petrol prices hike
-
కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?
-
కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?
సాక్షి, హైదరాబాద్: సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్టు పెరిగినా తగ్గినా దేశంలో రేటు పెంచడమే తమ పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ధ్వజమెత్తారు. చదవండి: వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. ఖమ్మంలో విచిత్ర పూజలు.. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తోంది. దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయాల పెట్రో పన్నును కేంద్రం దోచుకుంది. ప్రతిది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా?. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతిలేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుంది. పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. ప్రజలను దోపిడి చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను ప్రధాని క్షమాపణ కోరాలి. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయం’’ అంటూ కేటీఆర్‌లో లేఖలో దుయ్యబట్టారు. లేఖలో ఏమన్నారంటే.. ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతుంది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్‌గా తిరిగొస్తుంది. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి, పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిన నరేంద్ర మోదీ, అధికారంలోకి వచ్చినంక ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి పాలిస్తున్నారు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ల నుంచే తన చేతకానితనం, తమకు అస్సలు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజల్ని పీడించుకు తింటున్నది కేంద్ర ప్రభుత్వం. నేనిలా విమర్శించడానికి అడ్డూ అదుపు లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసరాల ధరలే కారణం. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయింది. ధరలను అదుపు చేయడం చేతగాని మోదీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెపుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్దాలే. అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులనీ కొన్నిరోజులు, ముడి చమురు ధరల పెరుగుదల అని ఇంకొసారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెప్పారు. కాని ఇదంతా నిజం కాదు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారు. అంతెందుకు పక్కనున్న దాయాది దేశాలతో పాటు, అర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికి అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 2014 లో బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతూనే ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యం. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా దేశంలో భారీగా పెట్రో రేట్లు తగ్గాల్సి ఉండే. కాని కరొనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన కనికరంలేని మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజలు తగ్గిన ధరల ప్రయోజం పొందకుండా ఎక్సైజ్ సుంకాన్ని 20 రూపాయలు పెంచింది. దీంతో తక్కువ రేటుకు పెట్రో ఉత్పత్తులను మన దేశ ప్రజలు పొదలేకపోయారు. 2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను, రు.53.78 గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ ఈరోజుకి 118.19 కి, డీజిల్ ను 104.62 కు పెంచింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉన్నది. 2014 లో క్రూడ్ ఆయిల్ కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కాని 2014లో మనదేశంలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు దొరికేదో ఇప్పుడు మాత్రం అంతకు దొరకడం లేదు. రేటు రెట్టింపు అయింది. ఇది ఎలా అయింది? ఎందుకు అయింది? ఏ ప్రయోజనాల కోసం ఇలా ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావదారిద్ర్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. అంటే సగటున ఒక్క కుటుంబం నుంచి లక్ష రూపాయలను దౌర్జన్యంగా పెట్రో ధరల పెంపు పేరుతో లూఠీ చేసింది మోడీ ప్రభుత్వం. ప్రతిది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రో ఉత్పత్తులను కొని అధిక ధరలకు దేశ ప్రజలకు అమ్ముకుంటున్న దళారి ప్రభుత్వం నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. బహిరంగంగా తాను చేస్తున్న దోపిడిని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్న బట్టేబాజ్ సర్కార్ కేంద్రంలో ఉంది. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదాన్ని తీసుకొచ్చింది. ఇందులోని మర్మాన్ని సవిరంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2014కు ముందుకు పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48గా ఉండేది. అధికారంలోకి వచ్చినంక మోదీ దాన్ని రూ.32.98కి పెంచారు. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారు. ఈ ఎక్సైజ్ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్ర మంత్రులతో పాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో డప్పు కొడుతున్నది. కాని ఇది పచ్చి అబద్ధం. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే. ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమే. ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసల్ని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు పంచుతుంది. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతం. అంటే లీటరుకు 0.01 పైసలు. కానీ 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోదీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొట్టుకుంటుంది. రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేస్తున్న నరేంద్ర మోదీ, పెరుగుతున్న పెట్రో ధరలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మాత్రమే నిండేలా చూసుకుంటున్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయి. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 18 రూపాయలు, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీగా 30 రూపాయలకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో మోదీ సర్కార్ వసూలు చేస్తోంది.ఇందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానే.. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పెట్రో ధరలను రెట్టింపు చేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2015 నుండి ఇప్పటిదాకా వ్యాట్ టాక్స్ ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్న సంగతిని ప్రజలంతా గమనించాలని కోరుతున్నాను. పెట్రో ధరల పేరిట పట్టపగలు ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలి. కానీ బీజేపీ అవకాశవాద, అసమర్థ విధానాలను చూసిన తర్వాత తరచూ ఎన్నికలు వస్తే బాగుంటుందని, అట్లయిన పెట్రోలు ధరల పెంపు ఆగుతుందన్న ఆలోచనల్లోకి ప్రజలు వచ్చారు. పెట్రో ధరల పెంపును ఒక రాజకీయ అంశంగా వాడుకుంటున్న బీజేపీ ఎన్నికల తర్వాత అత్యంత కర్కశంగా వరుసగా పెట్రో ధరలను పెంచుకుంటూ పోవడాన్ని అలవాటుగా మార్చుకుంది. 2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు, 2020లో 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలపాటు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. కాని ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతీ రోజూ పెట్రో ధరల్ని మోదీ సర్కార్ పెంచుకుంటూ పోతున్నది. గత పదిహేను రోజుల్లో 13 సార్లు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలన్నా, ప్రజల కష్టాలన్నా తనకు ఎంత చులకనభావం ఉందో మోదీ సర్కార్ చాటుకుంది. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన పాపానికి. ప్రజలకు మోదీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తనకు చేతకాని పాలనను పక్కనపెట్టి కేవలం పెట్రో ధరలను పెంచడాన్నే అలవాటుగా మార్చుకుందంటే అతిశయోక్తి కాదు. పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగిన ప్రతీసారి అదరకుండా, బెదరకుండా అబద్దాన్ని చెప్పే దొంగ నేర్పు ప్రస్తుత కేంద్ర మోదీ సర్కార్ కు పుష్కలంగా ఉంది. అందుకే తాజా ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా కేంద్ర మంత్రులు చూపిస్తున్నారు. లోక్ సభలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ తేలి చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా నుంచే మనం అత్యధికంగా పెట్రో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నాము. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ఈ దేశాల నుంచి మనకు పెట్రో ఉత్పత్తులు రావడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఒక్క శాతాన్ని చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఇలా పదే పదే అబద్దాలను వల్లె వేసీ..వేసీ.. బీజేపీ నాయకుల నోట్లోని నాలుకలు కూడా సిగ్గుపడుతున్నాయి. మానవత్వం అస్సలు లేని ప్రభుత్వం దేశ ప్రజల నెత్తి మీద తిష్ట వేసుకుని కూర్చుంది. కరోనా సంక్షోభాన్ని అత్యంత్య దారుణంగా మార్చిన మోదీ సర్కార్, ఆ టైంలో పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్సిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించింది. ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలపై భారీగా పన్నులు వసూలు చేయడమే అన్న స్ఫూర్తితోనే నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందనిపిస్తుంది. సమర్థ విధానాలు, నిర్ణయాలతో సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ.. సృష్టించిన సంపదను ప్రజలకు పంపిణీ చేయాలి కానీ కేవలం పన్నుల పేరిట ప్రజలను పీల్చిపిప్పి చేయడమే పరిపాలనగా భావిస్తున్న, బీజేపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రజలు సాగనంపే రోజు దగ్గర పడింది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం ఖాయం పెట్రో రేట్ల పెరుగుదలతో ప్రతీ ఒక్కరి దైనందిత జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇంట్లో వాడే గ్యాస్, పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుడి బతుకు దిన దిన గండంగా మారింది. బీజేపీ హయాంలో గ్యాస్ బండ.. మోయలేని గుదిబండగా మారింది. దీంతో మోడీ చెప్పిన పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదు. పెట్రో ధరల పెంపుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి వచ్చింది. ప్రజలు బైకులు, కారులు వదిలేసే పరిస్ధితి నెలకొంటున్నది. వంట గ్యాస్ వెయ్యి దాటడంతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కైంది. వ్యవసాయ పెట్టుబడివ్యయం పెరిగిపోతున్నది. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి పెట్రో వాతలు.. ధరల మోతలే.. అధికారంలోకి రావడానికి ముందు పెట్రో ధరల పెంపును రాజకీయాస్త్రంగా మార్చుకున్న నరేంద్ర మోదీ ఆనాటి తన మాటలు, చేతలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో రేట్ల పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలి. తన అసమర్థ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాల పై వివరణ ఇవ్వాలి. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను క్షమాపణ కోరాలి. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్‌గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదు అన్న సంగతిని గుర్తుంచుకుని వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలి. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు వేంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. -
ప్రధాని మోదీపై మరోసారి కేటీఆర్ వ్యంగ్యం
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా మరోసారి వ్యంగ్యం ప్రదర్శించారు. గత రెండు వారాల్లో.. దేశవ్యాప్తంగా దాదాపు 10రూ. పెరిగిన పెట్రో ధరలను ప్రస్తావిస్తూ కేటీఆర్ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారు?. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజూ పెంచుతూ.. జనాలకు దానిని ఒక అలవాటుగా మార్చినందుకు ప్రధాని మోదీగారికి ధన్యావాదాలు. బీజేపీలో మేధావులైన కొందరు నేతలు.. ఇప్పుడు ఇదంతా ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాలను)లను ప్రమోట్ చేసేందుకు మోదీగారు చేస్తున్న మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పుకుంటారు కూడా అని ట్వీట్ చేశారు కేటీఆర్. Who says GDP is not going up? Thank You dear Modi Ji for the making this Gas Diesel & Petrol hike as a daily habit for all Indians👏 Am sure there will be some bright BJP folks who will tell us now that this is Modi Ji’s master strategy to promote EVs 👍 https://t.co/6Ah3dmzhSO — KTR (@KTRTRS) April 5, 2022 ఇదిలా ఉండగా.. ఒకవైపు ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం వర్సెస్ తెలంగాణ మధ్య వాడీవేడిగా విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు ధరల పెంపుదలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీస్తోంది. సంబంధిత వార్త: మోదీజీ.. మీ మాటలు గుర్తున్నాయా? -
నోరు ముయ్.. నీకు అన్నీ చెప్పాలా: బాబా రాందేవ్
ఛండీగఢ్: యోగా గురు బాబా రామ్‌దేవ్ సహనం కోల్పోయారు. లైవ్‌లోనే ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రామ్‌దేవ్ బుధవారం హర్యానాలోని కర్నాల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు 2014లో బాబా రామ్ దేవ్ ప్రజలు లీటర్‌కు రూ. 40 పెట్రోల్, రూ. 300 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఓ మీడియా విలేకరి గతంలో బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలపై ప్రశ్నించారు. దీంతో బాబా రామ్ దేవ్ సహనం కోల్పోయి లైవ్‌లోనే బెదిరించారు. తాజాగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విలేకరి, రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అవును, ఇప్పుడు ఏం చేయమంటారు..? ఇలాంటి ప్రశ్నలు అడగకండి.. నేనేమీ మీ కాంట్రాక్టర్‌ను కాదు.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు..’’ అన్నారు. ఇంతో సదరు విలేకరి మరోసారి ప్రశ్నించగా.. అతడిపై రామ్ దేవ్ సీరియస్‌గా చూస్తూ..‘‘ నేను, ఆ వ్యాఖ్య చేశాను. అబ్ క్యా కర్ లేగా (నువ్వేం చేస్తావు)? నోరు మూసుకో. మళ్లీ అడగకు.. ఇలా మాట్లాడకు.. మంచిది కాదు.. నువ్వు మీ పేరెంట్స్‌కు మంచి కొడుకుగా ఉండాలి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం బాబా రామ్ దేవ్ మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని రామ్‌దేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని, దేశాన్ని ఎలా నడుపుతారని, జీతాలు చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారని ప్రభుత్వం చెబుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, ద్రవ్యోల్బణం తగ్గాలి, అందుకు ఒప్పుకుంటాను.. అయితే ప్రజలు కష్టపడి పనిచేయాలి. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను" అని అన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో 80 పైసలు పెరిగింది. దీంతో గత తొమ్మిది రోజులలో లీటరుకు రూ. 5లకు పైగా పెరిగాయి. Yoga Guru Ramdev was seen on camera losing his cool and threatening a journalist, who asked him about his comments in the past on reducing petrol price. @ndtv pic.twitter.com/kHYUs49umx — Mohammad Ghazali (@ghazalimohammad) March 30, 2022 -
వాళ్లు రావణుడి భక్తులు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
జైపూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు రెండో వారం నుంచి 2022 మార్చి మూడో వారం వరకు పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇక, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీరోజు పెరుగుతూ సామాన్య ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వంపై రాజస్థాన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు రాముడు భక్తులు కాదు.. రావణుడి భక్తులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతల రాముడి విధానాన్ని పాటించడం లేదని, వాళ్లు రావణుడి పాలసీని పాటిస్తున్నారని విమర్శలు చేశారు. మరో అడుగు ముందుకేసి.. రాముడు అందరినీ సమానంగా చూశాడని.. అదే రావణుడు ఓ మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో బీజేపీ ఎలాగైతే.. కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం టికెట్లను పంచిపెడుతున్నారో అలాగే పెట్రోల్, డీజిల్ కోసం కూడా కూపన్లు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఎనిమిది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏడుసార్లు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్ ధర రూ.99.83ని టచ్ చేసింది. రేపోమాపో డీజిల్ ధర హైదరాబాద్‌లో వంద రూపాయలను క్రాస్ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది. -
తగ్గని బాదుడు..మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు!
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల పెంపు కొనసాగుతుంది. దీంతో ఆదివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై 50పైసలు, లీటర్ డీజిల్‌పై 55పైసలు పెరిగాయి. దేశంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.35 పైసలు ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.98.68పైసలుగా ఉంది వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09 పైసలుగా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.99.11 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.90.42 పైసలుగా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ.113.88 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.98.13 పైసలుగా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00 పైసలుగా ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.108.53పైసలు ఉండగా డీజిల్ ధర రూ.93.57పైసలుగా ఉంది 'మూడిస్' ఏం చెబుతుందంటే ప్రముఖ ఇన్వెస్టర్ సర్వీస్ సంస్థ మూడిస్ ప్రకారం..ఈ ఏడాదిలో జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మనదేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ సంస్థలు పెట్రోల్ ధరల్ని పెంచకుండా తటస్థంగా ఉంచాయి. దీని కారణంగా చమురు సంస్థలకు రూ.19వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అదే సమయంలో బ్యారెల్ చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వెరసీ కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకునేలా పెట్రో ధరల పెంపు అనివార్యమైనట్లు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు
-
ధరలు పెంచి.. ధర్నాలు చేస్తారా?
సాక్షి, అమరావతి: ‘పెట్రోల్, డీజిల్ ధరలు మీరే పెంచేసి.. వాటిని తగ్గించాలని ధర్నాలు చేస్తారా?’ అంటూ బీజేపీ, టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ‘ఎక్సైజ్ సుంకం పిసరంత ఉంటే కొండంత సెస్సులు వేసి పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌ను రూ.వంద దాటించి, రూ.ఐదో, పదో తగ్గించి.. రాష్ట్రాలను ధర తగ్గించాలని ధర్నాలు చేయడంకంటే దిగజారుడుతనం మరొకటి ఉంటుందా?’ అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. 2015 ఫిబ్రవరి 5 నుంచి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.4 చొప్పున వ్యాట్ విధించింది టీడీపీ సర్కారు కాదా అని చంద్రబాబును నిలదీశారు. పెట్రోల్, డీజిల్ ధరలను సీఎం వైఎస్ జగన్ సర్కారు పెంచలేదని స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను పట్టించుకోకపోవడంవల్ల అవి శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి మరమ్మతులు చేయడం కోసమే పెట్రోల్, డీజిల్‌పై కేవలం లీటరుకు రూ.1 చొప్పున సెస్ విధించామని తెలిపారు. బీజేపీ, టీడీపీ నేతలు వారు చేసిన తప్పులు, పాపాలను వైఎస్సార్సీపీ సర్కారుపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెస్సుల రూపంలో కేంద్రం రూ. లక్షల కోట్లు వసూలు ‘2017లో కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గితే.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని.. ముడి చమురు ధరలు పెరిగితే వీటి ధరలు పెరుగుతాయని చెప్పింది. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించలేదు. సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం, సెస్సుల రూపంలో కేంద్రానికి 2016–17లో రూ.3,35,175 కోట్లు, 2017–18లో రూ.3,36,163 కోట్లు, 2018–19లో రూ.3,48,041 కోట్లు, 2019–20లో రూ.3,34,315 కోట్ల ఆదాయం వస్తే.. 2020–21లో ఇప్పటికే రూ.4,53,812 కోట్ల ఆదాయం రావడమే అందుకు నిదర్శనం. 2019–20లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఎక్సైజ్ సుంకం కింద రూ.47,500 కోట్లు వస్తే.. సెస్సుల రూపంలో రూ.3,15,700 కోట్లు వచ్చింది. ఎక్సైజ్ సుంకంలోనే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తుంది. సెస్సుల ఆదాయం ఒక్క పైసా కూడా ఇవ్వదు. అంటే రూ.19,475 కోట్లు మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చింది. సెస్సుల రూపంలో ప్రజల నుంచి దోచిన రూ.లక్షలాది కోట్లను కేంద్రం ఏం చేస్తోందో చెప్పాలి. సెస్సులు తగ్గిస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ని రూ. 60–70 కి ఇవ్వొచ్చు. సామాన్యలపై భారం తగ్గించవచ్చు’ అని వివరించారు. మరో వైపు కేంద్రం 2013–14 నాటికి రూ.53,11,081 కోట్ల అప్పులు చేస్తే.. ఆ రుణం ప్రస్తుతం రూ.1,16,21,780 కోట్లకు చేరుకుందని.. అంటే ఏడేళ్లలో కేంద్రం రూ.63,10,699 కోట్ల అప్పు చేసిందని, అప్పుగా తెచ్చిన నిధులను కేంద్రం ఏం చేసిందో వివరణ ఇవ్వాలని బీజేపీ నేతలను నిలదీశారు. చదవండి: శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా కల్పించడం కోసమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 25 ఏళ్లపాటు యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు చేస్తున్నామని సజ్జల స్పష్టంచేశారు. 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న సమయంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి పీపీఏలు చేసుకుని చంద్రబాబు వేలాది కోట్ల రూపాయలు కమీషన్లుగా వసూలు చేసుకున్నారని ఆరోపించారు. ‘బాబు చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యుదుత్పత్తి చేసినా, చేయకున్నా వాటికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో సౌర విద్యుత్ యూనిట్ రూ.7, పవన విద్యుత్ యూనిట్ రూ.5 చొప్పున కొనేలా పీపీఏలు కుదుర్చుకుని.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. చంద్రబాబు కమీషన్ల వల్లే డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి. వీటివల్ల ప్రజలపై తీవ్ర భారం పడింది’ అని చెప్పారు. ‘చంద్రబాబు పాలనలో చీకటిమయంగా మారిన రాష్ట్రాన్ని వెలుతురులోకి తేవడానికి సీఎం వైఎస్ జగన్ ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే సెకీ నుంచి యూనిట్‌ను రూ.2.49కే కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. సరఫరా నష్టాలు, ఇతర పన్నులతో కలిపి ఈ రేటుకు ఇవ్వడానికి సెకీ ముందుకొచ్చింది. అదే సంస్థ నుంచి తమిళనాడు సర్కారు యూనిట్‌ను రూ.2.61కు కొంటోంది. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదు. ఏవైనా తప్పులు జరిగితే.. ఆధారాలతో సహా చూపడం ద్వారా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలు హర్షిస్తారు. అవాస్తవాలతో సర్కారుపై బురద జల్లడానికి ప్రయత్నిస్తే ప్రజలు ఛీకొడతారు’ అని సజ్జల చెప్పారు. -
పెట్రో ధరల బాదుడుపై వామపక్షాల నిరసన
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన పెట్రో భారాలతో పేదల బతుకులు దుర్భరంగా మారాయని పలువురు వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, ఇతర పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో పెట్రోల్ ధర లీటరు రూ.130కి చేరే ప్రమాదముందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పెట్రో ధరలతో పాటు, గ్యాస్, నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిరసనలో భాగంగా పి.మధు, కె.రామకృష్ణల నాయకత్వంలో వామపక్షాల నాయకులు ఒక్కసారిగా రాస్తారోకోలకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఫలితంగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీసుస్టేషన్లకు తరలించారు. నిరసనల్లో ప్రత్యేక హోదా సాధాన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం, సీపీఐ నేతలు సీహెచ్ బాబారావు, దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
అప్పట్లో అదనపు పన్నులు విధించి ఇప్పుడు ఆందోళనలా!
సాక్షి, అమరావతి: ఎలాంటి కారణాలు చూపకుండానే 2015 ఫిబ్రవరిలో పెట్రోల్‌పై లీటరుకు రూ.4 చొప్పున అదనపు పన్ను విధించిన చంద్రబాబు అప్పట్లో అన్ని ధరలనూ పెంచేశారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో ధరల్ని పెంచినందుకు సంజాయిషీ ఇవ్వాల్సిందిపోయి పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. పెట్రోల్ ధర 2018లోనే 86 దాటింది రాష్ట్రంలో 2014 జూన్‌లో రూ.73 ఉన్న పెట్రోల్ ధర.. 2018 సెప్టెంబర్ నాటికే రూ.86 దాటింది. డీజిల్ అయితే రూ.62 నుంచి రూ.80కి పెరిగింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను ఎక్కడా తగ్గించింది లేదు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి.. అంటే 2019 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.87.24 కు చేరింది. పెట్రో ధరలు పెరిగాయనే సాకు చూపి 2015 అక్టోబర్‌లో, 2015 డిసెంబర్లో, 2016 జూన్‌లో, 2017 జూలైలో కలిపి కేవలం రెండేళ్లలో చంద్రబాబు నాలుగు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను అడ్డగోలుగా దోచేసి.. రాసి రంపాన పెట్టారు. ప్రజలపై భారం వేయలేదు కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం రూ.30 వేల కోట్లు తగ్గింది. కరోనా సమయంలో నిరుపేదలను ఆదుకోవడం కోసం రూ.30 వేల కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చు చేశారు. మొత్తమ్మీద ప్రభుత్వంపై రూ.60 వేల కోట్ల భారం పడినా ప్రజలపై ఎలాంటి భారం వేసేలా ధరలు పెంచలేదు. విభజన సమయంలో రాష్ట్ర వాటాగా వచ్చిన రూ.90 వేల కోట్ల రుణాన్ని.. ఎడాపెడా అప్పులతో దోపిడీ చేసి దాన్ని రూ.3.60 లక్షల కోట్లకు పెంచేసి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ సర్కార్‌ను విమర్శించే నైతిక హక్కు, అర్హత చంద్రబాబుకు లేవు. ఏనాడైనా రోడ్లను పట్టించుకున్నారా టీడీపీ హయాంలో ఐదేళ్లలో రోడ్లను ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లోనే రోడ్లు గోతులు, గుంతలమయంగా మారిపోయాయి. రెండేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల ఆ రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లను ప్రజలకు ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దడానికే పెట్రోల్ లీటర్‌పై ఇటీవల రూ.1ను ప్రభుత్వం పెంచింది. చంద్రబాబు తరహాలో పెట్రోల్ ధరలను చూపి.. ఆర్టీసీ చార్జీలను సీఎం వైఎస్ జగన్ పెంచలేదు. అమరరాజా బ్యాటరీ కంపెనీ తరలిపోతోందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కలత చెందుతూ కథనాలు రాశారు. ఆ పరిశ్రమపై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదు. పరిశ్రమలు రావాలి. అయితే అవి ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలి. ఇది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. -
హైదరాబాద్: రూ.100.20 పలికిన లీటర్ పెట్రోల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. డీజిల్ లీటర్ ధర వందకు చేరువైంది. సోమవారం పెట్రోల్ రూ.100.20, డీజిల్ రూ.95.14 పైసల చొప్పున ధర పలికాయి. కరోనా కష్టకాలంలో సైతం ఇంధన ధరలపై బాదుడు తప్పడం లేదు. తాజాగా పక్షం రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.2.17 పైసలు పెరిగింది. ఒకవైపు కరోనా సెకండ్‌వేవ్ ఉగ్రరూపం, మరోవైపు ఉపాధి కోల్పోయి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతుంటే చమురు ధరల పెంపు మరింత భారంగా మారాయి. పెరుగుతున్న ఇంధనం ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రెండు నెలలుగా పైపైకి.. కరోనా కష్టకాలంలో గత రెండు మాసాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. వాస్తవంగా ఈ ఏడాది ఆరంభంలో మొదటి రెండు నెలల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.8.32 పైసలు, డీజిల్‌పై 9.51 పైసలు పెరిగాయి. ఆ తర్వాత వరసగా రెండు నెలలు లీటర్ పెట్రోల్‌పై 75 పైసలు, డీజిల్‌పై 92 పైసలు తగ్గాయి. తిరిగి వరుసగా పైసలు పెరిగి రెండు నెలల వ్యవధిలో లీటర్ పెట్రోల్‌పై రూ.6.02 పైసలు, డీజిల్‌పై రూ 7.32 పెరిగినట్లు చమురు సంస్థల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గరిష్ట స్థాయికి ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రోజువారీ సవరణ కంటే ముందే ఇంధన ధరలు గరిష్ట స్ధాయికి చేరి తర్వాత తగ్గుముఖం పట్టాయి. నాలుగేళ్ల క్రితం రోజువారీ సవరణలు ప్రారంభం కావడంతో పైసల్లో హెచ్చు తగ్గులు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా పెట్రోల్ 2013 సెప్టెంబర్‌లో లీటర్ ధర రూ. 83.07 పలికి గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి రోజువారీ ధరల సవరణ అనంతరం 2018 అక్టోబర్ 4న లీటర్ పెట్రోల్ ధర రూ.89.11కు పెరిగి రికార్డు బద్దలు కొట్టింది. డీజిల్ 2018 అక్టోబర్‌లో లీటర్ ధర రూ.82.38తో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ రూ.82.80కు చేరి పాత రికార్డును అధిగమించింది. తాజాగా మరింత గరిష్ట ధరకు చేరుకున్నాయి. నగర వాటా 70 శాతం పైనే గ్రేటర్లో వాహనాల సంఖ్య సగటున 65 లక్షలపైగానే ఉంటుంది. పెట్రోల్, డీజిల్ వినియోగంలో నగర వాటా 70% వరకు ఉంటుంది. నగరం మొత్తమ్మీద 558 వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రతినిత్యం 35 నుంచి 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 నుంచి 33 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. జీఎస్టీలో చేర్చాలి చమురు ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటా శాతమే సగానికిపైగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌లను కూడా జీఎస్టీలో చేర్చాలి. అప్పుడే ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. ధరలు ఇదే విధంగా కొనసాగితే నిత్యావసర సరుకులు మరింత పెరుగుతాయి. వాహనాలు కూడా నడపడం కష్టమే. – సయ్యద్ జావీద్, అధ్యక్షుడు, గ్రేటర్ సిటీ ట్యాక్స్ వేల్పేర్ అసోసియేషన్ -
సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర
సాక్షి, అమరావతి: పెట్రోల్ ధర సెంచరీ కొట్టడమే కాదు.. వంద దాటేసింది. డీజిల్ ధర కూడా దానివెంటే పరుగులు పెడుతూ రూ.వందకు చేరువైంది. విజయవాడలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.101.11కి, డీజిల్ ధర రూ.95.34కి చేరాయి. గతేడాది జూన్ 1న విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.74.21, డీజిల్ రూ.68.15 ధర ఉండేవి. నాటి ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఏడాదిలో పెట్రోల్ లీటరుపై రూ.26.90, డీజిల్‌పై రూ.27.19 ధర పెరిగాయి. దీంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఇది నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రో ధరలపై 2017లో కేంద్రం నియంత్రణ ఎత్తేసింది. దాంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ఉత్పత్తి సంస్థలు ఏ రోజుకారోజు సమీక్షించి.. పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి. రిఫైనరీ నుంచి ప్రాంతాల దూరాన్ని బట్టి.. రవాణా ఖర్చులను కలిపి ఆయా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఉత్పత్తి సంస్థలు ఖరారు చేస్తాయి. అయితే, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో వైఎస్సార్, ప్రకాశం విశాఖపట్నం జిల్లాలు మినహా పది జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. డీజిల్ ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లోనే డీజిల్ ధర కూడా రూ.వంద దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పెట్రో డీలర్లు చెబుతున్నారు. -
అమితాబ్, అక్షయ్‌కు అండగా కేంద్రం
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్లపై పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే చేసిన బెదిరింపులను తీవ్రం గా ఖండిస్తున్నామనీ, వారికి తమ పార్టీ పూర్తి గా రక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయక మంత్రి రాందాస్ అఠావలే ప్రకటించారు. ఇటీవల బండారా జిల్లాలో నిర్వ హించిన రైతు మద్దతు యాత్ర సందర్భంగా, పెట్రోల్ ధరల పెరుగుదల విషయంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్‌లు స్పందించనందుకు వారి సినిమాలు ప్రదర్శించకుండా అడ్డుకుంటామనీ, షూటింగ్‌లు కూడా జరగనీయమని నానా పటోలే హెచ్చరించిన నేపథ్యంలో రామ్‌దాస్ అఠావలే తీవ్రంగా స్పందించారు. ‘హిందీ, మరాఠీ సినీ పరిశ్రమలు ముంబై నగరానికి గౌరవ ప్రతీకలనీ, సినీ పరిశ్రమ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందనీ, వేలాది మందికి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి కలిగిస్తోందనీ, ఇలాంటి పరిశ్రమను అడ్డుకోవడం సమంజసం కాదనీ..’ ఆయన హితవు పలికారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి బెదిరింపులకు స్థానం లేదనీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులను అమలు చేసినట్లయితే రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు రోడ్డు పైకి వచ్చి సినీ పరిశ్రమకు అండగా నిలబడతారనీ.. ముఖ్యంగా అమితాబ్, అక్షయ్‌కుమార్‌లకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు రక్షణ కవచంగా మారుతారనీ..’ ఆయన వెల్లడించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటులు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్‌లు స్పందించకుంటే వారి సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని ఎంపీసీసీ అధ్యక్షుడు నానా పటోలే హెచ్చరించిన విషయ తెలిసిందే. అంతేగాకుండా వారి షూటింగులను కూడా అడ్డుకుంటామన్నారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లు సోషల్ మీడియాలో ‘మేం కార్లయితే కొనగలం కానీ, పెట్రోల్ కొనలేం’ అని వ్యంగ్యంగా పలు పోస్టింగ్‌లు పెట్టారనీ, అలాంటిది ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సెలబ్రిటీలు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటులు అండగా తాము ఉంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదల: వివాదంలో నటులు -
వామ్మో.. హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధర వాహనదారుల చేతి చమురు వదిలిస్తోంది. అదే వరుసలో గ్యాస్ సిలిండర్ వంటింట్లో మంట మండిస్తోంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అంతకంతకూ ఎగబాగుతూనే ఉన్నాయి. వరుసగా తొమ్మిది రోజులుగా చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. పక్షం రోజుల వ్యవధిలో వంట గ్యాస్ సైతం ధర రెండుసార్లు పెరిగింది. చమురు సంస్థలు రోజు వారీ ధరల సవరణలో భాగంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సగటున 26 నుంచి 36 పైసలు పెంచుతూపోతున్నాయి. నగరంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డును అధిగమించింది. తాజాగా.. లీటర్ పెట్రోల్ రూ.93.10 పైసలకు చేరింది. డీజిల్ రూ. 87.20కి చేరింది. ఈ నెల లో లీటర్ పెట్రోల్‌పై రూ.3.33 పైసలు, లీటర్ డీజి ల్‌పై 3.74 పైసలు పెరిగింది. గత నెలలో సైతం లీటర్ పెట్రో ల్, డీజిల్‌పై సగటున రూ.3పైనే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పైపైకి ఎగ బాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వామ్మో.. గ్యాస్ బండ.. వంట గ్యాస్ ధర మోత మోగుతోంది. పక్షం రోజుల వ్యవధిలో సిలిండర్‌పై రూ.75 పెరిగింది. చమురు సంస్థలు మూడు రోజుల క్రితం గృహపయోగ వంట గ్యాస్ సిలిండరపై రూ.50 పెంచడంతో హైదరాబాద్‌లో సిలిండర్ రూ. 821.50కు చేరినట్లయింది. గత పక్షం రోజుల క్రితం కూడా సిలిండర్‌పై రూ.25 మేర పెరిగింది. గత ఏడాది డిసెంబర్లో పక్షం రోజుల వ్యవధిలో వంద రూపాయలు పెరిగిన రీఫిల్ ధర నెల రోజుల పాటు నిలకడగా ఉంటూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా మళ్లీ ధర ఎగబాగుతోంది. రూ.34.19 కోట్ల భారం వంట గ్యాస్ధరల పెంపునకు అనుగుణంగా సబ్సిడీ నగదు పెంపు లేకపోవడంతో గ్రేటర్వాసులపై నెలవారీగా పడుతున్న భారం అక్షరాలా రూ.34.19 కోట్లు. మూడు మాసాలుగా చమురు సంస్ధలు వంట గ్యాస్ రీఫిల్ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు కేవలం రూ.40.71 పైసలకు పరిమితం చేశాయి. దీంతో ఎల్పీజీ ధర పెరిగిన ప్రతిసారీ పేద, మధ్యతరగతి వినియోగదారులపై పిడుగు పడినట్లవుతోంది. ఈ నెలలో రెండుసార్లు ధర పెరగడంతో హైదరాబాద్‌లో గృహోపయోగ గ్యాస్ రూ.821.50కు చేరినట్లయింది. చదవండి: తల్లిదండ్రులపై కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల తీవ్ర ఒత్తిడి -
ధరల మంట- పెట్రోల్ @ఆల్‌టైమ్ హై
న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు నెల రోజుల తదుపరి బుధవారం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా మరోసారి బలపడ్డాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇంధన రంగ పీఎస్‌యూలు ధరలను వరుసగా రెండో రోజు పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై తాజాగా 23 పైసలు, డీజిల్‌పై 26 పైసలు చొప్పున పెంచాయి. బుధవారం సైతం లీటర్ పెట్రోల్ ధరను 26 పైసలు, డీజిల్ ధరను 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20ను తాకింది. డీజిల్ రూ. 74.38కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. ఇది ఆల్‌టైమ్ గరిష్టం కాగా.. ప్రస్తుతం ఈ స్థాయిని ధరలు అధిగమించడం గమనార్హం. ఇక డీజిల్ ధరలైతే 2018 అక్టోబర్ 4న లీటర్‌కు రూ. 75.45 వరకూ ఎగసింది. కాగా.. 2020 మే నెల నుంచి చూస్తే.. పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ. 14.51 పుంజుకోగా.. డీజిల్ ధర రూ. 12.09 ఎగసింది. ఇదే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు పెట్రోలియం వర్గాలు ప్రస్తావించాయి. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) ముంబైలో మరింత దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల సంగతి చూస్తే.. ముంబైలో తాజాగా లీటర్ పెట్రోల్ రూ. 90.83ను తాకగా.. డీజిల్ రూ. 81.07కు చేరింది. చెన్పైలో పెట్రోల్ రూ. 86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 85.68 వద్ద, డీజిల్ రూ. 77.97 వద్ద విక్రయమవుతోంది. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో గత రెండు రోజుల్లో దాదాపు 6 శాతం జంప్‌చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.85 శాతం పుంజుకుని 51 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.7 శాతం ఎగసి 54.67 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
వరుసగా రెండో రోజూ పెరిగిన పెట్రో ధర
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా రెండో రోజుకూడా పెరిగాయి. దాదాపు 40 రోజుల విరామం తరువాత ఆదివారం(నిన్న) ఊపందుకున్న పెట్రోలు ధర సోమవారం కూడా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మెట్రో నగరాల్లో ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు 16 పైసలు, హైదరాబాదులో 14 పైసలు పెరగ్గా, డీజిల్ ధర యథాతథంగా ఉంది. ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 80.73 రూపాయలు డీజిల్ ధర లీటరుకు 73.56 రూపాయలు కోలకతా పెట్రోలు 82.30, డీజిల్ 77. 06 రూపాయలు ముంబై పెట్రోలు 87.45, డీజిల్ 80.11 రూపాయలు చెన్నై పెట్రోలు 83. 87, డీజిల్ 78. 86 రూపాయలు హైదరాబాద్ పెట్రోలు 83.93, డీజీల్ 80.17రూపాయలు అమరావతి పెట్రోలు 85.54, డీజీల్ 81.32 రూపాయలు -
పెట్రో ధరల పెంపు, కాంగ్రెస్ నిరసన బాట
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం దేశవ్యాప్త ఆందోళనను చేపట్టనుంది. పెంచిన పెట్రో ధరలను వెనక్కితీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించనున్నారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలను అనాలోచితంగా పెంచడం పట్ల నిరసన తెలుపుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో పెట్రో ధరల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై అసాధారణ భారం మోపినతీరును ఎండగడతామని చెప్పారు. ఇక జూన్ 30 నుంచి వారం రోజుల పాటు తాలూకా, బ్లాక్ స్ధాయిలో భారీ నిరసనలు చేపడతామని వెల్లడించారు. గత 21 రోజులుగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులపై అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయిన క్రమంలో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు పెంచి భారీగా దండుకుంటోందని దుయ్యబట్టారు. పెట్రో ధరలు తగ్గినా వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రజలకు ఉద్దేశపూర్వకంగానే ఉపశమనం కలిగించడంలేదని ఆరోపించారు. చదవండి : అహ్మద్ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం -
కార్లు నడపాలా, కాల్చేయా?: మంత్రి
ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్ ముంబైలో పెరుగుతున్న ఇంధన ధరలపై సరదాగా స్పందించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను కార్లో ఇంధనం నింపాక బిల్లును తనిఖీ చేయడం లేదా అని శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజు రోజుకు పెంచుతుండటంతో బిగ్‌బీ గతంలో చేసిన ట్వీట్‌పై ఈ సందర్భంగా మంత్రి స్పందించారు. 2012లో పెట్రోల్ ధరలు మిన్నంటడంతో బిగ్‌బీ సరదాగా చేసిన ఓ ట్వీట్‌ను మంత్రి అవాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘పెట్రోల్ ధర లీటర్‌పై 7.5 రూపాయలు పెరగడంతో అసహనంతో ఉన్న ఓ ముంబైవాసి పెట్రోల్ పంప్‌కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది అతడిని ఎంత పెట్రోల్ కొట్టాలి సార్ అని అడగ్గా.. ఆ ముంబై వాసి 2-4 రూపాయల పెట్రోల్‌ను కారుపై కొట్టండి దాన్ని తగలబెట్టేస్తా’ అంటూ అగ్రహం వ్యక్తం చేసినట్లు బిగ్‌బీ సరదాగా ట్వీట్ చేశాడు. (‘పెట్రో’ మంట; వైరలవుతున్న బిగ్‌బీ ట్వీట్) ప్రస్తుత పెట్రోల్ ధరలు కూడా పెరగడంతో మంత్రి అవాద్ ఆ ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ‘‘మీ కారులో ఇంధనం నింపాక బిల్లు చూడటం లేదా? ఇప్పుడు మీరు మాట్లాడే సమయం వచ్చింది. పక్షపాతం వహించకుండా మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరల చూస్తే కార్లు నడపాలా, లేదా కాల్చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ ఆయన రాసుకొచ్చారు. అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ 2011 మే 16న పెట్రోల్ ధరలు పెంచడానికి ముందు చేసిన ట్వీట్‌ను కూడా మంత్రి గురువారం షేర్ చేశారు. ‘‘ఈ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్తానో లేదో తెలియదు. పెట్రోల్ పంప్ ముందు క్యూ కడుతూ ప్రజలు ముంబై రోడ్లపైకి వచ్చారు’’ అంటూ చేసిన ట్వీట్‌కు మంత్రి ‘‘ఏంటీ మీరు ట్విటర్లో యాక్టివ్‌గా లేరా?, న్యూస్ పేపర్ ఫాలో అవడం లేదా, లేక కార్లను వాడటం మానేశారా?’’ అంటూ సరదాగా చమత్కరించారు. కాగా ముంబైలో ఇవాళ లీటరు పెట్రోల్ 86.91 రూపాయలు, లీటరు డీజిల్ 78.51 రూపాయలు ఉంది. (మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే) R u not active on @Twitter ... Have u stopped using cars.. Dnt u read news paper....@akshaykumar .... There has been a steep #PetrolDieselPriceHike just for Ur information https://t.co/f5Dr1UPFhs — Dr.Jitendra Awhad (@Awhadspeaks) June 25, 2020 -
లాక్డౌన్ వేళ పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం వరుసగా ఎనిమిదో రోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్‌కు 62 పైసలు, డీజిల్ లీటర్‌కు 64 పైసల మేర పెరగడంతో ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు 4.52 రూపాయలు, డీజిల్ ధర లీటర్‌కు 4.64 రూపాయలకు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలకు అనుగుణంగా ధరలను చమురు కంపెనీలు సవరించాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 78.03 రూపాయలకు చేరగా, ఢిల్లీలో 75.78 రూపాయలకు ఎగబాకింది. లాక్డౌన్ వేళ ప్రజల ఆదాయం దిగజారిన సమయంలో పెట్రో ధరల పెంపుపై సామాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆందోళనకరమని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. చదవండి : పెట్రోలు : మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం -
బడ్జెట్ తర్వాత భారీ పెట్రో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు బుధవారం భారీగా పెరిగాయి. బడ్జెట్ అనంతరం ఒకేరోజు ఈస్ధాయిలో పెట్రో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడంతో పాటు సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో పెట్రో ధరలు పేట్రేగిపోతున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ 25 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కు 24 పైసల మేర పెరిగింది. పెట్రో ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ 72.42 కాగా, హైదరాబాద్‌లో రూ 76.99 ముంబైలో రూ 75.26, చెన్నైలో రూ 69.57, కోల్‌కతాలో రూ 68.23 పలికింది. -
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు
-
ముగిసిన ఎన్నికలు : ఎగిసిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో ఇంధన ధరలు పైకి చూస్తున్నాయి. సోమవారం దేశీయంగా వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ పుంజు కున్నాయి. పెట్రోలుపై లీటరుకు 8-10 పైసలు పెరిగాయి. అలాగే డీజిల్‌పై లీటరుకు 15-16 పైసలు చొప్పున ధర పెరిగింది. మరోవైపు ఉత్పత్తికోతలు కొనసాగించాలని, తద్వారా చమురు ధరలు పడకుండా ఈ ఏడాది మొత్తం మద్దతు అందించాలని ఒపెక్ నిర్ణయం తీసుకుంది. దీంతో సోమవారం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బహుళవారాల గరిష్ఠాలకు చేరింది. అటు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సైతం చమురు ధరకు ఆజ్యం పోశాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ దాదాపు 1.5 శాతం పెరిగి 73.40 డాలర్లను తాకింది. ఇది దేశీయంగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ : పెట్రోలు రూ. 75. 43, డీజిల్ ధర 71.90 విజయవాడ : పెట్రోలు రూ. 74. 84, డీజిల్ ధర రూ. 70. 94 ఢిల్లీ : పెట్రోలు రూ. 71.12, డీజిల్ రూ. 6.11 చెన్నై: పెట్రోలు 73.82, డీజిల్ రూ. 69.88 కోలకతా : పెట్రోలు రూ. 73.19, డీజిల్ రూ. 67.86 ముంబై: పెట్రోలు రూ. 76.73 డీజిల్ రూ. 69.27 -
పెట్రోల్, డీజిల్ ధరలు : ఏ నగరంలో ఎంత?
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు చేపట్టినా.. ఇవి పైకి ఎగుస్తూనే ఉన్నాయి. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో లీటరుకు 6 పైసలు, 19 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.72గా ఉంది. డీజిల్ ధర రూ.75.38గా నమోదైంది. అదేవిధంగా ముంబైలో డీజిల్ ధర నిన్నటి కంటే 20 పైసలు పెరిగి, లీటరుకు రూ.79.02గా రికార్డైంది. పెట్రోల్ కూడా 6 పైసలు పెరిగి రూ.88.18గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.85.99కు, కోల్‌కతాలో రూ.84.54కు పెరగగా.. లీటరు డీజిల్ ధర చెన్నైలో 19 పైసలు పెరిగి రూ.79.71గా, కోల్‌కతాలో రూ.77.23గా రికార్డయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఏ మాత్రం తగ్గింపు లేకుండా.. పెరుగుతూ ఉండే సరికి ఏకంగా ఈసారి ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు. అన్ని ఆయిల్ కంపెనీల సీఈవోలతో నేడు నరేంద్ర మోదీ సమావేశం కాబోతున్నారు. చమురు సరఫరాల్లో అతి ముఖ్యమైన దేశం అయిన ఇరాన్‌పై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుండటంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. -
ఆల్‌టైమ్ గరిష్టానికి పెట్రోల్
న్యూఢిల్లీ: సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్ ధరలు సోమవారం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.91 మార్క్‌ను దాటింది. ముంబైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఔట్లెట్లలో లీటర్ పెట్రోల్ రూ.91.08 ఉండగా, డీజిల్ రూ.79.72కు చేరుకుంది. ఇక, భారత్ పెట్రోలియం లిమిటెడ్ (బీపీఎల్) ఔట్లెట్లలో పెట్రోల్ రూ.91.15 కాగా, డీజిల్ రూ.79.79గా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటంతో ఆయిల్ కంపెనీలు సోమవారం లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.73, డీజిల్ రూ.75.09కు చేరుకొని రికార్డు సృష్టించాయి. గడచిన 6 వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.6.59, డీజిల్ 6.37 రూపాయలు పెరగటం గమనార్హం. -
ఇం'ధన' మంట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రవాణా రంగం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇం‘ధన’మంట నేపథ్యంలో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. అసలే నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు అశనిపాతంలా మారాయి. వారం రోజులుగా పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు వారాల్లోనే లీటరుపై దాదాపుగా రూ.3.18లు పెరిగింది. దీంతో రోజుకు రూ.23 లక్షల భారాన్ని ఆర్టీసీ మోస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలోని ప్రజా రవాణా వ్యవస్థ పరిస్థితీ ఇలానే ఉంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్, లారీలు, క్యాబ్‌లు, ఆటోల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడమే నేటి భారానికి కారణమని రవాణా రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. లారీ యజమానులకు కోలుకోలేని దెబ్బ పెరుగుతున్న పెట్రోల్ ధరలు రవాణా రంగానికి కీలకంగా ఉన్న లారీల యజమానులను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం అన్ సీజన్ కారణంగా లారీలకు గిరాకీ లేదు. దీనికితోడు పెరుగుతున్న డీజిల్ ధరలు వ్యాపారాన్ని మరింతగా దెబ్బతీస్తున్నాయని యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో కేవలం బొగ్గు, సిమెంటు రవాణా లారీలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. తాజా పరిస్థితులతో వ్యాపారం సరిగా సాగక.. యజమానులు వాయిదాలు కట్టలేకపోతున్నారు. రెండు వాయిదాలు దాటితే.. లారీలను ఫైనాన్స్ వ్యాపారులు లాక్కెళ్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలగజేసుకోవాలని తెలంగాణ లారీల అసోషియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మినహాయించి డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో చేర్చాలని కోరారు. -
భారత్ బంద్‌కు రాజ్ థాకరే మద్దతు
సాక్షి, ముంబై : ఇంధన భారాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మద్దతు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటం పట్ల సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, భారత్ బంద్‌లో తమ పార్టీ చురుకుగా పాల్గొంటుందని రాజ్ థాకరే ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పెట్రో ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో మరింత భారమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా దేశ విధానాలు ఉండటం ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు. నోట్ల రద్దు పర్యవసానాలను చక్కదిద్దుకునేందుకు పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా పన్నులు వడ్డించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలకు సామాన్యుడిపై భారం ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజలంతా రాజకీయ, సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి బంద్‌లో పాల్గొనాలని కోరారు. -
బంకు.. చూస్తే జంకు
సాక్షి,హైదరాబాద్: పెట్రోలు బంకు అంటేనే జనం జంకాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో, డీజిల్ ధర పైసా పైసా పెరుగుతూ చుక్కలు చూపిస్తోంది. రోజువారీ ధరల సవరణ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ ధరలు దేశంలోనే రికార్డు సృష్టిస్తుండగా పెట్రోల్ ధరలో మాత్రం ముంబై తర్వాత రెండో స్ధానంలో ఆల్‌టైం రికార్డుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుదల, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం మధ్య వరుసగా గత పన్నెండు రోజుల్లో ఇంధన ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ధరల సవరణ విషయంలో మధ్యలో ఒక రోజు విరామం ఇచ్చిన చమురు మార్కెటింగ్ సంస్ధలు మళ్లీ విజృంభించాయి. దీంతో ఇప్పటికే ఆల్‌టైమ్ హై రికార్డు వద్ద కదలాడుతున్న ధరలు మరింత పెరిగాయి. చమురు సంస్థలు ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణలతో సైలెంట్‌గా బాదేస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన చమురు సంస్థలు.. కిందటేడాది ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి. పన్నుల మోతనే.. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోతే కారణంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ. 21.48 లు, డీజిల్‌పై రూ.17.33 వసూలు చేస్తోంది. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలు పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్ పన్నుల విధింపులో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31శాతం వ్యాట్ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో 30.71 శాతానికి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి సగటున పెట్రోల్‌పై 57 శాతం. డీజిల్‌పై 44 శాతం పన్నుల భారం పడుతోంది. క్రూడాయిల్ దూకుడు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఎగబాగుతోంది. మార్కెట్లో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర రూ.4,872లకు చేరింది. ఒక బాస్కెట్ (బ్యారెల్)లో 159 లీటర్లు చమురు ఉంటుంది. ఈ లెక్కన లీటర్ చమురు ధర రూ.30.64. క్రూడాయిల్ రీఫైనింగ్, రవాణా ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మోతతో చమురు ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల భారం వినియోగదారుల మీద పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గతంలో తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదు. తాజాగా పెరుగుతున్న క్రూడాయిల్ ధరలకు తోడు పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణ మరింత ఆందోళనకరంగా తయారైంది. -
పెట్రో షాక్ : ఆల్ టైం హైలో ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ముడిచమురు ధరల భారంతో గురవారం పెట్రో ధరలు ఆల్ టైం హైకి చేరాయి. దేశ వాణిజ్యరాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రికార్డు స్ధాయిలో రూ. 86.91కు ఎగబాకింది. డీజిల్ లీటర్‌కు రూ. 75.96కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 21 పైసలు పెరిగి రూ. 84.30కు చేరింది. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 79.51, రూ. 71.55కు పెరిగాయి. అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ అత్యంత కనిష్టస్ధాయిలో రూ. 71కు పడిపోయిన ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరలు భారమవుతున్నాయి. మరోవైపు రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రూపాయిని స్ధిరీకరించేందుకు ఆర్బీఐ జోక్యంపై జైట్లీ మాట్లాడుతూ రూపాయి బలోపేతానికి ఆర్బీఐ అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పుకొచ్చారు. -
ఆగని పెట్రో ధరలు
-
షాకింగ్ : ఆగని పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడటం లేదు. ఇంధన ధరలు వరుసగా సోమవారం మూడోరోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్‌కు 30 పైసలుకు పైగా పెరగ్గా, పలు మెట్రో నగరాల్లో డీజిల్ ధరలు లీటర్‌కు 40 పైసలు పైగా పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ సోమవారం రూ 84.10 పైసలకు చేరింది. ఇక ముంబయిలో రెండు రోజుల కిందట రూ 83.76 పలికిన లీటర్ పెట్రోల్ ప్రస్తుతం రూ 86.56కు ఎగబాకింది. ఇక చెన్నైలో రూ 82.24, కోల్‌కతాలో రూ 82,.02, ఢిల్లీలో రూ 78.84గా నమోదైంది. మరోవైపు డీజిల్ ధరలూ భారమయ్యాయి. ముంబయి, చెన్నై, ఢిల్లీల్లో డీజిల్ లీటర్‌కు వరుసగా రూ 75.54, రూ 75.19, రూ 71.15కు పెరిగింది. ఇక కోల్‌కతాలో డీజిల్ లీటర్ ధర రూ 74కు చేరింది. ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో పాటు డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరుగుతాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. కాగా అమెరికా ఏకపక్ష విధానాలతోనే అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
షాకింగ్ : పెట్రో బాంబు పేల్చిన కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : రోజురోజుకూ భగ్గుమంటున్న పెట్రో ఉత్పత్తుల ధరలపై కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండటంతో ఇంధన ధరల పెంపు కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు అంతర్జాతీయ అంశాలే కారణమని పేర్కొన్నారు. మరోవైపు శనివారం రికార్డు గరిష్టస్ధాయిలకు చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం సైతం మరింత భారమయ్యాయి. ఇక హైదరాబాద్‌లో ఆదివారం పెట్రోల్ లీటర్‌కు 17 పైసలు భారమై రూ 83.59కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ 86.09కు చేరగా, డీజిల్ లీటర్‌కు రూ 74.76 పలికింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి రూ. 71కి పడిపోవడంతో ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. -
రూపాయి క్షీణించడంతో పెట్రో ధరలకు రెక్కలు..
-
పెట్రో షాక్ : రికార్డు హైలో ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : రూపాయి బలహీనపడటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు సోమవారం అత్యంత గరిష్ట స్ధాయికి చేరాయి. డీజిల్ లీటర్‌కు 14 పైసలు పెరగ్గా, పెట్రోల్ లీటర్‌కు 13 పైసలు భారమైందని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. సవరించిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 82.60కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 85.33కు పెరగ్గా, డీజిల్ ధరలు రూ.77.91కు చేరాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో ఈనెల 16 నుంచి ఇంధన ధరలు భగ్గుముంటున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అత్యంత కనిష్టస్ధాయిలో రూ 70.32 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారమవడం, రూపాయి మారకపు విలువతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, లెవీలతో ఇంధన ధరలు మరింత భారమవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తుండటంతో ఇంధన ధరలు రికార్డు స్ధాయిలకు చేరుతున్నాయి. -
బీజేపీకి ఓటమికి కారణం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలపై మిత్రపక్షం జేడీయూ స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరల అసాధారణ పెంపు ఫలితంగానే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషించింది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలే బీజేపీ ఓటమికి కారణమని, దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. తక్షణమే పెట్రో ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. బిహార్‌లోని జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ ఆలం జేడీయూ అభ్యర్థి ముర్షీద్ ఆలంపై 40,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నేపథ్యంలో జేడీయూ నేత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు జేడీయూ పొందిన ఓట్లు తమ ఆధిక్యం కంటే తక్కువని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ యూటర్న్ తీసుకోవడంపై బిహార్ ప్రజలు కసితీర్చుకుంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు లోక్‌సభ,పది అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికల్లో విపక్షాల చేతిలో బీజేపీకి భంగపాటు ఎదురైంది. -
‘పెట్రో’ భారంపై నిరసన సెగలు
సాక్షి, ముంబయి : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంధన భారాలపై ముంబయిలో గురువారం కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసనను చేపట్టాయి. కలినా ప్రాంతం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ముంబయివాసులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పెట్రో ధరల పెంపును నిరసిస్తూ మోదీ, సుష్మా స్వరాజ్, బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లు విమర్శిస్తూ చేసిన ట్వీట్లను ఈ సందర్భంగా వారు ప్రదర్శించారు. దేశ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా సూట్‌బూట్ సర్కార్ సాగుతోందని నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. పెట్రో ధరల పెంపుతో వాహనదారులతో పాటు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత తొమ్మిది రోజులుగా పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. పెట్రో ధరలు దేశవ్యాప్తంగా రికార్డు స్ధాయిలో లీటర్‌కు రూ 80 దాటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత భారమయ్యాయి. కాగా పెట్రో ధరలు దిగివచ్చేలా చర్యలు చేపడతామని కేంద్రం సంకేతాలు పంపింది. -
పెట్రో ధరలు; శుభవార్త చెప్పిన అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యులు, మధ్యతరగతి వర్గాలను నిలువునా దహిస్తోన్న పెట్రో మంటలు అతికొద్దిరోజుల్లోనే ఆరిపోయే అవకాశం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ శుభవార్తను సూచాయగా వెల్లడించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో వాహనదారులు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే: ‘‘పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలోని బృందం.. చమురు సంస్థలతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నది. అతిత్వరలోనే ధరల పెరుగుదలకు ఒక పరిష్కారం లభిస్తుంది. పెట్రోలియం మంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారు’’ అని అమిత్ షా వివరించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు పెంపును నిలుపులచేసిన ఆయిల్ కంపెనీలు.. ఆ తర్వాత ధరలను భారీగా పెంచేశాయి. ఒక దశలో లీటర్ పెట్రోలు 84 రూపాయాలకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం(మంగళవారం నాటికి) హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 81.4 రూపాయలు, డీజిల్ 74.04 రూపాయలుగా ఉంది. బీజేపీ సూపర్: బీజేపీ కార్యకర్తలు ఏప్రిల్ 14 నుంచి మే 5 దేశంలోని 484 జిల్లాల్లో.. 21వేల పైచిలుకు గ్రామాల్లో చేపట్టిన గ్రామస్వరాజ్ అభియాన్ కార్యక్రమం విజయవంతమైందని షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, ప్రధాని నరేంద్ర మోదీ మాటలను మొత్తం 65 వేల గ్రామాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల ఎంపికను ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను షా తప్పుపట్టారు. ట్రైనింగ్ అనంతరం మాత్రమే శిక్షణ ఇవ్వలని భావిస్తున్నారే తప్ప ఎంపికను కాదని వివరించారు. -
పెట్రో సెగల నుంచి ఊరట..?
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో ప్రభుత్వం వినియోగదారులకు ఊరట ఇచ్చే చర్యలు చేపడుతుందని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంతో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈ వారంలోనే కొన్ని చర్యలు తీసుకోవచ్చని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు మరికొన్ని చర్యలు తీసుకోవచ్చని ఆయన సంకేతాలు పంపారు. పెట్రో ధరలు పెరగడం ప్రభుత్వానికి సంక్షోభ పరిస్థితేనని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలతో ముందుకొస్తుందని అన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఎక్సయిజ్ సుంకం కోతతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులో ఉండేలా మరికొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఈ వారంలోనే ప్రభుత్వం పెట్రో ధరల నియంత్రణకు పలు చర్యలతో ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను సవరించని చమురు మార్కెటింగ్ సంస్థలు మే 14 నుంచి వరుసగా రోజూ ధరలను పెంచుతుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డుస్ధాయికి చేరిన సంగతి తెలిసిందే. -
‘జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు’
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమనడంతో వీటిపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని, జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని పరిశ్రమ సంస్థలు ఫిక్కీ, అసోచామ్ కేంద్రాన్ని కోరాయి. పెట్రో ధరల రోజువారీ సవరణలో భాగంగా తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ రూ 80 దాటి అత్యంత గరిష్టస్థాయిని నమోదు చేసింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానికి అంటడం ఆందోళనకరమని ఫిక్కీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్ధాయిలకు చేరాయి. మరోవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్ధాయికి చేరడంతో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఇంధన ధరలు పెరగడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీన్ని నివారించేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ద్వారా వినియోగదారులకు తాత్కాలికంగా ఊరట లభిస్తుందని, అయితే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అసోచామ్ సెక్రటరీ జనవర్ డీఎస్ రావత్ అన్నారు. ఇంధన భద్రతపై భారత్ దృష్టి కోణం మారాలని, వీటిని భారీ ఆదాయ వనరుగా ప్రభుత్వాలు పరిగణించరాదని సూచించారు. -
గరిష్టస్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు
-
పెట్రోల్ ధరలపై స్పందించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంపై కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డిజిల్ ధరలు పెరుగుదలతో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. పెట్రో ఉత్పత్తులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం.. పెట్రోల్, డిజిల్ ధరలపై ప్రభావం చూపిందన్నారు. త్వరలోనే భారత ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను యథాతథంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు మే 14 నుంచి తిరిగి ధరల సవరణను చేపట్టాయి. దీంతో పెట్రో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. గత వారం రోజులుగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ 1.61, డీజిల్ ధర లీటర్‌కు రూ 1.64 మేర పెరిగాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ 80.76 దాటడం గమనార్హం. డీజిల్ లీటర్‌కు రూ 73.45కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ రూ 76.24కు చేరగా, డీజిల్ ధర రూ 67.57కు ఎగబాకింది. -
రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ధరలను సవరించడంతో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ 80.76 దాటడం గమనార్హం. డీజిల్ లీటర్‌కు రూ 73.45కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ రూ 76.24కు చేరగా, డీజిల్ ధర రూ 67.57కు ఎగబాకింది. జూన్ 2017లో పెట్రో ధరల రోజువారీ సవరణ అమలులోకి వచ్చిన అనంతరం దేశ రాజధానిలో తొలిసారిగా పెట్రోల్ లీటర్‌కు అత్యధికంగా 33 పైసలు పెరగ్గా, డీజిల్ 26 పైసల మేర పెరగినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. పెట్రో ధరలు స్థానిక పన్నులకు అనుగుణంగా ఉండే క్రమంలో పలు మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను యథాతథంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు మే 14 నుంచి తిరిగి ధరల సవరణను చేపట్టినప్పటి నుంచి పెట్రో ధరలు వరుసగా ఏడవ రోజూ పెరిగాయి. గత వారం రోజులుగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ 1.61, డీజిల్ ధర లీటర్‌కు రూ 1.64 మేర పెరిగాయి. -
భగ్గుమంటున్న పెట్రో ధరలు
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరుగుతున్నది పైసల్లోనే అయినా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రోజువారీ ధరల సవరణ వినియోగదారుల పాలిట శాపంగా తయారైంది. కేవలం పది రోజుల్లో లీటర్ పెట్రోల్ ధరపై 63 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగింది. ఇప్పటికే దేశంలో డీజిల్ ధర టాప్‌గా మారగా, పెట్రోల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత జూన్ వరకు ప్రతి పక్షం రోజులకోసారి ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. ఆ తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ ధరలను నిర్ణయిస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చి న తొలి పక్షం రోజుల్లో ధరలు తగ్గగా.. తర్వాత క్రమంగా విజృంభించాయి. పెట్రో ఉత్పత్తుల ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీల ప్రభావం కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో పెట్రోల్.. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.78.90కు చేరింది. గత నెలాఖరులో రూ.77.89గా ఉన్న ధర.. ఆ తర్వాత పైసలు పైసలు పెరుగుతూ వచ్చింది. నెల ప్రారంభంలో వరసగా మూడు రోజులపాటు 11 నుంచి 19 పైసలకు పెరిగి ఆ తర్వాత ఒక పైసా నుంచి 5 పైసల పెంపు వరకు పరిమితమైంది. మధ్యలో మూడు రోజులు ధరలో ఎలాంటి మార్పు లేకపోగా రెండ్రోజులు మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత పైసలు పైసలు పెరుగుతూ గత మూడు రోజుల నుంచి విజృంభించింది. మరోవైపు డీజిల్ ధర టాప్‌గా మారింది. ప్రస్తుతం లీటర్ ధర రూ.71.44 పైసలు పలుకుతోంది. ధరల సవరణ సమయంలో డీజిల్ లీటర్ ధర రూ.59ç.30 పైసలు ఉండగా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. డీజిల్ ధర ఆల్‌టైం రికార్డుగా తయారైంది. ప్రతి నిత్యం విక్రయం ఇలా.. హైదరాబాద్‌లో పెట్రోల్ ఉత్పత్తుల విక్రయాలు అధికంగా ఉంటాయి. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వాహనాల వరకు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా వాటి ద్వారా నిత్యం 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడుపోతుంది. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి నిత్యం పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. -
డీజిల్ గుబేల్..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. హైదరాబాద్‌లో డీజిల్ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకుంది. పెట్రోల్ కూడా దానిని అనుసరిస్తూ భగ్గుమంటోంది. రోజు వారీ ధరల సవరణ పేరిట పెట్రో ధరలను పైసా.. పైసా పెంచుతున్న చమురు సంస్థలు.. వినియోగదారునిపై సైలెంట్‌గా బాదేస్తున్నాయి. ఈ నెల మొదట్లో డీజిల్ ధరను లీటర్‌కు మూడు నుంచి 19 పైసల చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు.. రెండు రోజుల క్రితం మూడు పైసలు తగ్గించాయి. మళ్లీ ఇప్పుడు డీజిల్ ధర తారస్థాయికి చేరింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.70.58కు చేరింది. ఇక లీటర్ పెట్రోల్ ధర రూ.78.27గా ఉంది. పక్షం నుంచి రోజులకు.. గతేడాది వరకు ప్రతి పక్షం రోజులకోసారి పెట్రో ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. గత జూన్ నుంచి ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చిన తొలి పక్షం రోజులూ ధరలు తగ్గగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రోజువారీగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచొద్దని చమురు సంస్థలకు సూచనలు జారీ చేసింది. చమురు సంస్థలు మాత్రం కేంద్రం ఆదేశాలు తమకు అందలేదని చెపుతూ ధరలను పెంచుతున్నాయి. డీజిల్ రూ.70.58.. పెట్రోల్ రూ.78.27 తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీజిల్ ధర మోతెక్కుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.70.58గా ఉంది. రోజువారీ ధరల సవరణ విధానం ప్రారంభమైన సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.59.30గా ఉంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ అక్టోబర్ నాటికి రూ.64.02కి చేరింది. మార్చి నెలఖారులో రూ.69.97కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.78.27గా ఉంది. గత జూన్‌లో రూ.69.56గా ఉన్న పెట్రోల్ ధర ఆ తర్వాత రోజువారీ ధర సవరణలతో పైసా పైసా పెరిగుతూ వచ్చింది. గత నెలఖారులో రూ.77.89గా ఉంటే.. ఈ నెలలో రూ.78.36 వరకు పెరిగి ఆ తర్వాత హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీల బాదుడు కూడా తోడవుతోంది. తెలుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ విధింపులో దేశంలోనే రెండో స్థానంలో ఉండటం గమనార్హం. పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గుతాయి.. పన్నుల వల్ల పెట్రో ధరలు ఎగబాకుతున్నాయి. ఖజానా నింపేందుకు ప్రజలపై పన్ను రుద్దేస్తున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు దిగిరావడం ఖాయం. కేంద్రం దీనిపై పునరాలోచించాలి. – రియాజ్ ఖాద్రీ, చైర్మన్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు.. కేంద్రం పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది. పెట్రో ధరలు దిగిరావాల్సిందే. లేకుంటే రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు. – జగదీశ్, ఉప్పుగూడ, హైదరాబాద్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తోంది.. ఒకేసారి రూపాయల్లో పెంచితే తెలిసిపోతుందని.. రోజూ పైసల్లో పెంచుతూ అమాయక ప్రజల్ని ప్రభుత్వం పిచ్చివారిని చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వాహనాలను ఇళ్లలో నుంచి తీయాలంటేనే ప్రజలు భయపడే రోజులు వస్తాయి. – ఉదయ్, క్యాబ్ డ్రైవర్ -
పెరిగిన ఇంధన ధరలపై ఆమ్ఆద్మీ నిరసన
రాయగడ:పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ రాయగడలోని కపిలాస్ జంక్షన్లో ఆమ్ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఉద యం 11గంటల సమయంలో ఆమ్ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జొన్మొజొనొస్వొంయి అధ్యక్షతన నిర్వహిం చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఇంధన ధరలు పడిపోతుంటే కేంద్రప్రభుత్వం ఇంధన ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతోందని ఆరోపించారు. గత 3సంవత్సరాలలో ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలు పెంచడం వల్ల ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.73కు చేరుకుందని మండిపడ్డారు. 2015 లో ఇంధన ధరలు తగ్గిస్తామన్న ప్రభుత్వం ధరలు తగ్గించలేదని, తరచూ ధరలు పెంచుతూ పోతోంద ని ఆరోపించారు. అనంతరం ప్రధా ని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను రావణునిగా పోల్చి దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టి.సంగన్న, సోమానాథ్ హుయిక, దొరకొండగిరి, జితేంద్రసేనాపతి, చైతన్యబేణియా, దుర్గాచరణ పట్నాయక్, నాగేష్బిడిక, మహిళా సభ్యులు దేవికొండగిరి, భాగ్యవతి రొహులొ, రాణివాజ్పా, సుభాషిణినాయక్, సునీతనాయక్, అనితపాత్రో, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఆమ్ఆద్మీపార్టీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో రైల్‌రోకో చేపట్టి నిరసన తెలియజేశారు. -
పెట్రోలుపై ఐదు పైసలు, డీజిల్‌పై రూ. 1.26 పెంపు
న్యూఢిల్లీ: పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటరు పెట్రోలుపై ఐదు పైసలు, లీటరు డీజిల్‌పై రూ. 1.26లు పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 65.65, డీజిల్ ధర లీటరుకు 55.19కి చేరాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. మే 1 నుంచి పెట్రో ధరలను నాలుగుసార్లు పెంచారు. అప్పటినుంచి పెట్రోలు రూ. 4.52, డీజిల్ రేటు రూ. 7.72 మేర పెరిగింది.