సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ప్రభుత్వ అనుమతి తీసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని సంఘం చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. సెస్ 44వ వార్షిక మహాసభను స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సెస్ పరిధిలో లూజువైర్లను సరిచేసేందుకు మండలానికి 500 విద్యుత్ స్తంభాలు అందించామని, మరో 1500 అందించి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
1985 నుంచి ఉద్యోగాలు భర్తీ చేపట్టలేదని, వాటిని భర్తీ చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ కట్ చేయబోమని, ఊళ్లు ఖాళీ చేసి వెళ్లినపుడే సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
అక్కపల్లి ఆదర్శం
విద్యుత్ చౌర్యం నివారణకు అందరూ సహకరించాలని లక్ష్మారెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ కమిటీలను ఏర్పాటు చేసుకుని అనుమతిలేని మోటార్లకు కనెక్షన్ తొలగించారని వివరించారు. ఇలా చేయడం ద్వారా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం లేదని, మోటార్లకు లోవోల్టేజీ సమస్య ఉండడం లేదని పేర్కొన్నారు. అన్ని గ్రామాల రైతులు అక్కపల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
వినియోగదారులకు మె రుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పాలకవర్గం కృషి చేస్తోందని, సిబ్బంది అవినీతికి పాల్పడినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినా ఫిర్యాదు చేయాలని కోరారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రవాణా ఖర్చులను రైతులపై వేస్తున్నారని విలేజీ ప్రతి నిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఉద్యోగులు వివిధ సెక్షన్లలో ఏళ్ల తరబడి పాతుకుపోయారని, అం తర్గత బదిలీలు చేపట్టాలని సభ్యులు కోరారు.
రూ.102.42 కోట్ల అంచనా బడ్జెట్‌కు ఆమోదం
‘సెస్’ మేనేజింగ్ డెరైక్టర్ కె.నాంపల్లిగుట్ట వార్షిక నివేదికను చదివి వినిపించారు. 2016-17కు గాను రూ.102.42 కోట్ల అంచనా బడ్జెట్‌ను సమావేశంలో ఆమోదించారు. ఈ స మావేశంలో వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీని వాస్, డెరైక్టర్లు జడల శ్రీనివాస్, ఏను గు విజయరామారావు, వూటుకూరి వెంకటరమణారెడ్డి, కొక్కు దేవేందర్‌యాదవ్, కుంబాల మల్లారెడ్డి, దేవరకొండ తిరుపతి, రామతీర్థపు రాజు, ఏనుగు లక్ష్మీ, ‘సెస్’ అకౌంట్స్ ఆఫీసర్ ఖుర్షీద్ సిబ్బంది పాల్గొన్నారు.
‘సెస్’లో ఉద్యోగాల భర్తీకి చర్యలు
Published Wed, Jun 1 2016 2:32 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM
Advertisement
Advertisement