
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో ఇంధన ధరలు పైకి చూస్తున్నాయి. సోమవారం దేశీయంగా వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ పుంజు కున్నాయి. పెట్రోలుపై లీటరుకు 8-10 పైసలు పెరిగాయి. అలాగే డీజిల్‌పై లీటరుకు 15-16 పైసలు చొప్పున ధర పెరిగింది.
మరోవైపు ఉత్పత్తికోతలు కొనసాగించాలని, తద్వారా చమురు ధరలు పడకుండా ఈ ఏడాది మొత్తం మద్దతు అందించాలని ఒపెక్ నిర్ణయం తీసుకుంది. దీంతో సోమవారం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బహుళవారాల గరిష్ఠాలకు చేరింది. అటు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సైతం చమురు ధరకు ఆజ్యం పోశాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ దాదాపు 1.5 శాతం పెరిగి 73.40 డాలర్లను తాకింది. ఇది దేశీయంగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తోంది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు
ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ : పెట్రోలు రూ. 75. 43, డీజిల్ ధర 71.90
విజయవాడ : పెట్రోలు రూ. 74. 84, డీజిల్ ధర రూ. 70. 94
ఢిల్లీ : పెట్రోలు రూ. 71.12, డీజిల్ రూ. 6.11
చెన్నై: పెట్రోలు 73.82, డీజిల్ రూ. 69.88
కోలకతా : పెట్రోలు రూ. 73.19, డీజిల్ రూ. 67.86
ముంబై: పెట్రోలు రూ. 76.73 డీజిల్ రూ. 69.27
Comments
Please login to add a commentAdd a comment