జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్ | Jobs and admissions alerts | Sakshi
Sakshi News home page

జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్

Published Tue, Sep 30 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

Jobs and admissions alerts

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు చెందిన పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ కింద పేర్కొన్న  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 65
 విభాగాలు: ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, పవర్ అండ్ యుటిలిటీస్( ఓ అండ్ ఎం/ బీ అండ్ ఎ), మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్, ప్రొడక్షన్
 అర్హతలు: పదో తరగతి, సబ్ - ఆఫీసర్ కోర్సు(ఫైర్ అండ్ సేఫ్టీ)/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా అభ్యర్థులకు ఏడాది, ఐటీఐ అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం ఉండాలి.
 జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్: 9
 అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం. వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 11. వెబ్‌సైట్: www.panipatrefinery.in
 
 సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
 రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 సెక్యూరిటీ గార్డ్: 500.  అసిస్టెంట్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్: 15, అకౌంటెంట్: 12
 అర్హతలు, వయోపరిమితి తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 31
 వెబ్‌సైట్: www.ccl.gov.in
 
 హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - కోల్‌కతా, గ్లోబల్ హెల్త్‌కేర్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు కోరుతోంది.
 హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ - 2015
 కాలపరిమితి: ఏడాది. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20
 వెబ్‌సైట్: http://hemp.ghspl.com/
 
 సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్
 సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - 2014’ నోటిఫికేషన్
 విడుదల చేసింది.
 సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (స్నాప్) - 2014
 కోర్సులు: ఎంబీఏ, ఎమ్మెస్సీ(ఐటీ), ఎంసీఏ
 కాలపరిమితి: రెండేళ్లు. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ
 ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 26
 ప్రవేశ పరీక్ష తేది: డిసెంబర్ 21.  వెబ్‌సైట్: http://snaptest.org/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement