Indian Oil Corporation Limited
-
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్‌గా 'సతీష్ కుమార్'
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇండియన్ ఆయిల్) చైర్మన్‌గా 'సతీష్ కుమార్ వడుగిరి' ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థకు అధిపతిగా నేడు బాధ్యతలు చేపట్టారు. శనివారం పదవికి రాజీనామా చేసిన ఎస్ఎం వైద్య స్థానంలో సతీష్ కుమార్‌ను నియామకమైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.2021 అక్టోబరు నుంచి డైరెక్టర్ (మార్కెటింగ్)గా పనిచేస్తున్న సతీష్ కుమార్.. తన ప్రస్తుత పాత్రను కొనసాగిస్తూనే ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. ఈయన 2022 అక్టోబర్ నుంచి ఒక సంవత్సరం పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా కూడా పనిచేశారు.35 సంవత్సరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభివృద్ధికి సతీష్ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయనకు ఇండియన్ ఆయిల్ మారిషస్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ అయిన ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, బహుళజాతి చమురు కంపెనీలతో పనిచేసిన విస్తృత అనుభవం ఉంది.సతీష్ కుమార్ నాయకత్వంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గత మూడు సంవత్సరాలలో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. సంస్థ తన రిటైల్ అవుట్లెట్లను ఆధునీకరించింది, కొత్త బాట్లింగ్ ప్లాంట్లు, టెర్మినల్‌లను ప్రారంభించింది. హైవే రిటైల్ ప్రదేశాలలో సౌకర్యాలను ప్రవేశపెట్టింది.మార్కెటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సతీష్ కుమార్.. మధ్యప్రదేశ్ & ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మార్కెటింగ్ నెట్‌వర్క్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్‌గా పనిచేశారు. తన కెరీర్లో LPG వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY), బీఎస్-6 ఫ్యూయల్ ఇంప్లిమెంటేషన్ మొదలైన కీలక వ్యాపార కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. -
టాటా పవర్, ఐవోసీ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 500 ఫాస్ట్, అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే దిశగా టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం (ఎంవోయూ) ఐవోసీ రిటైల్ అవుట్‌లెట్స్‌లో టాటా పవర్ చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేస్తుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు గుంటూరు–చెన్నై హైవే, సేలం–కొచ్చి హైవే వంటి జాతీయ రహదారుల వెంట వీటిని నెలకొల్పుతుంది. దీనితో సుదూర ప్రయాణాలు చేసే ఎలక్ట్రిక్ వాహనదారులు రేంజి (మైలేజి)పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం తప్పుతుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్ – ఈవీ చార్జింగ్) వీరేంద్ర గోయల్ తెలిపారు. చార్జర్ల లభ్యత గురించి టాటా పవర్ ఈజెడ్ చార్జ్, ఇండియన్ఆయిల్ ఈ–చార్జ్ మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 2024 నాటికి 10,000 పైచిలుకు ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ ఈడీ సౌమిత్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
ఐవోసీ భారీ పెట్టుబడులకు రెడీ
న్యూఢిల్లీ: నంబర్ వన్ ఇంధన రిటైల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌ల విస్తరణతోపాటు.. ఇంధన పరివర్తన ప్రాజెక్టులలోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. వెరసి 360 డిగ్రీల ఇంధన దిగ్గజంగా ఆవిర్భవించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలియజేశారు. విభాగాలవారీగా.. తాజా పెట్టుబడుల్లో రూ. లక్ష కోట్లను చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. పూర్తి కర్బనరహిత(నెట్ జీరో) కార్యకలాపాలను సాధించే బాటలో రూ. 2.4 కోట్లను సంబంధిత ప్రాజెక్టులకు కేటాయించనుంది. ఒడిషాలోని పారదీప్‌లో అత్యంత భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై మరో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను అందుకోవడంతోపాటు.. ఇంధన పరివర్తనను సైతం సాధించే వీలున్నట్లు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులకు ఐవోసీ చైర్మన్ వైద్య వివరించారు. దేశీ ఇంధన మార్కెట్లో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ 2046కల్లా పూర్తి కర్బన రహిత కార్యకలాపాలను సాధించాలని ఆశిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రిఫైనింగ్ సామర్థ్యాలను 33 శాతంమేర పెంచుకోనున్నట్లు వైద్య తెలియజేశారు. దీంతో త్వరలోనే 10.7 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. బీఎస్ఈలో ఐవోసీ షేరు వారాంతాన 0.5 శాతం నీరసించి రూ. 92 వద్ద ముగిసింది. -
రిలయన్స్ కేజీ–డీ6 గ్యాస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్ నుంచి వెలికితీసే గ్యాస్ విక్రయం కోసం నిర్వహించిన వేలానికి మంచి స్పందన కనిపించింది. వివిధ రంగాలకు చెందిన 41 కంపెనీలు వేలంలో పాల్గొనగా 29 సంస్థలు 5 ఏళ్ల కాలానికి గ్యాస్‌ను కొనుగోలు చేశాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), అదానీ–టోటల్ గ్యాస్, షెల్ తదితర కంపెనీలు వీటిలో ఉన్నాయి. రోజుకు 6 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను విక్రయించగా ఐవోసీ దాదాపు సగభాగాన్ని (2.9 ఎంసీఎండీ) దక్కించుకుంది. గెయిల్ 0.7 ఎంసీఎండీ, అదానీ–టోటల్ గ్యాస్ 0.4 ఎంసీఎండీ, షెల్ 0.5 ఎంసీఎండీ, జీఎస్పీసీ 0.25 ఎంసీఎండీ, ఐజీఎస్ మరో 0.5 ఎంసీఎండీ గ్యాస్‌ను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దిష్ట ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర యూనిట్‌కు (ఎంబీటీయూ) 13.35 డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, సంక్లిష్ట ప్రాంతాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్ రేటును చెల్లించాల్సి ఉంటుందని వివరించాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఇది 12.12 డాలర్లుగా ఉందని తెలిపాయి. ఈ రేటును కేంద్రం 6 నెలలకోసారి సవరిస్తుంది. రిలయన్స్, దాని భాగస్వామి బీపీ ఈ జనవరిలోనే వేలం నిర్వహించాలని భావించినప్పటికీ జనవరి 13న కేంద్రం కొత్త ధరల విధానాన్ని ప్రకటించింది. దీంతో వేలాన్ని వాయిదా వేసుకుని, మార్చి 9 నుంచి నిర్వహించింది. -
రాస్నెఫ్ట్తో ఐవోసీ ఒప్పందం
న్యూఢిల్లీ: రష్యాకి చెందిన రాస్నెఫ్ట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఓ ఒప్పందంపై సంతకం చేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో మరింత చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకోవాలన్నది ఐవోసీ ప్రయత్నం. చమురు దిగుమతులు గణనీయంగా పెంచుకునేందుకు తాజా ఒప్పందం ఉపకరిస్తుందని ఐవోసీ ప్రకటించింది. రాస్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్ భారత్ పర్యటనలో భాగంగా ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. -
గ్యాస్ అయిపోయిందని టెన్షన్ వద్దు !.. అరగంటలో మరో సిలిండర్ ?
గ్యాస్ సిలిండర్ అయిపోయిందంటే దాదాపుగా ఇంటి పని సగం ఆగిపోతుంది. ఇంటిల్లిపాది మరో సిలిండర్ కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. వేగంగా గ్యాస్ సిలిండర్ అందించేందుకు తత్కాల్ పథకం అందుబాటులోకి తెచ్చారు. అది కూడా పైటల్ ప్రాజెక్టుగా మన హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ పథకం అమలుచేస్తున్నారు. తత్కాల్ స్కీం ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ అయిపోతే గ్యాస్ ఏజెన్సీ వెళ్లడం, ఆన్లైన్ బుక్ చేయడం లేదా ఫోన్లో ఐవీఆర్ఎస్ పద్దతిలో ఇంకో సిలిండర్ బుక్ చేయాల్సి వచ్చేది. ఫుల్ సిలిండర్ ఇంటికి వచ్చేందుకు కనీసం ఆరు గంటల నుంచి ఆరు రోజుల వరకు సమయం పట్టేది. సామాన్యులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తీర్చేందుకు తత్కాల్ స్కీమ్ అమలు చేయాలని గ్యాస్ ఏజెన్సీలు నిర్ణయించాయి. ముందుగా ఇంధన్ దేశం మొత్తం మీద 28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో 14 కోట్ల కనెక్షన్లు ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్నాయి. దీంతో తత్కాల్ స్కీమ్‌ను ముందుగా ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్న ఇంధన్ సిలిండర్లకు అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నగరాన్ని ఎంపకి చేశారు. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ డివిజన్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. బుకింగ్ ఇలా రెగ్యులర్‌గా గ్యాస్ బుక్ చేసే ఐవీఆర్ఎస్, ఇండియన్ ఆయిల్ వెబ్సైట్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌లలో తత్కాల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి తత్కాల్ పద్దతిలో సిలిండర్ బుక్ చేయగానే.. సదరు ఏజెన్సీకి వెంటనే పుష్ మెసేజ్ వెళ్లిపోతుంది. వారు అక్కడి నుంచి డెలివరీ బాయ్‌కి ఆ మెసేజ్‌ని చేరవేస్తారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ బుక్ అవుతుంది.. డెలివరీకి రంగం సిద్ధమవుతుంది. అరగంటలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గరిష్టంగా 2 గంటలలోపు ఫుల్ సిలిండర్‌ను అందిస్తారు. అందుకు గాను గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వీసులను ప్రస్తుతం సింగిల్ సిలిండర్ ఉన్న ఇళ్లకే అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఈ తత్కాల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా దేశమంతటా, అందరు వినియోగదారులకు తత్కాల్ సేవలు అందివ్వనున్నారు. చదవండి: రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన -
సవాళ్లే సక్సెస్‌కు మెట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మొట్టమొదటి మహిళా రిఫైనరీ యూనిట్ హెడ్‌గా సమర్ధంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్లా మిస్త్రీ. పురుషాధిపత్య విభాగమైన మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్ లీడర్‌గా కొనసాగుతున్న శుక్లా ఈ యేడాది ప్రతిష్టాత్మక ఇటిప్రైమ్ ఉమన్ లీడర్షిప్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. గతంలో భారతీయ హైడ్రోకార్బన్ పరిశ్రమలోనూ మొట్టమొదటి మహిళా ఇన్స్పెక్షన్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం శుక్లా ఖాతాలో ఉంది. వారంలో అన్ని షిఫ్టులలోనూ, సమ్మె రోజున కూడా సమర్థంగా విధులను నిర్వర్తించిన అధికారిగా, సహోద్యోగులకు రోల్‌మోడల్‌గా నిలుస్తారు శుక్లా. అత్యుత్తమ సంస్థాగత నైపుణ్యాలతో, ఏ మాత్రం సంకోచం లేకుండా కీలక విధులను నిర్వర్తిస్తారనే ఘనత ఆమెది. వెస్ట్ బెంగాల్‌లోని సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్న బసంతి అనే ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు శుక్లా మిస్ట్రీ. ప్రతి యేటా వరదలకు గురవుతుండే ఆ గ్రామానికి పడవ సాయం తప్ప రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. కరెంటు, కాలేజీలు లేని చోటు నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా చేరడానికి ఎన్నో అవరోధాలను అధిగమించారు. అంచెలంచెలుగా రిఫైనరీ హెడ్‌గా ఎదిగారు. ‘మన దారి ఎప్పుడూ సునాయసంగా ఉండదు. కష్టాలు అనే బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. సవాళ్లుగా వాటిని ఎదుర్కొని, ప్రయాణం కొనసాగిస్తేనే గమ్యానికి చేరగలం’ అంటారు ఐదు పదుల వయసున్న శుక్లా. సామర్థ్య నిరూపణ రిఫైనరీ కార్యకలాపాలలో ప్రత్యేక శ్రద్ధ అన్నివేళలా అవసరం. లేదంటే, ప్రమాదకరస్థితిని ఎదుర్కోక తప్పదు. అలాంటి కీలమైన విధి నిర్వహణ గురించి శుక్లా వివరిస్తూ ‘ముడిసరుకును మెరుగుపరిచే ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుంది. వారంలో అన్ని షిఫ్టులకీ లీడ్ చేయడం తప్పనిసరి. అందరికీ సరైన గైడ్‌లైన్స్ ఇస్తూ ఉండాలి’ అని వివరిస్తారు ఆమె. పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో దూరపు బంధువు అందించిన సాయంతో, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1986లో ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఐఓసీలో చిన్న పోస్టులో చేరారు. అక్కడ మగవాళ్లు ఆన్సైట్లో పనిచేయడం చూసి, ఈ రంగంలో మహిళ ఎదగడానికి హద్దులున్నాయని గమనించారు. ఒక మహిళా ఇంజినీర్‌గా ఆఫీసులోనే కాకుండా పట్టుదలతో సైట్లో పనిచేయడానికి అనుమతి లభించేలా కష్టపడ్డారు. కానీ, ఆ సవాల్ అక్కడితో ఆగలేదు. శుక్లా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘మగ సహచరులతో పనిచేయగల అర్హతను సంపాదించుకోవడమే కాదు తగిన సామర్థ్యాన్ని కూడా చూపగలగాలి’ అంటారామె. అందుకు కొన్నేళ్ల సమయం పట్టిందని వివరిస్తారు శుక్లా. అవకాశాల కల్పనకు కృషి ఐసిఎఫ్ఎఐ నుంచి మోడర్న్ టెక్నాలజీలో డిప్లమా కూడా చేసిన శుక్లా నిర్వర్తించే విధులను గమనిస్తే అత్యంత చురుకుదనం, మానసిక శక్తి అవసరమయ్యే కఠినమైన ఉద్యోగం ఇది అని తెలుస్తుంది. మహిళలు కఠినమైన పని చేయడానికి ఇది తమకు తగనిది అని భావించడం తప్పు అనే శుక్లా ‘ఆడ–మగ తేడా లేదు. ఒకసారి పని మొదలుపెడితే ఎవరైనా దానిని సజావుగా పూర్తి చేయగల సామర్థ్యం తప్పక కలిగి ఉంటారు. అప్పుడు సమస్యలు, సవాళ్లు ఏవైనా కాలక్రమేణా తగ్గిపోతుంటాయి. మెరుగైన పనిని ‘చేయగలను’ అని సంకల్పించుకుంటేనే అవకాశాలు మనకోసం నడిచి వస్తాయి. అందుకు ప్రకృతి కూడా మన సమర్థతను నిరూపించుకోగలిగే స్థైర్యాన్ని ఇస్తుంది’ అంటారు. మనల్ని మనం అంగీకరిస్తేనే.. శుక్లా ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో ఇండియన్ ఆయిల్స్‌లో ముగ్గురు మహిళలలో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత తన పనితనాన్ని నిరూపించుకుంటూ ఒక్కో మెట్టును అధిరోహించుకుంటూ వెళ్లారు. తరచూ దేశవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణిస్తూ, అవగాహన పెంచుకోవడంతో పాటు, సవాళ్లను ఎదుర్కోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ‘మగ సహచరులతో కలిసి పనిచేసే వాతావరణాన్ని మనమే తయారుచేసుకోవాలి. నేను సైట్లో వచ్చిన మొదటి రోజుల్లో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడకున్నారు. కానీ, నన్ను నేను నిరూపించడం మొదలుపెట్టేసరికి ఇతరులూ నా సమర్థతను అంగీకరించడం ప్రారంభించారు. నేను వృత్తిరీత్యా కతార్‌కు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆఫీస్‌ను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నాను. 75 మంది గల గల్ఫ్ దేశ సభ్యులలో ఏకైక మహిళగా ఏడాది పాటు పనిచేశాను. సాధారణంగా మహిళలు డెస్క్ జాబ్‌లు సరైనవి అన్నట్టుగా భావిస్తుంటారు. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు తమ సామర్థ్యాలను తాము గుర్తిస్తున్నారు. చేయగలం అని నిరూపిస్తున్నారు. ఈ రంగంలో అమ్మాయిలు బాగా రాణించగలరు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని వివరిస్తారు శుక్లా. అవార్డుల నిధి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మొదటి మహిళా యూనిట్ హెడ్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా గతంలో ఎన్పిఎంపీ అవార్డు, పెట్రోఫెడ్ బెస్ట్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్, కైజెన్ అవార్డ్ ఫర్ బెస్ట్ సజెషన్, పెట్రోటెక్ ఉజాసిని అవార్డు మొదలైన అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న శుక్లా మంచి వక్త. వ్యాస రచన, కవిత్వం, క్రీడల పైనా ఎంతో ఆసక్తి చూపుతారు. కష్టంగా అనిపించే పనులను పట్టుదలతో చేపట్టి, సంకల్పబలంతో సాధించి, ఆశ్చర్యపరిచే విజయాలను సొంతం చేసుకునే శుక్లా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఇండియన్ ఆయిల్ కొత్త మస్కట్ ఇదే?
ఇండియన్ ఆయిల్ సంస్థ తమ కంపెనీని ప్రతిబింబించేలా కొత్త మస్కట్‌ని రూపొందించింది. శక్తికి, ధృడత్వానికి పేరైన ఖడ్గమృగాన్ని తమ కంపెనీ మస్కట్‌గా ఎంచుకుంది. ఏదైనా ఈవెంట్, లేదా బ్రాండ్ ప్రమోషన్ కోసం మస్కట్లను ఎంచుకోవడం సర్వ సాధారణం. ఇటీవల వెలుగులోకి వచ్చిన అస్సాం ఆయిల్స్ లిమిటెడ్ సంస్థ మస్కట్‌ను ఏర్పాటు చేసుకుంది. అదే బాటలో ఇండియన్ ఆయిల్ సైతం మస్కట్‌ని ట్విట్టర్ వేదికగా లాంఛ్ చేసింది. As we welcome #IndianOilRhino into the IndianOil family as its brand mascot, the similarities between the two are striking. Like a match made in heaven. Massive yet Agile, Tough yet Caring, Gentle yet Majestic. Reason enough to open up our hearts to the IndianOil Rhino. pic.twitter.com/LPgC0sCdTI — Indian Oil Corp Ltd (@IndianOilcl) September 1, 2021 ఇండియల్ ఆయిల్ కొత్తగా మాస్కట్ని లాంఛ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మస్కట్లను విడుదల చేయడంపకై ఉన్న శ్రద్ధ పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపుపై పెడితే బాగుంటుందంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. చదవండి : Petrol,diesel: రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు -
టెక్నాలజీ సాయంతో చమురు చోరీ, నిఘాకు ఐవోసీ డ్రోన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న చమురు పైప్లైన్ల భద్రతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డ్రోన్లను రంగంలోకి దింపింది. ఢిల్లీ– పానిపట్ మార్గంలో 120 కిలోమీటర్ల పైప్‌లైన్‌పై నిఘా కోసం డ్రోన్ సేవలను ప్రారంభించింది. చమురు దొంగతనాలను నిరోధించడమే కాకుండా, ప్రమాదాలను అరికట్టడం కోసం టెక్నాలజీ వినియోగం అవసరమని సంస్థ భావిస్తోంది. 15,000 కిలోమీటర్ల పరిధిలో సంస్థకు పైపులైన్లు విస్తరించి ఉండగా.. వీటిల్లో లీకేజీలను గుర్తించేందుకు ఇప్పటికే ఎంతో అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తోంది. ఇప్పుడు పైపులైన్ల పర్యవేక్షణకు డ్రోన్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్టు ఐవోసీ అధికారులు తెలిపారు. టెక్నాలజీ సాయంతో చమురు చోరీకి సంబంధించి 2020–21లో 34 ప్రయత్నాలను అడ్డుకున్నట్టు, 53 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఆప్టికల్ఫైబర్ ఆధారిత పైపులైన్ ఇంట్రూజర్ డిటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ (పీఐడీడబ్ల్యూఎస్)ను ఐవోసీ 5,474 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తోంది. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్
న్యూఢిల్లీ: ఎల్పీజీ కనెక్షన్‌దారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శుభవార్త చెప్పింది. కేవలం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎల్పీజీ కొత్త కనెక్షన్ తీసుకోవడం, ఎల్పీజీæ రీఫిల్ వంటి సదుపాయాలు పొందేలా సదుపాయం తీసుకొచ్చింది. కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లు ఈ సదుపాయాన్ని 8454955555కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పొందొచ్చని ఐఓసీ చైర్మన్ ఎస్ఎం వైద్య సోమవారం వెల్లడించారు. దీనితో పాటు ఒక సిలిండర్ కలిగిన వారు మరో సిలిండర్ పొందే సదుపాయాన్ని (డబుల్ బాటిల్ కనెక్షన్) ఇంటివద్దకే తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళిక రచించారు. 14.2 కేజీల సిలిండర్ ఉన్నవారు బ్యాక్అప్ కోసం మరో 5కేజీల సిలిండర్ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చని సూచించారు. -
గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: నిరాటంకంగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా మొత్తం సబ్సిడీ ఎత్తివేస్తోంది. దీంతో సామాన్యుడు వంట చేసుకోలేని విధంగా మారింది. అయితే ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలిగే వార్త వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్ సిలిండర్ లభించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్ ధర రూ.819గా ఉంది. కలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడంతో ధరలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఇథనాల్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగంలో ఉన్న ఆయిల్, గ్యాస్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ప్రత్యామ్నాయ ఇంధనం కోసం భారీ ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఒక్కో ఫెసిలిటీకి రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ ఎస్ఎస్వీ రామకుమార్ తెలిపారు. కంపెనీ ఈడీ, తెలంగాణ, ఏపీ హెడ్ ఆర్ఎస్ఎస్ రావుతో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒక్కో కేంద్రం రోజుకు 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రెండు స్థలాలను ప్రతిపాదించింది. ఏపీ సైతం ఇదే స్థాయిలో స్పందిస్తుందన్న ధీమా ఉంది. స్థలం చేతిలోకి రాగానే 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం’ అని చెప్పారు. బ్యాటరీ ప్లాంటు.. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల తయారీ కోసం ఇజ్రాయెల్ కంపెనీ ఫినెర్జీతో ఇండియన్ ఆయిల్ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక గిగావాట్ వార్షిక సామర్థ్యంతో రానున్న ప్రతిపాదిత ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసేది త్వరలో ప్రకటించనున్నారు. అల్యూమినియం ఆధారిత బ్యాటరీలను ఇక్కడ తయారు చేస్తారు. ఒకసారి చార్జీ చేస్తే ఈ బ్యాటరీతో 400 కిలోమీటర్ల వరకు వాహనం ప్రయాణిస్తుంది. బ్యాటరీలకు కావాల్సిన ముడి పదార్థాలన్నీ దేశీయంగా లభించేవే. రెండవ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఇండియన్ ఆయిల్ నోయిడాలో నెలకొల్పనుంది. 2023 జూలై నాటికి ఇది సిద్ధం కానుంది. ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,300 కోట్లు వెచ్చించనుంది. సుపీరియర్ డీజిల్ త్వరలో.. ఇండియన్ ఆయిల్ త్వరలో సుపీరియర్ డీజిల్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, చట్టబద్ధమైన అనుమతులు సైతం పొందామని రామకుమార్ తెలిపారు. ధర ఎక్కువ ఉన్నప్పటికీ కస్టమర్లకు ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పారు. ఇంజన్ శుభ్రంగా ఉండడం, తక్కువ ఉద్గారాలు, అధిక మైలేజీ ఇస్తుందని వివరించారు. ఎనర్జీ స్టేషన్స్‌గా అవతరణ.. సంస్థ ఫ్యూయల్ స్టేషన్స్ రూపురేఖలు మారనున్నాయి. 5–10 ఏళ్లలో ఇండియన్ ఆయిల్ పంపుల్లో మిథనాల్, ఇథనాల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ సైతం విక్రయించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్లూ రానున్నాయి. సాధారణ ఫ్యూయల్ స్టేషన్స్ కాస్తా ఇండియన్ ఆయిల్ ఎనర్జీ స్టేషన్స్‌గా రూపొందనున్నాయి. అలాగే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 5,000 కంప్రెస్డ్ బయోగ్యాస్ కేంద్రాలు రానున్నాయి. ఇప్పటికే 600 కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. ఒక ఎకరం స్థలం, రూ.3–5 కోట్ల పెట్టుబడి పెట్టగలిగే ఔత్సాహికులు ముందుకు రావొచ్చు. రుణమూ దొరుకుతుంది. కేజీకి సంస్థ రూ.46 చెల్లిస్తుంది. -
మోతెక్కిన వంట గ్యాస్..
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ 37 చొప్పున పెరిగింది. వరుసగా మూడు నెలలు వంట గ్యాస్ ధర దిగివచ్చినా జూన్ 1 నుంచి ఎల్పీజీ ధరలు భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధర పెరగడంతో సిలిండర ధరలను స్వల్పంగా పెంచామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. అంతర్జాతీయ ధరలు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అంశాల ఆధారంగా ఎల్పీజీ ధరలను ప్రతి నెల ఆరంభంలో సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ 636కు పెరిగింది. ఇక ఢిల్లీలో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ 593కు చేరగా, కోల్‌కతాలో రూ 616, ముంబైలో రూ 590, చెన్నైలో రూ 606కు ఎగబాకింది. చదవండి : దిగొచ్చిన గ్యాస్ ధర..! -
‘డిమాండ్‌కు తగ్గట్టు గ్యాస్ సిలిండర్ల పంపిణీ’
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండటంతో వంటగ్యాస్ వినియోగం పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్రవణ్ ఎస్. రావు తెలిపారు. లాక్డౌన్ ప్రారంభంలో సిలిండర్ బుకింగ్ బాగా పెరిగిపోయినప్పటికీ.. ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిమాండ్‌కు తగినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సకాలంలో సిలిండర్లు అందించేందుకు ఇండియన్ పంపిణీదారులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై సరఫరా యంత్రాంగానికి అవగాహన కల్పిస్తూ, గ్యాస్ నింపే ప్రదేశాల్లోనూ యాజమాన్యం అన్నివిధాలా అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపారు. (రైతులకు తీపికబురు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ట్రక్కుల పరిశుభ్రతపైనా శ్రద్ధ వహిహస్తున్నామని తెలిపారు. ఖాళీ సిలిండర్లతో వచ్చే వాహనాలు తిరిగి గ్యాస్ నింపిన సిలిండర్లు తీసుకెళ్లేదాకా అన్ని స్థాయిల్లోనూ అత్యంత అప్రమత్తత పాటిస్తుమన్నారు. జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తూ వాహనాల రాకపోకలు, సిలిండర్ల సరఫరా కార్యకలాపాలను సజావుగా నిర్వహిస్తోందన్నారు. సిలిండర్ల బిల్లు చెల్లింపు నిమిత్తం కరెన్సీ నోట్లకు బదులుగా సాధ్యమైనంత వరకూ డిజిటల్ పద్ధతిని ఉపయోగించే విధంగా ఐఓసీఎల్ ఖాతాదారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్క ఉచిత సిలిండర్ అందజేయదానికి వీలుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 73000 ఇండియన్ సిలిండర్లను (14.2 కేజీలు), 468 మంది లబ్దిదార్లకు 5 కేజీల సిలిండర్లను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంచితంగా పంపిణీ చేసిందన్నారు. (ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ ) శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో ఒకవైపు వేలాది ప్రాణాలు బలికాగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థలన్నీ మందగించాయి. ఈ భారీ ఆరోగ్య సంక్షోభంలో దేశమంతా దిగ్బంధమైన వేళ అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దేశానికి, ప్రజలకు మద్దతుగా ఐఓసీఎల్ సిబ్బంది శక్తివంచన లేకుండా తమవంతు కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు.ఈ పరీక్షా సమయంలో పెట్రో ఉత్పత్తుల సరఫరా క్రమం కుంటుపడకుండా పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలందించేందుకు ఐఓసీఎల్ సిబ్బంది పూర్తి వ్యక్తిగత రక్షణ సరంజామాతో విధులు నిర్వర్తిస్తున్నారు’’. (ఏపీ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు.. ) ‘‘ప్రాంతీయ కార్యాలయాలు, పంపిణీదారు ప్రాంగణాల వద్ద పూర్తిస్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేశాము. వలస కార్మికుల వంటి అన్నార్తులకు ఆహారం, నీరు, పాలు తదితర నిత్యావసరాలను మానవతా దృష్టితో సరఫరా చేస్తున్నాము. వాహనాల డ్రైవర్లు సొంతంగా వంట చేసుకునేందుకు వీలుగా కూరగాయలు, కిరాణా సరకులు, వంటగ్యాస్ తదితరాలన్నీ ఉచితంగా అందిస్తున్నాము. అనూహ్య సంఘటనల్లో దురదృష్టవశాత్తూ సిబ్బందికి, కార్మికులకు ప్రాణనష్టం వాటిల్లితే రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు కంపెనీ చేసింది. వివిధ ప్రభుతరంగ సంస్థల తరహాలో ‘పీఎం కేర్స్’ సహాయ నిధిసహా ఇతర సహాయ నిధులకూ ఐఓసీఎల్ సంస్థతోపాటు ఉద్యోగులు, సిబ్బంది తమ జీతాల నుంచి విరాళమిచ్చారు’’. అని శ్రవణ్ తెలిపారు. (ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ సడలింపు) -
పెట్రోల్ పోయించుకుంటే బహుమతులు
హైదరాబాద్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన కస్టమర్లకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. మెగా ఫెస్టివ్ ధమాకా పేరుతో ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్ ఆయిల్ సికింద్రాబాద్ డివిజన్ ప్రారంభించింది. ద్విచక్ర వాహనదార ఏదైనా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ వద్ద రూ.200 విలువైన పెట్రోల్ లేదా ఎక్స్‌ట్రాప్రీమియం పెట్రోల్ రూ.150 విలువ మేర పోయించుకున్నా మెగా లక్కీ డ్రా కింద బహుమతులు పొందడానికి అర్హులు. నాలుగు చక్రాల వాహనాదారులు రూ.500 విలువైన సాధారణ పెట్రోల్ లేదా రూ.400 విలువ చేసే ఎక్స్ట్రాపీమియం పెట్రోల్ పోయించుకోవాల్సి ఉంటుంది. అలాగే, సర్వో లూబ్రికెంట్ ఇంజన్ ఆయిల్‌ను ఒక లీటర్ కొనుగోలు చేసిన వారూ లక్కీ డ్రాకు అర్హులు. డ్రా కింద.. ఒక నిస్సాన్ డాట్సన్ కారు, 18 హీరో మ్యాస్ట్రో బైకులు, 350 గంగా కుక్కర్లు వంటివి ఆఫర్లలో ఉన్నాయి. పెట్రోల్ పోయించుకున్న కస్టమర్లు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. తమ మొబైల్ నుంచి ఇంగ్లిష్‌లో ఐవో (క్యాప్లెటర్) అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, పెట్రోల్ పంప్ కోడ్‌ను టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, బిల్లు నంబర్ టైప్ చేసి ఆ తర్వాత 8096666025 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. -
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు
-
ముగిసిన ఎన్నికలు : ఎగిసిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో ఇంధన ధరలు పైకి చూస్తున్నాయి. సోమవారం దేశీయంగా వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ పుంజు కున్నాయి. పెట్రోలుపై లీటరుకు 8-10 పైసలు పెరిగాయి. అలాగే డీజిల్‌పై లీటరుకు 15-16 పైసలు చొప్పున ధర పెరిగింది. మరోవైపు ఉత్పత్తికోతలు కొనసాగించాలని, తద్వారా చమురు ధరలు పడకుండా ఈ ఏడాది మొత్తం మద్దతు అందించాలని ఒపెక్ నిర్ణయం తీసుకుంది. దీంతో సోమవారం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బహుళవారాల గరిష్ఠాలకు చేరింది. అటు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సైతం చమురు ధరకు ఆజ్యం పోశాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ దాదాపు 1.5 శాతం పెరిగి 73.40 డాలర్లను తాకింది. ఇది దేశీయంగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ : పెట్రోలు రూ. 75. 43, డీజిల్ ధర 71.90 విజయవాడ : పెట్రోలు రూ. 74. 84, డీజిల్ ధర రూ. 70. 94 ఢిల్లీ : పెట్రోలు రూ. 71.12, డీజిల్ రూ. 6.11 చెన్నై: పెట్రోలు 73.82, డీజిల్ రూ. 69.88 కోలకతా : పెట్రోలు రూ. 73.19, డీజిల్ రూ. 67.86 ముంబై: పెట్రోలు రూ. 76.73 డీజిల్ రూ. 69.27 -
పెరిగిన వంటగ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ సిలిండర్ ధర రూ.2.08లు, నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.42.50 చొప్పున పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ప్రకటించింది.అంతర్జాతీయంగా చమురు ధరలు, డాలరు మారకంలో రూపాయి ఒడిదుడుకుల నేపథ్యంలో దేశీయంగా కూడా గ్యాస్ ధరలు ప్రభావితమైనట్టు పేర్కొంది. నేటి (మార్చి 1) నుంచి ఈ సవరించిన రేట్లు అమలు కానున్నాయి. -
ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట
న్యూఢిల్లీ : ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. సబ్సిడీ ఎల్పీజీ సిలెండరుపై రూ.6.52 మేర తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం 14.2కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.507.42గా ఉంది. 7 రూపాయలు తగ్గడంతో సిలెండరు ధర రూ.500.90కి లభించనుందని ఐఓసీ వెల్లడించింది. రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఎల్పీజీ ధరలు భారీగా తగ్గినట్లు ఐఓసీ వెల్లడించింది. ఇక సబ్సిడీయేతర సిలెండరు ధరపై రూ.133 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు సబ్సిడీయేతర సిలెండరు ధర రూ.942.50గా ఉంది. ఇక మీదట ఢిల్లీలో సబ్సిడీయేతర ఎల్పీజీ సిలెండరు ధర రూ.809.50కి లభించనుంది. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఎల్పీజీ ధర పెరుగుతూనే వచ్చింది. ఇప్పటి వరకు ఆరుసార్లు వంట గ్యాస్ ధరను పెంచారు. ఈ ఆరు నెలల కాలంలో గ్యాస్ ధర రూ.14.13 మేర పెరిగింది. గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఏటా 12 సిలెండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సబ్సిడీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. నవంబరు నెలలో చివరి సారిగా వంట గ్యాస్ సిలెండరు ధర పెంచారు. -
ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలు
‘నిప్పురవ్వలు పడి మీ బట్టలు కాలిపోయాయి.. క్షమించండంటూ ఇస్త్రీ వాలాల వేడుకోలు, కరెంటు లేదు బట్టలు ఇస్త్రీ చేయడం కుదరలేదనే సమాధానాలను దుస్తులను ఇస్త్రీకి ఇచ్చినప్పుడు మనం నిత్యం వింటూ ఉంటాం. అయితే ఈ సమస్యలేమీ లేకుండా ఇస్త్రీ వాలాలకు ఓ కొత్త పరిష్కారం దొరికింది. అంతేకాదు బొగ్గులతో ఇస్త్రీ చేయడం వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధ వ్యాధులూ దూరం కానున్నాయి. కరెంటు, బొగ్గులతో వాడే ఇస్త్రీ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఇస్త్రీ వాలాలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. 5 కేజీల సిలిండర్‌ను ఉపయోగించి 1,100 దుస్తులు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల సిలిండర్‌తో 4,500 దుస్తులు ఇస్త్రీ చేయొచ్చు. అయితే ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఇస్త్రీ పెట్టెల కంటే ఇవి కాస్త ఖరీదైనవి. రూ.2,500 నుంచి రూ.7,000 మధ్య వీటి ధర ఉంటుంది. సాధారణ పెట్టెలు ఆరు కేజీల బరువు ఉంటే ఇవి ఆరున్నర కేజీల బరువు ఉంటాయి. పుణే కేంద్రంగా ఉన్న ఓ కంపెనీ వీటిని సరఫరా చేస్తోంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్రలలో వీటిని వినియోగిస్తున్నారు. సిలిండర్ నుంచి పైప్‌ను గ్యాస్ స్టౌవ్‌కు ఎలా అమరుస్తామో ఇస్త్రీ పెట్టెకు కూడా అలాగే గ్యాస్ పైప్‌ను అమరుస్తారు. ఇస్త్రీ పెట్టె వేడిని నియంత్రించేందుకు రెగ్యులేటర్ ఉంటుంది. ఇస్త్రీ పెట్టె లోపలి భాగంలో ఇంధనం మండినా ఇస్త్రీ చేసే వ్యక్తికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు తయారీదారులు. -
పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 14 పైసలు
న్యూఢిల్లీ : వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం సోమవారం లీటరు పెట్రోల్‌పై 15 పైసలు ధర తగ్గింది. అదేవిధంగా లీటరు డీజిల్ ధరపై కూడా 14 పైసలు కోత పెట్టాయి చమురు సంస్థలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్ కూడా రూ.68.97గా నమోదైంది. కర్ణాటక ఎన్నికల అనంతరం నుంచి వరుసగా 16 రోజుల పాటు వాహనదారులకు వాత పెట్టిన చమురు సంస్థలు, ఆ అనంతరం మే 30 నుంచి తగ్గడం ప్రారంభించాయి. మే 30 నుంచి ధరలు పైసల చొప్పున తగ్గుతుండటంతో, వరుసగా ఆరు రోజుల పాటు పెట్రోల్ ధర 46 పైసలు, డీజిల్ ధర 33 పైసలు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇదే రకమైన ధరల తగ్గింపు అమలవుతోంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.82.59గా, డీజిల్ ధర రూ.74.97గా ఉన్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంకేతాలు కూడా ఇచ్చారు. గత మూడు రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉంటున్నాయని. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే, పరిస్థితి పూర్తిగా మన అదుపులోకి వస్తుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడంతోనే, దేశీయంగా ఇంధన ధరలు పెరిగాయని, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల నుంచి 76 డాలర్లకు తగ్గిందని చెప్పారు. రికార్డు స్థాయిలను చేధించిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కరాన్నే ఎంచుకునేలా ముందుకు సాగుతోంది. -
ఇంటి వద్దకే ఇంధనం?
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న నేటి పోటీ ప్రపంచంలో ఏదైనా కొత్తగా ఆలోచించగలిగితేనే మనుగడ సాధ్యమౌతుంది. సరికొత్త ఆలోచనతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ పెట్రోల్ , డీజిల్ డోర్ డెలివరీ అంటూ మరో నూతన ఆవిష్కరణకు తెరలేపింది. ఇంటి వద్దకే ఇంధనాన్ని అందించే కార్యక్రమం మొదలుపెట్టినట్లు తన అధికారక ట్విటర్లో పేర్కొంది. పుణెలోని వినియోగదారులకు మొదటగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మరి సాధారణ ధరే ఉంటుందా? సర్వీస్ చార్జ్ ఏమైనా తీసుకుంటారా? దీని విధివిదానాలు ఎలా ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉంది. దూరప్రాంత ప్రజలకు, పెట్రోల్, డీజిల్ బంక్‌లు అందుబాటులోని గ్రామాలకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. పెట్రోల్‌కు మండే స్వభావం ఎక్కువ ఉంటుంది. పెట్రోల్‌ను డోర్ డెలివరీ చేయడం కన్నా డీజిల్‌ను చేయడం సులభం. అందుకే డీజిల్ డోర్ డెలివరీ అంటూ ప్రారంభించారా అనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. కొత్త పోకడలు, నూతన ఆలోచనలు..ఇవే వ్యాపారానికి పెట్టుబడులు. ఇలా పుట్టినవే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. ఈ కామర్స్, ఆన్లైన్ రంగాలను ఇవి రెండు ఏలుతున్నాయి. బిగ్‌బాస్కెట్, స్విగ్గీ, ఫుడ్‌పాండా వంటి సంస్థలు డోర్ డెలివరీ అంటూ మరో ట్రెండ్‌ను సృష్టించాయి. ఇలా వినియోగదారుల సౌలభ్యాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి ఆధరణను పొందుతున్నాయి. ఇప్పుడు వీటిస్థానంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా చేరింది. అయితే ఒకప్రభుత్వ రంగ సంస్థ ఇలాంటి సేవల్లోకి అడుగుపెట్టడం విశేషం. మరి వినియోగదారులకు ఆకట్టుకోవడంలో ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందని అనేది కాలమే చెప్పాలి. Another milestone in customer convenience #FuelAtDoorstep. IndianOil launches FIRST OF ITS KIND PESO APPROVED Mobile dispenser for Door Delivery of Diesel to its esteemed customers at Pune. pic.twitter.com/7xB23at2Dj — Indian Oil Corp Ltd (@IndianOilcl) March 16, 2018 -
ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), హల్దియా రిఫైనరీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ అసిస్టెంట్: 77 విభాగాలు: ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఫైర్ అండ్ సేఫ్టీ, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్/ మెకానికల్. అర్హతలు, తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు: నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వెబ్సైట్: www.iocl.com పీఈసీ లిమిటెడ్ న్యూ ఢిల్లీలోని పీఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. చీఫ్ మేనేజర్ (ఫైనాన్స్) చీఫ్ జనరల్ మేనేజర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) చీఫ్ లీగల్ మేనేజర్ మేనేజర్(లా) అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21 వెబ్సైట్: www.peclimited.com -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు చెందిన పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 65 విభాగాలు: ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ అండ్ యుటిలిటీస్( ఓ అండ్ ఎం/ బీ అండ్ ఎ), మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్, ప్రొడక్షన్ అర్హతలు: పదో తరగతి, సబ్ - ఆఫీసర్ కోర్సు(ఫైర్ అండ్ సేఫ్టీ)/ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా అభ్యర్థులకు ఏడాది, ఐటీఐ అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్: 9 అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం. వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 11. వెబ్సైట్: www.panipatrefinery.in సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్యూరిటీ గార్డ్: 500. అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్: 15, అకౌంటెంట్: 12 అర్హతలు, వయోపరిమితి తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.ccl.gov.in హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - కోల్‌కతా, గ్లోబల్ హెల్త్‌కేర్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు కోరుతోంది. హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ - 2015 కాలపరిమితి: ఏడాది. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: http://hemp.ghspl.com/ సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (స్నాప్) - 2014 కోర్సులు: ఎంబీఏ, ఎమ్మెస్సీ(ఐటీ), ఎంసీఏ కాలపరిమితి: రెండేళ్లు. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 26 ప్రవేశ పరీక్ష తేది: డిసెంబర్ 21. వెబ్సైట్: http://snaptest.org/ -
ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు చెందిన పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 65 విభాగాలు: ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ అండ్ యుటిలిటీస్( ఓ అండ్ ఎం/ బీ అండ్ ఎ), మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్, ప్రొడక్షన్ అర్హతలు: పదో తరగతి, సబ్ - ఆఫీసర్ కోర్సు(ఫైర్ అండ్ సేఫ్టీ)/ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా అభ్యర్థులకు ఏడాది, ఐటీఐ అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్: 9 అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం. వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 11 వెబ్సైట్: http://www.panipatrefinery.in/ కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఆఫీసర్ అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ట్రెజరీ/సెక్రటేరియల్ ఆపరేషన్స్‌లో అనుభవం అవసరం. వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18 వెబ్సైట్: http://www.canfinhomes.com/ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెమీ-స్కిల్డ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రీషియన్ కమ్ స్విచ్‌బోర్డ్ అటెండెంట్ ఆటో ఎలక్ట్రీషియన్(గ్రేడ్-2) వెల్డర్ (గ్రేడ్-2), డీజిల్ మెకానిక్ (గ్రేడ్-2) జూనియర్ ఆపరేటర్(కంప్రెసర్)మిల్లర్ అర్హతలు: ఎలక్ట్రీషియన్/వెల్డర్/ఫిట్టర్(ఆటోమొబైల్/మెషినిస్ట్) ట్రేడ్‌లో ఐటీఐతో పాటు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఇంజనీర్ (ప్రాసెస్) అర్హతలు: సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా కెమికల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10 వెబ్సైట్: www.cementcorporation.co.in/ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్యూరిటీ గార్డ్: 500 అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్: 15 అకౌంటెంట్: 12 అర్హతలు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: http://www.ccl.gov.in/