పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు!
ఫ్రాంక్ఫర్ట్: నవంబరు వరకు పెట్రో బాదుడు తప్పేలా లేదు. చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలతో పాటు వాటి మిత్ర కూటమి తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఫలితంగా గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. సోమవారమయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. ఒపెక్ నిర్ణయాలు కోవిడ్ మహమ్మారి సమయంలో తగ్గిన ఉత్పత్తిని పునరుద్ధరించే క్రమంగా నెమ్మదిగా ఉండాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం నవంబర్‌లో రోజుకు 400,000 బారెళ్ల మేర మాత్రమే ఉత్పిత్తిని పెంచాలని ఒపెక్, ఈ కూటమి మిత్ర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే చమురు ఉత్పత్తి పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. ఐనప్పటికీ గ్లోబల్ మార్కెట్లలోకి భారీ సరఫరాలను పెంచరాదని ఒపెక్ కూటమి నిర్ణయించింది. ఫలితంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్వీట్ క్రూడ్ బేరల్ ధర 3 శాతంపైగా లాభంతో 78 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 3 శాతం లాభంతో 82 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. చదవండి :పెట్రోల్ సెంచరీ..మరీ ఈవీ ఛార్జింగ్ కాస్ట్ ఎంతో తెలుసా ? -
భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు.. సామాన్యులకు మోతేనా..!
సౌదీ-యూఎఈ మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొవడంతో యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఆయిల్ ఉత్పత్తి దేశాలు(ఒపెక్) మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమైనాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్‌ఆయిల్ ధర గణనీయంగా పెరిగింది. 2014 సంవత్సరం తరువాత తిరిగి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రెంట్(అట్లాంటిక్ బేసిన్ క్రూడ్‌ఆయిల్) బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 0.8 శాతం పెరిగి 77.78 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్ 2018 నుంచి ఈ స్థాయిలో బ్యారెల్ ధరలు పెరగలేదు. ఆయిల్ ఉత్పత్తి దేశాల(ఒపెక్)తో గతవారం ఏర్పడిన విభేదాల తరువాత మూడవరోజు చర్చలు జరిపిన ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. ఆయిల్ కంపెనీ ఉత్పత్తి దేశాలు తిరిగి సమావేశమయ్యే తేదీలను ప్రకటించలేదు. కొన్ని ఒపెక్ దేశాలు ఈ నెలలో చర్చలను తిరిగి ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. అంతేకాకుంగా డిమాండ్‌కు సరిపడ ముడిచమురును ఆగస్టు నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఆయిల్ ఉత్పత్తి దేశాలతో చర్చలు వెంటనే సఫలమైయేలా చూడాలని బైడెన్ సర్కార్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్ చమురు మంత్రి ఇహ్సాన్ అబ్దుల్ జబ్బర్ సోమవారం మాట్లాడుతూ..తమ దేశం చమురు ధరలు పెరగడం ఇష్టం లేదని తెలిపారు. 10 రోజుల్లోపు కొత్త ఒపెక్ + సమావేశానికి తేదీ నిర్ణయించబడుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. భారత్‌పై ప్రభావం..! యుఎఈ, ఇతర ఒపెక్ + దేశాలు ఆగస్టులో ఉత్పత్తిని పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే, ముడి చమురు ధరలనుంచి సామాన్యులకు ఉపశమనం కలిగే అవకాశం తక్కువ ఉండనుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి. సుమారు 13 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఈ ధరలు తిరిగి తగ్గేట్గుగా కనిపించట్లేదు. భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు 2021 ప్రారంభం నుండి పెట్రోల్ ధరను 19.3 శాతం, డీజిల్ ధరను 21 శాతం పెంచాయి.పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం ఒపెక్ సభ్య దేశాలతో సంభాషణలు జరిపారు. ఈ సమావేశాల తరువాత ముడి చమురు ధరలు నియంత్రణలోకి వస్తాయనిఆశాభావం వ్యక్తం చేశారు. -
కరోనా : కుప్పకూలిన చమురు ధర
కరోనా వైరస్ మహమ్మారి ప్రకంపనలతో ముడి చమురు ధర భారీగా పతనమైంది. డిమాండ్ క్షీణించడంతోపాటు, కరోనా సంక్షోభంతో చమురు ధర 18 ఏళ్ల కనిష్టానికి చేరింది. సోమవారం ఉదయం ఒక సమయంలో ముడి చమురు దర బ్యారెల్ కు 23.03 డాలర్లకు పడిపోయింది, ఇది నవంబర్ 2002 నుండి కనిష్ట స్థాయి. డబ్ల్యుటిఐ బ్యారెల్ ధర 20 డాలర్ల దిగువకు చేరి 18 సంవత్సరాల కనిష్టానికి దగ్గరగా ఉంది. 7.4 శాతం క్షీణించి 19.92 డాలర్ల వద్ద వుంది. దీంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం లేదా మూసివేయడం వల్ల గత నెలలో చమురు ధరలు సగానికి పైగా తగ్గాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్న చర్యలు డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు తెలిపారు. కోవిడ్-19 విస్తరణతో సంభవించిన డిమాండ్ షాక్ చాలా పెద్దదని నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్స్ హెడ్ లాచ్లాన్ షా రాయిటర్స్‌తో చెప్పారు. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే, గ్లోబల్ నిల్వలు కొన్ని నెలల్లో బాగా పెరుగుతాయి. ఇది ధరలపై అన్ని రకాలుగా భయంకరమైన ప్రభావాన్ఇన చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్ తగ్గడంతో పాటు ఈ నెల ప్రారంభంలో సౌదీ అరేబియా, రష్యా ఏర్పడిన ధరల యుద్ధం కడా చమురు ధరలను ప్రభావితం చేసింది. ఒపెక్ చమురు ఉత్పత్తిదారులతో అంగీకరించిన ఉత్పత్తి కోతలకు రష్యాను ఒప్పించడంలో సౌదీ అరేబియా విఫలం కావడంతో ధరల యుద్ధం ప్రారంభమైంది. -
భారీగా పుంజుకున్న చమురు ధర
సోమవారం నాటి భారీ పతనం నుంచి చమురు ధరలు భారీగా ఎగిసాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) భయాలకు తోడు, రష్యా సౌదీ అరేబియా ప్రైస్ వార్ నేపథ్యంలో 29 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన చమురు మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) తో చర్చలు కొనసాగవచ్చని రష్యా సూచనలతో ముడి చమురు ధర 11శాతం పెరిగింది. ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్‌కు 38 డాలర్లుగా వుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) 11 శాతం పెరిగి బ్యారెల్‌కు 34 డాలర్లకు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామని రష్యా ఇంధన మంత్రి ఆశావహ వ్యాఖ్యలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కూడా మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. అటు గ్లోబల్ మార్కెట్లు కూడా భారీ పతనంనుంచి కాస్త తెప్పరిల్లాయి. డౌజౌన్స్ 900 పాయింట్లు జంప్ చేసింది. ఎస్ అండ్ పీ 3.5 శాతం, నాస్డాక్ 3.6 శాతం ఎగిసింది. కాగా దేశీయ స్టాక్‌మార్కెట్లకు హోలీ సందర్భంగా మంగళవారం సెలవు. తాజా పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలు రేపు (బుధవారం) భారీగా రికవరీ సాధించే అవకాశం ఉంది. -
పెట్రో ధరలు బాగా తగ్గే అవకాశం?
పెట్రోలు, డీజిల్ ధరలు మరో వారం రోజుల్లో తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత నెల 30వ తేదీన పెట్రోలు ధరను లీటరుకు 31 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 71 పైసలు తగ్గించారు. అయితే.. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. దాంతో ఈనెల 15వ తేదీన నిర్వహించే సమీక్ష తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త ఎక్కువగానే తగ్గొచ్చని అంటున్నారు. మన దేశం తమ అవసరాల కోసం 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలతో పాటు, రూపాయి విలువ కూడా మన పెట్రోలు, డీజిల్ ధరలను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గ్రీసు సంక్షోభం, ఇరాన్ చర్చల్లో పురోగతి, డాలర్ బలోపేతం కావడం, చైనా స్టాక్ మార్కెట్లు పడిపోవడం లాంటి కారణాలతో ఈవారంలో అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారిగా మళ్లీ బ్రెంట్ క్రూడాయిల్ ధర 60 డాలర్ల దిగువ స్థాయికి చేరుకుంది. మంగళవారం నాడు బ్రెంట్ క్రూడ్ 57 డాలర్ల వద్ద ట్రేడయింది. మరో వారం రోజుల్లో ఇది 50 డాలర్ల కంటే కూడా తగ్గొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మనకు కూడా ఈ తగ్గింపు ఫలితం బాగానే కలిసి రావొచ్చన్నమాట.