replacement jobs
-
రాత పరీక్ష పాసైతే చాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ఉద్యోగాలు, 1.26 లక్షలకుపైగా అనుబంధ కొలువులు, 7,966 లైన్మెన్ ఉద్యోగాలు వెరసి రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు గత జూలై 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రితో ముగియగా గడువు ముగిసే సమయానికి 22,73,793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లక్ష మందికి పైగా దరఖాస్తు ఫీజు చెల్లించని కారణంగా 21,69,719 మందే రాతపరీక్షకు అర్హత పొందారు. దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం! ఒకవైపు ‘సచివాలయ’ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టు అభ్యర్థులు మాత్రం రాత పరీక్షలో కనీస మార్కులు సాధిస్తే చాలు కొలువు సొంతం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ పోస్టుకు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకోవటమే దీనికి కారణం. గ్రామ సచివాలయాల్లో 9,886 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా కేవలం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మిగిలిన 18 రకాల ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా సరాసరిన 35 మంది పోటీ పడుతున్నారు. సాధారణ డిగ్రీ ఉద్యోగాలకు భారీ పోటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కేటగిరీ –1లో పేర్కొన్న పంచాయితీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాంటి నాలుగు రకాల ఉద్యోగాలకు సాధారణ డిగ్రీని కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. ఈ కేటగిరీలో మొత్తం 36,449 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 12,54,034 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. -
సచివాలయ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అనంతపురం అర్బన్: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని ఎన్ఐసీలో సచివాలయ ఉద్యోగాల పరీక్ష నిర్వహణ, ప్రజాసమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదలైనందున.. వెంటనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలన్నారు. అలాగే పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని డీఆర్ఓ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఎక్కడా పొరపాట్లు దొర్లకూడదని సూచించారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది సిబ్బంది, కంప్యూటర్, ఇతర వసతులకు అనుగుణంగా ఉండే భవనాలను గుర్తించాలన్నారు. సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలి ప్రజా సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా హౌసింగ్, రేషన్ కార్డులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. పెన్షన్ల అర్జీలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ సీఈఓను నియమించాలని జెడ్పీ సీఈఓ శోభస్వరూపారాణిని ఆదేశించారు. సర్వే సమస్యలు 30 రోజుల్లోగా పరిష్కారం అవుతున్నాయో...లేదో పరిశీలించుకోవాలని సర్వే శాఖ ఏడీ మశ్చీంద్రనాథ్ను ఆదేశించారు. అలాగే ఆర్డీఓలు ప్రతి శనివారం కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్ఓఆర్, 1–బి, అడంగల్‌లో వివరాలు సరిజేయడం, తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ‘పల్లెపిలుపు’ కార్యక్రమం సందర్భంగా సమస్యల పరిష్కారాన్ని ర్యాండమ్‌గా పరిశీలించాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలోని పరిస్థితులను ప్రతిబింబించే ఫొటోలు తీయాలన్నారు. వాటిలో అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ అలీంబాషా పాల్గొన్నారు. -
వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 3 శాతం రిజర్వేషన్లు ఉండగా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రిజర్వేషన్లు ఒక శాతం పెరిగాయి. ఈ మేరకు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు శాతం రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రతి వంద పోస్టుల్లో 6, 31, 56, 82వ సంఖ్యలోని ఉద్యోగాలను వికలాంగులకు కేటాయించాలని పేర్కొంది. ఉద్యోగాల భర్తీలో వికలాంగుల రిజర్వేషన్లలో సమస్యలు తలెత్తితే వాటిని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంధ, దృష్టిలోపం ఉన్న వారికి 1 శాతం, మూగ, చెవిటిలోపాలున్న వారికి 1 శాతం, కదల్లేకపోవడం, నరాల బలహీనతతో నడవలేకపోవడం, మరుగుజ్జులు, కండరాల పెరుగుదల లోపించిన వారికి 1 శాతం, బుద్ధి మాంద్యం, మానసిక వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబులిటీ, మానసిక రుగ్మత, బహుళ వైకల్యం ఉన్న వారికి 1 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. -
కొలువుల కోసం సంతకాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువులు భర్తీ కాక నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారని, అయినా సర్కారు వారి గురించి ఆలోచించట్లేదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కొలువుల కోసం వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందన్నారు. శనివారం ఇక్కడ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిందన్నా రు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 25న మండల కేంద్రాలు, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యోగ ధర్నాలు విజయవంతమయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నా రు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పుల పాలవుతు న్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్‌కు చేతులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఏవిధంగా మోసం చేసిందో నిరుద్యోగులకు వివ రించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రతి మండ ల, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ఆగస్టు 8 నుండి 16 వరకు కొలువుల కోసం సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలు పునిచ్చారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నారు. వారి పక్షాన అండగా నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. నిరుద్యోగ గర్జనకు నిరుద్యోగులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆకాంక్షను బలంగా వినిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జె.మహేందర్‌రెడ్డి, మతీన్ ముజదుద్దీన్, బి.సంజీవరావు, బి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
31న ‘కొలువుల కొట్లాట’ సభ: కోదండరాం
నారాయణఖేడ్/న్యాల్కల్: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న హైదరాబాద్‌లో ‘కొలువుల కొట్లాట’ సభ నిర్వహించనున్నట్లు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి లోని మామిడ్గి గ్రామ శివారులో సోమవారం నిర్వహించిన నిమ్స్ భూ నిర్వాసితుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డీఎస్సీ ప్రకటన వెలువ డక ఎదురుచూసి అనా రోగ్యంతో మరణించిన నారాయణఖేడ్‌కు చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూసి విసిగి వేసారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల క్యాలెం డర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోకల్ రిజర్వేషన్ అంశాన్ని తాత్సారం చేయకుండా పరిష్కరించాలన్నారు. -
నిరుద్యోగ ర్యాలీకి డీవైఎఫ్ఐ మద్దతు
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే: కోదండరాం హైదరాబాద్: ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. గురువారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ నాయకులు ఎ.విజయ్‌కుమార్, మహేందర్, నిరం జన్లతో టీజేఏసీ నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీజేఏసీ చేపడుతున్న ర్యాలీకి మద్దతు ఇవ్వాలని డీవైఎఫ్ఐ నాయకులను కోదండరాం కోరగా వారు సానుకూలంగా స్పందిం చారు. జేఏసీ ర్యాలీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోపాటు ఈ నెల 22వ తేదీలోగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు, సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. -
నీళ్లు సరే.. నియామకాలు ఏవీ?
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తూప్రాన్ /రామాయంపేట: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో విలేకరులతో, రామాయంపేటలో సభలో ఆయన మాట్లాడారు. నియామకాలను ప్రభుత్వం విస్మరించిందని, ఇందుకోసం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే ప్రభుత్వం కేవలం 15 వేలే భర్తీ చేసిందన్నారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన యువతను విస్మరించిందని మండిపడ్డారు. ఉద్యోగ కల్పన కోసం ఈ నెల మూడో వారంలో హైదరాబాద్‌లో నిరుద్యోగులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తేదీ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని విమర్శించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందని ఆరోపించారు. -
వయోపరిమితి పెంపు మరో ఏడాది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పెంచిన (34 ఏళ్ల నుంచి 40 ఏళ్లు) వయోపరిమితి గడువును మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ సోమవారం జీవో నంబర్ 381ను జారీచేసింది. దీంతో వయోపరిమితి గడువు పెంపు 2017 సెప్టెంబర్ 30 వరకూ అమల్లో ఉంటుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత కొన్నేళ్లుగా నిలిచిపోవడంతో ఉద్యోగార్హత కోల్పోతామని, వయోపరిమితి గడువు పెంచాలని లక్షలాది మంది నిరుద్యోగులు గతంలో ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచారు. ఆ పెంపు రెండేళ్లు అమల్లో ఉండేలా 2014 సెప్టెంబర్ 23న జీవో 295 విడుదలైంది. ఆ జీవో గడువు 2016 సెప్టెంబర్ 30తో ముగిసింది. దీనిపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలను పెండిం గ్లో పెట్టి వయోపరిమితి పెంపు జీవో పొడిగింపుపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ వయోపరిమితి పెంపును మరో ఏడాది అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. ఇలా ఉండగా వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
కొత్త జిల్లాల్లో రెండు రకాల కేడర్లుండాలి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కాకుండా రెండు రకాల కేడర్లుగానే ఉద్యోగులను భర్తీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం టీజీవో భవన్లో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత అధ్యక్షతన ‘కొత్త జిల్లాల ప్రతిపాదనలు- ఉద్యోగుల విభజన, రాష్ట్రపతి ఉత్తర్వులు’ అనే అంశంపై చర్చ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు. ప్రస్తుతం జోనల్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలను నియామకాల సమయంలో జిల్లాస్థాయిలో చేపట్టి, తుది కేటాయింపులు మాత్రం రాష్ట్రస్థాయిలో చేపట్టాలని కోరారు. ఇందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి, అందులో టీజీవోలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కొత్త జిల్లాల్లో ఆయా జిల్లాల అధికారులను, వారి అధికారాలను తగ్గించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకువచ్చి కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను వెనక్కి పంపాలన్నారు. కమల్‌నాథన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పునస్సమీక్షించి, జరిగిన అవకతవకలను సరిదిద్దాలన్నారు. కాంపెన్సేటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు చెల్లించే మొత్తం గిట్టుబాటు కాకుంటే ప్రీమియం చెల్లించేం దుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఎస్‌ను కలసి ఇదే విషయాన్ని తెలియజేశామన్నారు. సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నేతలు జి.విష్ణువర్ధన్ రావు, పురుషోత్తం రెడ్డి, జి.రామేశ్వర రావు, ఎస్.సహదేవ్, ఎం.మోహన్ నారాయణ, టి.రవీం దర్ రావు, మధుసూదన్ గౌడ్, పి.రవీందర్ రావు, జి.వెంకటేశ్వర్లు, ఎం.బి.కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐ కొలువు సాధించానిలా..!
సక్సెస్ స్పీక్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియలో తొలి దశ ముగిసింది. అభ్యర్థులు మలిదశలో విజయానికి కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎస్ఐ పరీక్షలో 327 మార్కులతో (2011, ఆగస్టు) 3వ ర్యాంకు సాధించిన వడ్డే ఉదయ్‌కుమార్ తన సక్సెస్ సీక్రెట్స్‌ను ‘భవిత’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, కరివారిగూడెం. నాన్న వడ్డే శ్రీనివాసరావు సింగరేణిలో కోల్ ఫిల్లర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆయన 2005లో మరణించారు. అమ్మ సత్యవతి గృహిణి. నేను ఇంటర్ వరకు మణుగూర్‌లో తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ కొత్తగూడెంలో, ఎంసీఏ హైదరాబాద్‌లో పూర్తి చేశాను. బంధువు సలహాతో.. నా ఎంసీఏ పూర్తయ్యే నాటికి (2008లో) సాఫ్ట్వేర్ ఇండస్ట్రీపై ఆర్థికమాంద్యం ప్రభావం ఉంది. సరైన అవకాశాలు లేవు. అప్పటికే మా బంధువుల్లో చాలా మంది పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా అన్నయ్య వేణుమాధవ్ సలహా మేరకు ఎస్ఐ ఉద్యోగానికి ప్రయత్నించాను. మొదటి అటెంప్ట్‌లోనే విజయం సాధించాను. శిక్షణలో అగ్రస్థానం.. ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)లో ఏడాది పాటు శిక్షణలో పాల్గొని, మొదటి స్థానంలో నిలిచా. బెస్ట్ ఆల్‌రౌండర్, బెస్ట్ ఇండోర్‌గా నిలిచి సీఎం పిస్టల్, గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతోపాటు హోంమినిస్టర్ బ్యాటన్, గోల్డ్ మెడల్‌ను సాధించాను. పరుగు పందెంలో అప్రమత్తంగా... గతంలో మొదట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, తర్వాత రాత పరీక్ష జరిపేవారు. కానీ, ఇప్పుడు మొదట రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి మలి దశలో శారీరక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది అయితే ఇప్పుడు సివిల్ ఎస్ఐ, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు ఏవైనా రెండు ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్‌లో మెరిట్ సాధించినా.. ఎంపికలో ఎలాంటి మార్కులు కలపరు. కానీ, మిగిలిన పోస్టుల భర్తీలో మాత్రం ఈవెంట్స్‌లో సాధించిన మెరిట్‌కు స్కోరు కేటాయించి తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. 800 మీటర్ల పరుగుపందెంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులను ఎక్కువగా ఇందులోనే ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నిత్యం ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్‌లో అర్హత సాధించాలి... ఫైనల్ ఎగ్జామ్‌లో ఇంగ్లిష్ ఒక పేపర్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇందులో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లను మూల్యాంకనం చేస్తారు. టెస్టులతో టైం మేనేజ్మెంట్... కోచింగ్ కేంద్రాలు నిర్వహించే మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం ద్వారా టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. అర్థమెటిక్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని వదిలేసి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వదిలేసిన ప్రశ్నలను చివర్లో సాధించాలి. అర్థమెటిక్ పేపర్లో మెంటల్ ఎబిలిటీ/ రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలను తక్కువ సమయంలో సాధించవచ్చు. అభ్యర్థులు రీజనింగ్ బిట్స్ మొదట చేయడం లాభిస్తుంది. సబ్జెక్టు నేర్చుకోండి.. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు కేవలం బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అలాకాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా పరీక్షలో మంచి ఫలితాలు సాధించవచ్చు. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని చదవడం ద్వారా సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నవారే అర్హత సాధించారు. తెలంగాణ విద్యార్థులు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బాగా చదవాలి. చాలా మంది అభ్యర్థులు ఎస్ఐ పరీక్షలో ఉండే అర్థమెటిక్‌ను ప్యూర్ మ్యాథ్స్‌గా భావించి.. కష్టమనే అపోహతో ఉంటారు. కానీ, పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆర్ట్స్ విద్యార్థులు కూడా సులువుగా చేసే విధంగా ఉంటాయి. అభ్యర్థులు తొలుత మ్యాథ్స్ అనే భయాన్ని వీడి ప్రిపరేషన్లో ముందుకుసాగాలి. ముందుగా సిలబస్‌లో ఉన్న అంశాలను పరిశీలించాలి. పరీక్షలో ఆయా అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. సిలబస్‌లో లేని టాపిక్స్‌ను చదవద్దు. ఏదైనా ఒక ప్రామాణిక మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. -
‘సెస్’లో ఉద్యోగాల భర్తీకి చర్యలు
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ప్రభుత్వ అనుమతి తీసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని సంఘం చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. సెస్ 44వ వార్షిక మహాసభను స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సెస్ పరిధిలో లూజువైర్లను సరిచేసేందుకు మండలానికి 500 విద్యుత్ స్తంభాలు అందించామని, మరో 1500 అందించి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 1985 నుంచి ఉద్యోగాలు భర్తీ చేపట్టలేదని, వాటిని భర్తీ చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ కట్ చేయబోమని, ఊళ్లు ఖాళీ చేసి వెళ్లినపుడే సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అక్కపల్లి ఆదర్శం విద్యుత్ చౌర్యం నివారణకు అందరూ సహకరించాలని లక్ష్మారెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో ట్రాన్స్ఫార్మర్ కమిటీలను ఏర్పాటు చేసుకుని అనుమతిలేని మోటార్లకు కనెక్షన్ తొలగించారని వివరించారు. ఇలా చేయడం ద్వారా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లేదని, మోటార్లకు లోవోల్టేజీ సమస్య ఉండడం లేదని పేర్కొన్నారు. అన్ని గ్రామాల రైతులు అక్కపల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వినియోగదారులకు మె రుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పాలకవర్గం కృషి చేస్తోందని, సిబ్బంది అవినీతికి పాల్పడినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినా ఫిర్యాదు చేయాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రవాణా ఖర్చులను రైతులపై వేస్తున్నారని విలేజీ ప్రతి నిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఉద్యోగులు వివిధ సెక్షన్లలో ఏళ్ల తరబడి పాతుకుపోయారని, అం తర్గత బదిలీలు చేపట్టాలని సభ్యులు కోరారు. రూ.102.42 కోట్ల అంచనా బడ్జెట్‌కు ఆమోదం ‘సెస్’ మేనేజింగ్ డెరైక్టర్ కె.నాంపల్లిగుట్ట వార్షిక నివేదికను చదివి వినిపించారు. 2016-17కు గాను రూ.102.42 కోట్ల అంచనా బడ్జెట్‌ను సమావేశంలో ఆమోదించారు. ఈ స మావేశంలో వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీని వాస్, డెరైక్టర్లు జడల శ్రీనివాస్, ఏను గు విజయరామారావు, వూటుకూరి వెంకటరమణారెడ్డి, కొక్కు దేవేందర్‌యాదవ్, కుంబాల మల్లారెడ్డి, దేవరకొండ తిరుపతి, రామతీర్థపు రాజు, ఏనుగు లక్ష్మీ, ‘సెస్’ అకౌంట్స్ ఆఫీసర్ ఖుర్షీద్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీఆర్డీఏ నియామకాల్లో... ‘నో’ రిజర్వేషన్స్
* చంద్రబాబు ప్రభుత్వ కొత్త విధానం * ఏపీపీఎస్సీకి ఎలాంటి సంబంధమూ ఉండదు సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతిలో అనేక ‘వృథా’ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (సీఆర్డీఏ)లో రిక్రూట్మెంట్ల విషయంలో రిజర్వేషన్లు అమలు చేయరాదని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక మానవవనరుల విధానాన్ని కూడా సీఆర్డీఏ రూపొందించింది. దీంతో గతంలో మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన ‘సీఆర్డీఏ మానవ వనరుల విధానం’ రద్దయిపోయినట్లే. అంటే ఇక సీఆర్డీఏలో ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యంగా మారిపోనుంది. అంతేకాదు కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు కూడా ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చినవారిని నియమించుకునే వీలేర్పడనున్నది. ఇక సీఆర్డీఏ నియామకాల విషయంలో ఏపీపీఎస్సీకి ఎలాంటి సంబంధమూ ఉండదు. కార్పొరేట్ తరహాలో రిక్రూట్మెంట్ ఉంటుందని పాలసీలో ప్రముఖంగా ప్రస్తావించారు. కార్పొరేట్ తరహా రిక్రూట్మెంట్! సీఆర్డీఏలో శాశ్వత నియామకాల్లో గానీ, కాంట్రాక్టు నియామకాల్లో గానీ ఇక ఎలాంటి రిజర్వేషన్లను పాటించరు. కేవలం వారి విద్యార్హతలు, టాలెంట్ ప్రాతిపదికనే నియమాకాలను చేయనున్నట్లు నూతనంగా రూపొందించిన మానవ వనరుల పాలసీలో పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల తరహాలోనే రిక్రూట్మెంట్ విధానం ఉంటుందని పాలసీలో పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేయాలంటే ప్రతికల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారు. కాంట్రాక్టు విధానంలో గానీ, రెగ్యులర్ విధానంలో గానీ తీసుకునే అధికారం సీఆర్డీఏ కమిషనర్‌కు ఉంటుంది. అవసరమైన కేసుల్లో సీఆర్డీఏ కమిషనర్ అనుభవంలోను, విద్యార్హతల్లోను మినహాయింపులు ఇస్తారు. నూతన రిక్రూట్మెంట్కు ప్రకటన ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఆ దరఖాస్తులను మానవ వనరుల గ్రూప్ పరిశీలిస్తుంది. రాత పరీక్షతో పాటు అవసరమైన పక్షంలో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను సెలక్ట్ చేస్తారు. రిక్రూట్మెంట్లో అభ్యర్థి చదివిన విద్యతో పాటు ఆ చదివిన సంస్థకున్న పేరు ప్రతిష్టలు, అనుభవం, రాత పరీక్ష, మానసిక పరిస్థితి, ఇంటర్వ్యూకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు విధానంలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు ఆఫర్ లెటర్ జారీ చేస్తారు. అనంతరం వైద్య పరీక్షల సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగిగా పనిచేయడానికి సరిపోతారని వైద్య పరీక్షల్లో తేలితేనే ఉద్యోగంలో చే ర్చుకుంటారు. లేకపోతే ఆఫర్ లెటర్‌ను రద్దు చేస్తారు. సీఆర్డీఏ ఉద్యోగాలకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా విధానంలో పేర్కొన్నారు. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా నిర్ధారించారు. అయితే అథారిటీ ఎవరినైనా 60 ఏళ్ల పైబడిన వారిని కూడా కాంట్రాక్టు విధానంలో తీసుకోవచ్చునన్నారు.ఉద్యోగుల ప్రొబేషన్ సమయం ఏడాదిగా నిర్ధారించారు. ఇంకా ఐటీ వినియోగంతో పాటు డ్రెస్ కోడ్ పాటించాలని ఆ విధానంలో పేర్కొన్నారు. నచ్చినవారిని నియమించుకోవడం కోసమే ‘సీఆర్డీఏ మానవ వనరుల విధానం’ ఇలా ఉండాలంటూ గత ఏడాది ఏప్రిల్ 16వ తేదీన మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన 81, 82, 83 జీవోల స్థానంలో నూతనంగా రూపొందించిన మానవ వనరుల పాలసీని ఆమోదించాలంటూ సీఆర్డీఏ అధారిటీ ఆమోదానికి కమిషనర్ సమర్పించారు. గతంలో మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన జీవోల్లో సీఆర్డీఏ రిక్రూట్మెంట్ విధానంలో 1996 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండ్ సబ్-ఆర్డినేట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా డెరైక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ఆ జీవోల్లో పేర్కొన్నారు. అయితే ఆ జీవోల మేరకు రిక్రూట్మెంట్ చేస్తే తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల సూచనలు, ఆదేశాల మేరకు సీఆర్డీఏ కొత్తగా మానవ వనరుల విధానాన్ని రూపొందించిం ది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించిన వెంటనే ఈ విధానం అమల్లోకి వస్తుంది. -
పోలీస్ కొలువులు సిద్ధం
రెండేళ్ల తరువాత విడుదల కానున్న నోటిఫికేషన్ చిత్తూరులో 480, తిరుపతిలో 200 పోస్టులు ఖాళీ చిత్తూరు (అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోం మంత్రి, డీజీపీలు ఇటీవల ప్రకటించారు. దీంతో జిల్లాలో పోలీసు ఉద్యోగాలకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దీనికితోడు ఈసారి పోలీసు సెలెక్షన్స్‌లో సమూల మార్పులు చోటుచేసుకోవడంతో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగలక్ష్మి వరించనుంది. చిత్తూరు, తిరుపతి పోలీసు జిల్లాల్లో ఖాళీగా ఉన్న వందలాది పోస్టులకు ఈ ఏడాది చివరల్లోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు పోలీసు జిల్లాలు ఉన్నాయి. రెండు ప్రాంతాలకు ఇద్దరు ఎస్పీలు ఉన్నారు. అయితే 2013లో జిల్లా మొత్తం ఒక్కటే పోలీసు జిల్లా. అప్పట్లో జిల్లాలో 700 వరకు పోస్టులను పోలీసు శాఖలో భర్తీచేశారు. ఆ తరువాత ఎలాంటి నోటిఫికేషన్ వెలువడలేదు. మరోవైపు పోలీసుశాఖలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఖాళీలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు రెండు పోలీసు జిల్లాలు ఏర్పడ్డాయి. సిబ్బంది పంపకాలు సైతం పూర్తవడంతో సిబ్బంది లోటుగా మారింది. తాజాగా రాష్ట్ర హోంమంత్రి నుంచి డీజీపీ వరకు కొత్త నోటిఫికేషన్‌పై స్పందిస్తూ, ప్రకటనలు చేస్తుండడం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు పుట్టిస్తోంది. అన్నీ సవ్యంగా చేస్తే ఈ ఏడాది చివరిలోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పాత పద్ధతి రద్దు... మరోవైపు పోలీసుశాఖలో సెలక్షన్స్ అంటేనే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి పోస్టు వరకు తప్పనిసరి పరీక్ష 5 కిలో మీటర్ల పరుగుపందెం. ఆ పందేన్ని 25 నిముషాల్లో పూర్తి చేసిన అభ్యర్థులకు తరువాత లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, 100 మీటర్ల పరుగు పందెం పెడుతారు. ఇందులో మూడు ఈవెంట్స్‌లో అర్హత సాధించిన వారిని రాత పరీక్షలకు ఎంపిక చేస్తారు. చివరిగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈవెంట్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు కేటాయించడం ఇప్పటివరకు ఉన్న పద్ధతి. అయితే 5 కి.మీ పరుగు పందెం నిర్వహిస్తుండటంతో చాలాచోట్ల అభ్యర్థులు సొమ్మసిల్లి పడిపోయి, ఒక్కోసారి చనిపోతున్నారు. దీంతో ఈ పరుగును రద్దు చేసేదిశగా సెలక్షన్ బోర్డు, ప్రభుత్వం యోచిస్తోంది. పాత పద్ధతుల్లో సమూల మార్పులు చేసి, కేవలం ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ఖాళీలు ఇలా... చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో ఎస్ఐ పోస్టులు 15, సివిల్ కానిస్టేబుల్ (పురుషులు) 230, మహిళలు 15, ఏఆర్ విభాగంలో 220 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతి పోలీసు జిల్లాలో ఎస్ఐలు 8, కానిస్టేబుళ్లు (ఏఆర్, సివిల్) 210 వరకు ఖాళీలున్నాయి. కొత్త నోటిఫికేషన్ విడుదలయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 680 పోస్టులు భర్తీ కానున్నాయి. -
ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయండి
వైఎస్ జగన్‌కు ఏపీ నిరుద్యోగుల వినతి సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ నిరుద్యోగ విద్యార్థి కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది. సమితి అధ్యక్షుడు రెడ్డి వరప్రసాద్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం శుక్రవారం జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని వినతిపత్రం అందజేసింది. నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ ప్రకటన వెలువడలేదని, ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని నిరుద్యోగులు తెలిపారు. ఉద్యోగాల భర్తీ జరిగేలా చూడాలని.. ఈ మేరకు ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి ప్రతిపక్షం తరఫున లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. -
ఉద్యోగ పరీక్షలకు విధానం ఖరారు
టీఎస్పీఎస్సీ పరీక్షలు, సిలబస్‌లో మార్పులు ► పెరిగిన పేపర్లు.. మారిన సిలబస్ ► నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో కొత్తగా గ్రూప్-3 ► {Vూప్-1, 2 పరీక్షల్లో అదనంగా మరో పేపర్ ► కొత్తగా ‘తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం’ ► {Vూప్-1, 2లో పెరిగిన ఇంటర్వ్యూ మార్కులు ► సర్వీసుల వారీగా పోస్టుల విభజన ► ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే ఉద్యోగాల విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. పరీక్షల విధానంలోనూ, సిలబస్‌లోనూ పలు మార్పులు చేసింది. డెరైక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా పోస్టుల పునర్విభజనతో పాటు పోటీ పరీక్షల విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రానికి అనుగుణంగా పరీక్షల విధానం, పోస్టులను వర్గీకరించాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో టీఎస్పీఎస్సీ నియమించిన నిపుణుల కమిటీ గ్రూప్స్, ఇతర సర్వీసుల వర్గీకరణతో పాటు పరీక్షల విధానం, సిలబస్‌పై అధ్యయనం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఈ నివేదికలన్నీ పరిశీలించిన అనంతరం తుది విధివిధానాలను విడుదల చేసింది. కొత్త సర్వీసు.. కొత్త పేపర్ గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ప్రభుత్వం కొత్తగా గ్రూప్-3 కేటగిరీని చేర్చింది. ఇప్పటివరకు గ్రూప్-2లో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3లో చేర్చింది. గ్రూప్-4 సర్వీసులను యథాతథంగా ఉంచింది. ఇక సర్వీసుల వారీగా పోస్టులను వర్గీకరించింది. గ్రూప్-1లో 20 రకాల పోస్టులు, గ్రూప్-2లో 12, గ్రూప్-3లో 17 రకాల పోస్టులను పొందుపరిచింది. ఇక ఇప్పటివరకు గ్రూప్-1లో ఐదు పేపర్లు, గ్రూప్-2లో మూడు పేపర్లు ఉండేవి. తాజాగా ప్రభుత్వం కొత్తగా గ్రూప్-1లో ఆరో పేపర్‌ను, గ్రూప్-2లో నాలుగో పేపర్‌ను చేర్చింది. ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం’ పేరుతో తెలంగాణ ఉద్యమంలోని వివిధ దశలను ఈ కొత్త పేపర్లో సిలబస్‌గా పొందుపరిచింది. మొత్తంగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ పద్ధతిని యథాతథంగా కొనసాగించింది. గ్రూప్-1లో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ పరీక్షతో పాటు మరో ఆరు పరీక్షలు రాయాలి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం వెయ్యి మార్కులుంటాయి. అందులో ఇంటర్వ్యూకు వంద మార్కులు కేటాయించారు. గ్రూప్-2లో నాలుగు పేపర్లు అబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున, ఇంటర్వ్యూకు 75 మార్కులు కలిపి మొత్తం 675 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ఇంటర్వ్యూకు 50 మార్కులే ఉండేవి. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూప్-3 సర్వీసులో పొందుపరిచిన 17 రకాల పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. ఈ పరీక్షలకు మూడు పేపర్లు ఉంటాయి. గ్రూప్-2లో నిర్దేశించిన నాలుగు పేపర్లలో ‘తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం’ మినహా మిగతా మూడు పేపర్లు ఇందులో ఉన్నాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులుంటాయి. ఇక గ్రూప్-4, గ్రేడ్ టూ మ్యాట్రన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గ్రూప్ సర్వీసుల పరిధిలోకి రాని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్స్, ఫోర్ట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్స్, సీనియర్ రిపోర్టర్స్ పోస్టులకు నిర్వహించే పరీక్షల విధానాన్ని ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. గ్రూప్-1 సర్వీసులు (20) డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (కో ఆపరేటివ్ సొసైటీస్), జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, లే సెక్రెటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీవో. గ్రూప్-2 సర్వీసులు (12) మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, ఏసీటీవో, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (గ్రామీణాభివృద్ధి), ఎక్సైజ్ ఎస్ఐ, ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్), ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1(ఎండోమెంట్స్). గ్రూప్-2 పరీక్షా విధానం: (మొత్తం 675 మార్కులు) పార్ట్-ఏ (ఆబ్జెక్టివ్ పద్ధతి) పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు, 150 మార్కులు పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2.భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3.సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు) పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు(ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3.అభివృద్ధి, మార్పు అంశాలు) పేపర్-4: తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970); 2.ఉద్యమ దశ (1971-1990); 3.తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014)) పార్ట్-బి ఇంటర్వ్యూ-75 మార్కులు గ్రూప్-3 సర్వీసులు (17) సీనియర్ అకౌంటెంట్ ఆడిటర్ సీనియర్ ఆడిటర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆడిటర్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అకౌంటెంట్ (ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ పే అండ్ అకౌంట్స్ ట్రెజరీస్, లోకల్ ఫండ్ సెక్రటేరియట్, ఫైనాన్స్ లా విభాగంలోని సబ్ సర్వీసు వివిధ శాఖాధిపతుల మినిస్టీరియల్ సర్వీస్‌లోని ఈ కేడర్ పోస్టులు) గ్రూప్-3 పరీక్షా విధానం (మొత్తం మార్కులు 450) రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్).. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 150 మార్కులు. 2.30 గంటలు పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2.భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3.సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు) పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.భారత ఆర్థిక వ్యవస్థ-అంశాలు, సవాళ్లు; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3.అభివృద్ధి, మార్పు అంశాలు) గ్రూప్-4 సర్వీసులు: జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్స్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితరాలు గ్రూప్-4 పరీక్షా విధానం (మొత్తం మార్కులు 300) (ఆబ్జెక్టివ్ టైప్) 1.జనరల్ నాలెడ్జ్: 150 మార్కులు 2.సెక్రెటేరియల్ ఎబిలిటీస్: 150 మార్కులు గ్రూప్-1 పరీక్షా విధానం: (మొత్తం 1000 మార్కులు) ప్రిలిమినరీ టెస్ట్.. 1.జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్). 150 ప్రశ్నలు, 150 మార్కులు. 2.30 గంటల వ్యవధి. మెయిన్ పరీక్షలు (రాత పరీక్షలు).. 1.జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) 3 గం. 150 మార్కులు పేపర్-1: జనరల్ ఎస్సే, 3 గంటలు. 150 మార్కులు (1.సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; 2.ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు; 3.భారత రాజకీయ స్థితిగతులు; 4.భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం; 5.సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి; 6.విద్య, మానవ వనరుల అభివృద్ధి) పేపర్-2: హిస్టరీ, కల్చర్ - జాగ్రఫీ. 3 గం. 150 మార్కులు (1.భారత దేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక యుగం(1757-1947); 2.తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; 3.భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ) పేపర్-3: ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన. 3 గంటలు. 150 మార్కులు (1.భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; 2.భారత రాజ్యాంగం; 3.పరిపాలన) పేపర్-4: ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 3గం. 150 మార్కులు (1.భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ; 3.అభివృద్ధి, పర్యావరణ సమస్యలు) పేపర్-5: సైన్స్-టెక్నాలజీ-డేటా ఇంటర్‌ప్రిటేషన్. 3 గం,150 మార్కులు. (1.శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; 2.విజ్ఞానశాస్త్ర వినియోగం లో ఆధునిక పోకడలు;3.డేటా ఇంటర్‌ప్రిటేషన్-సమస్యా పరిష్కారం) పేపర్-6: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. 3 గంటలు. 150 మార్కులు (1.తెలంగాణ తొలి దశ (1948-1970); 2.ఉద్యమ దశ (1971-1990); 3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014)) ఇంటర్వ్యూ: 100 మార్కులు -
రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీల అభివృద్ధి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్: రాజకీయ రిజర్వేషన్లు లేకుండా బీసీలు ఎదగలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణలో సామాజిక న్యాయం’ అంశంపై జరిగిన సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క కులం 10 శాతానికి మించి లేకపోవడం వల్లే ఐక్యం కాలేకపోతున్నామన్నారు. రాజకీయ రిజర్వేష్లతోనే బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందగలరన్నారు. సీఎం కేసీఆర్‌కు బీసీ, దళిత, మైనారిటీలపై ప్రేమ లేదని కేవలం వారి ఓటు బ్యాంకు పట్ల మాత్రమే ప్రేమ ఉందని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశం లో తెలంగాణలోనే బహుజనులు ఎక్కువగా ఉన్నా రాజ్యాధికారం సాధించకపోవడం బాధకరమన్నారు. సదస్సులో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, ఎమ్మా ర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్లు వచ్చే వరకు ఉద్యమం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. అలాగే టీచర్ పోస్టులు 25 వేలు, గ్రూప్-1 ఉద్యోగాలు 1,200, గ్రూప్-2 కొలువు లు 2,500, గ్రూప్-4 36 వేలు, ఎస్ఐ పోస్టులు 1,600, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 14వేలు ఖాళీగా ఉన్నాయని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏ లెక్కన 25 వేల ఉద్యోగాలు భర్తీచేస్తారని ప్రశ్నించారు. -
జాబుల జాతర
వచ్చే నెలలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు: కేసీఆర్ ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకూ శ్రీకారం ► రూ.2,500 కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ► ఈ ఏడాదిలోనే 50 వేల ఇళ్ల నిర్మాణం ► రూ. 35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతలు ► రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: వచ్చే నెల నుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ఇంకెంతో కాలం నిరీక్షింప చేయదలుచుకోలేదని, పలు ప్రభుత్వ శాఖల్లోని 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. జూలై నుంచే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. తొలి రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం ఉదయం ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమమే ధ్యేయంగా తొలి ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు కొత్త వరాలను ప్రకటించారు. ‘నిరుద్యోగ సోదరులు ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు రావాలని ఎదురుచూస్తున్నారు. వారిని ఎక్కువకాలం నిరీక్షణకు గురిచేయకుండా జూలైలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తాం. రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వచ్చే నెల నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలోనే అందరినీ క్రమబద్ధీకరిస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. ‘గత ఏడాది అనేక కార్యక్రమాల వల్ల డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టలేకపోయాం. రూ.5.04 లక్షల ఖర్చుతో ఒక్కో ఇంటిని నిర్మించబోతున్నాం. ఈ ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 50 వేల ఇళ్లను నిర్మించబోతున్నాం. వలస జిల్లా పాలమూరు, ఫ్లోరైడ్ ఖిల్లాగా మారిన నల్లగొండ జిల్లాల కన్నీళ్లు తుడవడానికి రూ.35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు, కరువు ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించేందుకు రూ. 30 వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తాం’ అని సీఎం వెల్లడించారు. పోలీసుల సమస్యల పరిష్కారం కోసం డీజీపీ ఆధ్వర్యంలో కమిటీని వేశామని తెలిపారు. ‘మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచేం దుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుధీర్, చెల్లపల్ల ఆధ్వర్యంలో 2 కమిషన్లను నియమించాం. వాటి నివేదికలు అందిన వెంటనే రిజర్వేషన్ల పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2018 నాటికి నిరంతర విద్యుత్ ‘తెలంగాణ వస్తే కష్టాలు తప్పవని, అంధకార బంధురమవుతుందని అసత్య ప్రచారం చేశారు. ఆరేడు నెలల్లోనే విద్యుత్ వెలుగులు విరజిమ్మే స్థాయికి తెలంగాణ ఎదిగింది. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు అవసరమైతే పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే విధంగా తెలంగాణను దేశంలో అత్యధిక మిగులు విద్యుత్ గల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రూ.91 వేల కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. కొత్తగూడెం, మణుగూరులో విద్యుత్ ప్లాంట్లు, నల్గొండ జిల్లా దామరచెర్లలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ సాకారం కాబోతోంది. 2018 నాటికి తెలంగాణలో అన్ని రంగాలకు.. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు. పేదల సంక్షేమమే ధ్యేయం పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, దేశచరిత్రలో ఎక్కడ లేని విధంగా ఏటా రూ.28 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. అవసరమైతే గ్రాంట్లు ఇచ్చి ఆర్టీసీని అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు. ‘అంగన్వాడీలకు, హోంగార్డులకు వేతనాలు పెంచాం. రైతులకు రూ.17 వేల కోట్ల పంట రుణాల మాఫీని చిత్తశుద్ధితో అమలు చేసినం. రూ.400 కోట్లతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించాం. మహిళల భద్రతకు షీ-టీమ్స్‌ను ఏర్పాటు చేశాం. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధ్వర్యంలో రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. సమైక్య రాష్ట్రంలో చెరువులు కునారిల్లిపోయాయి. మిషన్ కాకతీయ ద్వారా ఐదేళ్లలో రాష్ట్రంలోని 46 వేల చెరువులు, కుంటలకు పూర్వ వైభవం తెస్తాం. సమైక్య రాష్ట్రంలో అటవీ సంపద స్మగ్లర్ల పాలైంది. భవిష్యత్తు తరాలకు సమశీతోష్ణ తెలంగాణను అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 300 కోట్ల మొక్కలు నాటడమే హరితహారం లక్ష్యం. జూలైలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో విద్యార్థుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అందరూ పాలుపంచుకోవాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిరుద్యోగ సోదరులు ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు రావాలని ఎదురుచూస్తున్నారు. వారిని ఎక్కువకాలం నిరీక్షణకు గురిచేయకుండా జూలైలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తాం. రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను వచ్చే నెల నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలోనే అందరినీ క్రమబద్ధీకరిస్తాం. - సీఎం కేసీఆర్ తెలుగు ప్రజలకు మోదీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: విభజనతో రెండు రాష్ట్రాలుగా ఏర్పాటైన ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుపోవాలని ఆకాంక్షించారు. వికాసయాత్రలో కష్టపడుతున్న ఏపీ ప్రజలకూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంగళవారం గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న ఇటలీకి కూడా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఉద్యోగాల భర్తీకి కసరత్తు
ఖాళీల వివరాలివ్వాలని అన్ని శాఖలకు సీఎంవో లేఖ రిమైండర్ జారీ చేసిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: విభాగాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు పంపించాలని తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎం కార్యాలయం లేఖ రాసింది. త్వరలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కౌన్సిల్ సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. జనవరి 31నే ఖాళీలకు సంబంధించి తెలంగాణ ఆర్థిక శాఖ అన్ని విభాగాలకు లేఖలు రాసింది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు తప్ప మిగతా ఖాళీల వివరాలను ఫిబ్రవరి 15లోగా సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ సగానికిపైగా విభాగాల నుంచి ఖాళీల వివరాలు అందకపోవడంతో వెంటనే వివరాలు సమర్పించాలని 32 విభాగాల కార్యదర్శులకు ఆర్థిఖ శాఖ రిమైండర్ జారీ చేసింది. మరోవైపు సీఎంవో కార్యాలయం లేఖ పంపించటంతో ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. వీటి ఆధారంగానే డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి... ఏయే విభాగాల్లో అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరముందని.. ప్రభుత్వం అంచనాకు రానుంది. జెన్కోలో పోస్టుల భర్తీకి ఇప్పటికే సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మైనారిటీ విద్యాసంస్థల్లో టీచర్ల పోస్టులను, మైనారిటీ విభాగంలో అత్యవసరమైన ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం జిల్లా స్థాయి, జోనల్, మల్టీ జోనల్‌కు సంబంధించిన ఖాళీల వివరాల సేకరణ మొదలైంది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల భర్తీ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. వీటి నియామకానికి రాష్ట్ర విభజన వ్యవహారాలతో పీటముడి పడింది. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులన్నింటినీ తెలంగాణ, ఏపీల మధ్య విభజించాల్సి ఉంది. ఈ అంశం ప్రస్తుతం కమలనాథన్ కమిటీ పరిధిలో ఉన్నందున కమిటీ తుది నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే. ఈ లోగా డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిగతా కేడర్ పోస్టులు భర్తీ చేసేందుకు సర్కారు ఆలోచన చేస్తోంది. అందుకే జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల వివరాలు మాత్రమే ఆరా తీస్తోంది. టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఆడిటర్లు, టెక్నికల్ సిబ్బంది, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని గ్రూప్-2 ఉద్యోగాలు సైతం ఇదే పరిధిలోకి వస్తాయి. -
హైదరాబాద్‌లో పెరిగిన హైరింగ్
నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడి హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీ దాదాపు 20 శాతం పెరిగింది. 2013 డిసెంబరు నుంచి 2014 డిసెంబరు మధ్య దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ తీరును విశ్లేషించినపుడు ఈ విషయం వెల్లడైనట్లు జాబ్స్ వెబ్సైట్ నౌకరీ డాట్‌కామ్‌కు చెందిన నౌఖరీ జాబ్ స్పీక్ తెలియజేసింది. మొత్తమ్మీద అన్ని నగరాలనూ పోలిస్తే పుణె 30 శాతం, చెన్నై 29 శాతంతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌ది ఆ తరువాతి స్థానం కాగా... బెంగళూరు 17%, ముంబయి 11%, కోల్‌కత 10%తో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం 1 శాతం భర్తీ పెరుగుదలతో ఆఖర స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రంగాల వారీ చూస్తే టెలికంలో 12% తగ్గుదల కనిపించగా చమురు-గ్యాస్ 27%, బ్యాంకింగ్ 17%, ఐటీ 12% వృద్ధితో తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఏ కంపెనీలో చూసినా ఫైనాన్స్ విభాగంలో 21%, హెచ్ఆర్ విభాగంలో 20%, ఐటీ విభాగంలో 18% భర్తీలో పెరుగుదల నమోదైనట్లు జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడిచింది. మొత్తమ్మీద ఉద్యోగాల భర్తీలో 10% వృద్ధి నమోదైనట్లు ఈ ఇండెక్స్ వెల్లడించింది. ఐటీ సెక్టార్లో అధిక వేతనాలు న్యూఢిల్లీ: దేశంలోనే లాభదాయకమైన రంగంగా ఐటీ సెక్టార్ ఆవిర్భవించింది. ఈ రంగంలో ఉద్యోగులు కనీసం గంటకు రూ.291 లను జీతంగా పొందుతున్నారు. ఇది సగటున గంటకు రూ.341గా ఉంది. ఇది ఇతర రంగాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాగే పురుషులతో పోలిస్తే మహిళలు 34 శాతంమేర తక్కువ జీతాల్ని పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆన్లైన్ కెరీర్, నియామకాల సొల్యూషన్స్ ప్రొవైడర్ మాన్స్టర్ ఇండియా పేర్కొంది. దీని ప్రకారం నిర్మాణ రంగంలో ఉద్యోగుల సగటు జీతాలు గంటకు రూ.259, హెల్త్ కేర్ రంగంలో రూ.215, తయారీ-రవాణా రంగాల్లో రూ.230గా ఉన్నాయి. విద్యా రంగంలోని ఉద్యోగులు చాలా తక్కువ జీతాల్ని (గంటకు రూ.186లు) పొందుతున్నారని తెలిపింది. -
మంత్రి పదవులు అడిగామా?
సీఎం కేసీఆర్‌కు ఓయూ విద్యార్థుల ప్రశ్న ఉస్మానియా యూనివర్సిటీ: ‘మేమేమైనా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, మంత్రి పదవులను అడిగామా? లేక ప్రభుత్వంలో భాగస్వామ్యం కోరామా?’ అని సీఎం కేసీఆర్‌ను ఓయూ విద్యార్థులు ప్రశ్నించారు. వయోపరిమితి దాటిపోతున్నందున కేవలం ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా వేడుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా రన్‌ఫర్ జాబ్ పేరుతో సోమవారం నిరసన పరుగు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కళ్యాణ్, మానవతరాయ్, బాబులాల్‌నాయక్, వీరబాబు, జి.కిరణ్‌గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులను వాడుకొని... అధికారం చేపట్టిన కేసీఆర్ నేడు వారిని శత్రువుల్లా చూడడం తగదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని, ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు ఈ నెల 17న అసెంబ్లీ ముట్టడి, డిసెంబర్లో బారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. -
జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స్
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ►అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్). ఖాళీలు: 20. అర్హత: ఎంబీఏ/పీజీడీబీఎం(మార్కెటింగ్/అగ్రికల్చర్) ఉత్తీర్ణత. ►జూనియర్ కాటన్ పర్చేజర్. ఖాళీలు: 80. అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణత. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 21. వెబ్సైట్: www.cotcorp.gov.in ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ కింద పేర్కొన్న ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ► రీసెర్చ్ అసోసియేట్. ఖాళీలు: 4. అర్హతలు: పీజీలో హెచ్ఆర్ఎం లేదా సైకాలజీ/ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత. ► హిందీ ట్రాన్స్‌లేటర్. ఖాళీలు: 2 అర్హత: హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16. వెబ్సైట్: www.ibps.in బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► విజిటింగ్ సైంటిస్ట్. ఖాళీల సంఖ్య: 4 అర్హత: ఫిజిక్స్‌లో పీహెచ్‌డీతో పాటు రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31. వెబ్సైట్: www.barc.gov.in స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కోచిలోని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ►డిప్యూటీ డెరైక్టర్(అకౌంట్స్)ఠి డిప్యూటీ డెరైక్టర్ ఠి సైంటిస్ట్ బి ఠి సైంటిస్ట్ బి(కెమిస్ట్రీ) ఠి సైంటిస్ట్ అసిస్టెంట్ దరఖాస్తులు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10. వెబ్సైట్: www.indianspices.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్‌లో పీహెచ్డీ భువనేశ్వర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్... పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ►పీహెచ్డీ. అర్హత: ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంఫార్మ్ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22. వెబ్సైట్: www.ils.res.in ఐఐఎస్ఈఆర్లో పీహెచ్డీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టుతో పీజీ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 19. వెబ్సైట్: www.iiserkol.ac.in బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో పీజీడీఎం నోయిడాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్.. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: జనరల్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు క్యాట్/ గ్జాట్/ మ్యాట్/ జీమ్యాట్/ సీమ్యాట్ స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 30 వెబ్సైట్: http://bimtech.ac.in -
పోలీస్ కొలువు.. సాధనతో సులువు
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్ది శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించడానికి రెడీగా ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో నగర జనాభా 70 లక్షలకు పైగా ఉందని తేలింది. అయితే కోటిమంది వరకు సిటీలో ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతమంది ప్రజలకు రక్షణ కల్పించాలన్నా.. నేరరహిత నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని పెంచాలన్నా.. క్షేత్రస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు పోలీసుల నియామకాలు జరగాలి. ఈ క్రమంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి వచ్చే నెలలో ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటికే నగరంలో కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్‌కు అడ్డాగా మారిన దిల్‌సుఖ్‌నగర్‌లో వేల మంది అభ్యర్థులు ఉద్యోగ సాధనే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాలు, అర్హతలు, విధివిధానాలపై ఫోకస్.. నవంబర్‌లో నోటిఫికేషన్.. నవ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కొలువులకు ఆగస్టులోనే జరగాల్సిన నియామక ప్రక్రియ మెదక్ ఉప ఎన్నికతో ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల రెండోవారంలో ప్రకటన జారీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. పోస్టుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. సొంతగడ్డపై ఖాకీ జాబ్ పట్టేయాలనే లక్ష్యంతో యువతీ, యువకులు ఇప్పటికే తమ కసరత్తులు మొదలుపెట్టారు. శిక్షణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారితో భాగ్యనగరం కిటకిటలాడుతోంది. కోచింగ్ కేంద్రాలు కొత్తకళ సంతరించుకుంటున్నాయి. నగరంలోని దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్, అమీర్ పేట, రామాంతపూర్ తదితర ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు సుమారు 40 వేలమందికి పైగా ఉంటారని అంచనా. ఒక్క దిల్‌సుఖ్‌నగర్‌లోనే 10 వేల మంది విద్యార్థులున్నట్లు అక్కడి శిక్షణా సంస్థల నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన సంక్షేమశాఖ సిద్ధమవుతోంది. వేలల్లో ఉద్యోగాలు దేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటిగా ఉన్న భాగ్యనగరంలో దేశవిదేశాలకు చెందిన ఎన్నో బహుళజాతి సంస్థలున్నాయి. వీటిలో కొన్ని కంపెనీల్లో ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు షిప్టులవారీగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, కాల్‌సెంటర్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య ఎక్కువ. మరోవైపు నగరం మెడికల్ హబ్, ఫార్మా హబ్‌గా అవతరించడంతో వివిధ పనులు, అవసరాల నిమిత్తం లక్షలమంది నగరాన్ని సందర్శిస్తున్నారు. మతపరంగా కూడా హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో శాంతిభద్రతలను కాపాడటం కత్తిమీద సాము. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు ఆకతాయిలు సైబర్ నేరాలకు ఒడిగడుతున్నారు. ఆయా వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేయడం.. అందినకాడికి దోచుకోవడం, ఫేస్బుక్ ఖాతాల్లో అసభ్య చిత్రాలను ఉంచడం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాలను అమ్మి సొమ్ము చేసుకునే నైజీరియన్ ముఠాలు నగరంలో పెరిగాయి. చైన్‌స్నాచర్ల భరతం పట్టడానికి, గల్లీ గల్లీలో గస్తీ నిర్వహించడానికి పోలీసులకు మోటారు సైకిళ్లు, అత్యాధునిక వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే.. ఆయా విభాగాల్లో వేలమంది పోలీస్ సిబ్బంది, సంబంధిత నిపుణుల అవసరం ఉంది. డ్రైవర్లు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, ఇన్స్పెక్టర్లు, సివిల్ కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సైబర్ క్రైమ్ నిరోధక నిపుణులు ఇలా ఎంతోమంది సిబ్బంది కావాలి. అర్హతలు.. వయోపరిమితి కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్, ఎస్ఐ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్లో నిర్దేశించిన వయోపరిమితి తప్పనిసరి. సాధారణంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 - 22 ఏళ్లు, ఎస్ఐ పోస్టులకు 25 ఏళ్ల వయసు మించకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నిబంధనలకనుగుణంగా రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా నిర్దేశిత ఎత్తు, బరువు, ఛాతీ కలిగి ఉండాలి. ఇతర వైద్య ప్రమాణాలు తప్పనిసరి. పరుగుపందెం, శారీరక సామర్థ్య పరీక్ష, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పురుషులకు నిర్వహించే 5 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో చేరాలనే నిబంధనపై భిన్నవాదనలున్నాయి. గతంలో పరుగు పందెంలో పోటీపడుతూ కొందరు అభ్యర్థులు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ దఫా 5 కి.మీ. పరుగును తగ్గించే అవకాశం ఉండొచ్చని సమాచారం. పరుగుపందెం, శారీరక సామర్థ్య పరీక్షను అధిగమించినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్ష.. పోస్టులను బట్టి 100 నుంచి 200 మార్కులకు ఉండే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారతీయ చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం, ఇండియన్ పాలిటీ-జాగ్రఫీ-ఎకానమీ, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ స్థాయిలో, ఎస్ఐ పోస్టులకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది. 10 వేలకు పైగా పోస్టులు తెలంగాణలో సుమారు 10వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా! వీటిని అంచెలవారీగా భర్తీ చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. తొలి దశలో భాగంగా హోంగార్డు నుంచి ఎస్సై వరకు 6 వేల ఉద్యోగులను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరిగిన ఖాళీలతో మరో వెయ్యి పోస్టులు అదనంగా చేరొచ్చు. హోంగార్డు, కానిస్టేబుల్, ఎస్సైలతోపాటు కొత్తగా సమకూర్చిన 1600 ఇన్నోవాలు, 1550 ఇతర పోలీసు వాహనాలకు అవసరమైన 3260 డ్రైవర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పోస్టుల్లో 3 నుంచి 4 వేల వరకు కానిస్టేబుల్స్, 300 వరకు ఎస్సై పోస్టులు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే ఉండొచ్చు!. చేపట్టబోయే నూతన నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలైతే పోలీసు కొలువులో చేరాలనుకునే మహిళలకు మంచి అవకాశం లభిస్తుంది. శారీరక ప్రమాణాలను పెంచుకోవాలి పురుషులు.. ఎత్తు 167.6 సెంటీమీటర్లు, ఛాతీ వైశాల్యం 86.3 సెం.మీ కలిగి ఉండాలి. గాలిపీల్చినప్పుడు ఛాతీ 5 సెంటీమీటర్లు పెరగాలి. శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా హైజంప్(1.20 మీ), లాంగ్‌జంప్ (3.80 మీ), షాట్‌పుట్ -7.26 కిలోలు (5.60 మీ), 100 మీ పరుగుపందెం (15 సెకన్లు), 800 మీ. (170 సెకన్లు) పరుగు అంశాల్లో పోటీలు ఉంటాయి. మహిళలు 152.5 సెం.మీ ఎత్తు, కనీసం 40 కిలోల బరువు ఉండాలి. 2.5 కి.మీ. గమ్యాన్ని 16 నిమిషాల్లో అధిగమించాలి. పరుగుపందెం, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్ అంశాల్లో పురుషులతో పోలిస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ అర్హత సాధించిన వారిని మాత్రమే రాతపరీక్షకు అనుమతిస్తారు. పోలీసు శాఖ నియామకాల్లో కీలకమైంది ఎత్తు, బరువు, ఛాతీ కొలత. చాలా మంది యువకులు వీటి విషయంలో పొరపాటు పడుతుంటారు. తీరా 5 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి రెండో అంకానికి చేరాక కానీ వాస్తవం తెలియదు. ఈ ఇబ్బంది తలెత్తకుండా నిర్ధేశించిన ఎత్తు, బరువు, ఛాతీ ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఛాతీ విస్తీర్ణం పెంచుకునేందుకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, ప్రాణాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నట్లయితే మానేయడం ఉత్తమమని సూచిస్తున్నారు స్పోర్ట్స్ డాక్టర్ ఎస్.భక్తియార్ చౌదరి. 5 కి.మీ. పరుగుపందెంలో ప్రాక్టీసు లేకుండా అప్పటికప్పుడు మైదానంలో దిగి అధిగమించడం కష్టం. కాబట్టి పోటీలో పాల్గొనే యువత కనీసం 3 నెలలు ముందుగానే ప్రాక్టీసు ప్రారంభించాలి. ఆస్తమా, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులున్న వారు ఎంపికకు వెళ్లకూడదు. వంశపారంపర్యంగా గుండె, ఊపిరితిత్తుల వంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ప్రాక్టీసుకు ముందే జనరల్ ఫిజీషియన్‌తో వైద్య పరీక్ష చేయించుకోవాలి. -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు చెందిన పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 65 విభాగాలు: ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ అండ్ యుటిలిటీస్( ఓ అండ్ ఎం/ బీ అండ్ ఎ), మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్, ప్రొడక్షన్ అర్హతలు: పదో తరగతి, సబ్ - ఆఫీసర్ కోర్సు(ఫైర్ అండ్ సేఫ్టీ)/ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా అభ్యర్థులకు ఏడాది, ఐటీఐ అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్: 9 అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం. వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 11. వెబ్సైట్: www.panipatrefinery.in సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్యూరిటీ గార్డ్: 500. అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్: 15, అకౌంటెంట్: 12 అర్హతలు, వయోపరిమితి తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.ccl.gov.in హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - కోల్‌కతా, గ్లోబల్ హెల్త్‌కేర్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు కోరుతోంది. హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ - 2015 కాలపరిమితి: ఏడాది. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: http://hemp.ghspl.com/ సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (స్నాప్) - 2014 కోర్సులు: ఎంబీఏ, ఎమ్మెస్సీ(ఐటీ), ఎంసీఏ కాలపరిమితి: రెండేళ్లు. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 26 ప్రవేశ పరీక్ష తేది: డిసెంబర్ 21. వెబ్సైట్: http://snaptest.org/ -
కొలువు కోసం ఆన్లైన్ నెట్వర్కింగ్ గ్రూప్
ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆన్లైన్ వేదికల ద్వారానే జరుగుతోంది. కొలువుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నెట్వర్కింగ్ వ్యూహంలో భాగంగా ఆన్లైన్లో కంపెనీలు, రిక్రూట ర్లు, సంబంధిత రంగాల వ్యక్తులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. దీనివల్ల మీకు జాబ్ మార్కెట్లో వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అంతర్జాలంలో మీ స్థానం: మంచి నెట్‌వర్క్‌తో అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. మీ రంగానికి చెందిన ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ కావడం వల్ల పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు, ఉద్యోగాల భర్తీ, కెరీర్ మేనేజ్మెంట్పై అవగాహన పెరుగుతుంది. తాజా సమాచారం తెలుసుకోవచ్చు. రొటీన్ హైరింగ్ ప్రాసెస్ పట్ల రిక్రూటర్లు కూడా విసుగెత్తిపోయారు. పోస్టుల్లో వచ్చే అభ్యర్థుల అర్హతల జాబితాలను పక్కన పడేసి అంతర్జాలంలో వారి బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తున్నారు. కాబట్టి మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు మీరు కూడా ఆన్లైన్లో మీ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోండి. జాబ్ నెట్వర్కింగ్ గ్రూపుల్లో చేరండి. వాటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండి. మీ ప్రొఫెషన్‌కు చెందినవారితో కలిసి ఒక జట్టుగా మారండి. కావాల్సిన సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోండి. గ్రూప్‌తో ప్రయోజనాలెన్నో.. : జాబ్ సైట్లలో ప్రొఫైల్‌ను పోస్టు చేయడం, నెట్వర్కింగ్ గ్రూప్‌లో చేరడం.. ఈ రెండూ ఒకటేనని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి ఇవి పూర్తిగా భిన్నం. ఆన్లైన్ గ్రూప్‌లో చేరితే రిక్రూటర్లు, సహచరుల నుంచి తాజా సమాచారం తెలుస్తుంది. ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్, నియామక విధానం పట్ల అవగాహన వస్తుంది. దాని ప్రకారం సన్నద్ధం కావొచ్చు. కెరీర్‌ను మార్చుకోవడానికి కూడా ఈ గ్రూప్స్ ఉపయోగపడతాయి. ఆన్లైన్ నెట్వర్కింగ్ గ్రూప్ కూడా ఒక మౌఖిక పరీక్ష లాంటిదే. మీ అర్హతలు, అనుభవాలు, నైపుణ్యాలతో రిక్రూటర్‌ను మెప్పించగలిగితే ప్రయత్నం సఫలం కావడం ఖాయం. గ్రూప్‌లో మిమ్మల్ని మీరు ప్రభావవంతంగా వ్యక్తీకరించుకోవాలి. మీ ప్రొఫెషనల్ ప్రొఫైల్ రిక్రూటర్లను ఆకట్టుకొనేలా ఉండాలి. వ్యక్తిగత విషయాలు వద్దు : ఇతరుల అవసరం మీకే కాదు, మీ అవసరం కూడా ఇతరులకు ఉంటుంది. ఏదైనా సంస్థలో కొలువులు ఖాళీగా ఉన్నట్లు మీకు తెలిస్తే సదరు సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. అది వారికి ఉపయోగపడుతుంది. వివరాలను ఆన్లైన్లో పోస్టు చేయండి. అందరికీ అవసరమైన స్కిల్ బిల్డింగ్, కెరీర్ అడ్వాన్స్మెంట్పై ఆసక్తికర సమాచారం ఏదైనా ఇవ్వొచ్చు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేస్తూ మరో ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు నెట్వర్కింగ్ గ్రూప్‌ను వాడుకోండి. కానీ, ప్రస్తుత యాజమాన్యం గురించి చెడు ప్రచారం చేయకండి. జాబ్, కెరీర్ వంటి అంశాలకే ఈ గ్రూప్‌లను పరిమితం చేయాలి. పర్సనల్ విషయాలను పబ్లిక్‌లోకి తీసుకురావొద్దు. ఎల్లప్పుడూ పాజిటివ్ ప్రొఫెషనల్ ఇమేజ్‌నే కొనసాగించాలి. ఉద్యోగం దక్కిన తర్వాత కూడా నెట్వర్కింగ్ గ్రూప్‌తో అనుబంధం ఎప్పటిలాగే ఉండడం మంచిది. ఇది లాంగ్‌టైమ్ జాబ్ ఇన్సూరెన్స్ లాంటిది. ఈ గ్రూప్ ప్రతిదశలో మీకు అండగా నిలుస్తుంది. కెరీర్లో ఎదగడానికి తోడ ్పడుతుంది. విద్యార్థినులు విజ్ఞాన వారధులు ఆరోగ్యం నుంచి అగ్ని పరీక్షల వరకూ.. అన్నింటా విజ్ఞానానిదే ప్రధాన భాగస్వామ్యం. తరగతి గదిలో విద్యార్థి మదిలో మెదిలే ఆలోచనలే పరిశోధనలతో ఫలవంతమవుతున్నాయి. తాము కూడా ఇదే దారిలో ఉన్నామంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్(కోఠి ఉమెన్స్ కాలేజీ) విద్యార్థినులు. కళాశాల 90వ వార్షికోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పలు ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాంకేతికత, సృజనాత్మకత, బృందస్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకోవడంతోపాటు విజ్ఞానాన్ని పంచుతోంది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను విద్యార్థినులు తమ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్, కొత్త అంశాలను నేర్చుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్, నేర్పు, ఓర్పు పెంపొందుతాయంటున్నారు కాలేజీ విద్యార్థినులు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన నేడు కూడా ఉంటుందని వెల్లడించారు. ఆర్ఆర్బీ -సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ)-సికింద్రాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్: జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఎంపిక: రాత పరీక్ష ద్వారా. విభాగాల వారీగా పోస్టులు, అర్హతలు, వయోపరిమితి.. తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 19 రాతపరీక్ష తేదీలు: జూనియర్ ఇంజనీర్, డీఎంఎస్, సీఎంఏ: డిసెంబర్ 14 సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పోస్టులకు: డిసెంబర్ 21 వెబ్సైట్: http://rrbsecunderabad.nic.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్ డీఎస్సీ, టెట్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు మెథడాలజీ విభాగంలో మంచి మార్కులు సాధించడానికి ఏవిధంగా చదవాలి? - ఎల్.గాయత్రి, విద్యానగర్ టెట్, డీఎస్సీ, మోడల్ స్కూల్స్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు బోధనా పద్ధతులు సబ్జెక్టును తప్పనిసరి చేశారు. ర్యాంకు సాధనలో ఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమే కాబట్టి అభ్యర్థులు తెలుగు మెథడాలజీపై ప్రత్యేక దృష్టి సారించి చదవాలి. దీంట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఎస్జీటీ, గ్రేడ్-2 తెలుగు పండిట్స్ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ‘డీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’; బీఎడ్, టీపీటీ చేసి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసే వారు ‘బీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. టెట్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలన్నింటిలో తెలుగు మెథడాలజీ సిలబస్‌కు సంబంధించి కింద పేర్కొన్న పాఠ్యాంశాలున్నాయి. 1. భాష - వివిధ భావనలు 2. మాతృభాష బోధన - లక్ష్యాలు, స్పష్టీకరణలు 3. భాషా నైపుణ్యాలు 4. ప్రణాళికా రచన - పాఠ్య గ్రంథాలు 5. పాఠ్య బోధన ప్రక్రియలు - ఆధునిక బోధన పద్ధతులు 6. విద్యా సాంకేతిక శాస్త్రం - సహ పాఠ్య కార్యక్రమాలు 7. మూల్యాంకనం - పరీక్షలు తెలుగు మెథడాలజీ అనేది తరగతి గదిలో మాతృభాషా బోధనకు సంబంధించింది. కాబట్టి పద్య, గద్య, వ్యాకరణ, ఉపవాచక బోధనలు, వాటికి సంబంధించిన పాఠ్య పథకం, సోపాన క్రమం, తరగతి గదిలో సందర్భానుసారంగా ప్రదర్శించే బోధనోపకరణాలు, మూల్యాంకనం - పరీక్షల నిర్వహణ మొదలైన అంశాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. ఇన్పుట్స్: ఎన్.కె. మద్దిలేటి, - సీనియర్ ఫ్యాకల్టీ -
ఉద్యోగాలు: ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ - 2014
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ‘క్లరికల్ క్యాడర్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ - 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా స్టేట్ బ్యాంక్ మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ - 2014 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి. వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 1 వెబ్సైట్: www.ibps.in విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సీనియర్ డిప్యూటీ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అర్హత: సీఏ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు: 42 ఏళ్లు దాటకూడదు. దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 25 వెబ్సైట్: www.vizagport.com టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సైంటిఫిక్ ఆఫీసర్ - డి వయసు: 35 ఏళ్లు దాటకూడదు. అర్హతలు: ఎమ్మెస్సీ లైఫ్ సెన్సైస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. డేటా మేనేజర్ వయసు: 30 ఏళ్లు దాటకూడదు. అర్హతలు: బీఎస్సీ ఐటీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 19 వెబ్సైట్: tmc.gov.in ప్రవేశాలు ఓయూ - దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ( జనరల్ మేనేజ్మెంట్, పర్సనల్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్.) ఎంసీఏ వెబ్సైట్: http://ouadmissions.com డాక్టర్ బి. రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా.