ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు చెందిన పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 65
విభాగాలు: ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, పవర్ అండ్ యుటిలిటీస్( ఓ అండ్ ఎం/ బీ అండ్ ఎ), మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్, ప్రొడక్షన్
అర్హతలు: పదో తరగతి, సబ్ - ఆఫీసర్ కోర్సు(ఫైర్ అండ్ సేఫ్టీ)/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా అభ్యర్థులకు ఏడాది, ఐటీఐ అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్: 9
అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం.
వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 11
వెబ్‌సైట్: http://www.panipatrefinery.in/
కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్
బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ ఆఫీసర్
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ట్రెజరీ/సెక్రటేరియల్ ఆపరేషన్స్‌లో అనుభవం అవసరం.
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18
వెబ్‌సైట్: http://www.canfinhomes.com/
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెమీ-స్కిల్డ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎలక్ట్రీషియన్ కమ్ స్విచ్‌బోర్డ్ అటెండెంట్
ఆటో ఎలక్ట్రీషియన్(గ్రేడ్-2)
వెల్డర్ (గ్రేడ్-2), డీజిల్ మెకానిక్ (గ్రేడ్-2)
జూనియర్ ఆపరేటర్(కంప్రెసర్)మిల్లర్
అర్హతలు: ఎలక్ట్రీషియన్/వెల్డర్/ఫిట్టర్(ఆటోమొబైల్/మెషినిస్ట్) ట్రేడ్‌లో ఐటీఐతో పాటు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ ఇంజనీర్ (ప్రాసెస్)
అర్హతలు: సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా కెమికల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10
వెబ్‌సైట్: www.cementcorporation.co.in/
సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సెక్యూరిటీ గార్డ్: 500
అసిస్టెంట్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్: 15
అకౌంటెంట్: 12
అర్హతలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 31
వెబ్‌సైట్: http://www.ccl.gov.in/
ఉద్యోగాలు
Published Sun, Sep 28 2014 10:20 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement