
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం వరుసగా ఎనిమిదో రోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్‌కు 62 పైసలు, డీజిల్ లీటర్‌కు 64 పైసల మేర పెరగడంతో ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు 4.52 రూపాయలు, డీజిల్ ధర లీటర్‌కు 4.64 రూపాయలకు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలకు అనుగుణంగా ధరలను చమురు కంపెనీలు సవరించాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 78.03 రూపాయలకు చేరగా, ఢిల్లీలో 75.78 రూపాయలకు ఎగబాకింది. లాక్‌డౌన్ వేళ ప్రజల ఆదాయం దిగజారిన సమయంలో పెట్రో ధరల పెంపుపై సామాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆందోళనకరమని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment