
ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంపై కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డిజిల్ ధరలు పెరుగుదలతో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. పెట్రో ఉత్పత్తులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం.. పెట్రోల్, డిజిల్ ధరలపై ప్రభావం చూపిందన్నారు. త్వరలోనే భారత ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు.
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను యథాతథంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు మే 14 నుంచి తిరిగి ధరల సవరణను చేపట్టాయి. దీంతో పెట్రో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. గత వారం రోజులుగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ 1.61, డీజిల్ ధర లీటర్‌కు రూ 1.64 మేర పెరిగాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ 80.76 దాటడం గమనార్హం. డీజిల్ లీటర్‌కు రూ 73.45కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ రూ 76.24కు చేరగా, డీజిల్ ధర రూ 67.57కు ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment