Pakistan To Implement 2 Days Lockdown To Overcome Petrol And Diesel Shortage - Sakshi
Sakshi News home page

Weekly 4 Days Working: భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఇక వారంలో 4 రోజులే పని?

Published Mon, May 23 2022 9:43 PM | Last Updated on Tue, May 24 2022 5:23 PM

Pakistan To Implement Two Days Lockdown To Overcome Petrol And Diesel Shortage - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో పెట్రోలు, డీజిల్‌ కొరత నానాటికీ పెరుగుతోంది. దీంతోపాటు వాటి ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు పాక్‌ ప్రభుత్వం సరిక్తొత ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ఉద్యోగుల పని దినాలను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజల్‌ కొరత సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందాలని పాక్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు పాక్ పత్రిక డాన్ సోమవారం ఓ కథనంలో వెల్లడించింది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, దేశంలో వినియోగం పెరగడం,  దిగుమతి వ్యయం పెరగడం వంటి కారణాలతో పాక్ ఈ నిర్ణయం తీసుకోనుందట. ఈ పద్ధతిని అనుసరించి ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఆలోచన అమలు ద్వారా వార్షికంగా $2.7 బిలియన్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని పాక్‌ అంచనా వేసింది. దీనితో, సగటు పీఓఎల్‌ ఆదా నెలకు 12.2 కోట్లుగా అంచనా వేస్తూ, ఇది సంవత్సరానికి $1.5 బిలియన్లకు చేరుకోవచ్చని భావిస్తోంది.  అంతేకాక 90 శాతం నూనె వాడకం పనిదినాల్లోనూ, మిగిలిన 10 శాతం సెలవు దినాల్లోనూ నెలలో వినియోగిస్తుండటం గమనార్హం. దీంతో వారానికి 4 రోజులే పని దినాలకే పాక్‌ ప్రభుత్వం మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: Russian Army Dog Max: చనిపోయే స్థితిలో రష్యా ‘మాక్స్‌’.. ప్రాణాలు నిలిపిన ఉక్రెయిన్‌కు సాయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement