కరోనా వైరస్ మహమ్మారి ప్రకంపనలతో ముడి చమురు ధర భారీగా పతనమైంది. డిమాండ్ క్షీణించడంతోపాటు, కరోనా సంక్షోభంతో చమురు ధర 18 ఏళ్ల కనిష్టానికి చేరింది. సోమవారం ఉదయం ఒక సమయంలో ముడి చమురు దర బ్యారెల్ కు 23.03 డాలర్లకు పడిపోయింది, ఇది నవంబర్ 2002 నుండి కనిష్ట స్థాయి. డబ్ల్యుటిఐ బ్యారెల్ ధర 20 డాలర్ల దిగువకు చేరి 18 సంవత్సరాల కనిష్టానికి దగ్గరగా ఉంది. 7.4 శాతం క్షీణించి 19.92 డాలర్ల వద్ద వుంది. దీంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం లేదా మూసివేయడం వల్ల గత నెలలో చమురు ధరలు సగానికి పైగా తగ్గాయి.
కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్న చర్యలు డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు తెలిపారు. కోవిడ్-19 విస్తరణతో సంభవించిన డిమాండ్ షాక్ చాలా పెద్దదని నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్స్ హెడ్ లాచ్లాన్ షా రాయిటర్స్‌తో చెప్పారు. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే, గ్లోబల్ నిల్వలు కొన్ని నెలల్లో బాగా పెరుగుతాయి. ఇది ధరలపై అన్ని రకాలుగా భయంకరమైన ప్రభావాన్ఇన చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్ తగ్గడంతో పాటు ఈ నెల ప్రారంభంలో సౌదీ అరేబియా, రష్యా ఏర్పడిన ధరల యుద్ధం కడా చమురు ధరలను ప్రభావితం చేసింది. ఒపెక్ చమురు ఉత్పత్తిదారులతో అంగీకరించిన ఉత్పత్తి కోతలకు రష్యాను ఒప్పించడంలో సౌదీ అరేబియా విఫలం కావడంతో ధరల యుద్ధం ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment