దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల పెంపు కొనసాగుతుంది. దీంతో ఆదివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై 50పైసలు, లీటర్ డీజిల్‌పై 55పైసలు పెరిగాయి.
దేశంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.35 పైసలు ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.98.68పైసలుగా ఉంది
వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09 పైసలుగా ఉంది
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.99.11 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.90.42 పైసలుగా ఉంది
ముంబైలో పెట్రోల్ ధర రూ.113.88 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.98.13 పైసలుగా ఉంది
చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00 పైసలుగా ఉంది
కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.108.53పైసలు ఉండగా డీజిల్ ధర రూ.93.57పైసలుగా ఉంది
'మూడిస్' ఏం చెబుతుందంటే
ప్రముఖ ఇన్వెస్టర్ సర్వీస్ సంస్థ మూడిస్ ప్రకారం..ఈ ఏడాదిలో జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మనదేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ సంస్థలు పెట్రోల్ ధరల్ని పెంచకుండా తటస్థంగా ఉంచాయి. దీని కారణంగా చమురు సంస్థలకు రూ.19వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అదే సమయంలో బ్యారెల్ చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వెరసీ కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకునేలా పెట్రో ధరల పెంపు అనివార్యమైనట్లు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment