government approval
-
ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్లు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకుఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్లను ఇచ్చే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలుపు రంగు అక్షరాలతో కూడిన ప్లేట్లను వ్యక్తిగత విద్యుత్ వాహనాలకు, పసుపు రంగు అక్షరాలతో కూడిన ప్లేట్లను ట్యాక్సీలకు కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. ట్యాక్సీ వినియోగదారులకు సమానంగా ఈ–వాహనాల వినియోగాన్ని పెంచేలా 16–18 మధ్య వయసున్న వారు కూడా విద్యుత్ స్కూటర్లు నడిపేందుకు అనుమతినిచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ప్లేట్లున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పార్కింగ్‌లోనూ ప్రాధాన్యత ఉండటంతోపాటు రద్దీ ప్రాంతాల్లోనూ ప్రవేశానికి అనుమతి ఉంటుంది. టోల్గేట్ పన్నులో కూడా రాయితీ లభిస్తుంది. -
నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.954 కోట్లు
సవరించిన అంచనాలకు ప్రభుత్వ ఆమోదం సాక్షి, హైదరాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల కోసం రూ.954.77 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి విడతలో రూ.96.69 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్ ప్రధాన కాల్వ, పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.549.60 కోట్లకు, ఉప పంపిణీ వ్యవస్థల కోసం రూ.83.77 కోట్లకు 2008 జూన్‌లో అనుమతిచ్చారు. మొత్తంగా రూ.633.54 కోట్లతో 155 కిలోమీటర్ల మేర కాల్వలను 2015 నాటికి ఆధునికీకరణ చేయాలని నిర్ణరుుంచారు. మధ్యలో ఈ మొత్తాలను సవరించి వ్యయాన్ని రూ.742.82 కోట్లకు పెంచారు. తర్వాత మరిన్ని పనులను చేర్చడంతో వ్యయం రూ.954.77కోట్లకు పెరిగింది. -
11 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల కు సంబంధించి 11 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.2,325 కోట్లు. షేర్‌ఖాన్ లిమిటెడ్ వంద శాతం వాటాను బీఎన్పీ పారిబాకు విక్రయించే ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్‌డీఐ విలువల రూ.2,060 కోట్లు. ఐడియా సెల్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. రూ.253కోట్ల పెర్రిగో ఇండియా, పెపె జీన్స్, ఐబీఎమ్ తదితర ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్-ఎఫ్ఐపీబీ) మొత్తం 18 ఎఫ్‌డీఐ ప్రతిపాదలను పరిశీలించింది. నాలుగు ప్రతిపాదనలను తిరస్కరించింది. మరింత సమాచారం కావాలంటూ ఐడియా, ఫ్లాగ్ టెలికం ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. రూ.95 కోట్ల విలువైన మోర్గాన్ స్టాన్లీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనను ఆటోమేటిక్ రూట్లో ఆమోదించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3,600 కోట్ల ఎఫ్‌డీఐలు, గత ఆర్థిక సంవత్సరంలో 5,546 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. -
అనుమతి లేకుండా స్కూలు నడిపితే జైలుకే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు స్కూళ్లు నడిపినా.. ప్రీ ప్రైమరీ, కిండర్‌గార్టెన్, ప్లేస్కూల్ తరగతులను నిర్వహించినా ఆయా పాఠశాలలను సీజ్ చేస్తామని విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది. దీనిని అతిక్రమిస్తే యాజమాన్యాలకు 6 నెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. అనుమతి లేకుండా విద్యా సంస్థలు తరగతులను నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం సెక్షన్ 18 ప్రకారం జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని పేర్కొంది. ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు ప్రైవేటు పాఠశాలలకు జారీ చేసిన నోటీసుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అనుమతి కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన గడువు ఆదివారంతో ముగియనుంది. వారం రోజుల్లో విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు ప్రైవేటు యాజమాన్యాలు, ఇటు విద్యాశాఖ మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. స్పందన నామమాత్రమే.. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, కిండర్ గార్టెన్, ప్లేస్కూల్ తరగతుల నిర్వహణకు అనుమతి తప్పనిసరని విద్యాశాఖ ఎన్ని హెచ్చరికలు చేసినా.. యాజమాన్యాల నుంచి నామమాత్రపు స్పందనే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 14,500 ప్రైవేటు పాఠశాలలుండగా.. అందులో ప్రీ ప్రైమరీ, కిండర్‌గార్టెన్ కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నది 263 స్కూళ్లే. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 121 పాఠశాలలు నమోదు చేసుకోగా... విద్యాశాఖను పర్యవేక్షించే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సొంతజిల్లా వరంగల్ నుంచి ఒక్క పాఠశాల కూడా దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులకు అనుమతి తప్పనిసరి చేయొద్దని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతుండగా... విద్యాహక్కు చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరని సర్కారు పట్టుదలగా ఉంది. దీంతో అనుమతి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోని పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యా శాఖాధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రైవేటు యాజమాన్యాల సంఘాలు నిర్ణయించాయి. చట్టాన్ని గౌరవించాల్సిందే.. ‘‘విద్యాహక్కు చట్టంలోని అంశాలను అన్ని పాఠశాలల యాజమాన్యాలు గౌరవించాల్సిందే. అనుమతి లేకుండా ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. నిబంధనల అమలుకు ప్రైవేటు యాజమాన్యాలు సహకరించాలి. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని అనుమతులు పొందిన పాఠశాలలు పాత అనుమతి పత్రాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. జీవో 91 ప్రకారం ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు, కరిక్యులం సిద్ధంగా ఉంది..’’ - కిషన్, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ కొత్తగా అనుమతులెందుకు..? ‘‘ప్రైవేటు పాఠశాలల నిర్వహణ యాజమాన్యాలకు ఇప్పటికే భారంగా మారింది. ఒకసారి అనుమతి తీసుకున్న విద్యా సంస్థలు కింది తరగతుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనడం ఎంత మాత్రం సబబు కాదు. ప్రీప్రైమరీ తరగతులకు అనుమతి తప్పనిసరని భావిస్తే.. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపుతో నడుస్తున్న పాఠశాలలన్నింటికీ దరఖాస్తు లేకుండానే అనుమతులు జారీ చేయాలి. అంతేగానీ జైలుకు పంపుతామని బెదిరిస్తే వెనుకాడం..’’ - ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) అధ్యక్షుడు -
‘సెస్’లో ఉద్యోగాల భర్తీకి చర్యలు
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ప్రభుత్వ అనుమతి తీసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని సంఘం చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. సెస్ 44వ వార్షిక మహాసభను స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సెస్ పరిధిలో లూజువైర్లను సరిచేసేందుకు మండలానికి 500 విద్యుత్ స్తంభాలు అందించామని, మరో 1500 అందించి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 1985 నుంచి ఉద్యోగాలు భర్తీ చేపట్టలేదని, వాటిని భర్తీ చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ కట్ చేయబోమని, ఊళ్లు ఖాళీ చేసి వెళ్లినపుడే సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అక్కపల్లి ఆదర్శం విద్యుత్ చౌర్యం నివారణకు అందరూ సహకరించాలని లక్ష్మారెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో ట్రాన్స్ఫార్మర్ కమిటీలను ఏర్పాటు చేసుకుని అనుమతిలేని మోటార్లకు కనెక్షన్ తొలగించారని వివరించారు. ఇలా చేయడం ద్వారా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లేదని, మోటార్లకు లోవోల్టేజీ సమస్య ఉండడం లేదని పేర్కొన్నారు. అన్ని గ్రామాల రైతులు అక్కపల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వినియోగదారులకు మె రుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పాలకవర్గం కృషి చేస్తోందని, సిబ్బంది అవినీతికి పాల్పడినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినా ఫిర్యాదు చేయాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రవాణా ఖర్చులను రైతులపై వేస్తున్నారని విలేజీ ప్రతి నిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఉద్యోగులు వివిధ సెక్షన్లలో ఏళ్ల తరబడి పాతుకుపోయారని, అం తర్గత బదిలీలు చేపట్టాలని సభ్యులు కోరారు. రూ.102.42 కోట్ల అంచనా బడ్జెట్‌కు ఆమోదం ‘సెస్’ మేనేజింగ్ డెరైక్టర్ కె.నాంపల్లిగుట్ట వార్షిక నివేదికను చదివి వినిపించారు. 2016-17కు గాను రూ.102.42 కోట్ల అంచనా బడ్జెట్‌ను సమావేశంలో ఆమోదించారు. ఈ స మావేశంలో వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీని వాస్, డెరైక్టర్లు జడల శ్రీనివాస్, ఏను గు విజయరామారావు, వూటుకూరి వెంకటరమణారెడ్డి, కొక్కు దేవేందర్‌యాదవ్, కుంబాల మల్లారెడ్డి, దేవరకొండ తిరుపతి, రామతీర్థపు రాజు, ఏనుగు లక్ష్మీ, ‘సెస్’ అకౌంట్స్ ఆఫీసర్ ఖుర్షీద్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుకను పిండి కోట్లు దండి
ర్యాంపుల్లో యథేచ్ఛగా దందా అక్రమంగా తరలిపోతున్న ఇసుక కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం ‘దోచుకున్న వాడికి దోచుకున్నంత..’ అన్నట్టుగా ఉంది జిల్లాలో ఇసుక వ్యాపారం. నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను దొరకని ముడిసరుకుగా మార్చేయడంతో అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా దండుకుంటోంది. ప్రభుత్వ అనుమతి ఉందనే సాకు చూపిస్తూ ర్యాంప్‌ల వద్ద ఎవరికి దొరికినంత వారు దోచేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా వెనకేసుకుంటున్నారు. చోడవరం: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అనధికార ర్యాంప్లతో పాటు అధికార ర్యాంప్ వద్ద కూడా అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. శారదా, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఇసుక వ్యాపారం జరుగుతోంది. శారదానదిలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, ముద్దుర్తి, రాయపురాజుపేట ,కలిగొట్ల, బోయిల కింతాడ, తారువ, మల్లంపాలెం, లక్కవరం, భోగాపురం వద్ద, బొడ్డేరు, పెద్దేరు నదుల్లో విజయరామరాజుపేట, జన్నవరం వీరనారాయణం, వీరవిల్లి అగ్రహారం, మాడుగుల, బెన్నవోలు, పీఎస్‌పేట, అంకుపాలెంలక్ష్మీపురం కల్లాలు వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. -
బాక్సైట్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ ర్యాలీ
ఐటీడీఏ వద్ద నాలుగో రోజు కొనసాగిన దీక్షలు పాడేరు: విశాఖ మన్యాన్ని అందాల కశ్మీర్‌గా అభివర్ణిస్తూనే బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి విధ్వంసానికి పూనుకుంటోందని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ధ్వజమెత్తారు. బాక్సైట్ వ్యతిరేక వేదిక విద్యార్థులతో సోమవారం పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఉన్న చట్టాలను అమలు చేయని ప్రభుత్వం 97 జీవోను ఇచ్చి 40 ఏళ్ల పాటు మన్యంలో ఏపీఎండీసీ అనుమతులు ఇచ్చిందని విమర్శించారు. బాక్సైట్ వ్యతిరేకంగా మహోద్యమానికి 28 సంఘాలతో బాక్సైట్ వ్యతిరేక వేదిక ఏర్పడిందని తెలిపారు. కేబినెట్ సమావేశంలో చ ర్చించి 97జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు రామరావు దొర మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోం దని విమర్శించారు. గిరిజనుల ఆందోళనలపై ప్రభుత్వాలు స్పందించి బాక్సైట్ తవ్వకాలను విరమించకుంటే మన్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్ మాట్లాడుతూ బాక్సైట్ వ్యతి రేక ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాల వలన మన్యం సర్వనాశనమవుతుందని పంటలు నశిస్తాయని, తవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. బాక్సైట్ వ్యతిరేక వేదిక ప్రతినిధులు సూర్యనారాయణ, రాజ్‌కుమార్, కృష్ణారావు, ఎం.ఎం.శ్రీను, పాలికి లక్కు, రాధకృష్ణ, సుందర్రావు, వంతాల రాంబాబులతో పాటు పట్టణంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
మార్కెటింగ్ శాఖలో మరిన్ని ఉద్యోగాలు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో 200 కొత్త పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని... వీటితో పాటు మరికొన్ని కొత్త ఉద్యోగాలు మంజూరు చేస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 150 మార్కెట్ కమిటీలున్నాయని... మరో 30 కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త పోస్టుల మంజూరు కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. గోదాముల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని, వాటి నిర్మాణానికి టెండర్లు పిలవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో రైతు బజారు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థల సేకరణపై దృష్టి సారించాలన్నారు. రైతు బజార్లన్నింటికీ కామన్ డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖలోనూ ఆన్లైన్ ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ (బార్ కోడింగ్)ను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. పనిలో వేగంతోపాటు పారదర్శకత కోసం వాట్స్ అప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డ్స్ వేతనాలు పెంచుతామని, దీనిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్ యార్డుల్లో పనిచేసే దడ్వాయి కార్మికులకు బీమా వర్తింప చేస్తామన్నారు. మార్కెటింగ్ ఫీజులకు ఎగనామం పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. యార్డుల్లో సరుకు అమ్మకం నుంచి రైతులకు సొమ్ము చేతికి వచ్చే వరకు జరిగే ప్రక్రియను ఆన్లైన్లో పెట్టాలన్నారు. మార్కెట్ కమిటీలు హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. -
మహా ‘కష్టం’ హెచ్ఎండీఏ
మబద్ధీకరణపై ఎటూ తేల్చని సర్కార్ హెచ్ఎండీఏ ఆదాయానికి కోట్లలో గండి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులకు బూజు సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు ఆర్థిక సంక్షోభం... మరో వైపు నిర్మాణాలు, లే అవుట్లు క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వ నాన్చివేత ధోరణి మహా నగరాభివృద్ధి సంస్థకు శాపంగా మారింది. నెలల తరబడి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తుండటంతో పెండింగ్ ఫైళ్లు బూజుపడుతున్నాయి. ఫలితంగా సంస్థ ఆదాయానికి కోట్లలో గండిపడుతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చన్న అధికారుల ఆశలు అడియాశలవుతున్నాయి. నగర శివార్లలో ఇంకా 80 వేలకు పైగా అక్రమ లే అవుట్లు, నిర్మాణాలున్నట్లు మహానగరాభివృద్ధి సంస్థ అధికారుల పరిశీలనలో తేలింది. వీటన్నిటినీ క్రమబద్ధీకరిస్తే మరో రూ. 200 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే మొత్తం ఫీజు చెల్లించిన వారు వెయ్యి మంది, సగం ఫీజు చెల్లిం చిన వారు 17 వేలకు పైగా దరఖాస్తుదారులున్నారు. సగం ఫీజు చెల్లించిన వారు మిగతా సొమ్మును సైతం చెల్లించేందుకు ముందుకొచ్చినా హెచ్ఎండీఏ స్వీకరించట్లేదు. ఎల్ఆర్ఎస్,బీపీఎస్‌లపై ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు ఏమీ చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పెండిగ్‌లోని దరఖాస్తులను క్లియర్ చేసినా రూ. 100 కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ 2 నెలల కిందట కొత్త ప్రభుత్వానికి హెచ్ఎండీఏ లేఖ రాసినా అటు నుంచి కనీస స్పందన లేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో ఐటీ బకాయిల కింద రూ. 485 కోట్లు తక్షణం చెల్లిచాల్సి ఉంది. ఇందుకోసం సర్కార్ నిధులు సమకూర్చక పోయినా... కనీసం ఎల్ఆర్ఎస్,బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులనైనా క్లియర్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని సచివాలయం స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫైల్ సీఎం వద్దే ఉందని వారు దాటవేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను కూడా సీఎం పర్యవేక్షిస్తున్నందున.. హెచ్ఎండీఏ ైచైర్మన్ హోదాలో చర్యలు తీసుకుని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు. ఫైళ్లు మూషికార్పణం హెచ్ఎండీఏలో ఎల్ఆర్ఎస్,బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులు క్లియర్కాక బూజుపడుతున్నాయి. తార్నాక లోని ప్రధాన కార్యాలయంలో ఓ గదిలో గుట్టలుగా పడేసిన దరఖాస్తులను ఎలుకలు నాశనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎల్ఆర్ఎస్,బీపీఎస్‌ల కింద ఇప్పటికే సగం ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులు సైతం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. అక్రమ లే అవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు (ఎల్ఆర్ఎస్,బీపీఎస్) మరో అవకాశమిచ్చే విషయాన్ని సైతం కొత్త ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం హెచ్ఎండీఏలో అయోమయం నెలకొంది. అడ్డగోలుగా లే అవుట్లు నగర శివార్లలో అడ్డగోలుగా లే అవుట్లు వెలిశాయి. వీటిలో 5 శాతం కూ డా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న పాపానపోలేదు. నిజాం పేట, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి ఎల్ఆర్ఎస్ కింద 4500 దరఖాస్తులు రాగా వీరిలో 10 శాతం కూడా ఇప్పటివరకు ఫీజు చెల్లించలేదు. శామీర్‌పేట, తూముకుంట, కొంపల్లి, కొహెడ, నాగారం, దమ్మాయిగూడెం తదితర ప్రాంతాల్లో క్రమబద్ధీకరించాల్సిన లే అవుట్లు అధికంగా ఉన్నాయి. మణికొండ, బండ్లగూడ, పీరాన్‌చె రువు, అమీన్పూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాల్లో 30-40 శాతం మేర మాత్రమే ఫీజులు వసూలయ్యాయి. వీరంతా క్రమబద్ధీకరించుకుంటే రూ. 250 నుంచి రూ. 300 కోట్లు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది. -
అవకతవకలు రుజువైతే జెట్-ఎతిహాద్ డీల్ రద్దు!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలు కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ కుదుర్చుకున్న ఒప్పందంలో అవకతవకలు ఉన్నట్లు రుజువైతే.. ఈ డీల్‌ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జెట్-ఎతిహాద్ ఒప్పందం సహజవనరులను దుర్వినియోగం చేయడం(ఎయిర్‌స్పేస్ ఇతరత్రా) కిందికి వస్తుందని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా శుక్రవారం ఈ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా పౌరవిమానయాన రంగంపై కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా మాటలకు సంబంధించి ట్యాప్ చేసిన టెలిఫోన్ సంభాషణల రాతప్రతులను ప్రభుత్వం బయటపెట్టేలా ఆదేశాలించాలన్న పిటిషనర్ వాదనపైనా సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం, ఆదాయపు పన్ను శాఖలకు నోటీసులు జారీచేసింది. కాగా, తన పిటిషన్‌పై కేంద్రం తన స్పందనను తెలియజేయకపోవడంపై స్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమకు నాలుగు వారాల వ్యవధి కావాలని సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరణ్ సుప్రీంను కోరారు. అయితే, ఎయిర్ ఏషియా డీల్పైనా ఇలాంటి పిటిషన్ దాఖలు కాగా, సుప్రీం కోర్టు దీన్ని విచారణకు స్వీకరించలేదని, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించిన విషయాన్ని పరాశరణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జెట్-ఎతిహాద్ డీల్‌పై పిటిషన్‌కు కూడా విచారణార్హత లేదని ఆయన వాదించారు. అయితే, ప్రాథమిక అంశాల ఆధారంగా ఈ కేసులో ఇప్పటికే తాము నోటీసులు జారీచేసినట్లు సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. ఏవైనా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలితే కచ్చితంగా ఈ ఒప్పందాన్ని పక్కనబెడతామని పిటిషనర్‌కు బెంచ్ హామీఇచ్చింది. జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాను చేజిక్కించుకోవడానికి ఎతిహాద్ కుదుర్చుకున్న ఒప్పంద ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. ఈ డీల్ విలువ రూ.2,069 కోట్లు.